15 March 2023

ఇస్లాంను రక్షించిన మరియు మంగోలులను అణిచివేసిన ఐన్ జలుత్ యుద్ధం - 1260 AD. The Battle of Ain Jalut — 1260 A.D.That Saved Islam And Crushed The Mongols

 



క్రీ.శ. 1260లో జరిగిన ఐన్ జలుత్ యుద్ధం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, ఆ కాలపు చారిత్రక సందర్భాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చెంఘిజ్ ఖాన్ తరువాత, మంగోలు ప్రపంచంలోని అత్యంత వినాశకర శక్తులలో ఒకరుగా రూపొందారు. మంగోలుల అశ్వికదళ ఆర్చర్లు తమ వేగవంతమైన దాడులతో, తమ మార్గంలో నిలబడిన వారిని నాశనం చేశారు. చెంఘీజ్ ఖాన్ దృష్టి మొత్తం ప్రపంచానికి చక్రవర్తిగా మారడం.

1251లో చెంఘీజ్ ఖాన్ మనవడు మోంగ్కే ఖాన్Mongke Khan గ్రేట్ ఖాన్ అయ్యాడు మరియు మోంగ్కే ఖాన్ తన ప్రసిద్ద తాత చెంఘీజ్ ఖాన్ అడుగుజాడలను అనుసరించాలని అనుకున్నాడు. మోంగ్కే ఖాన్ సోదరుడు హులగు ఖాన్ పశ్చిమ రాజ్యాలను లొంగదీసుకోవాలని నిశ్చయించాడు.. 1260 నాటికి హులగు ఖాన్, సిలిసియన్ ఆర్మేనియన్లు, ఆంటియోక్ మరియు బాగ్దాద్‌లోని 500 ఏళ్ల అబ్బాసిద్ కాలిఫేట్‌లను పూర్తిగా నాశనం చేశాడు లేదా పూర్తిగా  లొంగదీసుకున్నాడు. జెరూసలేం గుండా వెళ్లి, ప్రపంచంలో మిగిలి ఉన్న చివరి ప్రధాన ఇస్లామిక్ శక్తి అయిన ఈజిప్ట్/కైరో  సుల్తానేట్‌ను ఎదుర్కోవాలనేది హులగు ఖాన్ ప్రణాళిక. 1260లో, కైరో అమీర్, సుల్తాన్ కుతుజ్Qutuz కు క్రింది బెదిరింపులతో రాయబారులు పంపబడ్డారు.

"మేము విస్తారమైన ప్రాంతాలను జయించాము, ప్రజలందరినీ ఊచకోత కోశాము....కోటలు మమ్మల్ని నిర్భందించ లేవు, లేదా గొప్ప సైన్యాలు మమ్మల్ని అడ్డుకోలేవు....మేము మీ మసీదులను బద్దలుకొడతాము...మీ పిల్లలను మరియు వృద్ధులను చంపేస్తాము.". కైరో అమీర్, సుల్తాన్ కుతుజ్Qutuz మంగోల్ రాయబారుల శిరచ్ఛేదం మరియు కైరో గేట్లపై వారి తలలను ప్రదర్శించడం ద్వారా ప్రతిస్పందించాడు.

ఇంతలో చైనా దండ యాత్రలో గ్రేట్ ఖాన్ మోంగ్కే ఖాన్ మరణించినప్పుడు రాజకీయ సమీకరణాలు మారినవి.  తదుపరి గ్రేట్ ఖాన్ ఎవరో నిర్ణయించుకోవడానికి హులగు ఖాన్ ఇంటికి తిరిగి రావలసి వచ్చింది. ఈజిప్ట్ ప్రాంతంలో మంగోలుల ఉనికిని కాపాడుకోవడానికి హులగు ఖాన్ పాలస్తీనా ప్రాంతం లో ఒక చిన్న సైనిక దళాన్ని మాత్రమే అక్కడ విడిచిపెట్టాడు. అవకాశాన్ని చూసి, సుల్తాన్ కుతుజ్ పాలస్తీనాపై దండెత్తాడు మరియు ఇస్లాంను రక్షించడానికి మరియు మంగోల్ ఆక్రమించిన డమాస్కస్ మరియు బిలాద్ అల్-షామ్‌ Damascus,  Bilad al-sham ను విడిపించేందుకు తన సహచరుడు అయిన రుక్న్-ఉద్-దిన్ బైబరస్ Rukn al-Din Baibars అద్వర్యం లో సైన్యాన్ని పంపాడు..

పెరుగుతున్న మామ్‌లుక్‌ల సైనిక బలాన్ని చూసి, మంగోలు, ఫ్రాంకో-మంగోల్ కూటమిని తీసుకురావడానికి ప్రయత్నించారు, అయితే పోప్ అలెగ్జాండర్ IV దానిని నిషేధించినందున అలా చేయడంలో విఫలమయ్యారు. మమ్లుక్స్ మరియు ఫ్రాంక్‌ల మధ్య (ముస్లిములు క్రైస్తవుల మద్య) వ్యతిరేకత ఉన్నప్పటికీ,  మంగోలియన్ సమూహాలు ఎవరినీ విడిచిపెట్టవని ఫ్రాంక్‌లు అర్థం చేసుకున్నారు, తద్వారా వారు మామ్లుక్ సైన్యాలను తమ భూముల గుండా వెళ్ళడానికి అనుమతించారు. మంగోలులు జోర్డాన్ నదిని దాటిన వార్త వచ్చినప్పుడు, సుల్తాన్ కుతుజ్ వారిని కలవడానికి జెజ్రీల్ లోయJezreel Valleyలోని ఐన్ జలుత్ Ain Jalut వైపు వెళ్ళాడు.

సెప్టెంబరు 3, 1260, 20,000 మందితో కూడిన ఇరుపక్షాలు(మామ్లుక్-మంగోలులు) ఐన్ జలుత్‌లో యుద్ధంలో తలపడ్డాయి. మంగోలులు మొదట దాడి చేశారు. మామ్లుక్‌లకు తమ భూభాగం బాగా తెలుసు, మరియు సుల్తాన్ కుతుజ్ దానిని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. కుతుజ్ మిత్రుడు  బైబరస్ Baibarsఈ ప్రాంతంలో ఎక్కువ సమయం గడిపినందున బైబరస్ Baibars మాముక్ల సైనిక వ్యూహాన్ని రూపొందించారు. సుల్తాన్ కుతుజ్ తన బలగాలను చాలా వరకు ఎత్తైన ప్రాంతాలలో దాచిపెట్టాడు మరియు బైబరస్ మంగోలులను హిట్ అండ్ రన్(గెరిల్లా యుద్ద) వ్యూహాలతో పోరాడారు

రుక్న్-ఉద్-దిన్ బైబరస్ Rukn al-Din Baibars  యుద్ధం నుండి వైదొలిగినట్లు నటింఛి  తన సైన్యాన్ని వెనక్కి మరలించాడు. మంగోల్ కమాండర్ ఈ ఉపాయాన్ని అనుమానించకుండా ఘోరమైన తప్పు చేసాడు మరియు తిరోగమన సైన్యాన్ని నిర్లక్ష్యంగా వెంబడించాడు. మంగోల్ సైన్యం చివరకు ఎత్తైన ప్రాంతానికి చేరుకున్నప్పుడు, కుతుజ్ సైన్యం మంగోలులను చుట్టుముట్టింది మరియు మంగోలులు సుల్తాన్ కుతుజ్ సైన్యాల యొక్క ఉచ్చులో చిక్కుకున్నారు.

అయితే, మంగోలులు పోరాటం లో  క్రూరత్వానికి ప్రసిద్ధి చెందారు మరియు మంగోలులు మామ్లుక్ల ఉచ్చు నుండి బయటపడటానికి పిచ్చి రక్తదాహంతో పోరాడారు. మంగోలు ఎడమ వైపు నుండి బయటపడబోతున్నారని సుల్తాన్ కుతుజ్ చూసినప్పుడు, కుతుజ్ తన వెనుక వైపు దళాలను యుద్ధానికి ముందుకు నడిపించాడు మరియు మంగోలియన్ దళాలను అణిచివేసాడు, మంగోలులు తమ సైన్యం తో వేగంగా బిసాన్‌Bisan వైపుకు తిరోగామించారు.

మంగోలులు ఎదురుదాడిని ప్రారంభించగలిగినప్పటికీ, మంగోలుల వద్ద పెద్ద సంఖ్యలో సైనికులు లేరు  మరియు త్వరలోనే వారి కమాండర్‌తో సహా మొత్తం సైన్యం పూర్తిగా నాశనం చేయబడింది. చరిత్రలో ఎవరైనా మంగోల్‌లను ముఖా-ముఖాముఖి పోరాటంలో ఓడించడం ఇదే మొదటిసారి.

ఈ చారిత్రాత్మక విజయం తర్వాత, సుల్తాన్ ఖుతుజ్‌ను, రుక్న్-ఉద్-దిన్ బైబరస్ ఏజెంట్లు హత్య చేశారు, తద్వారా రుక్న్-ఉద్-దిన్ బైబరస్ అధికారాన్ని చేపట్టాడు మరియు మమ్లుక్ పాలకుడు అయ్యాడు. రుక్న్-ఉద్-దిన్ బైబరస్  మంగోలులను ఓడించి సిరియా నుండి తరిమివేసాడు మరియు మిగిలిన క్రూసేడర్ రాజ్యాలను కూడా లొంగదీసుకున్నాడు. రుక్న్-ఉద్-దిన్ బైబరస్ బలమైన సామ్రాజ్యాన్ని సృష్టించాడు.

వారసత్వ సమస్యల కారణంగా, హులాగు ఖాన్, మామ్లుకుల చేతిలో పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేంత బలమైన సైనిక శక్తిని సేకరించలేకపోయాడు. దీనికి తోడు మంగోలుల మధ్య అంతర్యుద్ధం ఉంది, ఎందుకంటే కిప్చక్ ఖానాటే యొక్క ఖాన్ ముస్లింగా మారాడు మరియు హులగు ఖాన్,  అబ్బాసిడ్‌లకు ఏమి చేసాడో విన్న తరువాత, కిప్చక్ ఖానాటే ఖాన్ హులగు ఖాన్ కు ఈ క్రింది సందేశాన్ని పంపాడు.అతను (హులగు) ముస్లింల నగరాలన్నిటినీ కొల్లగొట్టాడు మరియు ఖలీఫా మరణానికి కారణమయ్యాడు. దేవుని సహాయంతో, నేను అతనిని చాలా మంది అమాయకుల  రక్తం కోసం లెక్కిఅడుగుతాను.”

మామ్లుక్‌ల చేతిలో ఘోర పరాజయం మంగోల్ సామ్రాజ్యం ముగింపుకు దారిటింది. కుబ్లాయ్ ఖాన్ మంగోల్ సామ్రాజ్యం యొక్క చివరి గొప్ప ఖాన్. మంగోలులు కిప్‌చక్‌ Kipchaks లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు మరియు 1263లో కాకస్ దాడిలో ఓటమి చవిచూశారు. మమ్లుక్‌లతో పోరాడేందుకు మరిన్ని బలగాలను పంపినప్పటికీ, వారు కూడా ఈజిప్ట్ ముస్లిం(మామ్లుక్) సామ్రాజ్యాన్ని కూల్చేందుకు చేసిన ప్రయత్నాల్లో విఫలమయ్యారు. ఐన్ జలుత్ యుద్ధం ప్రపంచ చరిత్రలో ఇంతటి చారిత్రాత్మక ఘట్టం కావడానికి ఇదే కారణం. ఐన్ జలుత్ యుద్ధం మంగోలుల దాడి ప్రపంచానికి తెచ్చిన భీభత్సానికి ముగింపు పలికింది మరియు స్థిరత్వం పునరుద్ధరించబడింది.

 

 


No comments:

Post a Comment