21 March 2023

ఆసియా బింట్ ముజాహిమ్ Āsiya bint Muzāḥim

 

ఆసియా బింట్ ముజాహిమ్ آسِيَة بِنْت مُزَاحِم ఫిరోన్ భార్య మరియు మూసా యొక్క పెంపుడు తల్లిగా ప్రసిద్ధి చెందింది.ఆసియా ముస్లింలచే గౌరవించబడిన నలుగురు గొప్ప స్త్రీలలో ఒకరు  మరియు సహీ-బుఖారీ ప్రకారం, నలుగురు గొప్ప స్త్రీలలో రెండవది.

మూసా అద్భుతాన్ని చూసిన తర్వాత ఆసియా రహస్యంగా ఏకేశ్వరోపాసనను అంగీకరించిందని నమ్ముతారు. ఆసియా రహస్యంగా దేవుణ్ణి పూజించేదని, భర్త ఫిరోన్ కు భయపడి మారువేషంలో ప్రార్థించిందని హదీసులు చెబుతున్నవి. ఆసియా మూసాను దత్తత తీసుకుంది మరియు మూసాను చంపవద్దని తన భర్త ఫిరోన్ ను ఒప్పించింది. ఆసియా ఏకేశ్వరోపాసకురాలు మరియు తన భర్త  ఫిరోన్  దౌర్జన్యానికి గురియ్యి భర్తచే చిత్రహింసలకు గురై మరణించింది.

ఆసియా యొక్క  వివాహం  ఫిరోన్ తో జరిగినది. ఆసియా వినయపూర్వకంగా ఉండేది  మరియు మూసా మరియు హరూన్ బోధిస్తున్న విశ్వాసాన్ని అంగీకరించింది. ఆసియా కు అపారమైన సంపద ఉన్నప్పటికీ, ఆసియా భర్త ఫిరోన్ లా గర్వించలేదు. విశ్వాసం చాలా ముఖ్యమైనదని గ్రహించింది మరియు ఆ విధంగా తన తరానికి చెందిన స్త్రీలలో దేవునిచే ఉన్నతమైనదిగా పరిగణించబడినది.

ఆసియా మరియు ఆమె పనిమనిషి నైలు నదిలో తేలియాడుతున్న డబ్బాను కనుగొన్నారు. ఆసియా డబ్బాను ఒడ్డుకు లాగమని ఆదేశించింది. పనిమనిషి లోపల నిధి ఉందని భావించారు, కానీ బదులుగా మూసా  అనే మగబిడ్డను కనుగొన్నారు. ఆసియాకు తక్షణమే మూసా పట్ల మాతృ ప్రేమ జనించినది. ఆసియా బిడ్డ(మూసా) గురించి ఫిరోన్ కు చెప్పింది. ఈ సంఘటన దివ్య ఖురాన్‌లో వివరించబడింది.

·        ఫిరోన్ భార్య (అతడితో) ఇలా అన్నది, “ఇతడు నీకూ నాకూ కంటి చలువ, ఇతనిని చంపకు. బహుశా ఇతడు మనకు ఉపయోగపడవచ్చు లేదా మనం ఇతనిని కుమారునిగానైనా చేసుకోవచ్చు.” కాని వారికి (పర్యవసానం) తెలియదు.— దివ్య ఖురాన్: 28:9

ఆసియా, మూసా యొక్క జీవసంబంధమైన తల్లిని మూసా యొక్క దాయి(పాలిచ్చే తల్లి)గా వారి ఇంటిలో నివసించమని అడిగింది మరియు ఆమె సేవలకు ధనం చెల్లించింది.

తన భర్త ఫిరోన్ చిత్రహింసల కారణంగా విశ్వాసురాలైన స్త్రీ మరణాన్ని చూసినప్పుడు, అసియా, ఫిరోన్ ముందు తన విశ్వాసాన్ని ప్రకటించింది. ఫిరోన్, ఆసియా ను  విశ్వాసం నుండి దూరం చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఆసియా దేవుణ్ణి మరియు మూసా బోధనను తిరస్కరించడానికి నిరాకరించినది. ఫిరోన్ ఆదేశాల మేరకు, ఆసియాను చిత్రహింసలు పెట్టి చంపారు.

అన్ని కాలాలలో అత్యంత గౌరవనీయమైన నలుగురు మహిళల్లో ఆసియా ఒకరు మరియు ఆసియా ముస్లింలచే అత్యంత గౌరవం పొందింది. ఆసియా నిజాయితీగల విశ్వాసి అని, ఫిరోన్ భార్య అయినప్పటికీ ఆసియా తనను తాను పూర్తిగా అల్లాకు సమర్పించుకుందని చెబుతారు.

హదీసుల ప్రకారం, ఆసియా మూసా యొక్క ఏకేశ్వరోపాసనను అంగీకరించినందున స్వర్గంలోకి ప్రవేశించిన మొదటి మహిళల్లో ఒకరు. దివ్య ఖురాన్ ముస్లింలందరికీ ఆసియాను ఒక ఉదాహరణగా పేర్కొంది:

ఆసియా  ప్రార్థన దివ్య ఖురాన్‌లో ప్రస్తావించబడింది.విశ్వాసుల విషయం లో అల్లాహ్ ఫిరోన్ భార్యను ఉదాహరణగా పేర్కొంటున్నాడు.

·        అప్పుడు ఆమె ఇలా ప్రార్ధించారు, “ప్రభూ! నాకొరకు నీ వద్ద స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరోన్ నుండి, అతని చేష్టలనుండి కాపాడు, దుర్మార్గపు జాతి నుండి నాకు విముక్తి కలిగించు.”— దివ్య ఖురాన్: 66:11.

·        అబూ మూసా అషారీ ప్రకారం ప్రవక్త ముహమ్మద్(స)ఇలా పేర్కొన్నారు:

పురుషులలో చాలా మంది వ్యక్తులు చాలా పరిపూర్ణంగా ఉన్నారు, కానీ ఇమ్రాన్ కుమార్తె మరియం (మేరి), ఫిరోన్ భార్య అయిన ఆసియా మరియు ఆయిషా తప్ప మహిళలలో  పరిపూర్ణులు ఎవరూ లేరు. అలాగే అన్ని ఇతర ఆహారాల కంటే థారిద్‌దే యొక్క శ్రేష్ఠత మిన్న.— సహీహ్ ముస్లిం హదీథ్ 2431

No comments:

Post a Comment