12 December 2023

సయ్యద్ అబ్దుల్ అజీజ్, 1885 -1948 Syed Abdul Aziz 1885-1948

 


సయ్యద్ అబ్దుల్ అజీజ్ 1885లో బీహార్ లోని నియోరా (పాట్నా)లో జన్మించాడు. సయ్యద్ అబ్దుల్ అజీజ్ తండ్రి సయ్యద్ హిఫాజాత్ హుస్సేన్ జైపూర్ సంస్థానం లో రాజవైద్యుడు. సయ్యద్ అబ్దుల్ అజీజ్ తల్లిదండ్రులు చిన్నతనం లోనే మరణించారు. అబ్దుల్ అజీజ్ మొదట పాట్నా కాలేజీలో  తరువాత హజారీబాగ్‌లోని సెయింట్ కొలంబస్ కాలేజీలో విద్యనబ్యసించాడు. 1907లో అబ్దుల్ అజీజ్ ఇంగ్లండ్‌కు వెళ్లి 1913లో బారిస్టర్‌గా భారతదేశానికి తిరిగి వచ్చాడు

పాట్నా లో లీగల్ ప్రాక్టిస్ ప్రారంభించి కొద్దికాలం లోనే పాట్నా లో ఉత్తమ మరియు అత్యంత విజయవంతమైన క్రిమినల్ న్యాయవాదులలో (ఫౌజ్దారీ=క్రిమినల్ కేసులు) ఒకరిగా పేరు పొందాడు. 'జ్యూరీ అడ్రస్'లో అబ్దుల్ అజీజ్ శక్తివంతమైన, ఉద్వేగభరితమైన ప్రసంగాలు అబ్దుల్ అజీజ్ కి ప్రత్యేక గుర్తింపును, ప్రజాదరణను మరియు కీర్తిని సంపాదించాయి. అబ్దుల్ అజీజ్ మీరట్ కుట్ర కేసు (1929)లో ప్రభుత్వ ప్లీడర్. వృత్తిలో నిజాయతి గా వ్యవరించేవాడు. బలం లేనందువలన కేసులను ఉపసంహరించుకోవాలని వైస్రాయ్‌కు స్పష్టంగా సలహా ఇచ్చాడు

అబ్దుల్ అజీజ్‌కు మొదట్లో రాజకీయాలపై ఆసక్తి లేదు,  సామాజిక సంక్షేమ కార్యక్రమాల పట్ల  అభిరుచి కలవాడు.  బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని పాట్నా నియోజకవర్గం నుండి, విజయం సాధించాడు. అబ్దుల్ అజీజ్‌ 1934లో, బీహార్ విద్య మరియు అభివృద్ధి శాఖ మంత్రి అయ్యాడు. బీహార్ భూకంపం (15 జనవరి 1934) రూపంలో భారీ ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అబ్దుల్ అజీజ్ బీహార్ గ్రామీణ మరియు పట్టణాలలో పర్యటనలు చేపట్టాడు, ఆహార ధాన్యాలు, రొట్టెలు, బట్టలు, దుప్పట్లు, మందులు పంపిణీ చేసాడు మరియు నిర్వాసితులకు ఆశ్రయం కోసం శిబిరాలను,  ప్రజల పునరావాసం కోసం ఇళ్ళు కూడా నిర్మించబడ్డాయి.

గాంధీ మైదాన్‌లో గల అబ్దుల్ అజీజ్‌ నివాస భవనం పేరు  'దిల్ కుషా'.. అబ్దుల్ అవివాహితుడు. మరియు తన సంపాదన మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేశాడు

అబ్దుల్ అజీజ్ అంధుల కోసం ఉదారమైన నిధి అందించి బీహార్ ప్రాంతీయ బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ స్థాపకుడు కూడా.. అబ్దుల్ అజీజ్ బ్లైండ్ రిలీఫ్ క్యాంప్ ప్రత్యేకించి పెద్ద విజయాన్ని సాధించింది. బ్లైండ్ రిలీఫ్ క్యాంప్ శిబిరం ద్వారా వేలాది మందికి కంటి చూపు లభించింది. నిరుపేదలకు నివాసం, ఆహారం, కంటికి ఉచిత వైద్యం అందించారు. నిరుపేద రోగుల కోసం గాంధీ మైదాన్‌లో ప్రత్యేక టెంట్లు వేసి, వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు కూడా అందించారు. ఇది చాలా సంవత్సరాలు కొనసాగింది.

అబ్దుల్ అజీజ్ మంత్రిగా, కుటీర పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తత్ఫలితంగా, బీహార్లో  కుటీర పరిశ్రమలు అభివ్రుద్ది చెందినవి. బీహార్ లోని కుటీర పరిశ్రమల ద్వారా తయారు చేయబడిన కర్టెన్ల యొక్క ఫాబ్రిక్ మరియు డిజైన్‌లు ముఖ్యంగా విదేశాలలో కూడా ప్రాచుర్యం పొందాయి.

1936లో, అబ్దుల్ అజీజ్ ముస్లిం యునైటెడ్ పార్టీని ప్రారంభించాడు మరియు 1937 ఎన్నికలలో పాట్నా నియోజకవర్గం నుండి విజయం సాధించాడు. 1938-39లో యునైటెడ్ పార్టీ, ముస్లిం లీగ్‌లో విలీనమైంది.

డిసెంబరు 1938లో, అబ్దుల్ అజీజ్ పాట్నాలో జిన్నా పర్యటనతో, ముస్లిం లీగ్ రాజకీయాలలో పాలుపంచుకున్నాడు మరియు లీగ్ (ముస్లిం లీగ్ యొక్క బీహార్ విభాగం అధ్యక్షుడయ్యాడు) యొక్క ఉన్నత నాయకుడిగా ఎదిగాడు.

అయినప్పటికీ, అబ్దుల్ అజీజ్ ముస్లిం లీగ్ లో ఎక్కువ కాలం కొనసాగలేదు; 1941లో, అబ్దుల్ అజీజ్ నిజాం సంస్థానం లో మంత్రి కావడానికి హైదరాబాద్ వెళ్ళాడు, అక్కడ, అబ్దుల్ అజీజ్ 1944లో బాత్రూంలో గాయపడ్డాడు మరియు శారీరకంగా వికలాంగుడు అయ్యాడు, తిరిగి పాట్నాకు వచ్చాడు.

అబ్దుల్ అజీజ్ 1946లో బీహార్ లో జరిగిన  మతపరమైన అల్లర్లతో విసిగిపోయాడు. మరియు "హద్సాత్-ఎ-బీహార్ పర్ ఏక్ నజర్, 25 అక్టోబర్ 1946-20 జనవరి 1947" అనే రెండు భాగాలలో ఉర్దూ కరపత్రాన్ని వ్రాసాడు. అందులో ముస్లిం లీగ్‌ మరియు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను విమర్శించాడు.

అబ్దుల్ అజీజ్ జనవరి 1948లో మరణించాడు మరియు  నియోరాలో ఖననం చేయబడినాడు.

 

No comments:

Post a Comment