4 December 2019

నిఖాత్ జరీన్ Nikhat Zareen



 Image result for నిఖాత్ జరీన్ Nikhat Zareen"

నిఖాత్ జరీన్
23ఏళ్ల భారతీయ మహిళ నిఖాత్ జరీన 14 జూన్ 1996 లో నిజామాబాద్ జిల్లా, తెలంగాణ లో జన్మించారు. ఈమె బరువు 51 కిలోలు (112 పౌండ్లు). ఆమె మహిళల త్సాహిక ఫ్లై వెయిట్ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో  బ్యాంకాక్ ఆసియా ఛాంపియన్‌షిప్‌ లో ఫ్లై వెయిట్ విభాగంలో పాల్గొన్నారు.

గువాహతిలో జరిగిన 2 వ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో నిజామాబాద్‌కు చెందిన త్సాహిక మహిళా బాక్సర్ నిఖాత్ జరీన్ రజత పతకం సాధించినది.

జరీన్ 14 జూన్ 1996 న భారతదేశంలోని తెలంగాణలోని నిజామాబాద్‌లో ఎండి జమీల్ అహ్మద్ మరియు పర్వీన్ సుల్తానా దంపతులకు జన్మించారు. ఆమె తన ప్రాధమిక విద్యను నిజామాబాద్‌లోని నిర్మల హృదయ బాలికల ఉన్నత పాఠశాల నుండి పూర్తి చేసింది. ఆమె తెలంగాణలోని హైదరాబాద్ లోని ఎ.వి కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బి.ఏ) లో డిగ్రీ చదువుతోంది. నిఖాత్ ప్రారంభం లో 100 మీటర్లు, 200 మీటర్లలో అథ్లెటిక్స్ పోటీలో పాల్గొన్నారు.ఆ తరువాత బాక్సింగ్ లో ఆసక్తి పెరిగి అందులో పాల్గొన్నారు.

ఆమె తండ్రి, మహ్మద్ జమీల్ అహ్మద్, ఆమెను బాక్సింగ్‌కు పరిచయం చేశాడు మరియు ఆమె అతని క్రింద ఒక సంవత్సరం శిక్షణ పొందింది. 2009 లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత IV రావు ఆధ్వర్యంలో శిక్షణ పొందటానికి నిఖాత్‌ను విశాఖపట్నంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేర్చుకున్నారు. ఒక సంవత్సరం తరువాత ఆమె 2010 లో ఈరోడ్ నేషనల్స్ లో 'గోల్డెన్ బెస్ట్ బాక్సర్‌గా' ప్రకటించబడింది.

2011 ఉమెన్స్ జూనియర్ మరియు యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో
·        టర్కీలో జరిగిన AIBA ఉమెన్స్ జూనియర్ మరియు యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జరిగిన ఫ్లై వెయిట్ విభాగంలో బంగారు పతకం సాధించింది.
2014 యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్
·        2014 లో బల్గేరియాలో జరిగిన యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం.
2014 నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్
·        12 జనవరి 2014 న సెర్బియాలోని నోవి సాడ్‌లో జరిగిన థర్డ్ నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించింది.
·        51 కిలోల బరువు విభాగంలో జరీన్ రష్యాకు చెందిన పాల్ట్సేవా ఎకాటెరినాను ఓడించాడు.
2015 16 వ సీనియర్ మహిళ జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్
·        అస్సాంలో 16 వ సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది.
·        థాయ్లాండ్ఓపెన్అంతర్జాతీయ బాక్సింగ్టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ నిఖత్జరీన్‌ (మహిళల 51 కేజీలు) ఫైనల్ కు చేరారు.

అవార్డులు:
నిఖాత్ తన సొంత పట్టణం నిజామాబాద్, తెలంగాణకు అధికారిక రాయబారిగా నియమితులయ్యారు.
ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్శిటీ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్, జలంధర్, ఇండియా - ఫిబ్రవరి 2015 లో ఉత్తమ బాక్సర్
నిఖత్ జరీన్ యొక్క లక్ష్యం ఒలింపిక్ స్వర్ణం సాధించిన దేశం యొక్క మొదటి మహిళగా అవతరించటం.


మేరీకొం-నిఖిత్ మద్య వివాదం:

గత కొంతకాలంగా భారత మహిళా స్టార్బాక్సర్లు మేరీకోమ్-నిఖత్జరీన్ మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్లో భాగంగా చైనాలో జరిగే క్వాలిఫయింగ్ఈవెంట్కు  51 కేజీల కేటగిరీలో మేరీకోమ్ను పంపడానికి బాక్సింగ్ఫెడరేషన్ఆఫ్ఇండియా(బీఎఫ్) నిర్ణయించగా, దాన్ని మరో స్టార్బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్జరీన్తీవ్రంగా వ్యతిరేకించింది. తాను కూడా 51 కేజీల విభాగంలో ఉండటంతో తమ మధ్య ఒలింపిక్స్సెలక్షన్ట్రయల్నిర్వహించాలంటూ కోరుతూ వస్తోంది. బీఎఫ్. వారి మధ్య సెలక్షన్ట్రయల్నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఆరుసార్లు వరల్డ్చాంపియన్మేరీకోమ్తో యువ స్టార్బాక్సర్జరీన్తో పోరు నిర్వహించాలనే యోచనలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, విశ్వసనీయ సమాచారం ప్రకారం డిసెంబర్చివరి వారంలో వీరిద్దరికీ మధ్య ఫైట్  నిర్వహించడానికి యత్నిస్తోంది.  డిసెంబర్2 తేదీ నుంచి 21 తేదీ వరకూ ఆలిండియా బాక్సింగ్లీగ్‌(ఐబీఎల్‌) జరుగనున్న తరుణంలో తర్వాత మేరీకోమ్‌-జరీన్లకు మెగా ఫైట్  ట్రయల్స్ఏర్పాటు చేసేoదుకు దాదాపు రంగం సిద్ధమైంది.
  వివాదం లో నిఖత్జరీన్కు భారత విఖ్యత షూటర్అభినవ్బింద్రా మద్దతుగా నిలవడం కూడా మేరీకోమ్కు ఆగ్రహం తెప్పించింది.
నిఖత్జరీన్తో తలపడేందుకు నాకెలాంటి భయం లేదుఅని భారత దిగ్గజ బాక్సర్మేరీకోమ్ప్రకటించింది. బీఎఫ్ తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తాను. వారు నిఖత్తో ట్రయల్స్బౌట్లో తలపడాలని ఆదేశిస్తే తప్పకుండా పోటీపడతానుఅని 36 ఏళ్ల మేరీకోమ్తెలిపింది.


No comments:

Post a Comment