12 August 2022

భోపాల్‌లోని గోల్ఘర్-ఒకప్పుడు భోపాల్‌ నవాబుల కార్యాలయం.

 


భోపాల్ ఒక అందమైన మరియు చారిత్రక నగరం.  భోపాల్ నగరం దాని అందం మరియు పురాతన చారిత్రక కట్టడాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పాత భోపాల్ యొక్క చారిత్రక వారసత్వం “గుల్షన్-ఎ-ఆలం' కానీ దాని నిర్మాణం కారణంగా ఇది "గోల్ఘర్  गोलघर " గా ప్రసిద్ధి చెందింది

భోపాల్ యొక్క గోల్ఘర్ గురించి ప్రజలకు అంతగా తెలియదు. భోపాల్ రాచరిక రాజ్యంలో 4నవాబ్ బేగముల పాలన 157సంవత్సరాలు పాటు కొనసాగింది, ఇందులో మూడవ నవాబ్ షాజహాన్ బేగం పాలన అత్యుత్తమంగా పరిగణించబడుతుంది. పాత భోపాల్‌లోని షాజహానాబాద్ ప్రాంతంలో ఉన్న గోల్ఘర్ చారిత్రాత్మక భవనాన్ని భోపాల్ మహిళా పాలకురాలు నవాబ్ షాజహాన్ బేగం 1868 మరియు 1901 మధ్య నిర్మించారు.

షాజహాన్ బేగం, ఇంగ్లీష్ ఇంజనీర్ కుక్ మరియు మున్షీ హుస్సేన్ ఖాన్ (కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్) కి గోల్ఘర్ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు.

జ్యామితి రూపకల్పనకు గోల్ఘర్ ఒక ప్రత్యేక ఉదాహరణ. అందులో ఒక గది మాత్రమే ఉంది, మధ్యలో నిలబడితే  దానికి నాలుగు పక్కల  రాళ్లు 360 డిగ్రీల వద్ద కనిపిస్తాయి.

గోల్ఘర్‌ నిర్మాణం లో జ్యామితీయ వాస్తుశిల్పం ఉపయోగించబడింది, గోల్ఘర్ నిర్మాణ ఇంజనీర్ ఓస్టర్ కుక్ ఇంగ్లండ్‌లోని  వెనెస్సా వాస్తుశిల్పంచే ప్రభావితమై గోల్ఘర్‌ను నిర్మించాడు. ఇందులో జ్యామితి, తలుపులు మరియు కిటికీలు  ప్రధాన లక్షణాలు. గోల్ఘర్‌ నగరంలోని మిగిలిన భవనాల కంటే భిన్నంగా ఉంటుంది.

బయటి నుండి గోల్ఘర్‌లోకి ప్రవేశించడానికి 32 తలుపులు ఉన్నాయి. ఈ చెక్క తలుపులు సరిగ్గా ఒకేలా కనిపిస్తాయి.

గదులు మరియు తలుపుల మధ్య అందమైన వృత్తాకార స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలపై చాపలు వేలాడదీయబడ్డాయి, ఇవి అందమైన చెక్కడాలు మరియు జర్దౌజీ యొక్క పనిని వర్ణిస్తాయి. గాలి లోపలికి వచ్చినప్పుడు చల్లగా ఉండేలా ఈ చాపలపై నీరు, సువాసన చల్లారు.

గోల్ఘర్ గోపురం బయటి నుండి ఎంత అద్భుతంగా ఉంటుంది, లోపలి నుండి చూస్తే అంతే అద్భుతంగా ఉంటుంది.

గోల్ఘర్ లోపలి భాగం అద్భుతమైన పనితనాన్ని కలిగి ఉంది. రంగులు మరియు పూల నమూనాల కలయిక అద్భుతమైన రీతిలో చేయబడింది. మధ్యలో వేలాడదీసిన షాన్డిలియర్ గోల్ఘర్ కోసం ప్రత్యేకంగా ఫ్రాన్స్ నుండి ఆర్డర్ చేయబడింది.

గోల్ఘర్ లోపల, నవాబీ కాలం నాటి భోపాలీ పర్సులు మధ్యలో ఉంచబడ్డాయి, ఇది అప్పట్లో భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందినవి..

గోల్ఘర్ లోపల నవాబు కుటుంబీకులు ఉపయోగించే పాత్రలు, కూజాలు, టిఫిన్ ఉన్నాయి.  టిఫిన్ మరియు జగ్ ఇత్తడితో చేసినప్పటికీ వెండి నీటితో కప్పబడి ఉన్నాయి.

నవాబీ పాలకులు మరియు వారి కుటుంబాల జ్ఞాపకాలు గది లోపల గోడలపై భద్రపరచబడ్డాయి.

ఛాయాచిత్రాలు మరియు పెయింటింగ్‌లు ఆ కాలపు పాలనను వివరిస్తాయి.

గుండ్రని గది లోపల నాలుగు తలుపులు మరియు టెర్రేస్‌కు దారితీసే తలుపులతో కూడిన మెట్లున్నాయి.

గోల్ ఘర్ నిర్మాణం పూర్తయిన తర్వాత, నవాబ్ షాజహాన్ బేగం తన సచివాలయాన్ని (ప్రత్యేక కార్యాలయం) షౌకత్ మహల్ నుండి గోల్ఘర్‌కు మార్చారు. గతంలో ఇది భోపాల్ ప్రభుత్వ ప్రధాన కార్యాలయం.

నవాబీ పాలనలోని అధికారుల పని కోసం గోల్ఘర్ చుట్టూ గదులు నిర్మించబడ్డాయి మరియు ప్రత్యేక 12 మంది అధికారుల నివాసం కోసం, 12 మహల్స్ అని పిలువబడే విలాసవంతమైన గదులు నిర్మించబడ్డాయి.

గోల్ఘర్,  నవాబ్ షాజహాన్ బేగం తరువాత, ఆమె కుమార్తె సుల్తాన్ జహాన్ బేగం కు  కూడా ఇది సెక్రటేరియట్‌గా పనిచేసింది.  ఆ తర్వాత ఆమె వారసులు కూడా దీనిని కార్యాలయంగా ఉపయోగించారు.

కొంతకాలానికి గోల్ఘర్ పక్షులకు నిలయంగా మారింది. వివిధ రకాల పక్షులను తీసుకువచ్చి ఇక్కడ ఉంచారు మరియు ఆహారం మరియు నీరు మొత్తం ఏర్పాట్లు నవాబీ ప్రభుత్వం చేసింది. అందుకే కొందరు ఈ ప్రదేశాన్ని చిదీఖానా चिड़िखाना అని కూడా పిలుస్తారు.

ఒకానొక సమయంలో, నవాబ్ షాజహాన్ బేగం ఇంగ్లాండ్ రాణి, క్వీన్ విక్టోరియాకు ఒక బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు , ఇది ఖచ్చితంగా ప్రత్యేకమైనదిగా ఉండాలి  కానీ ఆమెకు అలాంటిది లభించడం లేదు. ఒకరోజు నవాబ్ షాజహాన్ బేగం తోటలో నడుచుకుంటూ వెళుతుండగా, ఆ సమయంలో బేగం చూపు  నేత పక్షి (వీవర్ బర్డ్) నిర్మించిన  పక్షి గూడుపై పడింది.

లేత పసుపు రంగు కల నేత జాతికి చెందిన చిన్న పక్షి(వీవర్ బర్డ్), చిన్న గడ్డి మరియు గడ్డి ఆకులను నేస్తుంది మరియు లాంతరు లాగా వేలాడే చాలా అందమైన గూడును నిర్మిస్తుంది, అందుకే దీనిని వీవర్ బర్డ్ మరియు ట్రైలర్ బర్డ్ అని కూడా పిలుస్తారు. వాటి గూళ్లను చూసిన షాజహాన్ బేగంకు ఒక ఆలోచన వచ్చింది.అప్పటి నుంచి  గోల్ఘర్‌లో నేత పక్షులను ఉంచడం ప్రారంభించారు  మరియు వాటి ఆహారం మరియు నీటి కోసం పూర్తి ఏర్పాట్లు చేశారు.

నవాబీ పాలనలో బేగంలు ధరించే దుస్తులలో కమ్దాని మరియు కమ్ఖ్వాబ్ कामदानी और कमख्वाब బట్టలు ఉన్నాయి, వీటిలో బంగారు మరియు వెండి తీగలను ఉపయోగించారు.

బేగం ఆదేశానుసారం, ఆ బట్టల ముక్కలు మరియు తీగలను గోల్ఘర్‌లో వేలాడ దిసారు. వాటి  నుండి నేత పక్షులు గుడ్డ నుండి బంగారు మరియు వెండి తీగలను తీసివేసి తమ గూడును ఏర్పరుస్తాయి. బంగారం మరియు వెండి నక్షత్రాలతో చేసిన ఈ గూళ్ళు రాత్రి వెలుగులో చాలా అందంగా ఉండేవి.

ఆ గూళ్ళలో చాలా అందమైనది మరియు ఉత్తమమైనది విక్టోరియా రాణికి బహుమతిగా పంపబడింది.

క్వీన్ విక్టోరియా బహుమతిని ఎంతగానో ఇష్టపడింది, ఆమె దానిని ఇంగ్లాండ్ యొక్క రాజ నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఉంచింది మరియు అది ఈ రోజు వరకు ఉందని చెబుతారు.

గోల్ఘర్‌కు సంబంధించిన మరొక కథనం, ఒకప్పుడు ఇక్కడ ధాన్యాన్ని ఉంచేవారని, రాత్రిపూట పేదలు ఉచితంగా ఆహార ధాన్యాలు తీసుకునేవారని ప్రజలు చెబుతారు.

కొంతకాలం గోల్ఘర్ రైల్వే పోలీస్ హెడ్ క్వార్టర్ మరియు శిక్షణా కేంద్రంగా ఉపయోగించబడింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ పురావస్తు శాఖ దానిని మరమ్మత్తు చేసి మ్యూజియంగా మార్చింది.

గోల్ఘర్ భోపాల్ చరిత్రలో ముఖ్యమైన వారసత్వ కట్టడo.

 

No comments:

Post a Comment