18 August 2026

ఒమర్ మసీదు మరియు మత సహనంలో మరచిపోయిన ఒక పాఠం Mosque of Omar and a forgotten lesson in religious tolerance

 

 

 

మధ్యప్రాచ్యానికి ఎప్పుడూ వార్తల్లో ఉండే అలవాటు ఉంది. ఆ ప్రదేశం నుండే అత్యంత స్ఫూర్తిదాయకమైన మరియు విజ్ఞానాన్ని అందించే కొన్ని కథలు, గాథలు వెలువడ్డాయి.

జెరూసలేం మూడు వేర్వేరు మతాలకు పవిత్రమైనది, మరియు దీని పేరు "శాంతి" (సలేం) అనే పదం నుండి వచ్చింది.జెరూసలేం నగరం ఏసుక్రీస్తు జీవితంతో పెనవేసుకుపోయింది. ఇది జుడాయిజంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం కూడా, ఎందుకంటే ఇక్కడే మొదటి యూదు దేవాలయం నిర్మించబడింది. ఆ దేవాలయానికి మిగిలింది వెస్ట్రన్ వాల్ మాత్రమే, ఇప్పుడు యూదులు ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్తారు.

అరబిక్‌లో, యూదు దేవాలయం కూడా గౌరవించబడుతుంది, దీనిని "బైత్ అల్ మఖ్దిస్" అని పిలుస్తారు. నిజానికి, జుడాయిజం మరియు క్రైస్తవ మతాలలో జెరూసలేంకు ఉన్న ప్రాముఖ్యత, దానిని ఇస్లాంలో కూడా పవిత్రమైనదిగా చేసింది. ఆ తర్వాత అక్కడ నిర్మించిన అల్ అక్సా మసీదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు మూడవ అత్యంత పవిత్రమైన ప్రదేశంగా మిగిలిపోయింది

జెరూసలేంలోని చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్‌ బహుశా క్రైస్తవ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశం. యేసును శిలువ వేసి, ఆ తర్వాత సమాధి చేశారని నమ్మే గొల్గొతా Golgotha ప్రదేశంపై దీనిని నిర్మించారు. ఈ చర్చికి సమాధి Sepulchre కేంద్ర బిందువుగా ఉంది.

జెరూసలేం నగరo లోని మరొక చూడదగిన స్థలం ఒమర్ మసీదు. " రెండవ ఖలీఫా ఒమర్ జెరూసలంను జయించాడు మరియు ఖలీఫా ఒమర్,  ఒమర్ మసీదు ను నిర్మించాడు."


ఒమర్ మసీదు చరిత్ర:

అది 637 లేదా 638వ సంవత్సరం. జెరూసలేం క్రైస్తవ రాజ్యంగా ఉండేది మరియు సోఫ్రోనియస్ పాట్రియార్క్‌ Sophronius was the Patriarch గా ఉండేవారు. ఇస్లాంలో రెండవ ఖలీఫా అయిన ఒమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ యొక్క ముస్లిం సైన్యం పవిత్ర భూమిపై దాడి చేసి, ఆపై జెరూసలేంను ముట్టడించింది. ముస్లిం కమాండర్’/సైన్యాధిపతి సోఫ్రోనియస్‌తో షరతులపై చర్చలు జరపాలనుకున్నాడు. కానీ సోఫ్రోనియస్‌ ముస్లిం కమాండర్/సేనాధిపతితో చర్చలు జరపడానికి నిరాకరించి, తాను ఖలీఫాతోనే చర్చలు జరుపుతానని పట్టుబట్టాడు.చివరకు, ఖలిఫా ఒమర్ ఆ డిమాండ్‌కు అంగీకరించి, పాట్రియార్క్‌ను కలవడానికి జెరూసలేంలోకి ప్రవేశించాడు.

ఒమర్‌ను పరిశీలించిన తరువాత, పాట్రియార్క్, ఒమర్  ప్రార్థన సమయం సమీపిస్తున్నందున, ప్రార్థన చేయడానికి ఒమర్ ను హోలీ సెపల్చర్ చర్చికి ఆహ్వానించాడు. ఒమర్ దానికి నిరాకరించాడు. బదులుగా, ఒమర్ చర్చి బయటకు వెళ్లి దాని పక్కనే ఉన్న నేలపై ప్రార్థన చేశాడు. తన ప్రార్థనలు ముగిశాక, అయోమయంలో ఉన్న సోఫ్రోనియస్‌కు ఒమర్  తన చర్యను వివరించాడు.ఒకవేళ తాను చర్చి లోపల ప్రార్థన చేసి ఉంటే, తన అనుచరులు ఆ చర్చిని మసీదుగా మార్చేసేవారని ఒమర్ వివరించాడు. ఒమర్ దానిని నివారించాలనుకున్నాడు; చర్చి, చర్చిగానే ఉండాలని కోరుకుంటూ, దానికి బదులుగా ఖాళీ స్థలంలో ప్రార్థన చేయడానికి ఎంచుకున్నాడు.

ఇదే వివేకానికి, మత బహుళత్వానికి అసలైన నిదర్శనం! ఆ గొప్ప విజేత ఖలీఫా ఒమర్, పాట్రియార్క్ తనకు ప్రార్ధనకు చర్చిని ఇవ్వజూపినప్పటికీ, దానిని తన అనుచరులు ఎక్కడ మసీదుగా మార్చేస్తారనే భయంతో అక్కడ ప్రార్థన చేయడానికి నిరాకరించాడు. ఏడవ శతాబ్దానికి చెందిన ఈ సరళమైన సందేశం, 21వ శతాబ్దంలో బహుశా మునుపెన్నడూ లేనంతగా నేటికీ ఎంతో సందర్భోచితంగా ఉంది!

సుమారు 13 శతాబ్దాల క్రితం ఒమర్ ప్రార్థన చేసిన ఈ ప్రదేశంలోనే, హోలీ సెపల్చర్ చర్చికి సరిగ్గా పక్కన, నేడు ఒమర్ మసీదు ఉంది. ఇది జెరూసలేంలోని క్రైస్తవ ప్రాంతాలలో ఉన్న ఏకైక మసీదు మరియు ఇస్లాంలోని తొలి మసీదులలో ఒకటి. ప్రస్తుత భవనం 11వ శతాబ్దంలో నిర్మించబడింది.

ఒమర్ మసీదు వంపు ఆకారంలో ఉన్న ఒక మండపం, నిరాడంబరంగా, ప్రశాంతంగా ఉంది, అంతా దట్టంగా ఎర్ర తివాచీలతో కప్పబడి ఉంది. గోడలు సున్నపు పూతతో ఖాళీగా ఉన్నాయి; కొన్ని సాధారణ షాండిలియర్ల మృదువైన కాంతిలో ఆ గది నిండి ఉంది. అక్కడ అలంకరించిన మింబర్లు గానీ, మెహ్రాబ్‌లు గానీ లేవు.

అది కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే. ఆ మసీదును జయఘోష, విజయ సందేశాలు తెలియజేయడానికి నిర్మించలేదు. మసీదు, విశ్వాసి తన దేవుడిని శాంతి, ప్రశాంతతతో ప్రార్థించుకోవడానికి నిర్మించిన ఒక నిరాడంబరమైన, గౌరవప్రదమైన నివాసం.

జెరూసలేం నివాసుల మత జీవితంలో, ఆరాధనలో ఎలాంటి జోక్యం ఉండదని, వారి మత హక్కులు పరిరక్షించబడతాయని వాగ్దానం చేస్తూ ఒమర్ ఒక శాసనాన్ని రూపొందించారు.  ఆపత్రం లోపల తగిలించి ఉంది. కాని ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆ మసీదులోకి పర్యాటకులకు ప్రవేశం కల్పించలేదు 

ఈ సందర్భం లో ఒక విషయం  గుర్తుకు వస్తుంది. కొంతకాలం క్రితం క్రితమే, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, హగియా సోఫియా చర్చిని మ్యూజియం నుండి మసీదుగా మార్చిన  ఆరవ వార్షికోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకున్నారు. టర్కీ నేత ముస్తఫా కెమల్ అటాటర్క్, హగియా సోఫియా మసీదు, మసీదుగా మార్చక ముందు అది ఒక చర్చిగా ఉండేదని తెలుసుకొని, దానిని ఒక మ్యూజియంగా మార్చాలని శాసించారు.

హగియా సోఫియాకు అంత దూరంలో లేని ఒమర్ మసీదు, మరియు నా మనసులో ప్రతిధ్వనిస్తున్న ఒమర్ సందేశం వెంటనే గుర్తుకువచ్చాయి. ఒమర్ ఒక 'రాషిదున్' - అంటే ఇస్లాం ధర్మ మార్గంలో నడిచిన నలుగురు ఖలీఫాలలో ఒకరు. ఆధునిక కాలంలో తమంతట తామే ఖలీఫాలుగా ప్రకటించుకున్న వారికి, ఆయనకు మధ్య ఉన్న ఏకైక తేడా ఇదే!

 

 

 

 

No comments:

Post a Comment