
“షూటింగ్ స్టార్”, ”ది లయన్ ఆఫ్ ది సీస్” (“The Shooting Star”,”The Lion of the Seas”) గా పిలువబడే అహ్మద్ ఇబ్న్ మాజిద్ (అరబిక్: أحمد بن ماجد), (అహ్మద్ ఇబ్న్ మజీద్ ఇబ్న్ ముహమ్మద్ ఇబ్న్ ఒమర్ ఇబ్న్ ఫడ్ల్ ఇబ్న్ ద్వైక్ ఇబ్న్ యూసఫ్ ఇబ్న్ హసన్ ఇబ్న్ హుస్సేన్ ఇబ్న్ అబి మొలాక్ ఇబ్న్ అబీ అల్-రాకాబ్ అల్-నజ్డే (Ahmad ibn Majid ibn Muhammad ibn Omar ibn Fadl ibn Dwaik ibn Youssef ibn Hassan ibn Hussein ibn Abi Mo’alaq ibn Abi Al-Raka’eb Al-Najdey.) ప్రసిద్ద అరేబియా నావిగేటర్ మరియు కార్టోగ్రాఫర్ మరియు రచయిత
అహ్మద్ ఇబ్న్ మాజిద్ యుఎఇ ఎమిరేట్స్‌లో ఒకటైన జుల్ఫర్, ప్రస్తుత రాస్ అల్ ఖైమా, యుఎఇలోని (Ras Al Khaimah, UAE) ఒక ప్రసిద్ధ సముద్రయాన కుటుంబంలో క్రీ.శ 824 AH / 1421 లో లేదా 1430 లలో జన్మించాడు. ఒకప్పుడు ఇది ఒమన్ తీరంలో భాగం. ఇబ్న్ మజీద్ 1500 లో మరణించాడు.
అహ్మద్ ఇబ్న్ మాజిద్ తండ్రి, ఇబ్న్ మాజిద్ను ఒక విద్యావంతుడైన నావికునిగా రుపొందిoచినాడు. అహ్మద్ ఇబ్న్ మాజిద్ 17 ఏళ్ళ వయసులో నౌకలను స్వయంగా నావిగేట్ చేయగలిగినాడు. అహ్మద్ ఇబ్న్ మాజిద్ మొదటి పని చుక్కానిని నడపటం మరియు సరిగా నావికా కొలతలు వెయడం.
రచనలు:
నావిగేషన్‌లో ఇబ్న్ మాజిద్ చేసిన రచనలు చాలా ఉన్నాయి, నావిగేషన్ యొక్క సూత్రాలు మరియు నియమాలపై ఉపయోగకరమైన సమాచారం ఇచ్చే పుస్తకం, అహ్మద్ ఇబ్న్ మాజిద్ చే 1490 లో వ్రాయబడింది. అహ్మద్ ఇబ్న్ మాజిద్ పుస్తకాలు, పటాలు సంవత్సరాల తరబడి నావికులకు మార్గనిర్దేశం చేశాయి అహ్మద్ ఇబ్న్ మాజిద్ ను సముద్ర సింహం అని కూడా పిలుస్తారు.ఇబ్న్ మజీద్ దాదాపు నలభై కవిత్వ మరియు గద్య రచనలకు రచయిత. సముద్ర శాస్త్రం మరియు ఓడల కదలికలపై ఇబ్న్ మజీద్ అనేక పుస్తకాలు రాశారు
1490 లో అహ్మద్ ఇబ్న్ మాజిద్ రాసిన “కితాబ్ అల్-ఫవాయిద్ ఫి ఉసుల్ ఇల్మ్ అల్ బహర్ వా-ఎల్-కవైద్” (బుక్ ఆఫ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ ఆఫ్ నావిగేషన్ Kitab al-Fawa’id fi Usul ‘Ilm al-Bahr wa ’l-Qawa’id (Book of Useful Information on the Principles and Rules of Navigation)), అతని అతి ముఖ్యమైన రచనగా పరిగణించబడుతుంది.
అహ్మద్ ఇబ్న్ మాజిద్ ‘కితాబ్ అల్-ఫవాయిద్ [ఫౌండేషన్ ఆఫ్ ది సీ అండ్ నావిగేషన్ పై పాఠాల పుస్తకం]’ కూడా రాశాడు. అహ్మద్ ఇబ్న్ మాజిద్ కేవలం నావికుడు మాత్రమే కాదు, అతను చాలా తెలివైన మరియు నిపుణుడు అయిన నావిగేటర్, మరియు బహు బాషావేత్త. అహ్మద్ ఇబ్న్ మాజిద్ కు తమిళం, తూర్పు ఆఫ్రికా బాష, పెర్షియన్, అరబిక్ వచ్చు.
ఇబ్న్ మాజిద్ భౌగోళికo, మతం, చరిత్ర, సాహిత్యం మరియు వంశాల గురించి రాశాడు. అహ్మద్ ఇబ్న్ మాజిద్ నిష్ణాతుడైన కార్టోగ్రాఫర్ కూడా. ఇబ్న్ మాజిద్ షూటింగ్ స్టార్) అని పిలవబడేవాడు..
ఇబ్న్ మాజిద్ దిక్సూచి వాడకం ను మెరుగు పరిచాడు. ఇబ్న్ మాజిద్ నావిగేషన్ లో వేళ్ల వాడకo లో ప్రావీణ్యం పొందాడు మరియు కమల్ అనే చెక్క టాబ్లెట్ ను మెరుగుపరిచాడు, అవి రెండూ హోరిజోన్‌లో ఉన్న పోల్ స్టార్ ఎత్తు ఆధారంగా అక్షాంశాన్ని నిర్ణయించడానికి ఉపయోగించబడ్డాయి.
ఇబ్న్ మాజిద్ మరియు వాస్కో డా గామా
వాస్కో డా గామా ఆఫ్రికా నుండి భారతదేశానికి వెళ్ళడానికి సహాయం చేసిన నావిగేటర్‌గా అహ్మద్ ఇబ్న్ మాజిద్ పశ్చిమ దేశాలలో ప్రసిద్ది చెందాడు, దీనిని ప్రముఖ నావికా పండితుడు జి.ఆర్. టిబెట్స్, ఖండించాడు.
చాలా చరిత్ర పుస్తకాలు 15 వ శతాబ్దం మధ్యలో అహ్మద్ బిన్ మాజిద్ చేసిన ప్రయత్నాలు యూరప్ మరియు భారతదేశం మధ్య మొదటి సముద్ర వాణిజ్య మార్గాన్ని కనుగోనటం లో సహాయపడ్డాయి అని వివరిస్తాయి.
యుఎఇలోని అల్-షార్జా పాలకుడు షేక్ సుల్తాన్ ఇబ్న్ మొహమ్మద్ అల్-ఖాసిమి, అహ్మద్ ఇబ్న్ మజీద్ పై ఒక వ్యాసం రాశారు. అల్-షార్జా పాలకుడు తన పరిశోదన లో హిందూ మహాసముద్రం గుండా తన మార్గంలో వాస్కో డా గామాకు మార్గదర్శకుడు ఇబ్న్ మజీద్ కాదని మలిండిలో ఉన్న భారతదేశానికి చెందిన ఒక క్రైస్తవ-గుజరాతీ నావికుడని నిర్ధారించారు.
'ది లయన్ ఆఫ్ ది సీ' గా పిలువబడే ఇబ్న్ మజీద్ చేతితో
వ్రాసిన రెండు ప్రసిద్ద పుస్తకాలు ఇప్పుడు పారిస్‌లోని నేషనల్ లైబ్రరీలో ప్రముఖ ప్రదర్శనలు గా
ఉన్నవి..
No comments:
Post a Comment