22 December 2019

దివ్య ఖురాన్ మరియు హదీసుల వెలుగులో ఇస్లాంలో మహిళల స్థితి



 Image result for the status of women in islam
ఇస్లాం అనేది సంపూర్ణ జీవన మార్గదర్శిని.  ఇస్లాంలో మహిళలకు గౌరవనీయమైన స్థితి ప్రసాదించబడినది. ఇస్లాం లో స్త్రీ  ఆశీర్వాదంగా(blessed one) భావించబడినది. దివ్య ఖురాన్ మరియు హదీసులు  స్త్రీకి ఉన్న గౌరవాన్ని ఉటంకిస్తాయి.

మహిళల సమానత్వంEquality of women
ఇస్లాం లో మహిళలు  కొనుగోలు మరియు అమ్మకం, బహుమతులు మరియు దాతృత్వం ఇవ్వడానికి లేదా తమ డబ్బును చట్టబద్ధంగా ఖర్చు చేయడానికి అన్ని హక్కులు కలిగి ఉన్నారు. ముస్లింల ప్రారంభ యుగంలో, మహిళలు బహిరంగ చర్చలలో, ముఖ్యంగా అత్యవసర సమావేశాల్లో  పాల్గొన్నారు. పవిత్ర ఖురాన్ ప్రకారం మహిళలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛతో వ్యక్తం చేయడమే కాకుండా తమ ఆలోచనలను కూడా వ్యక్తపరిచారు మరియు ముహమ్మద్ ప్రవక్త (స) తో పాటు ఇతర ముస్లిం నాయకులతో తీవ్రమైన చర్చలలో పాల్గొన్నారు.

ఇస్లాం పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ సమాన హక్కులను ఇస్తుంది. వారు ఇరువురికి  కుటుంబo పట్ల విధులు, బాధ్యతలు కలవు. ఇస్లాం మహిళలకు స్వతంత్ర గుర్తింపును ఇస్తుంది. ఆమె నైతిక మరియు ఆధ్యాత్మిక బాధ్యతలు  ఆమె సొంతం. ఇస్లాంలో మహిళల గల ఉన్నత హోదా వివాహ ప్రతిపాదనలను అంగీకరించడానికి లేదా తిరస్కరించే హక్కును సూచిస్తుంది. వివాహ ఒప్పందాన్ని ధృవీకరించడానికి ఆమె సమ్మతి అవసరం.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అద్భుతమైన ఖుర్ఆన్ లో అన్నాడు:"మీలోని ఎవరి శ్రమను నేను వృధాగా పోనివ్వను. పురుషుడైనా స్త్రీ అయిన మీరంతా ఒకే రాశికి చెందినవారు. "(అల్-ఖుర్ఆన్ 3: 195)

మహిళలకు గౌరవం
ఇస్లాం మానవుల నుండి జంతువుల వరకు ప్రతి ఒక్కరి హక్కులతో పాటు జీవితం లోని ప్రతి అంశంలో సమగ్ర మార్గదర్శకత్వం ఇస్తుంది. అదేవిధంగా పవిత్ర ఖుర్ఆన్ మరియు హదీసులలో చాలా చోట్ల మహిళల పాత్ర చాలా ఉన్నతంగా మరియు ప్రముఖంగా వివరించబడినది.  ఇస్లాం మహిళలకు  అత్యంత గౌరవం,  అత్యంత పవిత్రతను ఇస్తుంది. తల్లి, కుమార్తె, సోదరి లేదా భార్య గా  అడుగడుగునా మహిళను ఆశీర్వదిస్తుంది.
Image result for the status of women in islam

దివ్య ఖురాన్ మరియు హదీసులల వెలుగు లో  మహిళ: 
ఇస్లాంలో తల్లి స్థానం విలువైనది దివ్య ఖురాన్ మరియు హదీసులు రెండింటిలోనూ మహిళ పట్ల  ఉన్నత స్థాయి గౌరవం కనిపిస్తుంది. ఇస్లాం ఎల్లప్పుడూ మహిళలతో ఎల్లప్పుడూ  ఉత్తమమైన వైఖరితో మరియు మర్యాదగా వ్యవహరిస్తుంది.

దివ్య ఖురాన్ ప్రకారం:
అయన సూచనలలో మరొకటి ఏవిటంటే, ఆయన మీ కొరకు భార్యలను, మీ జాతి లో నుండే సృష్టించాడు- మీరు వారివద్ద శాంతి పొందటానికి, మీ మద్య ప్రేమను,కారుణ్యాన్ని సృజించాడు. నిశ్చయంగా ఆలోచనాపరులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి.-(దివ్యఖురాన్, 30:21)

హదీసుల ప్రకారం :
·        ఒక వ్యక్తి ముహమ్మద్ ప్రవక్త(స) వద్దకు వచ్చి, “దేవుని దూత! నా సేవ, సద్ప్రవర్తనలకు అందరికంటే  ఎవరు ఎక్కువ అర్హులు? ”ప్రవక్త (స) అన్నారు: నీ  తల్లి.  ఆ వ్యక్తి,“ తిరిగి అడిగాడు. “ఆ తరువాత ఎవరు?. ముహమ్మద్ ప్రవక్త (స) తిరిగి నీ  తల్లి”. అన్నారు. అతను “ఆ తరువాత? అని అడగ్గా  ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అన్నారు: “నీ తల్లి”.ఆ వ్యక్తి మళ్ళీ తరువాత ఎవరు?” అని అడిగాడు. ప్రవక్త ఇలా అన్నారు: “నీ  తండ్రి”.- (బుఖారీ, ముస్లిం)

·        మరొక హదీసు ప్రకారం :ఒక సందర్భంలో ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి సైనిక యాత్రకు వెళ్లాలని కోరికను వ్యక్తం చేసినప్పుడు,
ప్రవక్త (స) నీకు  తల్లి ఉందా అని అడిగారు. అతను “అవువు” అని సమాధానమిచ్చినప్పుడు  ప్రవక్త (స) అతనికి సలహా ఇచ్చారు, "ఆమెతో ఉండండి, ఎందుకంటే స్వర్గం ఆమె పాదాల వద్ద ఉంది." -(అల్- తిర్మిజి)

కుమార్తెను ఆశీర్వదిస్తూ హదీసులు ఇలా చెబుతున్నాయి:
·        జబీర్ ఇబ్న్ అబ్దుల్లా ఇలా అన్నారు: ప్రవక్త (స) ఇలా అన్నారు, “ఎవరైతే ముగ్గురు కుమార్తెలు కలిగి ఉంటారో అతను వారిని పోషించి, విద్యాబుద్దులు చెప్పించి- వారిపట్ల దయా వైఖరిని అవలంభిస్తాడో స్వర్గం అతని కోసం వ్రాయబడుతుంది.” మరి ఇద్దరు మాత్రమే ఉంటే ఏమిటి? ”అని అడుగుగా ప్రవక్త,“ ఇద్దరుకు  కూడా అని అన్నారు. కొంతమంది ఆయనతో “ఒకటి” అని అడిగి ఉంటే, ప్రవక్త(స) “ఒకరు”  కూడా అనేవారని అనుకున్నారు.-(ముస్నాద్ అమాద్ 13835)

·        ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అన్నారు:
మీలో ఉత్తమమైనవారు తమ  భార్యల పట్ల  ఉత్తమవైఖరి కలిగి ఉంటారు. (సునన్ అల్ తిర్మిధి 1162)

సామాజిక అంశం:
జీవితంలోని అన్ని అవకాశాలలో మహిళలు సమగ్ర సమాన ఆదరణ పొందుతారు. ఇస్లాం విద్య, ఉపాధి లేదా తల్లిదండ్రుల ఆస్తి పంపిణీ మొదలగు వాటిలో  మహిళలకు  గణనీయమైన హక్కులు ఇచ్చింది. ఇస్లాం లో అనేక చోట్ల, స్త్రీ, పురుషుల సమానత్వం స్పష్టంగా కనిపిస్తుంది. హదీసులలో పురుషులు మరియు మహిళలు తమ కోరిక ప్రకారం ఇస్లామిక్ విద్య లేదా ప్రాపంచిక విద్యను పొందాలని ఆదేశించబడింది.

ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అన్నారు:
జ్ఞానంను  ఆర్జించే ప్రతి ముస్లిం: స్త్రీ మరియు పురుషునిపై ఉంది.-(అల్-మజ్లిసి బీహార్ అల్-అన్వర్, వాల్యూమ్ 1. పేజి 177)

ఇస్లాం సమాజంలో మహిళల స్థానాన్ని పెంచింది మరియు వారికి పురుషులతో పాటు సమాన స్థానం ఇచ్చింది.   సంపద పంపిణీ క్రమంలో  స్త్రీ, పురుష పిల్లలకు వాటా ఇవ్వడం జరిగింది. కుమారులు మరియు కుమార్తెల వాటా మొత్తం భిన్నంగా ఉన్నప్పటికీ, ఖుర్ఆన్ కుమార్తెకు ఆస్తి నుండి సరైన వాటా ఇవ్వడం గురించి స్పష్టంగా పేర్కొంది.

అల్లాహ్ (SWT) అన్నారు:

తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపెట్టిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది.  అదేవిధంగా తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచివెళ్లిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది.- అది తక్కువైనా సరే లేక ఎక్కువైనా సరె.” ఈ భాగం అల్లాహ్ చే నిర్ణయిoచబడినది. (దివ్య ఖురాన్, 4: 7)








No comments:

Post a Comment