11 March 2023

భారతదేశపు మొట్టమొదటి ఉర్దూ వార్తాపత్రిక జామ్-ఎ-జహాన్-నుమా India’s first Urdu newspaper Jam-E-Jahan-Numa.

 

మార్చి 27, ఉర్దూ జర్నలిజం డే:

భారతదేశపు మొట్టమొదటి ఉర్దూ వార్తాపత్రిక “జామ్-ఎ-జహాన్-నుమా”. ఉర్దూ జర్నలిజం చరిత్రలో మార్చి 27 ఒక చారిత్రాత్మకమైన రోజు. మార్చి 27, 1822 తేదీన, ఉర్దూ భాషలో మొట్టమొదటి వార్తాపత్రిక జామ్-ఎ-జహాన్-నుమా ప్రచురించబడింది.ఉర్దూ జర్నలిజం భారత ఉపఖండంలో జామ్-ఎ-జహాన్ నుమా ప్రచురణతో ప్రారంభమైంది. 

భారతదేశంలో, ఉర్దూ ముస్లింలతో ముడిపడి ఉంది మరియు స్వాతంత్య్రానంతర భారతదేశంలో, ఉర్దూ భాష ముస్లిం భాషగా గుర్తించబడింది. ఉర్దూ జర్నలిజం చరిత్రను పరిశీలిస్తే, దాని వారసత్వం మరియు లౌకిక మూలాలను తెలిస్తే  ఆశ్చర్యపడవచ్చు.

భారతదేశంలో ఉర్దూ పత్రికను మొదట ప్రచురించినది ఒక హిందూ వ్యక్తి. హరి హర్దత్, బెంగాలీ బ్రాహ్మణ హిందువు, జామ్-ఎ-జహాన్ నుమా” ను కలకత్తా నుండి మార్చి 27, 1822న ప్రచురించారు. ఇది లాలా సదా సుఖ్ లాల్ అనే ఒక పంజాబీ సంపాదకత్వంలో ప్రచురించబడింది. ప్రింటర్ విలియం హాప్కిన్స్, బ్రిటిష్ జాతీయుడు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి.

 ఉర్దూ జర్నలిజం లౌకిక లక్షణాలను ప్రతిబింబిస్తుంది. 19వ శతాబ్దంలో చాలా మంది ముస్లిమేతర సంపాదకులు ఉర్దూ జర్నలిజం వృద్ధి మరియు అభివృద్ధిలో భారీ సహకారం అందించారు..

1822లో, కలకత్తా నుండి జామ్-ఎ-జహాన్ నుమా ప్రచురణతో, ఉర్దూ జర్నలిజం ప్రయాణం ప్రారంభమైంది. త్వరలో ఇది ఉపఖండంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. గత రెండు వందల సంవత్సరాలలో, ఉర్దూ జర్నలిజం అనేక హెచ్చు తగ్గులు చూసింది మరియు ఉపఖండం యొక్క చరిత్ర, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం మరియు సామాజిక శాస్త్రంపై లోతైన ముద్ర వేసింది.

మొత్తం ఉపఖండం యొక్క చరిత్ర అంటే ప్రస్తుత భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా మరియు ఆఫ్ఘనిస్తాన్ ఉర్దూ జర్నలిజం లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది. ఆ కాలపు రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక పరిస్థితులు ఆనాటి ఉర్దూ వార్తాపత్రికల పేజీలపై నిజంగా ప్రతిబింబిస్తాయి.

గుజరాతీ జర్నలిజం పుంజుకోకముందే ఉర్దూ జర్నలిజం ప్రారంభమైంది. గుజరాతీ లో మొదటి ప్రచురణ, బాంబే సమాచార్, జూలై 1, 1882న మొదటిసారిగా వెలువడింది. అదేవిధంగా, హిందీ జర్నలిజం దాని మొదటి వార్తాపత్రిక - ఉతాండ్ మార్తాండ్ - ఫిబ్రవరి 9, 1826న ప్రచురించబడింది. తమిళ జర్నలిజం కోసం, తమిళ పత్రిక, 1831లో ప్రచురించబడింది..

బెంగాలీ జర్నలిజం 1816లో బెంగాలీ లో మొదటి వార్తాపత్రిక  “బెంగాల్ గెజిట్”  తో ప్రారంభమైంది మరియు బెంగాలీ  భాషలో “సంబాద్ కౌముది” మరియు “సమాచార్ చంద్రిక” అనే మరో రెండు బెంగాలీ వార్తాపత్రికలు ప్రచురణలో కలవు.

బెంగాలీ వార్తాపత్రికల తర్వాత, అవిభాజ్య భారతదేశం నుండి ఏదైనా భారతీయ భాషలో వచ్చిన రెండవ వార్తాపత్రిక జామ్-ఎ-జహాన్ నుమా. భారతదేశంలో జర్నలిజం ప్రారంభించిన రెండవ వెర్నాకులర్ భాష గా ఉర్దూ జర్నలిజం ప్రత్యేకతను కలిగి ఉందని చెప్పవచ్చు.

సాంకేతికంగా, ఉర్దూ జర్నలిజం ఇతర ప్రాంతీయ జర్నలిజంతో సమానంగా ఉంటుంది. 21వ శతాబ్దంలో ఉర్దూ వార్తాపత్రికల డిజిటలైజేషన్‌ను భారతదేశం కూడా చూసింది. మూడు డజనుకు పైగా ఉర్దూ వార్తాపత్రికలు తమ ఇ-వార్తాపత్రికలను ప్రారంభించాయి

ఉర్దూ జర్నలిజం దాని 200 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో అనేక హెచ్చు తగ్గులు చూసింది. ఇన్ని జరిగినా నేడు ఉర్దూ జర్నలిజం వెలిగిపోతోంది. ఉర్దూ భాషా వార్తాపత్రికను ప్రారంభించాలనే ఆలోచనకు హరిహర్ దత్ యొక్క పాఠకులు రుణపడి ఉన్నారు.

హరిహర్ దత్ తన వార్తాపత్రికను ప్రారంభించినప్పుడు, అతను ఉర్దూ జర్నలిజానికి బీజం వేయబోతున్నాడని మరియు అది దేశవ్యాప్తంగా ఉన్న ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి పురికొల్పుతుందని హరిహర్ దత్ అతను ఎప్పుడూ ఊహించలేదు.

జామ్-ఎ-జహాన్-నుమా: ది పయనీర్ ఉర్దూ వీక్లీ:

 జామ్-ఎ-జహాన్ నుమా మార్గదర్శక ఉర్దూ భాషా వార్తాపత్రిక మిషన్ ప్రెస్, 11, సర్క్యులర్ రోడ్, కలకత్తాలో ముద్రించబడింది మరియు సెంట్రల్ కలకత్తాలోని వాణిజ్య ప్రదేశం అయిన కొలూటోలాలోని నెం. 2 నుండి ప్రచురించబడింది.

ఇది పరిమాణంలో 3-షీట్ (6 పేజీలు) వారపత్రిక మరియు ప్రతి చాహర్ స్తంభా (బుధవారం) Chahar Stambah (Wednesday) నాడు వెలుబడుతుంది. “జామ్-ఎ-జహాన్ నుమా” యొక్క ప్రతి పేజీని రెండు నిలువు వరుసలుగా విభజించారు మరియు ప్రతి నిలువు వరుసలో సాధారణంగా 22 పంక్తులు ఉంటాయి. కాగితం పరిమాణం 20×30/8 సెంటీమీటర్లు, మరియు దాని ధర నెలకు రూ.2/ మరియు చహర్ స్తంభా (బుధవారం-ఉర్దూ పదం) అనే పదం మాస్ట్‌హెడ్ క్రింద ప్రతి సంచికపై తేదీతో ముద్రించబడింది.

బెంగాల్‌లో ఉర్దూ భాష ప్రాచుర్యం పొందని సమయంలో హరిహర్ దత్తా “జామ్-ఎ-జహాన్ నుమా” అనే ఉర్దూ వారపత్రికను తీసుకువచ్చారు. ఉర్దూ సంభాషణకు మాత్రమే అన్న భావన ప్రబలంగా ఉండేది మరియు అది జర్నలిజం రంగంలో స్వీకరించబడలేదు. కానీ హరిహర్ దత్తా దూరదృష్టితో ఉర్దూ భాషను ముద్రించిన వార్తాపత్రిక రూపంలో ప్రవేశపెట్టాడు.

అయితే “జామ్-ఎ-జహాన్ నుమా”యొక్క ఉర్దూ ఎడిషన్ యొక్క 6 సంచికల తర్వాత, హరిహర్ దత్తా దానిని పర్షియన్ వారపత్రికగా మార్చాడు. ఉర్దూ పేపర్‌గా ప్రారంభించబడిన “జామ్-ఎ-జహాన్ నుమా” దాని 6వ సంచిక తర్వాత మే 16, 1822నుండి  పర్షియన్ వార్తాపత్రికగా మారింది.

ఈ మార్పు వెనుక కారణం పాఠకులలో అత్యధికులు నిరక్షరాస్యులు మరియు పేదలు. మరియు పర్షియన్ ఆ కాలంలో అధికారిక భాష మరియు ఉన్నత వర్గాల భాష కూడా.

కాని కొన్ని సంవత్సరాల తరువాత ఉర్దూ వార్తాపత్రికలు ఉత్తర భారతదేశంలో ప్రచురించడం ప్రారంభించాయి. ఉర్దూ యొక్క ప్రజాదరణ వేగంగా పెరిగింది మరియు అది పర్షియన్ నుండి అధికారిక భాషగా  ఉర్దూను  మార్చడానికి అప్పటి వలస ప్రభుత్వాన్ని బలవంతం చేసింది.

హరిహర్ దత్తకు ఉర్దూపై ఆసక్తి తగ్గలేదు. మరియు ఒక సంవత్సరం తర్వాత హరిహర్ దత్త “జామ్-ఎ-జహాన్ నుమా” యొక్క పర్షియన్ ఎడిషన్‌తో ఉర్దూ అనుబంధాన్ని పరిచయం చేశాడు. ఈ అనుబంధం మే 23, 1823న ప్రారంభించబడింది. ఇందులో 4 పేజీలు ఉన్నాయి మరియు పేజీలు రెండు నిలువు వరుసలుగా విభజించబడ్డాయి.

జామ్-ఎ-జహాన్ నుమాలో అన్ని రకాల జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు ప్రచురించబడతాయి. ఆసక్తి కథనాలు మరియు శాస్త్రీయ ఆవిష్కరణల వార్తలు తగిన కవరేజీని పొందాయి.

ఉర్దూ జామ్-ఎ-జహాన్ నుమా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పాటు ప్రచురించబడటం కొనసాగింది; 23 మే 1822 నుండి 23 జనవరి 1828 వరకు ప్రారంభించబడింది. ఈ కాలంలో, దాదాపు 241 సంచికలు ప్రచురించబడ్డాయి. ఈ 241 సంచికలలో, దాదాపు 100 సంచికలు బ్రిటన్, యూరప్ మరియు మొఘల్ చక్రవర్తి జహంగీర్ యొక్క చారిత్రక సంఘటనలను కలిగి ఉన్నాయి.

పర్షియన్ ఎడిషన్ 8 పేజీలను కలిగి ఉంది మరియు ఉర్దూ అనుబంధం 4 పేజీలను కలిగి ఉంది. ఈ వార్తాపత్రికకు ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయాన్ని అందించింది. కానీ అధిక పోస్టల్ ఛార్జీలు ఈ వార్తాపత్రిక యజమానిపై భారం అయినాయి.

వార్తాపత్రిక ఖర్చులను తగ్గించడానికి, హరిహర్ దత్ జనవరి 1828లో మరోసారి ఉర్దూ ఎడిషన్‌ను నిలిపివేసి, పర్షియన్ ఎడిషన్‌ను కొనసాగించాడు. ఉర్దూ ఎడిషన్ పేజీలను కూడా పర్షియన్ ఎడిషన్‌కు కేటాయించారు. అయితే, ప్రభుత్వం ఆదరించకపోవడంతో చివరకు శాశ్వతంగా నిలిచిపోయింది.

జామ్-ఎ-జహాన్ నుమా ఎంతకాలం కొనసాగిందో తెలియదు కానీ అబ్దుస్ సత్తార్ సిద్ధిఖ్ తన వ్యాసంలో హిందుస్థాన్ కే పురానే అఖ్బర్, 1845 వరకు జామ్-ఎ-జహాన్ నుమా పేపర్ ప్రచురించడం కొనసాగిందని రాశారు.

హరిహర్ దత్ మొదటి ఉర్దూ వార్తాపత్రికను ప్రారంభించినప్పుడు, ఉర్దూ ఉన్నత మరియు విద్యావంతుల భాష కాదు. ఇది దాని పరిణామ దశలో ఉంది. ఇది విద్యావంతులైన ప్రజలలో చదవడం మరియు వ్రాయడం వంటి భాషగా అభివృద్ధి చెందలేదు మరియు సమాజంలోని దిగువ శ్రేణికి చెందిన ప్రజల మధ్య కమ్యూనికేషన్ సాధనంగా మాత్రమే ఉపయోగించబడింది.

ఉర్దూ పాఠకులు తక్కువ. హిందువులు, ముస్లింలు, సిక్కులు లేదా ఇతరులు చదువుకున్న తరగతి వారు పర్షియన్ చదివేవారు. బ్రిటీష్ పాలనలో ఆ సమయంలో అధికారిక భాషగా ఉన్న పర్షియన్ భాషలో అన్ని అధికారిక పనులు కూడా జరిగాయి.

నిజానికి, ఆ కాలంలో ఉర్దూ చదవడం మరియు రాయడం కించపరిచేదిగా పరిగణించబడింది మరియు విద్యావంతులు  ఉర్దూను ఉపయోగించడాన్ని అవమానంగా భావించారు, ఎందుకంటే ఇది సాధారణ ప్రజల భాష. అన్ని అధికారిక ప్రకటనలు పర్షియన్ భాషలో మాత్రమే వచ్చేయి

కులీనులు ఉర్దూ భాషను దిగువ తరగతి బాషగా పరిగణిస్తారు. పైగా, వార్తాపత్రికలు చదివే అలవాటు కూడా అప్పటికి అభివృద్ధి చెందలేదు. ఉన్నత వర్గాలకు కూడా వార్తాపత్రికలు చదవడానికి లేదా సాధారణంగా సమాజం గురించి తెలుసుకోవడానికి సమయం లేదు. ఆ సమయంలో ఉర్దూలో వార్తాపత్రికను తయారు చేయడం అంత తేలికైన పని కాదు.

“జామ్-ఎ-జహాన్ నుమా” ప్రారంభానికి ముందు, కొన్ని చేతితో వ్రాసిన వార్తాపత్రికలు ఉన్నాయి- ముద్రించబడలేదు, ఇవి ప్రాథమికంగా కులీనులు మరియు ధనవంతుల కోసం వ్రాయబడ్డాయి. ఈ చేతివ్రాత వార్తాపత్రికలు కాలిగ్రాఫర్స్ అని పిలువబడే రచయితల బృందంచే వ్రాయబడ్డాయి. అమ్ముడైన ఈ పేపర్ల కాపీల సంఖ్య చాలా తక్కువగా ఉంది.ఈ చేతివ్రాత వార్తాపత్రికల ఉత్పత్తి ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉండేది.ఈ చేతివ్రాత పత్రాలు కులీనులకు మరియు ధనిక వర్గానికి కూడా సమాచారం యొక్క ఏకైక మూలం.

ఉర్దూ జర్నలిజం గురించి చదువుతున్నప్పుడు మనం ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. హరిహర్ దత్ “జామ్-ఎ-జహాన్ నుమా” ను ప్రచురించినప్పుడు, వార్తాపత్రిక చదవడం అలవాటుగా మారలేదు. కాబట్టి, ఒక విధంగా, బెంగాలీ తర్వాత, ఉర్దూ జర్నలిజమే భారత జర్నలిజమును  ప్రభావితం చేసింది.


No comments:

Post a Comment