14 August 2022

షా ముహమ్మద్ జుబైర్ 1884- 1930 సర్ బిరుదును తిరస్కరించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు शाह मुहम्मद ज़ुबैर1884- 1930 सर के ख़िताब को ठुकराने वाल एक महान स्वातंत्रता सेनानी

 





1884లో అర్వాల్-బీహార్‌లోని ఒక జమీందార్ కుటుంబంలో జన్మించారు. షా మహ్మద్ జుబేర్ తండ్రి పేరు సయ్యద్ అష్ఫాక్ హుస్సేన్, ఇతను బ్రిటిష్ వారి పాలనలో చాలా ఉన్నత పదవిలో ఉండి, జెహానాబాద్‌లో నియమించబడ్డాడు.

ఇంట్లోనే ప్రాథమిక విద్యను అభ్యసించిన తర్వాత, షా మహ్మద్ జుబైర్1904లో పాట్నాలోని TK ఘోష్ పాఠశాలలో  తన చదువును పూర్తి చేసాడు 1908లో బారిస్టర్ చదువు కోసం ఇంగ్లండ్‌ వెళ్ళాడు. ఇంగ్లాండ్ లో జుబైర్ కు భారతీయ విప్లవకారులతో పరిచయం ఏర్పడినది. దేశ భక్తి భావనలు అతని మదిలో వృద్ది చెంద సాగినవి.

బారిస్టర్ చదువు పూర్తి చేసి 1911లో మహ్మద్ జుబేర్ పాట్నాకు తిరిగి వచ్చాడు. పాట్నాలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు, అదే సమయంలో బెంగాల్ నుండి బీహార్‌ను విడదీసే ఉద్యమం అలీ ఇమామ్, సచ్చిదానంద్ సిన్హా, మౌలానా మజరుల్ హక్, హసన్ ఇమామ్ మొదలగు ప్రముఖులు  ప్రారంభించారు. షా మహ్మద్ జుబేర్ కూడా ఈ ఉద్యమం కు  తన మద్దతునిచ్చాడు.

మహ్మద్ జుబేర్ 1912లో, బాకీపూర్ పాట్నాలో జరిగిన వార్షిక కాంగ్రెస్‌ ప్రధాన నిర్వాహకులుగా ఉన్నారు, సచ్చిదానంద్ సిన్హా, మౌలానా మజరుల్ హక్, హసన్ ఇమామ్ మరియు షా మహ్మద్ జుబైర్ తదితరులు సమావేశం లో పాల్గొన్నారు.

1914లో ముంగేర్ నివాసి బీబీ సాదిఖాతో మహ్మద్ జుబేర్ వివాహం జరిగింది, ఆ తర్వాత షా మహ్మద్ జుబేర్ ముంగేర్‌కు వెళ్లి అక్కడ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు మరియు బహిరంగంగా రాజకీయాల్లో పాల్గొనడం ప్రారంభించారు, ఈ సమయంలో ముంగేర్ జిల్లా కాంగ్రెస్ కమిటీకి సదర్‌గా ఎన్నికయ్యారు. శ్రీ కృష్ణ సింగ్ నాయబ్ సదర్ గా పనిచేసారు.

శ్రీ కృష్ణ సింగ్ తనను తాను షా మహమ్మద్ జుబైర్ శిష్యుడిగా భావించారు మరియు  ముంగేర్‌లోని జుబేర్ హౌస్‌లో శ్రీ కృష్ణ సింగ్రాజకీయాలు నేర్చుకున్నాడు. ముంగేర్ లో షా మహమ్మద్ జుబైర్ కు గాంధీ, మోతీలాల్ లేదా మౌలానా జౌహర్‌ తదితర ఆనాటి ప్రముఖ నాయకులతో పరిచయాలు ఏర్పడినవి,

షా మహమ్మద్ జుబేర్ గాంధీతో కలిసి రౌలత్ చట్టాన్ని బహిరంగంగా వ్యతిరేకించాడు. షా మహమ్మద్ జుబేర్ ఖిలాఫత్ మరియు సహాయ నిరాకరణ ఉద్యమం లో  కూడా చురుకుగా పాల్గొన్నాడు, ఖిలాఫత్ మరియు సహాయ నిరాకరణ ఉద్యమం లో  షా మహమ్మద్ జుబేర్ తో పాటు అతని శిష్యుడు శ్రీ కృష్ణ సింగ్‌ కూడా చురుకుగా పాల్గొని హిందూ-ముస్లిం ఐక్యత, ఖిలాఫత్ మరియు సహాయ నిరాకరణ ఉద్యమం కు దృఢంగా తన మద్దత్తు ప్రకటిస్తారు.

ఆగష్టు 1, 1920, సహాయ నిరాకరణ ఉద్యమం కు మద్దతుగా ఖిలాఫత్ డే  జరుపుకున్నారు మరియు షా ముహమ్మద్ జుబేర్ సాహెబ్ ఆ నాటి నుండి తన న్యాయవాద వృత్తిని శాశ్వతంగా విడిచిపెట్టారు.  

డిసెంబరు 1920లో, అలీ బ్రదర్స్ వారి తల్లి  బీ అమ్మ మరియు గాంధీజీతో కలిసి ముంగేర్‌కు వచ్చారు  మరియు ముంగేర్‌లోని షా మహమ్మద్ జుబైర్‌ హౌస్‌లో ఉన్నారు. మహాత్మా గాంధీ షా మహమ్మద్ జుబైర్‌తో కలిసి పరిసర ప్రాంతమంతా పర్యటించి  తిలక్ స్వరాజ్ సంస్థ కోసం విరాళాలు సేకరించారు. సహాయ నిరాకరణోద్యమo కు ముంగేర్ లోని  ప్రజల నుంచి బలమైన  మద్దతు లభించినది.  ప్రభుత్వ పదవులు, సర్టిఫికెట్లు, నవాజీలు బహిష్కరించారు. బి అమ్మ అబాది బానో బేగం ముస్లిం మహిళా సమితి పిలుపు మేరకు విదేశీ దుస్తులకు నిప్పుపెట్టారు., ఈ పనిలో షా మహ్మద్ జుబేర్ భార్య బీబీ సాదికా ముందుంది.

ఈ సందర్భంగా ముంగేర్ జిల్లా రాజకీయ సమావేశం మౌలానా షౌకత్ అలీ నాయకత్వం లో  లఖిసారేలో జరిగింది, బి అమ్మ అబాది బానో బేగం కూడా సమావేశానికి  హాజరు అయ్యారు. కార్యక్రమం విజయవంతమైంది మరియు దీని తర్వాత జమాల్‌పూర్‌లో ఒక కార్యక్రమం కూడా జరిగింది, మౌలానా షౌకత్ అలీ స్వయంగా తన మొదటి రాజకీయ ఆరంగేట్రం ముంగేరులోనే జరిగింది అన్నారు.. సహాయ నిరాకరణ ఉద్యమం విజయవంతమవడం చూసి, వైస్రాయ్ లార్డ్ సిన్హాను పరిస్థితిని పరిశీలించడానికి ముంగేర్‌కు వెళ్లమని ఆదేశించాడు, ఫిబ్రవరి 1921లో, లార్డ్ సిన్హా ముంగేర్‌కు వెళ్ళాడు, అక్కడ ప్రజలు అతన్ని పూర్తిగా బహిష్కరించారు

జులై 1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ముంగేర్ పర్యటన పూర్తిగా బహిష్కరించబదడినది., ఇందులో షా మహమ్మద్ జుబైర్ ముందున్నాడు, ఈ కారణంగా అతన్ని మొదట గృహనిర్బంధంలో ఉంచారు, తర్వాత జుబైర్ , శ్రీకృష్ణ సింగ్, షఫీ దావూదీ, బిందేశ్వరి మరియు ఖాజీ అహ్మద్ హుస్సేన్ అరెస్టయ్యాడు మరియు భాగల్పూర్ జైలుకు పంపబడ్డాడు. షా మహ్మద్ జుబేర్‌కు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.

1922 లో, గయా నగరంలో కాంగ్రెస్ సమావేశం నిర్వహించబడింది, స్వరాజ్ పార్టీ ఉనికిలోకి వచ్చింది, మోతీలాల్ నెహ్రూ దాని నాయకుడు, 1923లో జైలు నుండి విడుదలైన తర్వాత, షా మహ్మద్ జుబేర్ స్వరాజ్ పార్టీలో చేరారు మరియు దాని కార్యదర్శిగా చేశారు.

జిల్లా బోర్డు మరియు మున్సిపల్ ఎన్నికలు 1923లోనే జరిగాయి. షా ముహమ్మద్ జుబేర్ ముంగేర్ జిల్లా నుంచి గెలుపొంది ఛైర్మన్‌గా, శ్రీకృష్ణ సింగ్‌ను డిప్యూటీ ఛైర్మన్‌గా చేశారు. 1923లో, షా మహ్మద్ జుబేర్ మొట్టమొదట కిసాన్ సభ అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా రైతుల హక్కుల కోసం ఆందోళన ప్రారంభించాడు. ఈ సంస్థకు జుబేర్ నాయకుడు మరియు శ్రీ కృష్ణ సింగ్‌ ఉప నాయకుడు.

1925లో, బీహార్ స్టేట్ పొలిటికల్ కాన్ఫరెన్స్ పుర్వాలియాలో జరిగింది, ఇందులో గాంధీజీ స్వయంగా పాల్గొన్నారు, షా మహ్మద్ జుబైర్ ఈ సమావేశానికి మద్దతు ఇచ్చారు మరియు "దేహీ తంజీమ్" పథకాన్ని ప్రారభించారు.  ఈ పథకం భారతదేశంలోని పల్లెలను మేల్కొల్పడానికి ఉద్దేశించినది.

1926లో, షా మహ్మద్ జుబైర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్‌కు నామినేట్ అయిన తర్వాత ఢిల్లీ చేరుకున్నాడు. 1926 నుండి 31 అక్టోబర్ 1929 వరకు, స్వరాజ్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తించాడు, ఈలోగా, కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యం (పూర్ణ స్వరాజ్) కోరినప్పుడు డానికి మద్దతుగా , షా మహ్మద్ జుబేర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్‌కు రాజీనామా చేశాడు. బ్రిటీష్ వారు కూడా వారికి మద్దతు ఇస్తే, అతనికి "సర్" బిరుదు ఇస్తానని ఎర వేశారు. కాని జుబేర్ దానిని తిరస్కరించినాడు. నాకు 'సర్' కంటే పెద్ద బిరుదు ఉందని అది గాంధీగారి విశ్వాసం అని జుబేర్ సున్నితంగా “సర్” బిరుదును తిరస్కరించారు.

1927లో, షా మహ్మద్ జుబైర్ బీహార్ నుండి సైమన్ కమిషన్‌ను బహిష్కరించిన వారిలో ప్రధముడు. 1928లో ముంగేర్ నగరంలో జరిగిన బీహార్ యూత్ కాన్ఫరెన్స్ ను షా మహ్మద్ జుబేర్ విజయవంతం చేసాడు. శాసనోల్లంఘన ఉద్యమానికి మద్దతుగా, షా మహ్మద్ జుబైర్ స్వయంగా 23 ఏప్రిల్ 1930న బర్హయ్యాలో తన చేతులతో ఉప్పును తయారుచేశాడు మరియు  అతని అద్యరం లో వేలాది మంది ఉప్పును తయారు చేయడం ద్వారా ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు.

హసన్ ఇమామ్ కుమార్తె 'మిస్ సామి' నేతృత్వం లో మిస్ సిజి దాస్, మిస్ గౌరీ మరియు బీహార్‌లోని చాలా మంది మహిళలు కలిసి 1930 జూలై 15న మహిళా ఉద్యమాన్ని ప్రారంభించారు. మహిళలు  విదేశీ వస్తువులను  బహిష్కరించారు. విధించబడింది. ముంగేర్‌లో ఈ ఉద్యమం విజయవంతం కావడానికి, షా మహమ్మద్ జుబేర్ భార్య బీబీ సాదికా కృషి చేసింది.  25 జూలై 1930న విదేశి వస్తువులకు వ్యతిరేకం గా ముంగేర్‌లో జరిగిన పెద్ద ఊరేగింపుకు బీబీ సాదికా నాయకత్వం వహించారు.

1923లో జైలు నుంచి విడుదలైన తర్వాత షా ముహమ్మద్ జుబైర్ ఆరోగ్యం చాలా క్షీణించడం ప్రారంభించింది.

రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు షా ముహమ్మద్ జుబైర్ ఇంగ్లండ్ వెళ్ళవలసి ఉంది , కానీ 12 సెప్టెంబర్ 1930, 46 సంవత్సరాల వయస్సులో, జుబైర్ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు.

శ్రీ కృష్ణ సింగ్ భారతదేశంలోని బీహార్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి (1946-1961) అయ్యారు.

షా ముహమ్మద్ జుబైర్ కు నలుగురు సోదరులు కలరు. ఈ నలుగురు సోదరులు భారతదేశ స్వాతంత్ర్యంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేడు, షా ముహమ్మద్ జుబైర్ యొక్క రాజకీయ వారసత్వాన్ని అతని మనవళ్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-NCP ఎంపీలు తారిఖ్ అన్వర్ (కతిహార్) మరియు షా ఇమ్రాన్ (అర్వాల్) నిర్వహిస్తున్నారు.

 

No comments:

Post a Comment