14 December 2023

జనతా వీక్లీ: సోషలిస్ట్ వారపత్రిక

 


జనవరి 1946లో ప్రారంభమైన జనతా వారపత్రిక భారతదేశ చరిత్రలో సోషలిస్టు వాణిగా ఉద్భవించింది. జనతా వీక్లీ సోషలిస్ట్ మేధావులు మరియు రాజకీయ కార్యకర్తలచే స్థాపించబడింది. జనతా వీక్లీ ప్రజాస్వామ్య సోషలిస్ట్ సూత్రాలపై అవగాహన ను పెంపొందించింది మరియు లోతైన సామాజిక మార్పు కోసం అణగారిన ప్రజల హక్కుల కోసం వాదించింది.

శ్రీమతి అరుణా అసఫ్ అలీ జనతా వీక్లీ వారపత్రికకు మొదటి సంపాదకురాలు. జనతా వీక్లీ 1946 నుండి ముంబై నుండి ఆంగ్లంలో ప్రచురించబడింది. అరుణా అసఫ్ అలీ జర్నల్ ప్రారంభం నుండి దానితో అనుబంధం కలిగి ఉంది. 

ఎదత్తా నారాయణ్, అచ్యుత్ పట్వర్ధన్, రోహిత్ దవే, ఎస్. నటరాజన్, ఎన్.జి. గోరే, ప్రేమ్ భాసిన్, J. D. సేథి, H.K. పరాంజపే, మధు దండావతే మరియు సురేంద్ర మోహన్ గతంలో జనతా వీక్లీ సంపాదకులుగా ఉన్నారు. జనతా వీక్లీ యొక్క ప్రస్తుత సంపాదకులు ప్రముఖ సోషలిస్టు మరియు వందేళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ జి.జి. పారిఖ్.

జనతా వీక్లీ  1946లో ప్రచురణను ప్రారంభించింది. రాజకీయ పరిపక్వతతో పాటు భారత రాజకీయాలకు ఆధునిక ఆలోచనలను అందించాలని  జనతా వీక్లీ  కోరుకుంది. నిరాడంబరంగా, కొత్త రాజకీయ ఆలోచనల వ్యక్తీకరణకు వేదికగా జనతా వీక్లి  రూపొందినది. 

లౌకిక మరియు ప్రగతిశీల శక్తుల పెరుగుదలకు వాతావరణాన్ని కల్పించడంలో జనతా వీక్లి  వారం వారం సహాయం చేసేది. ప్రజల్లో సామాజిక బాధ్యతపై మరింత అవగాహన కల్పించడం కోసం జనతా వీక్లి  అవసరం ఎంతైనా ఉంది... డాక్టర్ జి.జి. పారిఖ్ 2010 నుండి జనతా వీక్లీ ఎడిటర్‌గా ఉన్నారు.

No comments:

Post a Comment