8 July 2019

6గురు అసాధారణ ముస్లిం అన్వేషకులు (6 Incredible Muslim Explorers) .




అమెరికా ను కనుగొన్న కొలంబస్ వంటి ప్రసిద్ధ పాశ్చాత్య అన్వేషకులు  మరియు మార్కో పోలో తూర్పున చేసిన సాహసిక పర్యటనలు గురించి  దాదాపు అందరికీ తెలుసు. కాని చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, జ్ఞానం మరియు సాహసం కోసం భూములను/సముద్రాలను  దాటిన ముస్లిం అన్వేషకులు చాలా మంది ఉన్నారు. వారిలో ముఖ్యులైన వారిని  గురించి తెలుసుకొందాము.

1.ఇబ్న్ బటుట్టా (Ibn Batutta):

మొరాకోలోని టాన్జియర్స్లో జన్మించిన అబూ అబ్దుల్లా ముహమ్మద్ - లేదా ఇబ్న్ బటుటా గొప్ప ముస్లిం యాత్రికుడు. తన 20 వ ఏట ప్రపంచాన్ని అన్వేషించడానికి బయలుదేరాడు, 30 సంవత్సరాల తరువాత 51 సంవత్సరాల వయసులో ఇంటికి తిరిగి వచ్చాడు. అలెగ్జాండ్రియా, కైరో మరియు డమాస్కస్‌లలో ఉన్న గొప్ప  గ్రంథాలయాల ప్రేరణ తో ఇబ్న్ బటుటా    జ్ఞానం సంపాదించాలి  మరియు ఉత్తమ ఉపాధ్యాయులను కనుగొనాలనే కోరిక తో ప్రయాణం ఆరంబించినాడు.

అతడు తన సాహస యాత్రలలో మొత్తం 44 దేశాలను మొత్తం 75000 మైళ్ళు పర్యటించినాడు. ఇది భూమండలాన్ని మూడు సార్లు చుట్టిరావటానికి సమానం. ప్రసిద్ద పర్యాటకుడు మార్కోపోలో ఇతనికి సాటిరాడు. ఇతను ఈజిప్ట్, అబిసీనియా, ఆఫ్రికా స్పెయిన్, దక్షిణ రష్యా, ఇండో-చైనా,  చైనా, భారత దేశం మొదలగు అనేక దేశాలలో తన పర్యటనలు కొనసాగించి నాడు. నాలుగు సార్లు హజ్ యాత్ర చేసినాడు.


ప్రపంచవ్యాప్తంగా తన సాహసకృత్యాల సమయంలో అతను ఎన్నడు  గ్రంథాలను వ్రాయలేదు. తన ప్రయాణాలలో అతను అప్పటి ప్రసిద్ధ పాలకులతో పరిచయం చేసుకోవడం మరియు డిల్లి, మాల్దీవులలో న్యాయమూర్తిగా వ్యవరించినాడు.అతను తిరిగి వచ్చిన తరువాత  1354 లో మొరాకో సుల్తాన్ అతనిని ఒక యాత్రా సంకలనం చేయమని ఆదేశించాడు. తన ప్రయాణ గాధలను కథలను ఇబ్న్ జుజాయ్ అనే రచయితకు వివరిస్తూ, వారు ఇద్దరు  కలిసి 'నగరాల అద్భుతాలు మరియు మార్వెల్స్ ఆఫ్ ట్రావెలింగ్ గురించి ఆలోచించే వారికి బహుమతి A Gift to Those Who Contemplate the Wonders of Cities and the Marvels of Traveling’  అనే పుస్తకాన్ని సంకలనం చేశారు. దానిని రిహ్లా అని పిలుస్తారు, దీని అర్థం ట్రావెల్స్ ". అతని పుస్తకం 14 వ శతాబ్దంలోని  ఇస్లామిక్ ప్రపంచాన్ని  అత్యంత కళ్ళుకు కట్టినట్టుగా వివరిస్తుంది.  

2. అడ్మిరల్ జెంగ్ హి .(Admiral Zheng He)

ముస్లిం అడ్మిరల్ జెంగ్ హి (చెంగ్ హో) అమెరికాని  మొదట కనుగొన్నారని మీకు తెలుసా! చైనాలోని యునాన్లో 14 వ శతాబ్దం చివరిలో జన్మించిన జెంగ్ హి చైనీస్ ముస్లిం జాతికి చెందినవాడు మరియు అతనికి మా హీఅని పేరు పెట్టారు. చైనాలో, "మా" ను ముహమ్మద్ యొక్క చిన్న పేరుగా పరిగణినిస్తారు.

మా హి  ఇస్లామిక్ గ్రంధాలను  అభ్యసించాడు మరియు చిన్న వయస్సులోనే ఖురాన్ ను కంఠస్థం చేశాడు మరియు అరబిక్ మరియు చైనీస్ భాషలను మాట్లాడేవాడు. అతని తండ్రి మరియు తాత హజ్ పూర్తి చేయడానికి మక్కాకు వెళ్ళిటం  విస్తృత ప్రపంచం గురించి అతనిలో  ఉత్సుకతను రేకెత్తించింది. చైనాకు పశ్చిమాన ఉన్న దేశాల గురించి మరింత తెలుసుకోవడానికి అతను విబిన్న భాషలు, మతాలు, సంప్రదాయాలు, చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు.
ఆగ్నేయాసియాకు ఇస్లాంను వ్యాప్తి చేసిన గొప్ప వ్యక్తులలో అతను ఒకరు. అతను అడ్మిరల్, సైనికుడు, దౌత్యవేత్త మరియు వ్యాపారి. చైనీస్ మరియు మిడిల్ ఈస్టర్న్ సంతతి కి చెందిన అతడు పరమ ధార్మిక ముస్లిం. అతను తాను సందర్శించిన అనేక ప్రదేశాలలో మసీదులను నిర్మించడంతో పాటు, ఇతర మతాలకు చెందినవారిని గౌరవించాడు మరియు వారికి సహాయం చేశాడు. అతని నైపుణ్యాలు మరియు జ్ఞానం కారణంగా, అతన్ని చైనా ప్రభుత్వం ఆగ్నేయాసియా, భారత ఉపఖండం, తూర్పు ఆఫ్రికా దేశాలకు మరియు సుదూర దేశాలకు సౌహార్ద పర్యటనలకు గాను పంపెది.

కాని అతని మరణం తరువాత చైనా అతనిని మర్చిపోయినది. అతని విజయాలు అతని సేవలు  మరుగున పడినవి. మెలక మలేషియా లో అతని పేర  మ్యూజియం ఉంది.

3. సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ (ర) Sa’ad ibn Abi Waqqas (RA)
ముహమ్మద్ ప్రవక్త(స) యొక్క మేన  మామ  సాద్ ఇబ్న్ అబి వక్కాస్  ఇస్లాం స్వీకరించిన తరువాత  అనేక యుద్ధాలు మరియు దాడులలో పాల్గొన్న మహా  వీరుడు. అతను ఇస్లామిక్ చరిత్రలో గొప్ప యుద్ధాలలో సైన్యాన్ని నడిపించాడు, కాని నాయకత్వంలో ఎల్లప్పుడూ వినయంగా ఉండేవాడు. స్వచ్ఛమయిన ఆత్మ , విశ్వాసం,నిజాయితీ మరియు చిత్తశుద్ధి కి ప్రసిద్ది చెందాడు.


ప్రవక్త(స) మరణించిన పద్దెనిమిది సంవత్సరాల తరువాత, అతన్ని 29 AH లో ఖలీఫా  ఉత్మాన్(ర) చైనాకు పంపినారు.  ఈ యాత్రలో అతను ఇస్లాం స్వీకరించవలసినదిగా  చైనా చక్రవర్తి తుంగ్ (యుంగ్-వీ) ను ఆహ్వానించారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, గ్వాంగ్‌జౌలోని అందమైన హుయిషెంగ్ మసీదు చైనాలోని మొట్టమొదటి మసీదు, దీనిని సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ (ర) నిర్మించారు. అతను ఈ పర్యటనలో మరణించారు మరియు గ్వాంగ్జౌలో ఖననం చేయబడ్డారు.

4. అబూ అల్ హసన్ అల్ మసూది Abu Al Hasan Al Masudi

"ది హెరోడోటస్ ఆఫ్ ది అరబ్స్" గా పిలువబడే అల్-మసూది ఒక ప్రసిద్ధ చరిత్రకారుడు మరియు భౌగోళిక శాస్త్రవేత్త. అతను చరిత్ర మరియు శాస్త్రీయ భౌగోళికాలను కలిపి  తన ప్రపంచ చరిత్ర రచన 'ది మెడోస్ ఆఫ్ గోల్డ్ అండ్ మైన్స్ ఆఫ్ జెమ్స్' (مروج الذهب ومعادن الجوهر మురుజ్ అధ్-ధహాబ్ వా మాదిన్ అల్-జవహర్ అరబిక్‌లో) రచించినాడు.  బాగ్దాద్‌లో జన్మించిన అతను తన జీవితంలో ఎక్కువ భాగం తూర్పు ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, పర్షియా, రష్యా, భారతదేశం మరియు చైనా దేశాలకు ప్రయాణించి తన రచనలను సంకలనం చేశాడు.

అతను అనుసరించిన చారిత్రాత్మక పద్దతి ఆనాటి  సంస్కృతిక, సామాజిక విషయాలను మరియు స్థానిక విషయాలను లెక్క లోనికి తీసుకొనేది. ఇస్లామేతర భూముల విషయంలో అతని వివరణ సమకాలిన రచయితల కన్నా మిన్న గా ఉంది.ప్రపంచ చరిత్ర కు సంభందించిన అతను రాసిన  అనేక పుస్తకాలు ఎన్సైక్లోపిడియాలు మరుగున పడిపోయినవి.  రక్షింబడిన అతని పుస్తకాలు అతని జ్ఞానాన్వేషనను అతని కృషిని వివరిస్తున్నాయి. 

5. అహ్మద్ ఇబ్న్ మజీద్ Ahmad Ibn Majid

అహ్మద్ ఇబ్న్ మాజిద్ ఒక నావిగేటర్ మరియు అరబిక్ కవి, అతను ప్రసిద్ధ పోర్చుగీస్ అన్వేషకుడు మరియు సముద్రం ద్వారా భారతదేశానికి చేరుకున్న మొదటి యూరోపియన్ వాస్కో డా గామాకు సహాయం చేసినందుకు గాను  ప్రసిద్ది చెందాడు. సముద్రయానదారుల కుటుంబంలో పెరిగిన అతను 17 సంవత్సరాల వయస్సులో ఓడలను నావిగేట్ చేయగలిగాడు మరియు చాలా ప్రసిద్ది చెందాడు, అతను మొదటి అరబ్ నావికుడు/సీమాన్ అని పిలువబడ్డాడు.


సముద్రాలను జయించడంతో పాటు దాదాపు నలభై కవిత్వం మరియు గద్య రచనలను రచించిన ఆయనను ది లయన్ ఆఫ్ ది సీఅని కూడా పిలుస్తారు. అతను  నావిగేషన్  సూత్రాలు మరియు నియమాలపై ఉపయోగకరమైన సమాచార పుస్తకం (కితాబ్ అల్ ఫవాయిద్ ఫై ఉసుల్ 'ఇల్మ్ అల్-బహర్ వా-ఎల్-కవైద్ Kitab al Fawa’id fi usul ‘Ilm al-Bahr wa ‘l-Qawa’id) రచంచినాడు. అతడు వివరించిన  ఖగోళ నావిగేషన్, వాతావరణ నమూనాలు మరియు ప్రమాదకరమైన ప్రయాణ ప్రాంతాల పటాలను   అరబ్ నావికులు విస్తృతంగా వాడేవారు. ఆ సమయంలో అతను ఇతర యూరోపియన్ నావికులకు తెలియని ప్రపంచ పటాన్ని(Map of World Prepared by Arabs) వాస్కో డా గామాకు అందించినట్లు తెలిసింది. ఇది వాస్కోడా గామా భారతదేశానికి చేసిన విజయవంతమైన యాత్రలో ఉపయోగపడినది.

. 6. కరీమా బింత్ అహ్మద్ అల్ మార్వాజియా Karima Bint Ahmad al-Marwaziyya
.
ఇస్లామిక్ నాగరికత వికాసం లో ఎందరో పురుషులు గొప్ప ప్రయాణికులుగా ప్రసిద్ది చెందారు  వారితో పాటు  మహిళలు కూడా ప్రసిద్ది చెందారు. అటువంటి అద్భుతమైన మహిళ కరీమా అల్-మార్వాజియా, ఒక ప్రయాణికురాలు  గొప్ప ముహద్దితా (హదీత్ అధ్యయనాలలో నిపుణురాలు) మరియు తుర్క్మెనిస్తాన్లో జన్మించిన తెలివైన పండితురాలు.

జ్ఞానం కోసం ఆమె చేసిన అన్వేషణ ఆమెను చాలా దూరం ప్రయాణింప జేసింది.  తుర్క్మెనిస్తాన్ నుండి ఇరాన్ మరియు జెరూసలేం వరకు సముద్రం మరియు భూమిపై కష్టతరమైన ప్రయాణాలలో  ఆమె తన తండ్రితో కలిసి ప్రయాణించి, చివరికి మక్కాలో స్థిరపడింది, అక్కడ ఆమె సహిహ్ అల్-బుఖారీని అభ్యసించింది మరియు ఆమె తన యుగంలో ప్రముఖ గౌరవనీయమైన పండితులలో ఒకరిగా మారింది.

ఈ అద్భుతమైన స్త్రీపురుషులు జ్ఞానాన్ని సంపాదించడానికి మరియు అల్లాహ్ యొక్క సృష్టి యొక్క అద్భుతాలకు సాక్ష్యమివ్వడానికి అనేక భూములు మరియు కష్టాలను దాటారు. మనము  వారి కథల నుండి ప్రేరణ పొందగలము.








No comments:

Post a Comment