22 November 2026

జర్మన్ బాషలో దివ్య ఖురాన్ అనువాద కర్తలు- విశేషాలు

 

Quran in German - Modesty Collection


ఖురాన్‌ను మొట్టమొదటిసారిగా జర్మన్ భాషలోకి అనువదించిన వ్యక్తి సలోమన్ ష్వీగర్ (Salomon Schweigger). సాలోమన్ ష్వీగర్ దీనిని 1616లో ప్రచురించాడు. అయితే, జర్మన్ భాషలో అత్యంత ప్రామాణికమైన, విద్యాపరంగా గుర్తింపు పొందిన ఖురాన్ అనువాదం చేసిన ఘనత రూడి పారెట్ (Rudi Paret) కు దక్కుతుంది.

దివ్య ఖురాన్ యొక్క ప్రధాన జర్మన్ అనువాదకులు:

సాలోమన్ ష్వీగర్ (Salomon Schweigger) – మొట్టమొదటి ఖురాన్ అనువాదకుడు. జర్మన్ ప్రొటెస్టంట్ మతబోధకుడైన ష్వీగర్ 1616లో న్యూరెంబర్గ్ (Nuremberg) నగరంలో "Alcoranus Mahometicus" పేరుతో మొట్టమొదటి జర్మన్ ఖురాన్‌ను ప్రచురించారు. అయితే, ఆయన దీనిని నేరుగా అరబిక్ నుండి కాకుండా, ఒక ఇటాలియన్ అనువాదం ఆధారంగా జర్మన్‌లోకి మార్చారు.అప్పటి కాలంలో యూరోపియన్లకు ఇస్లాం మత గ్రంథాన్ని పరిచయం చేయడంలో ఇది కీలక పాత్ర పోషించింది. దీని ఆధారంగానే 1641లో మొట్టమొదటి డచ్ (Dutch) అనువాదం కూడా జరిగింది.

1772లో జర్మన్ పండితుడు డేవిడ్ ఫ్రెడరిక్ మెగర్లిన్ "Die türkische Bibel" అనే పేరుతో ఖురాన్‌ను అనువదించారు. నేరుగా అరబిక్ మూలం నుండి జర్మన్‌లోకి ఖురాన్‌ను పూర్తిగా అనువదించిన మొదటి వ్యక్తి డేవిడ్ ఫ్రెడరిక్ మెగర్లిన్. ప్రఖ్యాత జర్మన్ కవి యోహాన్ వోల్ఫ్‌గ్యాంగ్ వాన్ గోథే (Johann Wolfgang von Goethe) ఇస్లాం మరియు ఖురాన్ గురించి అధ్యయనం చేయడానికి మెగర్లిన్ అనువాదాన్ని ఉపయోగించారు

 1830-40ల మధ్య ఫ్రెడరిక్ రూకెర్ట్ ఇతను ఖురాన్‌లోని చాలా భాగాలను అనువదించాడు (ఇది ఇతని మరణానంతరం 1888లో ప్రచురించబడింది). గొప్ప  కవి మరియు ఓరియంటలిస్ట్ అయిన రూకెర్ట్, అరబిక్ మూలంలోని కవితా సౌందర్యాన్ని, లయను జర్మన్ భాషలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. సాహిత్యపరంగా సాహిత్యపరంగా జర్మన్ భాషలో ఇది అత్యంత గొప్ప అనువాదాలలో ఒకటిగా ఇది నిలిచిపోయింది

20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ జర్మన్ ఓరియంటలిస్ట్ (Orientalist) మరియు ఇస్లామిక్ అధ్యయన పండితుడు రూడి పారెట్ (Rudi Paret) 1966లో పూర్తి ఖురాన్‌ను జర్మన్‌లోకి అనువదించాడు. పారెట్ అనువాదం నేటికీ అత్యంత శాస్త్రీయమైనది మరియు ఖచ్చితమైనది (philologically most accurate) గా గుర్తింపు పొందింది. ఏదైనా ఒక అరబిక్ పదానికి ఉన్న అసలు అర్థాన్ని ఏమాత్రం మార్చకుండా, పాఠకులకు వివరంగా అర్థమయ్యేలా బ్రాకెట్లలో వివరణలు ఇస్తూ రూడి పారెట్ చేసిన అనువాదం ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధకులకు ప్రామాణిక గ్రంథంగా మారింది.

ఇతర ముఖ్యమైన జర్మన్ అనువాదకులు:

1939లో ఒక ముస్లిం పండితుడు మౌలానా సదర్-ఉద్-దిన్ (Maulana Sadr-ud-Din):  ఖురాన్  యొక్క జర్మన్ అనువాదం చేసినాడు.

ముహమ్మద్ అహ్మద్ రసూల్ (Muhammad Ahmad Rassoul): 1986లో అరబిక్ నుండి నేరుగా జర్మన్‌లోకి పూర్తి ఖురాన్‌ను అనువదించిన మొదటి సున్నీ ముస్లిం పండితుడు.

ఆధునిక కాలంలో రూడి పారెట్ (Rudi Paret) చేసిన అనువాదం విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలకు ప్రామాణికంగా నిలవగా, ఫ్రాంక్ బుబెన్‌హైమ్ (Frank Bubenheim) మరియు అబూ రెడా (Abu Reda) చేసిన అనువాదాలు ప్రస్తుతం జర్మన్ మాట్లాడే ముస్లింలలో అత్యంత ప్రజాదరణ పొందాయి.

 

No comments:

Post a Comment