17 July 2019

నా ఎమిరేట్స్ /యూ.ఐ.ఈ.(UAE) యాత్రా విశేషాలు:తెనాలి నుంచి అబూధాబి వెళ్ళుటకు శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషల్ ఎయిర్ పోర్ట్కు కార్లో ఉదయం బయలుదేరాము.  కుమారుడు షబ్బీర్ అలీ, పూర్వ విద్యార్ధి యువరాజ్ కూడా మాతో పాటు హైదరాబాద్ దాకా వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో మా అల్లుని  స్నేహితుడు భాస్కర్ కలసినాడు. అతను అంతా వివరించి ప్రయాణంలో మాకు సహాయపడినాడు. అతనికి అభినందనాలు.

ఇత్తెహాద్ ఎయిర్లెన్స్ లో ప్రయాణం మధురానుభూతి గా గడిచింది. ఎయిర్ లెన్స్ వారి  ఆతిద్యం మరిచి పోలేనిది. అబూధాబి ఎయిర్ పోర్ట్ లో సుమారు రాత్రి ఒంటి గంటకు దిగాము. మమ్మిల్లి రిసీవ్ చేసుకోవటానికి మా మనవరాలు బన్ను, అమ్మాయి సోనీ, అల్లుడు ఖాజా వచ్చారు. అక్కడినుంచి టాక్సీ లో అల్లుడు అపార్ట్ మెంట్ ముసఫా లోని షాబియా కు చేరుకొన్నాము.
వాతావరణం మాములుగానే ఉంది. అక్కడ ఇంకా వేసవి ప్రారంభం కాలేదు. సమ్మర్ లో 50 డిగ్రీ సెల్షియస్ వరకు ఉంటుందట.

అక్కడ నేను గమనించి అంశం కార్లు రోడ్ మీదే పార్క్  చేయటం. షాపుల ముందు పేవ్మెంట్ ఉంటుంది. మనం పేవ్మెంట్ పైనే నడవాలి. ఆ తరువాత రోడ్ పైన జీబ్రా గుర్తులు ఉన్న చోట మాత్రమె రోడ్ క్రాస్ చేయాలి. రోడ్ పై నడువ రాదు. కార్ ఎక్కడ ఖాళీ ఉంటె అక్కడ పార్క్ చేయవచ్చు. అక్కడ పార్కింగ్ పెద్ద సమస్య. దాదాపు అన్ని  కుటుంభాలు కార్లు  కలిగి ఉంటయి. డెలివరీ బాయ్స్/పేపర్ బాయ్స్/టీ అమ్మేవాళ్ళు   మోటార్ సైకిల్/సైకిల్స్, స్కూల్ పిల్లలు కొంత మంది   సైకిల్ వాడుతున్నారు. అబూదాబిలో సిటీ బసేస్, టాక్సీలు  కూడా ఉన్నవి. ఇక్కడ అన్ని వెహికల్స్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్.

మరొక విశేషం దాదాపు ప్రొద్దున 6 గంటలు ఇంకా అంతకు ముందే అందరు పనికి వెళ్తారు. సాయకాలం 5 గంటలకు వస్తారు. స్కూల్స్ 8AM తో 3-30PM కు ఉంటవి.

షాబియా చిన్న ప్రాంతం. అబూధాబి కి శాటిలైట్ ప్రాంతం. క్లీన్ గా ఉంది. వీధులు క్లీన్ చేసేవాళ్ళు అంతా నైజిరియన్స్,  పేపర్ బాయ్స్, హౌస్ క్లినర్స్  బంగ్లాదేశీయులు. చిన్న ఉద్యోగాలలో ఎక్కువ బంగ్లా వారు, నైజిరియన్స్ ఉంటారు.

ఇంటి పక్కనే అల్  మదీనా హేపర్ మార్కెట్ (చిన్న మాల్) ఉంది. అన్ని వస్తువులు దొరుకుతాయి. మేము దల్మా మాల్ కు వెళ్ళాము. ఇది అబూధాబి లోనే  పెద్దది. అతి  పెద్ద  మాల్. నాలుగు  ఫ్లౌర్స్ కలిగి మన తెనాలి అంతా ఉంటది. దాంట్లోనే లూలు స్టోర్స్ కలదు. వసతులన్ని ఉంటాయి. రెట్లు మాత్రం మన ఇండియా తో పోల్చుకొలేము. చాల ఎక్కువ. పోల్చుకొంటే ఏమి కొనలేము, ఏమి తినలేము. పేపర్ 5 దిర్హమ్స్. అనగా 100 రూపాయలు. బేస్మెంట్ లో కార్  పార్కింగ్ 3 లేదా నాలుగు ఫ్లోర్స్ కలిగి  ఉంటది. కార్ పార్కింగ్ తో సహా అంతా సెంట్రల్ AC.

ఇంకా మజ్యాద్ మాల్, అబూధాబి లోని అబూధాబి మాల్ దర్సిoచాము. అవి పెద్దవే. మాల్స్ లో సేల్స్ గర్ల్స్, బాయ్స్ ఎక్కువ ఫిలిపైన్స్, కేరళ వారు కొంతమంది స్థానికులు  ఉంటారు.1-10,1-20 దిర్హం షాప్స్ (మనకు చైనా బజార్ లాంటివి) ఉన్నవి. వాటికి వెళ్ళాము.

అక్కడ అపార్ట్మెంట్స్  అన్ని సెంట్రల్ AC కలిగి ఉంటాయి. మనకు ఎండ తీవ్రత తెలియదు. ఫ్యాన్ ఉండదు. కావాలంటే పెడస్టల్ ఫ్యాన్ వాడతారు.

ఫోన్ చేస్తే కూరగాయల షాప్ వాడు కూరగాయలు, ఫ్రూట్స్, పాలు, పెరుగు, మొదలగు వస్తువులు తెచ్చి ఇస్తాడు. బకలా (కిరాణా కోట్లు) ఉన్నవి.

నేను షబియా లోని       రెండు మూడు మస్జిద్లు చూసాను. రోజు ముసఫ్ఫా 10 లో ఉన్న మస్జిద్ కు వెళ్ళేవాడిని. అక్కడ రమదాన్ పండుగ వాతావరణం బాగా ఉంది. అన్ని షాప్స్, మాల్స్ అలంకరణలతో డిస్కౌంట్ లతో ఉన్నాయి. రంజాన్ సందర్భంగా అన్ని రోడ్స్ నెలవంక కూడిన నక్షత్రాల అలంకరణల తో సుందరంగా ఉన్నాయి.

అన్ని మస్జిద్ లలో సాయంకాలం ఇఫ్తార్ పాకెట్  ఫ్రీ గా ఇస్తారు. మస్జిద్ కు వచ్చిన ప్రతి వారికి మతం, ప్రాంతం తో సంభందo లేకుడా ఇఫ్తార్ పాకెట్ ఇస్తారు. మా మస్జిద్ లో అందరం కలిసి సామూహికంగా ఇఫ్తార్ చేసే వారము.  ఆ తరువాత ప్రేయర్ జరిగేది. ప్రేయర్ కి అన్ని దేశాల వారు  ఆఫ్గాన్, పాకిస్, ఇండియన్స్, సోమలియన్స్, పాలస్తీనా వారు  ఎక్కువ బంగాలి, కేరళ వాసులు వస్తారు. హిందీ నడుస్తుంది. అరబిక్ లోకల్స్ మాట్లాడుతారు. సాముహిక ఇఫ్తార్ కనుల పండుగగా ఉంటది. అన్ని మస్జిద్లు ప్రభుత్వ నిర్వహణ లో ఉంటాయి. అందరికి ఇఫ్తార్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది.  ఇమాం ను జనరల్ అథారిటీ అఫ్ ఇస్లామిక్  అఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ అప్పాయింట్ చేస్తంది. మస్జిద్ కు మౌజన్ ఉండడు, ఆజన్ టైం కి మైక్ లో వినపడుతుంది. ఒక వ్యక్తి వాచమన్ గా ఉంటాడు.

నేను ప్రతి రోజు ఉదయం, సాయంకాలం ఆరోగ్యం కాపాడు కోవటానికి వాకింగ్ చేసేవాడిని.
ప్రవాసులు టైం పాస్ కోసం మాల్స్ దర్శిస్తారు. ఈజీ గా 4-5 గంటలు గడిచి పోతుంది. ఇక్కడ ఈద్ రోజు ఉదయం ఈద్ నమాజ్ స్థానిక కాలమానం ప్రకారం 5-50 జరుగుతుంది. ఇమాం నమాజ్ చదివించి ఖుత్బా ప్రసంగం చేస్తాడు. విపరీతమైన రష్ ఉంటది. విశ్వాసులు మస్జిద్ లో స్థలం లేక పోతే మస్జిద్ ఆవరణ లో రోడ్ పై నమాజ్ చదువుతారు.

UAE ఫ్రీ కంట్రీ. వస్త్రధారణ లో అంత పట్టింపులు లేవు. ఇండియా లో  కన్నా వస్త్రధారణలో స్త్రీలు ఎక్కువ స్వతంత్రం కలిగి ఉన్నారు. స్త్రీలు కార్లు నడుపుతున్నారు. జేబ్రా లైన్స్ పై పాదచారి నడిచేటప్పుడు వెహికల్స్ ఆగుతాయి. వాకర్స్ పేవ్మెంట్ నడవక జేబ్రా లైన్ మీద రోడ్ క్రాస్ చేయక పోతే ఫైన్ వేస్తారు.

దుబాయ్ ట్రిప్ 3 రోజులు సాగింది. కార్లో దుబాయ్ పోయి అక్కడ హోటల్ అపార్ట్మెంట్స్ తీసుకొన్నాము. హోటల్ అపార్ట్మెంట్స్ అంటే రూమ్స్ తో పాటు  కిచెన్ ఉంటది వాషింగ్ మెషిన్ విత్ డైయర్ ఉంటది. దుబాయ్ అంత కార్ పార్కింగ్ సమస్య. కార్ హోటల్ లో ఉంచి టాక్సీ లో వెళ్ళాము. మొదటి రోజు దుబాయ్ ఫ్రేమ్ చూసాము. జాబిల్ పార్క్ లో అది భాగం. వేలకొలది మంది దాన్ని చూడటానికి వస్తారు. ఫ్రేమ్ 150 ఎత్తు ఉంటది. లిఫ్ట్ లో పైకి వెళ్తాము. పైన గ్లాస్ ఫ్లోర్ ఉంటది. క్రింద కనపడుతా ఉంటది. ఫ్రేమ్ లో దుబాయ్ పూర్వ చరిత్ర, రాబోయే సంవత్సరాలలో దుబాయ్ ఎలా ఉంటాడో వివరించే ప్రదర్సనలు ఉన్నాయి. ఒక అపూర్వ అనుభవం. మర్చి పోలేము.

ఆ తరువాత దుబాయ్ మ్యూజియం చూసాము. దుబాయ్ చరిత్ర ప్రదర్శించారు. ఆ తరువాత మీనా బజార్ (ఇండియా వాళ్ళ షాప్స్ ) వెళ్ళాము.

ఆ తరువాత బర్ (bur) దుబాయి వెళ్ళాము. దుబాయ్ క్రీక్ లో అబ్ర /బోటు షికార్ చేసాము. అక్కడ నుంచి దుబాయి మాల్ వెళ్ళాము. దుబాయ్ మాల్ ప్రపంచం లోనే అన్నిటి కన్నా పెద్దది. మన తెనాలి కి ఐదు రెట్లు ఉంటది. అన్ని ఉంటాయి. అందులోనే బుర్జ్ ఖలీఫా చూసాము. బుర్జ్ ఖలీఫా బాగా ఎత్తుగా ఉంది. ప్రపంచం లో ఎతైన బిల్డింగ్. బుర్జ్ ఖలీఫా ముందు వాటర్ మ్యూజికల్ ఫౌంటెన్ ఉంది. ప్రతి అరగంట కొకసారి మ్యూజిక్  ప్రదర్సన ఉంటది. అది చాలా మంది చూస్తారు.

తరువాత రోజు మెట్రో లో వెళ్ళాము. తరువాత ట్రామ్ ఆ తరువాత మోనో రైల్ ఎక్కి అట్లాంటిస్ వెళ్ళాము. అక్కడ అక్వేరియం చూసాము. బాగా ఉంది. ఆతరువాత మరినా మాల్ వెళ్ళాము. అక్కడ అది చూసుకొని దుబాయ్ మరినా  ఫెర్రి పాయింట్ కి వెళ్ళాము. మరినా ఫెర్రి పాయింట్ నుంచి క్రూజ్ లో bur బర్ దుబాయ్ కి వెళ్ళాము. గంటన్నర క్రూజ్ లో ప్రయాణం. దుబాయి అంత కన్పిస్తుంది. దుబాయ్ క్రిక్ వాటర్ లో ప్రయాణం. ఎంజాయ్ చేసాము. బర్ దుబాయి నుంచి తిరిగి హోటల్ అపార్ట్ మెంట్ కు తిరిగి వచ్చాము. మరుసటి రోజు అబూ ధాబి తిరిగి వచ్చాము.

అబుదాబిలో మాల్స్, అల్ బతీన్ ఏరియా(పోష్ ఏరియా) లో ఉన్న ADIB కంప్యూటర్ విభాగం, అబూధాబి సెంట్రల్ బ్యాంక్ చూసాను. ADNOC ప్రధాన కార్యాలయం, ADIB ప్రధాన కార్యాలయం  చూసాము. ముసఫా నుంచి అబూ ధాబి వెళ్ళేదారిలో UAE వివిధ గవర్నమెంట్ ఆఫీసస్, వివిధ దేశాల  రాయభార కార్యాలయాలు అన్ని ఉన్నాయి. 1-20 దిరయమ్స్ కి వస్తువులు అమ్మే షాప్స్, వివిధ మాల్స్ చూసాము. కొన్ని వస్తువులు కొన్నాము. మరల ఇంకో సారి అబూ ధాబి ఇంకోసారి వెళ్ళినప్పుడు కొన్ని వాణిజ్య ప్రదేశాలు, ADNOC మెయిన్ బిల్డింగ్, రేస్త్రరెంట్లు, 1-20 దిరయ మ్స్ కి వస్తువులు అమ్మే షాప్స్, వివిధ మాల్స్ చూసాము. కొన్ని వస్తువులు కొన్నాము.

ఖస్ర్ అల్ వతన్(QUSR al VATAN) లేదా ప్రేసిడేన్శియల్ ప్యాలెస్ చూసాము. టికెట్ ఒకరికి 60 దిర్హమ్స్ . ప్రేసిడేన్శియల్ ప్యాలస్ ఇంద్ర భవనాన్ని మించి ఉంది. ప్యాలస్ 54 ఫుట్ బాల్ గ్రౌండ్స్ ను మించి  ఉంది. ఎంట్రన్స్ లో టికెట్ తీసుకొన్న తరువాత లోపలకి  బస్సు లో వెళ్లి ప్యాలెస్ చూసాము. బస్లో మైక్ ద్వారా ప్యాలస్ గురించి వివరించారు.  ప్యాలెస్ లో ఉన్న గ్రేట్ హాల్ ప్యాలెస్ కి తలమానికం మయుడు సృష్టించిన ఇంద్రభవనాన్ని మించ  ఉంది. ప్యాలెస్ నిర్మాణం 2010 లో ప్రారంభించి 2017 పూర్తి చేసారు. ప్యాలెస్ లోని గ్రేట్ హాల్ కన్నుల పండుగగా ఉంది. దానిని వర్ణించ లేము. పురాణాలలోని భవనాలను తలదననే  ఆధునిక మయ భవనం. ప్యాలెస్ లో ప్రెస్/మీడియా రూమ్, విదేశి ప్రముఖులు, UAE క్యాబినెట్ సమావేశ రూమ్ చూసాము. రూమ్ లో 12 టన్నుల బంగారు పూత షాoడీలియర్ వేలాడదియబడి ఉంది. ప్రెసిడెంట్ బంక్యేట్ హాల్ (డైనింగ్ రూమ్) ప్రెసిడెంట్ కు విదేశీ ప్రముఖుల అందజేసిన కానుకలు  బద్ర పరిచిన గది, హౌస్ అఫ్ నాలెడ్జ్ రెండు రూమ్స్ చూసాము. హౌస్ అఫ్ నాలెడ్జ్ లో ఇస్లామిక్  నాగరికత, కళ, సాహిత్య, శాస్త్ర విజ్ఞాన రంగాలలో అరబ్స్ సాధించిన ప్రగతి అన్ని ఉన్నాయి. లైబ్రరీ(పబ్లిక్)  లో అనేక వేల పుస్తకాలు, అపురూప పరచిన గ్రంథాలు ఉన్నాయి

నిజంగా ప్రెసిడెంట్ ప్యాలస్ సందర్శించటం ఒక మరుపురాని అనుబూతి. న బూతో నా భవిష్యత్ అనుభవం. UAE పర్యటన లోనే తలమానికం.

అబూధాబి లోని షేక్ అల్ జాయద్ గ్రాండ్ మసీదు చూసాము. ఇది ప్రపంచ ప్రఖ్యాత మస్జిద్. చాలా బాగుంది. అలాగే దల్మా మాల్ లో ఇంకోసారి షాపింగ్ చేసి నా పర్యటనను ముగించాము.
మదర్ ఇండియా కి UAE నుండి విత్ లవ్ తో అనేక మధురమైన జ్ఞాపకాలతో తిరిగి బయలు దేరాను.No comments:

Post a Comment