19 September 2021

ఇంగ్లాండ్ లో మొదటి మస్జిద్ England’s first mosque


 


 


 

 

ఇంగ్లాండ్‌లో ఇస్లాం ధర్మం చాలా ఆలస్యంగా ప్రవేశించినది.ఇంగ్లాండ్ లో  ఇస్లాం ధర్మం ను వ్యాప్తి చేసిన   ఘనత భారతీయ ముస్లింలకు దక్కుతుంది. ఇంగ్లాండ్‌లో అధికారికంగా, మొదటి మసీదు 1889లో నిర్మించబడింది; ఒకటి లివర్‌పూల్‌లో, మరొకటి వోకింగ్‌లో. ఈ రెండూ ఇంగ్లాండ్‌లోని మొదటి మసీదులు  అని చెప్పవచ్చును..

 

 

 1889 లో, విలియం హెన్రీ క్విల్లియం, అకా అబ్దుల్లా క్విల్లియం, లివర్‌పూల్‌లో "ముస్లిం ఇనిస్టిట్యూట్" ను ప్రారంభించాడు మరియు అక్కడ చదువుతున్న విద్యార్థుల కోసం ఒక మసీదును నిర్మించాడు, దీనిలో 1915 లో కాబూల్ లో ఏర్పడిన భారత తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన మంత్రి మౌల్వీ బర్కతుల్లా భోపాలి, 1895 నుండి 1899 వరకు తన సేవలను అందించారు.

 

అదే సమయంలో పంజాబ్ యూనివర్సిటీ స్థాపకుడు, గొట్లీబ్ విల్హెల్మ్ లీట్నర్, అకా అబ్దుర్ రషీద్ సయ్యహ్ 1881 లో వోకింగ్ టౌన్‌లో ఓరియంటల్ ఇనిస్టిట్యూట్ కు పునాది వేశాడు. అబ్దుర్ రషీద్ సయ్యహ్ భోపాల్ యొక్క బేగమ్ షాజహాన్ సహాయంతో ముస్లిం విద్యార్థుల కోసం 1889 లో ఒక మసీదును కూడా నిర్మించాడు. గాట్లీబ్ విల్హెల్మ్ లీట్నర్, అకా అబ్దుర్ రషీద్ సయ్యాహ్ నిర్మించిన  మసీదు బ్రిటన్ లో అధికారికంగా నిర్మించబడింది.ఆగష్టు 2, 1889, మసీదు బ్లూప్రింట్ 'ది బిల్డింగ్ న్యూస్ అండ్ ఇంజనీరింగ్ జర్నల్' లో ముద్రించబడింది.

 

 

గోట్లీబ్ విల్‌హెల్మ్ లీట్నర్ అకా అబ్దుర్ రషీద్ సయ్యహ్, హంగేరియన్-బ్రిటిష్ ఓరియంటలిస్ట్ మరియు యూదుడు, గోట్లీబ్ విల్‌హెల్మ్ లీట్నర్ అనేక ముస్లిం దేశాలను సందర్శించిన తర్వాత తన పేరును అబ్దుర్ రషీద్ సయ్యాహ్‌గా మార్చుకున్నాడు. అబ్దుర్ రషీద్ సయ్యాహ్‌ కి అరబిక్, టర్కిష్, పర్షియన్ మరియు ఉర్దూతో సహా యాభైకి పైగా భాషలు తెలుసు. అబ్దుర్ రషీద్ సయ్యాహ్‌ 1861 లో లండన్లోని కింగ్స్ కాలేజీలో అరబిక్ లాంగ్వేజ్ మరియు ముస్లిం లా ప్రొఫెసర్‌గా నియమించబడ్డాడు. అబ్దుర్ రషీద్ సయ్యాహ్‌ 1864 లో లాహోర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు. 1882 లో పంజాబ్ యూనివర్సిటీకి పునాదులు వేయడంలో అబ్దుర్ రషీద్ సయ్యహ్ ముఖ్యమైన పాత్ర పోషించాడు.

 

అబ్దుర్ రషీద్ సయ్యాహ్‌ 1871-1876 మధ్య ​​మౌల్వీ కరిముద్దీన్ సహాయంతో భారతదేశ చరిత్ర మరియు ముస్లింలపై ఉర్దూలో రెండు వాల్యూమ్ పుస్తకాలు రాశారు. 1886 లో అబ్దుర్ రషీద్ సయ్యాహ్‌ పదవీ విరమణ చేసి ఇంగ్లాండ్‌కు తిరిగి వచ్చాడు. అప్పటికే అనగా 1881 లో, అబ్దుర్ రషీద్ సయ్యాహ్‌ వోకింగ్ టౌన్‌లో ఓరియంటల్ ఇనిస్టిట్యూట్ కు పునాది వేశాడు. భోపాల్‌కు చెందిన బేగం సుల్తాన్ షాజహాన్ ముస్లిం విద్యార్థుల కోసం ఇచ్చిన విరాళంతో  1889 లో వోకింగ్ టౌన్‌లో, ఇంగ్లాండ్‌లోని మొదటి మసీదు షాజహాన్ మసీదు నిర్మించబడినది.

 

షాజహాన్ మస్జిద్ నిర్మాణం పర్షియన్-సారాసెనిక్ రివైవల్ శైలిలో రూపొందించబడింది మరియు గోపురం, మినార్‌లు మరియు ప్రాంగణాన్ని కలిగి ఉంది. మసీదు  బాత్ మరియు బార్గేట్ రాతితో నిర్మించబడింది.

 

గోట్బీల్ విల్హెల్మ్ లీట్నర్, అకా అబ్దుర్ రషీద్ జీవించి ఉన్నంత వరకు షాజహాన్ మసీదు వాడుకలో ఉంది. విద్యార్థులు, అలాగే యాత్రికులు దీనిని సందర్శించే వారు, మున్షి అబ్దుల్ కరీం, క్వీన్ విక్టోరియా యొక్క ముఖ్యమైన అటెండర్, తరచుగా మసీదును సందర్శించేవారు.

 

 1899 మార్చి 22, గాట్లీబ్ విల్హెల్మ్ లీట్నర్, అకా అబ్దుర్ రషీద్ కన్నుమూశారు మరియు బ్రూక్వుడ్ స్మశానవాటికలో ఖననం చేయబడ్డారు. అబ్దుర్ రషీద్ మరణం తరువాత, ఓరియంటల్ ఇనిస్టిట్యూట్ మరియు షాజహాన్ మసీదు మూతబడినవి. 

 

షాజహాన్ మసీదు 1912 వరకు మూసివేయబడింది తరువాత భారతీయ న్యాయవాది ఖ్వాజా కమలుద్దీన్ చొరవతో తిరిగి తెరవబడింది. ఖ్వాజా కమలుద్దీన్ వోకింగ్ ముస్లిం మిషన్‌ను స్థాపించారు. ఫిబ్రవరి 1913 లో, ఖ్వాజా కమలుద్దీన్ "ది ఇస్లామిక్ రివ్యూ" అనే మాసపత్రికను స్థాపించాడు, మొదటి సంచికలో ఖ్వాజా కమలుద్దీన్ "భారతీయ ముస్లింలు" గురించి రాసాడు.. "ది ఇస్లామిక్ రివ్యూ” పత్రిక  ఇంగ్లాండ్ అంతటా పంపిణీ చేయబడింది. వాకింగ్ ముస్లిం మిషన్‌ ప్రభావంతో చాలా మంది ప్రజలు ఇస్లాం ధర్మం లోకి మారారు.

 

1924 లో, ఇంగ్లాండ్‌లోని మొత్తం ముస్లింల సంఖ్య పది వేలు, అందులో వెయ్యి మందికి పైగా నూతనంగా ఇస్లాం స్వీకరించారు. 1960 వరకు, షాజహాన్ మసీదు ఇంగ్లీష్ ముస్లింలకు కేంద్రంగా ఉంది. కానీ 70వ దశకంలో, పాకిస్తాన్ నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు లండన్‌లో స్థిరపడటం ప్రారంభించారు మరియు లండన్ లో మసీదుల నిర్మాణానికి  పునాది వేశారు, ఆ తర్వాత షాజహాన్ మసీదు ఒక సాధారణ మసీదుగా మారింది. సాధారణ ముస్లింలలో దీని ప్రాముఖ్యత తగ్గడం ప్రారంభమైంది

 

అబ్దుల్లా యూసుఫ్ అలీ, మర్మడుకే పిక్థాల్ మరియు లార్డ్ హెడ్లీ అకా  షేక్ రహమతుల్లా అల్ ఫరూక్, మొదలగు ఆంగ్ల ముస్లిం ప్రముఖులు  షాజహాన్ మసీదుతో సంబంధాలు కలిగి ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, భారతీయ ముస్లిం సైనికులు ఇక్కడ ప్రార్థనలు చేసేవారు. భారతీయ స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా షౌకత్ అలీ, మౌలానా ముహమ్మద్ అలీ జోహార్, అగా ఖాన్, సయ్యద్ అమీర్ అలీ మరియు అల్లామా ఇక్బాల్    షాజహాన్   మసీదు కు వచ్చేవారు.

 

 21 మార్చి 1920, మౌలానా ముహమ్మద్ అలీ జోహార్ నాయకత్వంలో ముగ్గురు వ్యక్తుల ప్రతినిధి బృందం-మౌలానా సులైమాన్ నద్వి మరియు సయ్యద్ హుస్సేన్ షాజహాన్ మసీదు ను దర్సించినది. వారితో పాటు  అనేక మంది ముస్లిమేతర పురుషులు మరియు మహిళలతో పాటు పెద్ద సంఖ్యలో భారతీయ మరియు బ్రిటిష్ మూలాలు కలిగిన ముస్లింలు మసీదులో సమావేశమయ్యారు. మసీదులో తక్కువ స్థలం ఉన్నందున సమావేశం బయట నిర్వహించబడింది మరియు దీనికి ప్రొఫెసర్ హెచ్. ఎమ్. లియాన్ నేతృత్వం వహించారు. ఏప్రిల్ 1920లో భోపాల్ సమీపంలోని కుర్వి సంస్థానానికి చెందిన మహమ్మద్ సర్వార్ అలీ ఖాన్ ఇక్కడకు వచ్చారు. మార్చి 1924 లో, టర్కీ రాయబారి మరియు 1937 మే 8, ఇరాన్ రాయబారి మీర్జా అలీ సోహేలీ మసీదును సందర్శించారు.

 

అక్టోబర్, 1925లో భోపాల్ బేగం  తన ఇంగ్లాండ్ పర్యటనలో షాజహాన్ మసీదును సందర్శించి ప్రార్థనలు చేసింది. 30జూన్, 1935, సౌదీ అరేబియా యువరాజు అమీర్ సౌద్ మరియు 19ఫిబ్రవరి, 1939, అప్పటి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి,  తరువాత సౌది రాజు ఫైసల్ షాజహాన్ మస్జిద్ ను సందర్శించారు. ప్రముఖ భారతీయ ముస్లింలు ఇక్కడకు రావడం కొనసాగించారు మరియు 7జూన్, 1931 హైదరాబాద్ నిజాం కుమారులు మొజామ్ మరియు అజామ్ ఈ మసీదును సందర్శించారు.

 

 

 

 

No comments:

Post a Comment