15 August 2022

ప్రసిద్ది చెందిన భారతీయ ముస్లింలు

 


·        ముగ్గురు ముస్లిం లు భారత దేశానికి రాష్ట్ర పతులుగా పని చేసారు-జాకీర్ హుసైన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, APJ అబ్దుల్ కలాం.

·        మొహమ్మద్ హిదయతుల్లా,A.M. అహ్మది, M.H.బేగ్, అల్తమాస్ కబీర్ భారత దేశ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయముర్తులుగా పనిచేసారు.

·        మొహమ్మద్ హిదయతుల్లా సుప్రేం కోర్ట్ చీఫ్ జస్టిస్,ఉపరాష్ట్ర పతి, తాత్కాలిక రాష్ట్ర పతి మూడు పదవులు నిర్వహించిన ఏకైక వ్యక్తి.

·        మొహమ్మద్ హమీద్ అన్సారి ( మాజీ  ఉప రాష్ట్ర పతి ) సల్మాన్ ఖుర్షిద్, MC చాగ్లా,గులాం నబి ఆజాద్,E.అహ్మద్,ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా  సైఫుద్దీన్ సోజ్ ముఫ్తీ మొహమ్మద్ సయీద్,ఘని ఖాన్ చౌదరి, జాఫర్ బేగ్,సికందర్ బక్త్,  సయ్యద్ షానవాజ్, , నజ్మా హెఫ్తుల్ల ఇంకా అనేక ఇతరులు పూర్వపు కేంద్ర మంత్రులుగా పనిచేసినారు. ముక్తార్ అబ్బాస్ నక్వి ప్రస్తుతం కేంద్ర మంత్రి గా పనిచేస్తున్నారు.

 

·        అంతులే మహారాష్ట్ర ముఖ్య మంత్రి గా, అబ్దుల్ గపూర్ బీహార్ ముఖ్య మంత్రి గా పని చేసారు.ఒమర్ అబ్దుల్లా,ఫరూక్ అబ్దుల్లా కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసారు. .

·        సయ్యద్ ఆసిఫ్ ఇబ్రహీం  ఇండియా లో IB చీఫ్  గా పనిచేసిన మొదటి ముస్లిం.

·        డాక్టర్ ఎస్.వై.ఖురేషి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసారు.

·        అబిద్ హుస్సేన్, అలీ యావర్ జుంగ్, అసఫ్ అలీ మొదలగు వారు ఉన్నత  బ్యూరోక్రాట్ లుగా,జాఫర్ సైఫుల్ల కేంద్ర కాబినెట్ సెక్రటరీ గా పనిచేసారు,

·        సల్మాన్ హైదర్ భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసారు.

 

·        సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, దిలీప్ కుమార్, రహమాన్,మధుబాల,వహిదా రెహమాన్, ఇమ్రాన్ హాష్మి, నసీరుద్దీన్ షా, జాని వాకర్, షబానా అజ్మి, అమ్జాద్ ఖాన్, పర్వీన్ బాబి, ఫిరోజ్ ఖాన్, మీనా కుమారి, ప్రేమ నజీర్, మమూతి,నర్గిస్, ఇర్ఫాన్ ఖాన్, ఫరిదా జలాల్, అర్షద్ అరసి, మెహమూద్,జీనత్ అమన్, ఫారూక్ షైక్, టాబు మొదలగు వారు ముఖ్యమైన ముస్లిం చలన చిత్ర నటులు.

·        మెహబూబ్ ఖాన్,K.A. అబ్బాస్,కమల్ అమ్రోహి, అబ్బాస్ మస్తాన్ ప్రముఖ ముస్లిం ఫిలిం డైరెక్టర్లు.

·        M.F. హుస్సేన్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సుప్రసిద్ద భారతీయ చిత్ర కారుడు.

·        రెసుల్ పూకుట్టి,A.R. రహమాన్ ఆస్కార్ అకాడమి అవార్డు పొందారు.

 

·        షకీల్ బదాయుని, సాహిర్ లుధియాన్వి,మజ్రూ సుల్తాన్ పూరి, జావేద్ అక్తర్ సుప్రస్సిధ భారతీయ ముస్లిం హిందీ సిని గేయ రచయితలు.

·        మొహమ్మద్ రఫీ, లక్కీ అలీ, తలత్ మెహమూద్, శంషాద్ బేగం,సురయ్య,బేగం అక్తర్,అను మల్లిక్  ప్రసిద్ద సిని నేపధ్య గాయకులు మరియు గాయని మణులు.

·        ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షహనాయి, జాకీర్ హుస్సేన్ తబలా, దిల్షాద్ అలీ తబలా  ప్రముఖ వాయిద్య కారులు.   

 

·        క్రీడా రంగం లో క్రికెట్ లో పటౌడి,ముస్తాక్ అలీ, అజారుద్ద్దిన్, ఆబ్బాస్ అలీ, అబిద్ అలీ, కిర్మాణి,ఇర్ఫాన్ పఠాన్, వసిం జాఫర్, అర్షద్ ఆయుబ్,కైఫ్, జహిర్ ఖాన్, సానియా మీర్జా టెన్నిస్ ఇంకా అనేక ముస్లింలు  క్రీడా రంగం  లో ప్రముఖులు.

·        ఖ్వాజా అబ్దుల్ హమీద్, ఇతను 1935 లో 'సిప్లా' అనే భారతీయ ఫార్మాసూటికల్ కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ నేటికి 150 దేశాలకు ఫార్మాసూటికల్స్ ను ఎగుమతిచేస్తూ, యావత్-భారతానికీ సేవలందిస్తోంది.

·        సలీం అలీ (విహంగాల అధ్యయన శాస్త్రవేత్త)  ఇతనికి "బర్డ్-మ్యాన్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు.

·        జాకీర్ ఖాన్ ప్రసిద్ద మత ప్రసంగికులు. అస్గర్ అలీ ఇంజనీర్ సుప్రసిద్ధ ముస్లిం విద్యావేత్త.

·        అజీం ప్రేమ్‌జీ 'విప్రో' సంస్థ అధినేత. ఇతనిని భారతప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో  2005లో సత్కరించింది.

·        డా.సాబూ అలియార్, జనాభా గణికుడు మరియు వైద్య పరిశోధకుడు. కెనడానందు తన పరిశోధనలు చేపట్టాడు.

·        ప్రముఖ భారతీయ ఔషధ సంస్థలైన విప్రో,వోకార్డ్,హిమాలయ హెల్త్ కేర్, హందర్ద్ లేబోలేతరిస్,సిప్ల,మీర్జా తానర్స్ ను స్థాపించినది ముస్లింలు.

·        యూసఫ్ హమీద్,అజీం ప్రేమ్జీలను  ఫోర్బ్స్ మాగజైన్ సౌత్ ఆసియ లో బిలియనియర్ లుగా ప్రకటించినది.

·        భారతీయ వాయు దళం లో ఎయిర్ చీఫ్  మార్షల్ గా  ఇద్రిస్ హసన్ లతీఫ్ పనిచేసారు., అబ్దుల్ హమిద్ పరం వీర్  చక్ర (మరణాంతరము) పొందారు. బ్రిగేడియర్ మొహమ్మద్ ఉస్మాన్ మరియు మొహమ్మద్ ఇస్మాయిల్ మహావీర్ చక్ర పొందినారు.

·        మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలం మిస్సైల్ వ్యవస్థను అబివృద్ది చేసినారు మిస్సైల్ మాన్ గా పేరు పొందినారు. Z.A. ఖాసిం నేషనల్ ఇనిస్తిత్యుత్ అఫ్ ఒషోనోగ్రఫి కి డైరెక్టర్ గా పనిచేసినారు మరియు అంటార్తికా యాత్ర లో ప్రముఖ పాత్ర వహించారు.

·        విద్యా రంగం లో అలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, జామియా మిలియా, ఊస్మానియా విశ్వ విద్యాలయం, ముస్లిం లచే స్థాపించబడినవి.

పత్రికారంగంలో,

·        అజీజ్ బర్నీ (సహారా ఉర్దూ), ఎం.జే. అక్బర్, జాహెద్ అలీ ఖాన్ (సియాసత్ ఉర్దూ) హైదరాబాదు, జోయ్ అన్సారీ, ఫరీద్ జకరియా, ఇర్ఫాన్ హుసేన్, హసన్ కమాల్, సాదియా దెహ్లవీ, సయ్యద్ అక్బర్, రఫీక్ జకరియా, సయీద్ నక్వీ, షరీఫ్ అమీరుద్దీన్ ఇస్‌హాకీ, సబా నక్వీఅస్లం ఫర్షోరీ, ఆబిద్ అలీ ఖాన్, మహమూద్ హుసేన్ జిగర్, ఖాలిద్ అన్సారీ (మిడ్-డే, ముంబై) పుత్తూర్ ముహమ్మద్, బుర్హానుద్దీన్ ఒవైసీ మరియు ఎం.ఎ.బాసిత్.

 

ఇంకా అనేక మంది భారతీయ ముస్లింలు వివిధ రంగాలలో భారత దేశానికి విశిష్ట సేవలను అందించినారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment