10 August 2022

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ముహర్రం యొక్క సహకారం भारत की जंग ए आज़ादी में मुहर्रम का योगदान

 







ఈ సంవత్సరం మొహర్రం మరియు ఆగస్టు నెల కలిసి వచ్చాయి.. ఒకవైపు భారత స్వాతంత్య్ర వేడుకలు జరుగుతుండగా, మరోవైపు ఇమామ్ హుస్సేన్ (ర) త్యాగాన్ని స్మరించుకుంటున్నారు. భారతదేశ స్వాతంత్ర్య యుద్ధంలో ముహర్రం ప్రాముఖ్యతను కలిగి ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇమామ్ హుస్సేన్ బలిదానం నుండి ప్రజలు స్ఫూర్తి పొంది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ముహర్రం భారతదేశ స్వాతంత్ర్య యుద్ధంలో ఒక మైలురాయిగా నిలిచిన  సంఘటనలు చాలా ఉన్నాయి.

1757లో బెంగాల్ రాష్ట్రo ను పూర్తిగా ఆక్రమిoచుకోన్నప్పుడు బ్రిటీష్ వారి పట్ల  భారతీయులలో - వారు ఆదివాసీలు అయినా, యువరాజులు అయినా, మహిళలు అయినా,  రైతులు అయినా,  ఫకీర్ అయినా, లేదా స్వయంగా ఆంగ్ల సైన్యంలో భారతీయ సైనికులు అయినా భారతీయులలో  ప్రతిచోటా ప్రతిఘటన/స్వతంత్ర భావం  అలముకొని  బ్రిటిష్ వారిని వ్యతిరేకించారు. భారతదేశ స్వాతంత్ర్యంలో ముహర్రం మరియు ఇమామ్ హుస్సేన్ వంటి అమరవీరుల పాత్ర గురించి తెలుసుకొందాము.

 

“గరీబ్  ఓ సాదా ఓ రంగీన్ హై దాస్తానే హరమ్

నియాహత్ ఇస్కి హుస్సేన్ (ర) ఇబ్తాదా హై ఇస్మాయిల్ (అ)

ग़रीब ओ सादा ओ रंगीन है दास्ताने हरम
निहायत इसकी हुसैन (र) इब्तदा है इस्माइल (अ)

 1778లో, బ్రిటిష్ ఇండియా కంపెనీ రాబర్ట్ లిండ్సేను సిల్హెట్ కలెక్టర్‌గా చేసింది. ఈ సమయంలోనే లిండ్సే సున్నపురాయి మరియు దంతాల వ్యాపారాన్ని ప్రారంభించినాడు. ప్రజలు నిరసనలు తెలిపినా పరిష్కారం దొరకలేదు.1781 లో, ఈ ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి, దీని కారణంగా ప్రజలకు  మాత్రమే కాకుండా, జంతువులతో పాటు పొలాలకు కూడా చాలా నష్టం జరిగింది. ఈ వరదల కారణంగా, ఈ ప్రాంతంలోని జనాభాలో మూడవ వంతు మంది పూర్తిగా మరణించారు.

వరదల వల్ల సర్వస్వం ధ్వంసమైంది మరియు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పిర్జాదాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడం ప్రారంభించారు. పీర్జాదాల గురించి ఇన్‌ఫార్మర్లు కలెక్టర్‌కు సమాచారం అందించారు. మరియు పీర్జాదాల చర్యలపై నిఘా ఉంచాలని కలెక్టర్‌ జమాదార్‌ను కోరారు.

డిసెంబర్ 16, 1782, అంటే 10 మొహర్రం 1197 హిజ్రీ, పిర్జాదాలు తిరుగుబాటు చేశారని ఎవరో కలెక్టర్‌కు తెలియజేశారు, ఆ తర్వాత లిండ్సే మరియు అతని మనుషులు సిల్హెట్ కొండలపై ముహర్రం ఊరేగింపును తీసుకువెళుతున్న ప్రజలను చుట్టుముట్టారు మరియు వారిని లొంగిపోవాలని కోరారు. సిల్హెట్‌కు చెందిన పీర్జాదే సయ్యద్ మహ్మద్ హదీ మరియు సయ్యద్ మహమ్మద్ మెహందీ కూడా ఆజదారీలో పాల్గొన్నారు.

పిర్జాదాస్ తమాకు  ఏమి జరగబోతోందో గ్రహించారు , ఆ తర్వాత వారు తమ ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు: " మనం పెంపుడు కుక్కలం కాదు ఈ ఫిరంగిల మాటలు వినటానికి? ఎందుకంటే ఈరోజు జరిగే పోరాటం లో  వారు చనిపోతారు లేదా మనం అమరవీరులమవుతాము, త్వరలో బ్రిటిష్ పాలన అంతం కానుంది.”

ఆ తరువాత పోరాటం జరిగింది, లిండ్సే మరియు పీర్జాదాలు కత్తి యుద్ధం చేశారు, ఈ యుద్ధంలో పీర్జాదే,  లిండ్సే కత్తిని ఎగర కొట్టాడు. ఒక జమాదార్ తన పిస్టల్ లిండ్సేకి అందించాడు, లిండ్సే వెంటనే కాల్పులు జరిపాడు దీని కారణంగా పిర్జాదే అక్కడికక్కడే మరణించాడు.

1799లో టిప్పు సుల్తాన్ బ్రిటీష్ వారిచే అమరుడయ్యాడు, ఈ సంఘటన భారతీయులను చాలా నిరాశపరిచింది. నాయకుడు చనిపోతే హక్కు చావదు. టిప్పు సుల్తాన్ కుమారులను తమ నాయకులుగా తీసుకుని 1806లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. మరియు ఈ తిరుగుబాటు వెనుక పీర్లు మరియు ఫకీర్ల పాత్ర ఉంది, వారు బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయ సైనికులను తిరుగుబాటుకు ప్రేరేపించారు.

ఇందుకు గాను టిప్పు సుల్తాన్ బలిదానాన్ని కర్బలాలో ఇమామ్ హుస్సేన్ బలిదానంతో ముడిపెట్టుతు ఒక పాట రచించారు. ఇందులో ఇమామ్ హుస్సేన్ లాగా టిప్పు సుల్తాన్ అన్నీ త్యాగం చేసాడు కానీ సరైన మార్గాన్ని వదిలిపెట్టలేదు. కాబట్టి మనం కూడా అదే చేయాలి. సైన్యంలోని,  సైనికులు ప్రతి ప్రాంతానికి చెందినవారు కాబట్టి, ఈ పీర్ ఫకీర్లు ప్రతి భాషలో పాటలు పాడేవారు. ఇందులో అబ్దుల్లా ఖాన్, నబీ షా, రుస్తమ్ అలీ, పిర్జాదా వంటి వారు ముందున్నారు. వీరికి   హిందూ సన్యాసుల మద్దతు కూడా చాలా ఎక్కువ ఉంది. జూలై 1806లో తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు పెద్ద ప్రాంతంలో విస్తరించింది, కానీ బ్రిటిష్ వారిచే అణచివేయబడింది.

అయినా కూడా జనం ఆగలేదు. దీని తరువాత, వివిధ కాలాలలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడానికి విప్లవకారులు  ప్రజలను  సిద్ధపరిచారు. ఇందులో కూడా ప్రజల ప్రేరణ కోసం ఎక్కువగా ఉపయోగించబడిన సంఘటన-కర్బలాలో జరిగిన ఇమామ్ హుస్సేన్ బలిదానం. అది 1838 నాటి దక్కన్ కావచ్చు లేదా 1846 నాటి పాట్నాలో బ్రిటిష్ వ్యతిరేక సంఘటన కావచ్చు. వీటన్నింటిలో దీన్‌ను రక్షించడం గురించి మరియు ఇమామ్ హుస్సేన్ వలె సరైన మార్గంలో నడవడం గురించి విప్లవకారులు మాట్లాడుతున్నారు.

1857లో పీర్ ఫకీర్ మరియు సన్యాసి మరోసారి ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని ప్రస్తావిస్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కంటోన్మెంట్ ప్రాంతంలోని భారతీయ సైనికులను ప్రేరేపించడం ప్రారంభించారు. అదే సమయంలో, చాలా మంది ఆంగ్లేయులు ముహర్రం సమయంలో, పెద్ద సంఖ్యలో ముస్లింలు అకస్మాత్తుగా హింసాత్మకంగా మారతారని భావించారు. ఇది బ్రిటీష్ వారికి చాలా ప్రమాదకరo కావచ్చు.. 1857లో పాట్నా కమీషనర్‌గా ఉన్న విలియం టేలర్ కూడా ఇదే విధమైన ప్రస్తావన తెచ్చాడు. ప్రతి సంవత్సరం ముహర్రం వచ్చినప్పుడు, నగరంలో నివసించే బ్రిటిష్ మరియు క్రిస్టియన్ ప్రజలకు ఇది ప్రమాద గంట. మరియు 1857లో పాట్నాలో తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు, ప్రజలు చేసిన నినాదాలు  మరియు ముందుకు వచ్చిన తీరు పూర్తిగా కర్బలాను గుర్తుకు తెచ్చింది. ఒక వ్యక్తి డఫిల్ వాయిస్తూ ముందుకు కదులుతున్నాడు, కొంతమంది చేతిలో ఆలం లేదా జెండా పట్టుకుని ఉన్నారు. మరియు వారి నినాదం “దిన్ బోలో దిన్, నారా ఇ హైదరీ - యా అలీ, యా అలీ”.

తిరుగుబాటు నాయకుడు పీర్ అలీని అరెస్టు చేసి పాట్నా కమిషనర్ విలియం టేలర్ కార్యాలయానికి తరలించారు. కమీషనర్ విలియం పీర్ అలీతో, 'మీ నాయకులు మరియు సహచరుల పేర్లు చెబితే, మీ జీవితాన్ని కాపాడుకోవచ్చు' అని చెప్పగా, పీర్ అలీ దీనికి ధైర్యంగా సమాధానం ఇస్తూ, జీవితంలో ప్రాణాలను రక్షించాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ జీవితంలో జీవితాన్ని ఇవ్వడానికి అవసరమైన సందర్భాలు ఉన్నాయి మరియు ఇది జీవితాన్ని ఇవ్వడానికి సరి అయిన సమయం.”

ఇమామ్ హుస్సేన్ వారసత్వపు వారసుడు పీర్ అలీ మరణిస్తున్నప్పుడు ఇలా అన్నాడు, "మీరు నన్ను ఉరితీయవచ్చు, కానీ మీరు మా ఆదర్శాన్ని చంపలేరు. నేను చనిపోతాను, కానీ నా రక్తం నుండి లక్షలాది ధైర్యవంతులు పుడతారు మరియు మీ అణచివేతను అంతం చేస్తారు." పాట్నాలోని దాన్‌పూర్ కంటోన్మెంట్ తిరుగుబాటు చేసినప్పుడు కూడా అదే జరిగింది.

1857లో జరిగిన విప్లవంలో ఇమామ్ హుస్సేన్ వలే ప్రజలు తమ ముఖంపై చిరునవ్వుతో మరణాన్ని సవాలు చేస్తూ తలవంచకుండా అమరులయ్యారు.

1857 తరువాత, బ్రిటిష్ వారు భారతదేశంలోని ప్రజలను పెద్ద సంఖ్యలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు బానిసలుగా మరియు కార్మికులుగా పంపడం ప్రారంభించారు. ఫిజీ, బ్రిటీష్ గయానా, డచ్ గయానా, ట్రినిడాడ్, టోబెగా, నాటల్ (దక్షిణాఫ్రికా) మొదలైన దేశాలకు లక్షలాది మందిని  ఒప్పంద కార్మికులుగా పంపారు.. వారిలో ఎక్కువ మంది బ్రిటిష్ వ్యతిరేకులు. కానీ ఈ ప్రజలు తమ మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ, ఇమామ్ హుస్సేన్ బోధనలను మరచిపోలేదు మరియు బ్రిటిష్ వారిపై ధ్వజమెత్తారు. మరియు ప్రతి ఆషూరా అంటే ముహర్రంలో ఇమామ్ హుస్సేన్ యొక్క బలిదానం జ్ఞాపకం చేసుకొనేవారు  మరియు ఈ కార్యక్రమంలో ముస్లింలు మరియు హిందువులు కలిసి పాల్గొనేవారు.

కొన్నిసార్లు వారు  బ్రిటిష్ అణచివేతకు బాధితులు అయ్యారు కూడా. అక్టోబరు 1884లో ట్రినిడాడ్‌లో ఇమామ్ హుస్సేన్ బలిదానం జరుపుకుంటున్న వేలాది మందిపై బ్రిటిష్ వారు కాల్పులు జరిపి అనేక డజన్ల మంది భారతీయులను హతమార్చినారు. ఈ హత్య అక్కడ హొసే होसे ఊచకోతగా పిలువబడుతుంది, హోసే होसे యొక్క అసలు అర్థం ఇమామ్ హుస్సేన్. ఇమామ్ హుస్సేన్ లాగా, ఇక్కడ ప్రజలు కూడా తన మానవ హక్కుల కోసం బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ అమరులయ్యారు.

 ఇమామ్ హుస్సేన్ వంటి అమరవీరుల నుండి ప్రేరణ పొందన సందర్భాలు చాలా ఉన్నాయి. గాంధీజీ నుండి మౌలానా ఆజాద్ వరకు అమర వీరుడు ఇమామ్ హుస్సేన్ని  ఉదాహరణగా తీసుకొన్న చరిత్ర ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటుకు సైనికులకు బహుమతులు ఇస్తున్నప్పుడు, హక్ కోసం జరిగిన పోరాటానికి కర్బలాలో ఇమామ్ హుస్సేన్ బలిదానం గురించి ప్రస్తావించినట్లు తెలుస్తుంది.

బ్రిటీష్ వారు భారతదేశాన్ని ఐదు భాగాలుగా విభజించారు, కానీ నేటికీ భారతదేశంలో చాలా మంది ఇమామ్ హుస్సేన్‌పై విశ్వాసం కలిగి ఉన్నారు, ఇమామ్ హుస్సేన్‌పై కులానికి మరియు మతానికి అతీతంగా భారత  ప్రజలు విశ్వాసం ఉంచుతారు.

No comments:

Post a Comment