24 September 2021

‘హాజీ ఉస్మాన్ : ‘ HAJI USMAN SAIT :

 

 ‘

 

 

దాతృత్వానికి  పేరుగాంచి మరియు 'ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ క్యాష్ బ్యాగ్' గా గుర్తింపు  పొందిన హాజీ ఉస్మాన్ సేట్ Haji Usman Sait 1887 లో బెంగళూరులో జన్మించారు. అతని పూర్వీకులు గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతానికి చెందినవారు మరియు బెంగళూరులో స్థిరపడ్డారు. వ్యాపార సంపన్న కుటుంబంలో జన్మించిన ఉస్మాన్ సేట్ తన తండ్రితో కలిసి జాతీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యంలో సంపదను సంపాదించారు.

 

హాజీ ఉస్మాన్ సేట్ మరియు అతని తండ్రి బెంగళూరు నగరం నడిబొడ్డున క్యాష్ బజార్అనే షాపింగ్ కాంప్లెక్స్‌ ను స్థాపించారు. 1919 లో హాజీ ఉస్మాన్ సేట్,  ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఖిలాఫత్ ఉద్యమంలో హాజీ ఉస్మాన్ సేట్ కి 'అలీ బ్రదర్స్' మరియు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడి దానిలో చాలా చురుకుగా పాల్గొన్నారు. త్వరలోనే  హాజీ ఉస్మాన్ సేట్ ఖిలాఫత్ వాలేఉస్మాన్  సేట్   గా పిలవబడ్డారు.

 

హాజీ ఉస్మాన్ సేట్  గాంధీజీ సలహా మేరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో సభ్యత్వం పొందారు  మరియు గాంధీజీ కి ముఖ్యమైన అనుచరుడు గా మారారు. హాజీ ఉస్మాన్ సేట్ స్వదేశీ ఉద్యమంలో భాగంగా తన 'క్యాష్ బజార్' స్టోర్‌లలోని విదేశీ వస్తువులన్నింటినీ బహిరంగంగా అగ్గిపాలు చేశారు. ఈ ధిక్కార చర్యపై బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి ఉస్మాన్ సేట్ వ్యాపారంపై ఆంక్షలు విధించినప్పుడు  హాజీ ఉస్మాన్ సేట్  చాలా నష్టపోయారు.

 

గాంధీజీ సలహా మేరకు, హాజీ ఉస్మాన్ సేట్  1920 లో బెంగుళూరులో స్వదేశీ స్కూల్ప్రారంభించారు. హాజీ ఉస్మాన్ సేట్  తన పిల్లలను ఆంగ్ల పాఠశాలకు పంపలేదు. హాజీ ఉస్మాన్ సేట్  తన చివరి శ్వాస వరకు ఖాదీ ధరించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు ఆర్థిక అవసరం ఉన్నప్పుడు హాజీ ఉస్మాన్ సేట్ కాంగ్రెస్స్ కు   బ్లాంక్ చెక్కులు blank cheques ఇచ్చేవారు. హాజీ ఉస్మాన్ సేట్.  అలీ బ్రదర్స్, గాంధీజీ మరియు జవహర్‌లాల్ నెహ్రూలకు బ్లాంక్ చెక్కులు మరియు బంగారు నాణేల సంచులను అందజేసేవారు.

 

హాజీ ఉస్మాన్ సేట్  తన విలాసవంతమైన బంగళాలను ఒకదాని తర్వాత ఒకటి విక్రయించడం ద్వారా తన ఉదారతను చాటారు. ఒక సందర్భంలో, భారత జాతీయ కాంగ్రెస్‌కు విరాళంగా ఇవ్వడానికి హాజీ ఉస్మాన్ సేట్ వద్ద డబ్బు లేనప్పుడు, హాజీ ఉస్మాన్ సేట్  తన పెద్ద కుమారుడు ఇబ్రహీంను బహిరంగ వేలంలో పెట్టారు. హాజీ ఉస్మాన్ సేట్    సన్నిహితుడు వేలంలో పాల్గొని వేలం బిడ్ గెలుచుకున్నాడు. అతను మొత్తం వేలం ఆదాయంతో పాటు ఇబ్రహీంను హాజీ ఉస్మాన్ సేట్ కు  ఇచ్చాడు. హాజీ ఉస్మాన్ సంతోషంగా వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు విరాళంగా ఇచ్చారు.

 

హాజీ ఉస్మాన్ సైత్ తన తుది శ్వాస వరకు 'భారత జాతీయ కాంగ్రెస్ క్యాష్ బ్యాగ్' అనే బిరుదు తో జీవించాడు మరియు తన పిల్లలకు ఏమీ ఇవ్వలేదు. ఉస్మాన్ సేట్ తన పిల్లలకు మీరు జీవించాలనుకుంటే, భారతదేశం కోసం జీవించండి ... చనిపోవాలనుకుంటే, భారతదేశం కోసం మరణించండిఅనే అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఖిలాఫత్ వాలేహాజీ ఉస్మాన్ సైత్ 1932 లో బెంగళూరులో కన్నుమూశారు.

  ఆధారాలు:

1.www.heritagetimes.in

2.ప్రసిద్ద చరిత్ర కారుడు నసీర్ అహ్మద్ గారి రచనలు

3.ముస్లిమ్స్ అఫ్ ఇండియా పేస్ బుక్ లోని వ్యాసం

4.వికిపెడియా 

No comments:

Post a Comment