25 December 2023

మెహ్రున్నీసా దల్వాయి: అజ్ఞాత ముస్లిం కార్యకర్త Mehrunnisa Dalwai: An Unsung Muslim Activist

 

 

మెహ్రునిస్సా దల్వాయి ముస్లిం సంస్కరణవాద ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించింది.భారతదేశ సమాజం లో  మార్పు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన అనేక మంది ప్రముఖ సామాజిక కార్యకర్తల పేర్లు చరిత్రలో మరచిపోయారు, వారిలో మెహ్రున్నీసా దల్వాయి ఒకరు.

మెహ్రునిస్సా దల్వాయి మే 25, 1930న జన్మించి, పూణేలో పెరిగిన మెహ్రునిస్సా దల్వాయి సంప్రదాయవాద, ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబం నుండి వచ్చారు.

మెహ్రున్నీసా దల్వాయ్ సాంప్రదాయ ఉర్దూ విద్యను అభ్యసించినప్పటికీ, మరాఠీ భాషలో మంచి పట్టు సాధించగలిగింది. మెహ్రున్నీసా దల్వాయ్ తన ఆత్మకథ 'మి భరూన్ పావ్లే ఆహే'ని మరాఠీ భాషలో వ్రాసింది మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత, మెహ్రున్నీసా దల్వాయ్ ముంబై నగరంలోని ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC)లో పనిచేసింది.

ముంబై లో మెహ్రున్నీసా దల్వాయ్  పరిచయం, ఒక  ప్రగతిశీల ముస్లిం సమాజ సంస్కర్త హమీద్ తో జరిగింది. హమీద్  ఒక పేద కొంకణి ముస్లిం కుటుంబం నుండి వచ్చాడు మరియు ముస్లిం సమాజంలోని మహిళల పేద స్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేసేవాడు..

ట్రిపుల్ తలాక్, భరణం మరియు బహుభార్యత్వం వంటి పద్ధతులను,  సామాజిక దురాచారాల నిర్మూలనకు హమీద్  కృషి చేసే వాడు.. హమీద్ మంచి రచయిత కూడా, 1965లో క్లాసిక్, 'ఇంధాన్' ను ప్రచురించాడు మనువాదం మరియు రాడికల్ ఇస్లాం కు వ్యతిరేకంగా పోరాడాడు. ముస్లిం సమాజం యొక్క సరళీకరణకు దల్వాయ్ దంపతులు కృషి చేసారు..

మెహ్రున్నీసా దల్వాయ్ మరియు  హమీద్‌. ఇద్దరూ సాంప్రదాయ ముస్లిం ఆచారాల ద్వారా వివాహం చేసుకున్నారు మరియు ఒక నెల తర్వాత 'ప్రత్యేక వివాహ చట్టం' (1954) ద్వారా వివాహం చేసుకున్నారు..

కొత్తగా పెళ్లయిన దల్వాయ్ దంపతులు జంట జోగేశ్వరిలోని మజస్వాడి ప్రాంతంలో ఒక చిన్న గదిలో నివసించారు. అక్కడ వారితో పాటు  హమీద్ యొక్క చిన్న తమ్ముడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ అయిన హుస్సేన్ దల్వాయ్ చేరాడు.  హుస్సేన్ దల్వాయ్ ముంబైలో విద్యను పూర్తి చేశారు.

మెహ్రున్నీసా దల్వాయి దంపతులు సామాజిక పని లో నిమగ్నమయ్యారు. మెహ్రున్నీసా దల్వాయి ముస్లిం మహిళల న్యాయం మరియు సమాన హక్కుల కోసం పనిచేసింది. మెహ్రున్నీసా భర్త యొక్క ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ఇచ్చింది. మెహ్రున్నీసా దంపతులు ముస్లిం సమాజంలోని స్త్రీ-పురుషులకు  సమాన హక్కులు, మరియు వారి  ఆర్ధిక శక్తీ మెరుగుపరచడానికి  కృషి చేసారు..

మెహ్రునిస్సా దల్వాయ్ ఒక సామాజిక కార్యకర్త మరియు సంస్కర్త గా జీవితం కొనసాగించారు. దురదృష్టవశాత్తూ, హమీద్ 1977లో 44 ఏళ్ల వయసులో కిడ్నీ ఫెయిల్యూర్‌తో కన్నుమూశారు. మెహ్రునిస్సా దల్వాయ్ తన భర్త విషాదకరమైన మరణం తర్వాత, తన సమయాన్ని పూణేలో భర్త హమీద్ స్థాపించిన సంస్కరణవాద సంస్థ అయిన ముస్లిం సత్యశోదక్ మండల్‌కు అంకితం చేసింది, ముస్లిం సమాజ౦ లోని సమస్యలకు పరిష్కారాలను అందించడం మరియు సామాజిక-సాంస్కృతిక పరివర్తన పై దృష్టి సారించింది.

మెహ్రునిస్సా దల్వాయి ముస్లిం సత్యశోదక్ మండల్‌కు మొదటి కార్యనిర్వాహక అధ్యక్షురాలు మరియు తరువాత అనేక దశాబ్దాల పాటు అధ్యక్షురాలిగా పనిచేసింది.

ఏప్రిల్ 1996లో, మెహ్రునిస్సా దల్వాయి ట్రిపుల్ తలాక్ రద్దు వ్యతిరేక ఉద్యమం లో భాగం గా ధైర్యంగా మరో ఆరుగురు మహిళలతో కలిసి ముంబైలోని 'మంత్రాలయ'కు జరిగిన మార్చ్‌కి నాయకత్వం వహించారు. అక్కడ మెహ్రునిస్సా దల్వాయి బృందం అప్పట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంతరావు నాయక్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన మెమోరాండం ఇచ్చారు. ఇది ముస్లిం సమాజం లో తీవ్ర వ్యతిరేకతకు పెద్ద కలకలం కు దారితీసింది.  

మెహ్రునిస్సా దల్వాయ్ ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ మరియు ముస్లిం సమాజం యొక్క ఆధునిక సంస్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. తర్వాత మెహ్రునిస్సా దల్వాయ్ హమీద్ దల్వాయి ఇస్లామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు మహారాష్ట్ర తలావ్ ముక్తి మోర్చా Maharashtra Talaw Mukti Morcha ను స్థాపించారు.

మెహ్రునిస్సా దల్వాయి నాయకత్వంలో ముస్లిం సత్యశోదక్ మండల్షా బానో కేసులో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ కేసు భారతదేశంలోని ముస్లిం మహిళల సమాన హక్కుల కోసం పోరాటంలో అలాగే ముస్లిం వ్యక్తిగత చట్టం యొక్క సనాతనధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఒక మైలురాయిగా భావించబడింది. ఈ కేసు అపూర్వమైనది మరియు ఇతర మహిళలు ఇలాంటి చట్టబద్ధమైన దావాలు చేయడానికి మార్గం సుగమం చేసింది.

1978లో, 62 ఏళ్ల ముస్లిం మహిళ, షా బానో, విడాకులు తీసుకున్న తన భర్త మహమ్మద్ అహ్మద్ ఖాన్‌పై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భర్త మహమ్మద్ అహ్మద్ ఖాన్ తనకు తలాక్ ఇచ్చిన తర్వాత భార్య షా బానో భరణం డిమాండ్ చేసింది. 1985లో, షా బానో వివాదం సుప్రీంకోర్టుకు తీసుకువెళ్లబడింది, అక్కడ ప్రధాన న్యాయమూర్తి Y. V. చంద్రచూడ్ హైకోర్టులో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు, షా బానో  కు CrPC కింద, కింద భరణం అందించబడుతుందని తీర్పు  ఇచ్చారు.

అయితే, ఉలేమాలు మరియు మౌలావీలు ఎదుర్కొన్న తీవ్రమైన ఒత్తిడితో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ సుప్రీం కోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది, అయితే ముస్లిం సత్యశోదక్ మండల్ ఈ చర్యను ధైర్యంగా వ్యతిరేకించింది మరియు వరుస నిరసనల ద్వారా దీనిని అమలు చేయాలని పట్టుబట్టింది.

మెహ్రునిస్సా దల్వాయ్ పూణెలోని తన ఇంటిలో 87 సంవత్సరాల వయస్సులో మరణించారు. మెహ్రునిస్సా దల్వాయ్ ఇద్దరు కుమార్తెలు జీవించి ఉన్నారు మరియు మెహ్రునిస్సా దల్వాయ్ చివరి కోరిక మేరకు, మెహ్రునిస్సా దల్వాయ్ శరీరం దానం చేయబడింది.

మహారాష్ట్రలో ముఖ్యంగా పూణేలో చురుకైన సంఘ సంస్కర్తలు మరియు సామాజిక కార్యకర్తలు ఆవిర్భవించారు మరియు  వారు తమ కృషితో సమాజంలో సానుకూల మార్పును తీసుకువచ్చారు.

మెహ్రునిస్సా దల్వాయి వంటి వారిని గుర్తుంచుకోవడం చాలా అవసరం, మెహ్రునిస్సా దల్వాయి మన చరిత్రలో ముఖ్యమైన మరియు సుసంపన్నమైన భాగమని మర్చిపోకూడదు.

మూలం: http://www.feminisminindia.com, ఏప్రిల్ 10, 2023

No comments:

Post a Comment