స్వాతంత్ర్య పోరాట సమయంలో బీహార్‌కు చెందిన ముస్లిం రాజకీయ నాయకులు, పండితులు, ఉలేమాలు, విద్యార్థులు మరియు సామాజిక సంస్థలలోని ఒక ముఖ్యమైన వర్గం, పాకిస్తాన్ కోసం ముస్లిం లీగ్ చేసిన డిమాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు, ద్విజాతి సిద్ధాంతాన్ని తిరస్కరించారు మరియు ఐక్య, స్వతంత్ర భారతదేశం కోసం కృషి చేశారు.
ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్, యొక్క బీహార్ నాయకులు, ముఖ్యంగా అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ మరియు అహద్ ముహమ్మద్ నూర్, జాతీయవాద ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు మరియు భారతదేశంలోని ముస్లింలందరికీ తామే ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న ముస్లిం లీగ్ వాదనను వ్యతిరేకించారు. జిన్నా యొక్క ద్విజాతి సిద్ధాంతానికి వ్యతిరేకంగా సింధీ జాతీయవాద నాయకుడు అల్లా బక్ష్ సూమ్రో ఏర్పాటు చేసిన ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్‌లో వారు పాల్గొన్నారు. 1946 ఎన్నికల సమయంలో, జాతీయవాద ముస్లిం సంస్థలు మరియు వాటి నాయకులు కూడా, తరచుగా కాంగ్రెస్ సహకారంతో, ముస్లిం లీగ్ అభ్యర్థులకు వ్యతిరేకంగా తమ అబ్యర్ధులను బరిలోకి దింపారు.
ముజఫర్‌పూర్‌కు చెందిన మఘ్‌ఫూర్ అహ్మద్ అజాజీMaghfoor Ahmad Ajazi మరో ప్రముఖ జాతీయవాద ముస్లిం నాయకుడు. మఘ్‌ఫూర్ అహ్మద్ అజాజీ, అఖిల భారత జమ్హూర్ ముస్లిం లీగ్ All India Jamhur Muslim League ను స్థాపించారు. ఈ సంస్థ పాకిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది మరియు ఐక్య భారతదేశం అనే ఆలోచన చుట్టూ ముస్లింలను సమీకరించడానికి ప్రయత్నించింది. ఇది తరువాత భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనమైంది.
బీహార్ జాతీయవాద ముస్లిం ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రముఖ ఇస్లామిక్ పండితుడు మౌలానా అబుల్ మొహసిన్ ముహమ్మద్ సజ్జాద్, భారతదేశాన్ని విభజించాల్సిన అవసరం ఉందని చెప్పే ఆలోచనను విమర్శిస్తు ఒక వివరణాత్మక ఖండనను జారీ చేశారు.
ఖాజీ అహ్మద్ హుస్సేన్ మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ఇతర ప్రముఖ పండితులు మరియు జాతీయవాద ముస్లింలతో కలిసి, మౌలానా సజ్జాద్ పాట్నాలో ఇమారత్-ఎ-షరియా స్థాపనలో కూడా పాలుపంచుకున్నారు
మౌలానా అబుల్ మొహసిన్ ముహమ్మద్ సజ్జాద్ మరియు బారిస్టర్ ముహమ్మద్ యూనస్‌లతో సంబంధం ఉన్న ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ, బీహార్ లో ముస్లిం లీగ్‌కు వ్యతిరేకం గా ముస్లిం రాజకీయాలలోని మరో విభాగానికి ప్రాతినిధ్యం వహించింది.
మౌలానా అబ్దుస్ సమద్ రహ్మానీ, బారిస్టర్ ముహమ్మద్ యూనస్, మరియు మౌలానా ఉస్మాన్ ఘనీ వంటి వారు ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 1946 ఎన్నికలలో, కాంగ్రెస్ మరియు ఇతర లీగ్ వ్యతిరేక శక్తుల మద్దతుతో జాతీయవాద ముస్లిం అభ్యర్థులు ముస్లిం లీగ్‌ను సవాలు చేశారు.
జమియత్ ఉలమా-ఎ-హింద్ కూడా భారతదేశ విభజనను మరియు ద్విజాతి సిద్ధాంతాన్ని గట్టిగా వ్యతిరేకించింది. బీహార్‌లో, సయ్యద్ జలాలూద్దీన్ షా మరియు నూరుల్లా రహ్మానీ వంటి నాయకులు ముస్లిం లీగ్‌కు వ్యతిరేకంగా జరిగిన రాజకీయ పోరాటంలో పాల్గొన్నారు మరియు విస్తృత లీగ్ వ్యతిరేక కూటమిలో భాగంగా 1946 ఎన్నికలలో పోటీ చేశారు.
బీహార్‌లో ముస్లిం లీగ్ కు వ్యతిరేకంగా స్థాపించబడిన ఆజాద్ ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యులలో అర్రాకు చెందిన చౌదరి మహమ్మద్ అబుల్ హస్నత్ ఒకరు.
పాట్నాలో జన్మించి, మజ్లిస్-ఎ-అహ్రార్-ఎ-ఇస్లాం ప్రముఖులలో ఒకరైన మౌలానా అటౌల్లా షా బుఖారీ కూడా భారత ముస్లిం రాజకీయాల్లోని బలమైన విభజన వ్యతిరేక సంప్రదాయానికి చెందినవారే. అహ్రార్ ఉద్యమం ముస్లిం లీగ్ యొక్క వేర్పాటువాద రాజకీయాలను వ్యతిరేకించి, ఐక్య భారతదేశాన్ని సమర్థించింది.
బీహార్‌లోని అర్వాల్ కు చెందిన షా మహమ్మద్ ఉమైర్, ముస్లిం లీగ్ మరియు దాని నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా
యొక్క విభజనవాద రాజకీయాలను ఎదుర్కోవడానికి జాతీయవాద ముస్లింల ప్రగతిశీల కూటమిని
ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
షా వహీదుద్దీన్ మిన్హాజీ, ఖయ్యూమ్ ఖిజర్, మరియు రఫిక్ ఆలం హిందుస్తానీ ముస్లిం లీగ్ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి తమ సొంత సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.
అందువల్ల బీహార్‌లోని జాతీయవాద ముస్లిం ఉద్యమం ముస్లిం లీగ్‌కు ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా నిలిచింది
స్వాతంత్ర్యానికి ముందు చివరి దశాబ్దంలో మోమిన్ కాన్ఫరెన్స్ మరియు ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ నుండి జమియత్ ఉలమా-ఎ-హింద్, మజ్లిస్-ఎ-అహ్రార్, ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్, విద్యార్థి సంఘాలు మరియు స్వతంత్ర జాతీయవాద నాయకుల వరకు, ఎందరో ముస్లింలు పాకిస్తాన్ ఉద్యమాన్ని చురుకుగా వ్యతిరేకించారు.
పాకిస్తాన్ డిమాండ్ భారత ముస్లిం సమాజంలోనే
వ్యతిరేకించబడిందని వారి పోరాటం నిరూపిస్తుంది. ముఖ్యంగా బీహార్, ద్విజాతి సిద్ధాంతాన్ని తిరస్కరించి, వలస వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని, ముస్లిం లీగ్‌ను ఎన్నికల పరంగా మరియు రాజకీయంగా సవాలు
చేసి, ఐక్య భారతదేశం కోసం వాదించిన ఒక శక్తివంతమైన జాతీయవాద
ముస్లిం రాజకీయ సంప్రదాయాన్ని సృష్టించింది.
No comments:
Post a Comment