4 December 2019

భారతదేశంలో ముస్లిం మహిళలు మసీదులలో ప్రార్థన చేయడమే కాదు, వారు మసీదులు కూడా నిర్మించారు There was a time when Muslim women in India not only prayed in mosques, they even built them



Image result for khairul manazil masjid 

1561 లో మహమ్ అంగ చే నిర్మించిబడిన  ఖైరుల్ మనజిల్ (Khairul Manazil) మసీదు డిల్లి లో ఒక మహిళ చేత నిర్మించబడిన మొట్టమొదటి మసీదు.
దాదాపు 800 సంవత్సరాల క్రితం  డిల్లి సుల్తానేట్ పాలకురాలు రజియా సుల్తాన్ 13 వ శతాబ్దం ప్రారంభంలో సింహాసనాన్ని అధిష్టించడం మరియు డిల్లి పాలించిన మొదటి మహిళ కావడం వలన చరిత్ర సృష్టించారు.
తన సోదరుడు ముయిజ్ ఉద్-దిన్ బహ్రమ్ను కాదని సుల్తాన్ ఇల్తుట్మిష్ యొక్క ప్రియ పుత్రిక సింహాసనం అధిష్టించారు. ఆ సమయంలోని  ఉలేమా మొదట్లో ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. కాని ఆమె ఒక  తెలివైన, పరిపాలన దక్షురాలు మరియు  సుల్తానేట్ను యుద్ధంలో నడిపించగల సామర్థ్యం కలిగి ఉంది. వారి దృష్టిలో ఆమెకు ఉన్న  ఏకైక అడ్డంకి ఆమె స్త్రీ కావడం.
ఆమె పట్ల ఆమె తండ్రి ఇల్టుట్మిష్ కు ఉన్న విశ్వాసం తో ఆమె  సింహాసనాన్ని పొందటానికి లింగ అసమానతలను ధిక్కరించింది. ఆమె ఉత్తర భారతదేశపు మొదటి మసీదు అయిన  మెహ్రౌలిలోని క్వ్వతుల్ (Quwwatul) ఇస్లాం మసీదుకు గరిష్ట ఆరాధకులు ఉండే శుక్రవారం వెళ్లింది మరియు సింహాసనంపై అధిష్టించడానికి ఆమె విశ్వాసుల మద్దతు కోరింది.
ఆమె  తన ప్రసంగం లో  తనను తాను సుల్తాన్ అని పేర్కొంది. క్వవాతుల్ ఇస్లాం మసీదులో తన ప్రసంగంతో రజియా ఇతర మహిళలు  మసీదుకు వెళ్లడానికి మాత్రమే కాకుండా మసీదులను నిర్మించడానికి కూడా ఒక బాట వేసింది. భారతదేశ చరిత్రలో మొదటిసారి ఖుత్బా ఆమె పేరుతో  చదవబడింది. ఇది ఒక రికార్డ్.
ఆమె పరదా  లేకుండా ప్రయాణించేది మరియు గుర్రాలు మరియు ఏనుగులను అధిష్టించినది. ఆమె మసీదులు మరియు మదర్సాలకు వెళ్లేది. ఆమె ఖంకా మరియు మదర్సాల కు ప్రోత్సాహం ఇచ్చేది.  తబాకత్-ఎ-నాసిరి రచయిత మిన్హాజ్ సిరాజ్ జుజ్జనితో సంబంధం కలిగి ఉంది. రజియా సుల్తాన్ అతన్ని షేక్-ఉల్ ఇస్లాం గా పరిగణించారు.
మధ్యయుగ కాలంలో ముస్లిం మహిళలు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నారు.  రాజకీయంగా చక్రవర్తులు వారిని సంప్రదించి, విశ్వాసంలోకి తీసుకునేవారు.  మొఘల్ రాజు జహంగీర్ పై మహారాణి నూర్ జహాన్ ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంది. మొఘల్ రాజవంశం స్థాపకుడు జహిరుద్దీన్ బాబర్ కూడా యుద్ధానికి బయలుదేరే ముందు తన పరివార మహిళలు, తల్లి, భార్యలు మరియు కుమార్తెలను ముందు సంప్రదించే వాడు.  
డిల్లి లో 16 వ శతాబ్దపు ఖైరుల్ మనజిల్ మసీదు మొఘల్ పాలకుడు జలాలుద్దీన్ అక్బర్ యొక్క పెంపుడు తల్లి మహమ్ అంగ చే నిర్మించబడినది. 1561 లో మహమ్ అంగ చేత నిర్మించబడిన ఖైరుల్ మనజిల్ మసీదు డిల్లీలో ఒక మహిళ చేత నిర్మించబడిన మొట్టమొదటి మసీదు. అక్బర్ చక్రవర్తి బాధ్యతలను నెరవేర్చడానికి చాలా చిన్నవాడు అయినందువలన అక్బర్ యొక్క చిన్న తనం లో మహమ్ అంగ  మొఘల్ సామ్రాజ్యానికి వాస్తవంగా పాలకురాలు గా వ్యవహరించేది.  
మహమ్ అంగ  మసీదులో స్వయంగా ప్రార్థన సమావేశాలకు హాజరు అయిందో లేదో  నిరూపించడానికి చారిత్రక ఆధారాలు లబించనప్పట్టికి  మసీదు నిర్మాణంలో ఆమె కీలక పాత్ర పోషించిందనేది వాస్తవం. ఆమె తరువాత చాలా మంది మొఘల్ యువరాణులు తమ రోజువారీ ప్రార్థనల కోసం మసీదులను సందర్శించకుండా మసీదుల నిర్మాణాన్ని ధర్మబద్ధమైన చర్యగా చేపట్టారు.
ఖైరుల్ మనజిల్ నిర్మాణం విషయంలో మహాం అంగ తన మంత్రిగా ఉన్న షాహాబుద్దీన్ అహ్మద్ ఖాన్ సేవలను ఉపయోగించుకొన్నారు. మసీదు యొక్క సెంట్రల్ ఆర్చ్ లో ఉన్న శాసనం ద్వారా మసీదును మహాం అంగ నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ మసీదుకు  మదర్సా జతచేయబడింది. పిల్లల ఇస్లామిక్ విద్య కోసం మహాం అంగ స్వయంగా నిధులు సమకూర్చింది.
జహంగీర్ మరియు షాజహాన్ యుగం నాటి మొఘల్ సూక్ష్మచిత్రాలు   (miniatures) స్త్రీలు గుర్రపు స్వారీ మరియు పరదా లేకుండా తిరుగుతున్నట్లు చూపించాయి. తరచుగా వారు తమ నికాహ్నామాలను నిర్దేశిస్తారు మరియు అందులో  ఏక పత్ని monogamy, తక్షణ ట్రిపుల్ తలాక్ లేదా తలాక్-ఎ-తఫ్వీజ్ ద్వారా విడాకుల హక్కును పొందే పరిస్థితులను పొందుపరిచారు.
వారు మసీదులు, మదర్సాలు మరియు సరాయిలను నిర్మించారు.  కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, రాజవంశికులు అయిన స్త్రీలు ఈద్ వంటి ప్రత్యేక సందర్భాలలో లేదా కొత్త చక్రవర్తి రాజ్య సింహాసనం అధిష్టించినప్పుడు  మరియు ఖుత్బా అతని పదవి స్వికరణకు చిహ్నంగా చదివినప్పుడు మసీదులకు వచ్చేవారు.  
చారిత్రికంగా లిఖిత ఆధారాలు తక్కువగా ఉన్నప్పటికీ, సుల్తానేట్ మరియు మొఘల్ కాలం నాటి నిర్మాణాలను నిశితంగా పరిశీలిస్తే స్త్రీలు మసీదులలో ప్రార్థనలు చేశారని నమ్మవచ్చు. ఉదాహరణకు, డిల్లి లోని వజీరాబాద్‌లో తుగ్లక్ శకం నాటి మసీదు ఉంది. రాజులు సాధారణంగా షాహి దర్వాజా అని పిలువబడే ప్రధాన ద్వారం నుండి ప్రవేశించి మసీదు వద్ద ప్రార్థనలు చేసి తరువాత ఆ ద్వారం గుండా బయటకు వెళ్ళేవారు. ఈ మసీదులో ఒక ఎత్తైన గది ఉంది.  ఆ ఎత్తైన గది రాజ వంశ మహిళలకు ఉద్దేశించిబడినదని చరిత్రకారులు నమ్ముతారు.
చాలా మంది చరిత్రకారులు వజీరాబాద్ మసీదులో జాలి  గోడల వెనుక ఉన్న ప్రదేశం మహిళా ఆరాధకుల కోసం కేటాయించబడిందని నమ్ముతారు. జాలి /లాటిస్ గోడల వెనుక ప్రధాన హాలులో పురుషులు మరియు తమ ప్రత్యెక  విభాగంలో మహిళలు ప్రార్థనలు చేసేవారు. .
మీరు బెంగాల్‌కు వెళితే, అక్కడ హజ్రత్-ఎ-పాండువా Hazrat-e-Pandua లో మనకు ఆదినా (Adina) మసీదు ఉంది. ఇది భారతదేశంలోని  అతిపెద్ద మసీదులలో ఒకటి. ఇది క్వవతుల్ ఇస్లాం మసీదు కంటే చాలా పెద్ద మసీదు. ఇక్కడ ప్రార్థన గది ఒక జాలీ గోడ మరియు సెమీ వృత్తాకార సముచితం semi-circular niche గా ఉన్న ఎత్తైన మిహ్రాబ్ ఉన్నాయి.
మధ్యయుగ భారతదేశంలోని అనేక మసీదులకు  రాజ మహిళలు మరియు ప్రభువుల కుటుంబాలకు చెందినవారు వచ్చేవారని చెప్పవచ్చు. మహిళలు మసీదులకు వెళ్లడాన్ని నిషేధించారని చూపించడానికి ఒక్క చారిత్రక ఆధారాలు కూడా లేవు మరియు మహిళలు మసీదులలోకి ప్రవేశించటానికి వ్యతిరేకంగా ఉలేమా ఫత్వా జారీ చేసినట్లు రికార్డులు లేవు.

మసీదులు మాత్రమే కాదు మహిళలు సూఫీ ఖాంకా మరియు దర్గాలకు కూడా వెళ్లారు, మరియు సుఫియానా కలాం పాడటంలో పాల్గొన్నారు. కుతుబుద్దీన్ ఐబాక్ మామ్లుక్ రాజవంశం నుండి, మొఘలుల కాలం వరకు(13 వ శతాబ్దం ఆరంభం నుండి 18 మరియు 19 వ శతాబ్దాలలో) మహిళలు తమ ఖంఖాల పోషణలో ముందు ఉన్నారు.

చాలా దర్గాలు మరియు ఖంఖాల్లో మసీదులు జతచేయబడినందున, సూఫీలు ​​ఎటువంటి అబ్యంతరం వ్యక్తం చేయనందున మహిళలు వాటిలో ప్రవేశిoచారనుట చాలా సరైంది. ఉదాహరణకు నిజాముద్దీన్ ఆలియా (Nizamuddin Auliya) సమా సంగీత సమావేశాలు. వీటిలో సుల్తానేట్ పాలకులు పాల్గొనేవారు.   ఇస్లాంలో సంగీతం హరామ్ (నిషేధించబడింది) అని నమ్మే యుగంలోని హనాఫీ పండితుల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ వారు పాల్గొనేవారు.
మసీదుల లోపల, మహిళల ప్రవేశాన్ని నిషేధించే స్పష్టమైన గుర్తులు లేవు
మొఘలుల క్షీణత మరియు బ్రిటిష్ వారి రాకతో ఇవన్నీ మారడం ప్రారంభించాయి. సంప్రదాయవాదులు మసీదులు మరియు స్మశానవాటికలలో  మహిళల ప్రవేశం పరిమితం చేసారు. వారిని మసీదులలోకి అనుమతించలేదు. స్మశానవాటికలోని సమాధి వద్ద ప్రార్థనలు చేయుటకు స్త్రీలను అనుమతించ లేదు.

మహిళలు హజ్ కోసం వెళ్ళడం కొనసాగించారు. మధ్యయుగాలలో మరియు ఆధునిక కాలంలో హజ్ హక్కు మహిళలకు ఎప్పుడూ నిరాకరించబడలేదు. ఇతర దేశాల పురుషులు మరియు మహిళలు మాదిరిగానే వారు మక్కా మరియు మదీనా నగరాలు  రెండింటిలో ప్రార్థనలు చేశారు.  వారు ప్రవక్త(స) భార్యలు మరియు సహచరుల సమాడులను సందర్శిస్తున్నారు.

దీనిని స్థానిక సంస్కృతి యొక్క ప్రభావం అని పిలవండి లేదా ఇస్లాం యొక్క  భారతీయకరణ అనండి:  మహిళలు మసీదులను నిర్మించవచ్చు  లేదా వాటికీ  ఆర్థిక సహాయం చేయవచ్చు కాని వాటి లోపల క్రమం తప్పకుండా ప్రార్థనలు చేయలేరు. ఈ రోజు కూడా మహిళలు తమ తోటి మహిళలు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన మసీదులకు ప్రార్థనల కోసం వెళ్ళలేరు.

పాత డిల్లి లోని  ప్రసిద్ధ ఫతేపురి మసీదు గాని లేదా భోపాల్ లోని తాజ్-ఉల్-మసాజిద్  లో గాని మహిళలకు సమూహ ప్రార్థన చేయడానికి అనుమతి లేదు. అక్కడ మహిళల కోసం ఒక గదిని లేదా హాలును విడిచిపెట్టలేక పోయారు. భారతదేశంలో ఇస్లామిక్ చరిత్రలో పూర్వం కన్నా నేడు ఈ పక్షపాతం ఎక్కువగా కనిపిస్తుంది.

No comments:

Post a Comment