30 December 2023

ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క సైనికుడు వర్గీస్ థామస్

 

 

 

వర్గీస్ థామస్ జన్మస్థలం ప్రస్తుత కేరళలోని అలెప్పీ జిల్లాలోని కాయంకుళం, అది అప్పట్లో ట్రావెన్క్యూర్state స్టేట్లో ఉంది. వర్గీస్ థామస్ యవ్వనం లోనే INAలో చేరారు

2వ ప్రపంచ యుద్ద సమయం లో లొంగిపోయిన  INA సైనికులలో  వర్గీస్ థామస్ ఒకడు.

INA ట్రయల్స్ సమయంలో, వర్గీస్ థామస్ ఎందుకు  INA లో చేరాడని బ్రిటిష్ అధికారులు అడిగారు మరియు నేతాజీ తనను (వర్ఘీస్ థామస్) తప్పుదారి పట్టించారని ఒక ప్రకటన రాయాలని వర్ఘీస్ థామస్ ను బ్రిటిష్ అధికారులు  కోరారు.

వర్గీస్ థామస్ బ్రిటిష్ ఆదేశానుసారం వ్రాయడానికి నిరాకరించాడు. వర్గీస్ థామస్ నా మాతృభూమి మరియు నేతాజీ నాకు మరింత పవిత్రమైనవారు అని  అన్నాడు.  బ్రిటీష్ అధికారులు కోపంగా అతన్ని సెల్లోకి తీసుకెళ్లి హింసించారు మరియు వెదురు కర్రలతో కొట్టారు.

2వ ప్రపంచ యుద్ద సమయం లో లొంగిపోయిన  INA సైనికులను విడుదల చేయాలని భారతీయులు నిరసన మరియు ఆందోళన చేసారు..పలితంగా విడుదల అయిన వారిలో వర్గీస్ థామస్ ఒకరు.

వర్గీస్ థామస్ విడుదలైన I N A యొక్క చివరి బ్యాచ్లో ఒకడు, 1950లో విడుదలైన తర్వాత వర్గీస్ థామస్ I N A కుటుంబాల సహాయంతో కేరళకు తిరిగి వచ్చాడు. వర్గీస్ థామస్ 1952లో ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్లో ఉద్యోగం సంపాదించాడు, తరువాత వర్గీస్ థామస్ స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ను పొందాడు.

1954లో వర్గీస్ థామస్ అన్నమ్మ వర్గీస్ను వివాహం చేసుకున్నాడు, దంపతులకు విమల వర్గీస్, సన్నీ వర్గీస్ మరియు ఫిలిప్ వర్గీస్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. I N A వారియర్ వర్గీస్ థామస్ 30 జూలై 1998లో మరణించారు.

.

No comments:

Post a Comment