భారత దేశం లోని విదర్భ ప్రాంతం చాలా మంది సామాజిక సంస్కర్తలు మరియు మేధావులకు నిలయం.
భారత దేశ స్వాతంత్ర చరిత్రలో విదర్భ చాలా చురుకైన
పాత్ర పోషించింది మరియు భారత దేశ సామాజిక, సాంస్కృతిక మరియు
రాజకీయ వికాసం లో ప్రముఖ పాత్ర వహించినది. అటువంటి పవత్ర భూమి లో భాగమైన యవత్మల్ Yavatmal లో జన్మించిన కాజీ సయ్యద్ కరీముద్దీన్. గొప్ప క్రిమినల్ న్యాయవాదిగా పేరుగాంచారు
మరియు భారత రాజ్యాంగ ముసాయిదాలో కీలక
పాత్ర పోషించారు.
కాజీ కరీముద్దీన్ 1899 జూలై 19 న మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలోని దర్వాలో కాజీ సయ్యద్ నసీరుద్దీన్
మరియు దయానథ్ బేగం దంపతులకు జన్మించారు. అమరావతిలోని మొహమ్మదాన్ హైస్కూల్లో పాఠశాల
విద్యను అభ్యసించారు. కాజీ కరీముద్దీన్ నాగ్‌పూర్‌లోని మోరిస్ కాలేజీ నుండి
పట్టభద్రుడయ్యాడు మరియు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్
గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. తరువాత న్యాయశాస్త్రం/లా లో ఉత్తీర్ణుడు అయ్యాడు. అతను
ఖాదిరున్నిసా బేగం (మే 24, 1926) ను వివాహం చేసుకున్నాడు.
.
కాజీ కరీముద్దీన్ యవత్మల్ లోని సామాజిక, న్యాయ, రాజకీయ రంగాలలో చురుకుగా
ఉన్నారు. అతను జిల్లా కౌన్సిల్ (1924-28) వైస్ చైర్మన్, సబ్ జడ్జి (1928-31), అంజుమాన్ మిడిల్
స్కూల్ ప్రెసిడెంట్, (1932-37) మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (1939-45) వంటి పదవులు చేపట్టినారు. కాజీ కరీముద్దీన్ రాజ్యాంగ
అసెంబ్లీ (1947-50) మరియు మధ్యప్రదేశ్ అసెంబ్లీ (1947-52) సభ్యుడు (ఆ సమయంలో
మధ్యప్రదేశ్‌ను సెంట్రల్ ప్రావిన్స్ అని పిలుస్తారు). ఆ తరువాత 1954 నుండి 1958 వరకు రాజ్యసభ (భారత
పార్లమెంటు ఎగువ సభ) సభ్యుడుగా వ్యవహరించాడు. కాజీ కరీముద్దీన్ 14 సెప్టెంబర్ 1977 న మరణించారు.
కాజీ కరీముద్దీన్ అమెరికన్ రాజ్యాంగం లాగా గోప్యతా హక్కును right to privacy ప్రాథమిక హక్కుగా
మార్చడానికి రాజ్యాంగ సభలో ఒక సవరణను ప్రతిపాదించాడు. కాని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దీనికి
రిజర్వ్డ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారు. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 20 ప్రకారం అమలులో
ఉన్న చట్టాన్ని ఉల్లంఘిస్తే మినహా ఏ
వ్యక్తిని అరెస్ట్ చేయరాదు. ఒక నేరానికి ఒక
వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువసార్లు విచారించకూడదు మరియు శిక్షించకూడదు; మరియు ఒక వ్యక్తిని
తనకు వ్యతిరేకంగా సాక్షo ఇవ్వమని బలవంత పెట్టరాదు.
కాజీ కరీముద్దీన్ గోప్యతా హక్కును ఆరోగ్యకరమైన
రాజ్యాంగానికి కీలకమైన అంశంగా భావించారు. కాజీ
కరీముద్దీన్ ప్రకారం గోప్యతా హక్కు అమెరికన్ రాజ్యాంగంలోని 4వ ఆర్టికల్. ఐరిష్ రాజ్యాంగం మరియు జర్మన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 114 మరియు 115 అందు కనిపిస్తాయని పేర్కొన్నాడు. దీనికి సమాంతర బావాలు డాక్టర్ అంబేద్కర్ రచించిన
మైనారిటీలు అండ్ ది స్టేట్స్ పుస్తకం లో
కనిపిస్తాయని పేర్కొన్నారు
డాక్టర్ అంబేద్కర్ ఈ నిబంధన ఇప్పటికే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో ఉందని, అందువల్ల ఇది భారతీయ
చట్టంలో ఒక భాగమని, అయితే ఈ నిబంధనలను శాసనసభ పరిధికి వెలుపల ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛ
ప్రయోజనాలదృష్ట్యా మంచిదని అంగీకరించారు.. అంబేద్కర్ మద్దతు
ఉన్నప్పటికీ సవరణ వీగిపోయింది.
ఏది ఏమయినప్పటికీ, రాజ్యంగ అసెంబ్లీలో కరీముద్దీన్ సవరణ ఖరక్ సింగ్ వర్సెస్ స్టేట్ అఫ్ యుపి
వివాదం లో జ్యుడిషియల్ ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా తిరిగి ఉద్భవించింది, ఇక్కడ కోర్టు నిఘా
మరియు వ్యక్తిగత స్వేచ్ఛ (రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన వ్యక్తిగత స్వేచ్ఛ) మధ్య
సంబంధాన్ని చర్చించింది మరియు ఒక వ్యక్తి ఇంటిలోకి అనధికార చొరబాటు అతడు/ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు అంతరాయం
కలిగిస్తుంది అని కోర్ట్ అభిప్రాయపడింది. కోర్టు అసమంజసమైన
శోధనలు మరియు నిర్భందించటానికి వ్యతిరేకంగా వ్యక్తుల
హక్కును ఉల్లంఘించరాదని ప్రకటించింది declared that their right against
unreasonable searches and seizures was not to be violated.
కాజీ కరీముద్దీన్ రాజ్యాంగ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ పై చర్చల్లో కూడా
పాల్గొన్న ముఖ్య వ్యక్తి. కాజీ
కరీముద్దీన్ ప్రకారం “ఒక ముస్లిం,
వ్యక్తిగత చట్టాన్ని తన మతంలో భాగంగా పరిగణిస్తున్నాడని బయటి ప్రజలు మరియు
రాజ్యాంగ సభ సభ్యులు గ్రహించాలి మరియు దేశంలోని ఏ ఒక్క ముస్లిం కూడా మతపరమైన హక్కులు మరియు వ్యక్తిగత
చట్టాల యొక్క తప్పనిసరి నిబంధనలో a change in the mandatory provision
of religious rights and personal laws మార్పు కోరుకునేవాడు కాదు మరియు తప్పనిసరి సూత్రంలో mandatory principle మార్పు కోరుకునే వాడు లేదా మతానికి
సంభందించిన వ్యక్తిగత చట్టo లో మార్పు
కోరుకోనేవాడు ముస్లిం కాలేడు. అని అన్నారు.
కాజీ కరీముద్దీన్‌కు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అతను యుసిసి UCC యొక్క బలమైన విరోధి అయినప్పటికీ, అతను చాలా ప్రగతిశీల మరియు అబ్యుదయ ముస్లిం, అతను తన పిల్లలకు దేశంలోని ప్రధాన విద్యా సంస్థలలో విద్యను అందించాడు. యవత్మల్ లో ఉన్నత విద్యకు తగిన సదుపాయాలు లేనందున, అతను తన కుమార్తెలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అభ్యసించడానికి హైదరాబాద్కు పంపాడు, ఆ రోజులలో హైదరాబాద్ మహిళలకు ప్రసిద్ధ విద్యా కేంద్రంగా ఉంది.
కాజీ కరీముద్దీన్ అల్లుళ్ళు కూడా తమ తమ రంగాలలో రాణించారు: నిజాముద్దీన్
అహ్మద్ (ఎల్ఎల్ఎమ్) UK లో లేబర్ లాలో శిక్షణ పొందారు మరియు మహారాష్ట్రలోని డిప్యూటీ లేబర్ కమిషనర్ గా రిటైర్ అయ్యారు; సయ్యద్ ముకాసిర్ షా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్; జస్టిస్ ఎం.ఎం. ఖాజీ
మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మాజీ ఛైర్మన్ మరియు బొంబాయి హైకోర్టు
రిటైర్డ్ జడ్జి; మరియు డాక్టర్ మీర్జా బషీర్ బేగ్ UK లో ఆర్థోపెడిక్
సర్జన్ (FRCS).
కాజీ కరీముద్దీన్ జీవిత చరిత్ర ఆధునిక ప్రగతిశీల ముస్లింలకు ఒక మార్గదర్శి
No comments:
Post a Comment