26 September 2026

ప్రకృతి వైపరీత్య భాధితుల పట్ల ముస్లింల బాధ్యత Muslims have a responsibility towards climate refugees

 

 

ప్రజలు 'శరణార్థి' అనే పదం విన్నప్పుడు, తరచుగా యుద్ధం, హింస లేదా రాజకీయ హింస నుండి తప్పించుకుంటున్న వారిని ఊహించుకుంటారు. కానీ, పెరుగుతున్న సముద్ర మట్టాలు, దీర్ఘకాలిక కరువులు, వినాశకరమైన వరదలు, తీవ్రమైన వేడి, మరియు కనుమరుగవుతున్న జీవనోపాధి మార్గాలు, తరతరాలుగా వారి పూర్వీకులు నివసించిన ప్రదేశాలను విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళ పట్ల కూడా విశ్వాసులకు బాద్యత ఉంది.  

భూమి అల్లాహ్ నుండి వచ్చిన 'అమానహ్' (అల్లాహ్ అనుగ్రహం) అని ఖురాన్ మానవులకు పదేపదే గుర్తు చేస్తుంది. మనం దానికి సంపూర్ణ యజమానులం కాదు. అల్లాహ్ ఇలా అంటున్నాడు: "భూమిపై మిమ్మల్ని వారసులుగా చేసింది ఆయనే."— ఖురాన్ 6:165

భూమికి వారసుడిగా లేదా సంరక్షకుడిగా ఉండటం బాధ్యతతో కూడుకున్నది. పర్యావరణ విధ్వంస పర్యవసానాలు న్యాయం, కరుణ మరియు మానవ గౌరవానికి సంబంధించిన ప్రశ్నలుగా మారతాయి.

ఖురాన్ భూమిపై అవినీతిని మరియు విధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తుంది: “భూమి సంస్కరించబడిన తరువాత దానిపై అవినీతిని కలిగించకండి.” — ఖురాన్ 7:56

ఇస్లాం ప్రకారం మానవులు హాని కలిగించకుండా ఉండాలి మరియు తమకు అప్పగించబడిన వాటిని రక్షించుకోవాలి.

వాతావరణ మార్పుల వలన తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చిన వారిని స్వాగతించే సుదీర్ఘ సంప్రదాయం ఇస్లాంలో ఉంది. ఖురాన్ మదీనాలోని అన్సార్‌ల ఉదారతను ప్రశంసిస్తుంది: “వారు లేమిలో ఉన్నప్పటికీ, తమకంటే ఇతరులకు ప్రాధాన్యత ఇస్తారు.” — ఖురాన్ 59:9.

అన్సార్లు కొత్తగా వచ్చినవారిని కేవలం ఆహారం, ఇళ్లు, ఉద్యోగాలు లేదా వనరుల కోసం పోటీపడే బయటి వ్యక్తులుగా చూడలేదు. వారు వారిని అవసరంలో ఉన్న మానవులుగా చూశారు.

న్యాయం కోసం నిలబడాలని ఖురాన్ విశ్వాసులను ఆజ్ఞాపిస్తుంది: “నిశ్చయంగా, అల్లాహ్ న్యాయాన్ని మరియు సత్ప్రవర్తనను ఆజ్ఞాపిస్తాడు.” — ఖురాన్ 16:90

వాతావరణ పిడితులకు సమాజాలు, స్వచ్ఛంద సంస్థలు, మసీదులు మరియు సాధారణ ముస్లింలు ఆహారం, దుస్తులు దానం చేయడం, అత్యవసర ఆశ్రయాలకు మద్దతు ఇవ్వడం, పిల్లలు తమ విద్యను కొనసాగించడానికి సహాయపడటం, ఉపాధి అవకాశాలు కల్పించడం, అవగాహన కల్పించడం ద్వారా తమ వంతు సహకారం అందించగలరు:,

ఇస్లాంలో ఆతిథ్యం అంటే కేవలం అతిథులకు భోజనం పెట్టడం మాత్రమే కాదు. అది వారిలోని మానవత్వాన్ని గుర్తించడం.

ఖురాన్ ఇలా చెబుతోంది: “మరియు మేము ఆదం సంతతిని నిశ్చయంగా గౌరవించాము.” — ఖురాన్ 17:70

ఇస్లాం మనల్ని కరుణ, న్యాయం, బాధ్యత మరియు ఆతిథ్యం వైపు నడిపిస్తుంది. ముస్లింలు  స్థానభ్రంశం చెందిన వారికి సహాయం చేయడం కాకుండా, మనమందరం పంచుకునే ఈ భూమికి మరింత మంచి సంరక్షకులుగా మారడంలో కూడా మార్గనిర్దేశం చేయగలరు..

No comments:

Post a Comment