24 May 2023

ఆరైల్ : సుదీర్ఘమైన చరిత్ర కలిగిన గ్రామం Arail: The village with long trail of history

 

ఆరైల్ ఒక పురాతన గ్రామం మరియు  పరగణా ప్రధాన కార్యాలయం ఉన్న గ్రామం.  ఆరైల్ అలహాబాద్ కోటకు ఎదురుగా, యమునా నదికి కుడి ఒడ్డున గంగా సంగమానికి సమీపంలో ఉంది. రెండు నదులు కలిసే చోట ఉన్న కారణంగా చాలా మంది యాత్రికులు  పండుగ దినాలలో  స్నానం చేయడానికి ఆరైల్ సందర్శిస్తారు.

ఆరైల్ చరిత్ర గురించి ఏమీ తెలియదు కాని సికందర్ లోధీ కాలం లో అరైల్ గురించి మొదటి ప్రస్తావన వచ్చింది.

మధ్యయుగ చరిత్రలో, ఆరైల్ ఒక రకమైన హాలిడే రిసార్ట్ మరియు భాటా (బందాలో) మరియు గహోరా (తరువాత రేవాగా పిలువబడింది) యొక్క బఘేలా రాజుల తీర్థయాత్ర ప్రదేశం అని నివేదించబడింది. బఘేలా రాజులు తరచూ  ఆరైల్ లో నివసించేవారు.

ఆరైల్ మొఘల్ చక్రవర్తి హుమాయున్ జీవితంతో ముడిపడి ఉంది.చౌసా యుద్ధం మొఘల్ చక్రవర్తి హుమాయున్ మరియు ఆఫ్ఘన్ షేర్ షా సూరి మధ్య జరిగిన ఒక ముఖ్యమైన సైనిక సంఘర్షణ.

భారతదేశంలోని ఆధునిక బీహార్‌లోని బక్సర్‌కు నైరుతి దిశలో 10 మైళ్ల దూరంలో ఉన్న చౌసా వద్ద 26 జూన్ 1539న మొఘల్ హుమాయున్ సేనలకు ఆఫ్ఘన్ షేర్ షా సూరి సేనలకు మద్య పోరాటం జరిగింది. హుమాయున్ దౌత్యం ద్వారా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నించాడు, అయితే షేర్ షా యొక్క మోసపూరిత ఎత్తుగడల కారణంగా, దాదాపు హుమాయూన్ సైన్యం మొత్తం రాత్రికి రాత్రి  చంపబడింది మరియు హుమాయున్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి యుద్ధభూమి నుండి తప్పించుకోవలసి వచ్చింది. షేర్ షా విజయం సాధించి తానే ఫరీద్ అల్ దిన్ షేర్ షా Farīd al-Dīn Shēr Shah అనే బిరుదుతో పట్టాభిషేకం చేసుకున్నాడు.

హుమాయున్ చక్రవర్తి గాలితో నిండిన "వాటర్ స్కిన్" ఉపయోగించి గంగానదిని ఈదుతూ ప్రాణాలతో బయటపడ్డాడు మరియు ఆరైల్ చేరుకోగలిగాడు. ఈ సమయంలో, ఆరైల్‌లో ఉన్న గహోరా పాలకుడు రాజా బీర్భన్,  హుమాయున్ చక్రవర్తి ని రక్షించడానికి వచ్చాడు. గహోరా పాలకుడు రాజా బీర్భన్ వెంటాడుతున్న ఆఫ్ఘన్ దళాలను వెనక్కి తరిమివేసాడు. రాజా బీర్భన్, చక్రవర్తి హుమాయున్ మరియు అతని బృందానికి  ఆరైల్‌లో కొన్ని రోజులు బస ఏర్పాటుచేశాడు. అవసరమైన సదుపాయలు చక్రవర్తి హుమాయున్ కు సమకూర్చాడు.

హుమాహున్ గంగా నదిని దాటడంలో రాజా బీర్భన్ సహాయపడి కారాకు తీసుకువెళ్ళాడు. కుటుంబం మరియు అదృష్టాన్ని కోల్పోయిన హుమాయున్ చివరకు జూలై 1539 రెండవ వారంలో ఆగ్రాలోకి ప్రవేశించాడు. హుమాయున్ నామాలో హుమాయున్ తన సామ్రాజ్య రాజధాని ఆగ్రా కి చేరుకోవడంలో ఆరైల్ రాజా బీర్భన్ సహాయం చేసినట్లు ప్రస్తావించబడింది.

కొన్ని సంవత్సరాల తర్వాత హుమాయున్ సింహాసనాన్ని తిరిగి పొందినప్పుడు, చక్రవర్తి హుమాయున్  మొఘల్ కొలువులో ఉన్న దల్పత్‌  (బీర్భన్‌ సోదరి కుమారుడు)  కు భోజ్‌పూర్ ప్రదానం చేసినట్లు ఒక ఫర్మానా జరిచేసాడు. మొఘలులు తమ పూర్వీకుల పట్ల దయ చూపినందుకు బఘేలాలకు కృతజ్ఞతలు తెలుపారు.

ఆపద సమయంలో తన తండ్రి(హుమాయున్)కి అందించిన సహాయం కారణంగా అక్బర్ కూడా బఘేలా రాజు కు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండేవాడు. అక్బర్,  రాజా రామచంద్ర బఘేలాకు ఆరైల్ మరియు పియాగ్ (ప్రయాగ) యొక్క పరగణాను, దాని ఆశ్రిత ప్రాంతాలతో కలిపి, ఆ ప్రదేశాన్ని జలాలాబాద్ పరగణగా పేరు మార్చి  CE 1569లో జాగీర్‌గా ప్రధానం చేసాడు. అక్బర్  ఇక్కడ ఒక పాత కోటను పునరుద్ధరించినట్లు నివేదించబడింది కానీ నేడు ఆ కోట యొక్క ఆనవాళ్లు లేవు.

ఆరైల్‌లో బేణి మాధవ్ మరియు సోమేశ్వర్ నాథ్ అనే రెండు ప్రసిద్ధ పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఔరంగజేబు సోమేశ్వర్ నాథ్ ఆలయానికి రోజైనా rozinah మంజూరు చేసినట్లు పుస్తకాలలో పేర్కొనబడింది.

1674లో తన పర్యటనలో, ఔరంగజేబు సోమేశ్వర్ నాథ్ ఆలయాన్ని సందర్శించాడు మరియు ఆలయానికి భూమి మరియు డబ్బు మంజూరు చేశాడు. సోమేశ్వరనాథ్ ఆలయ పూజారి ఆలయానికి రోజైనా ఒరిజినల్/అసలు ఫర్మానాను కలిగి ఉన్నారు.

నవాబీ కాలంలో ఆరైల్, తిర్హట్ యొక్క సిర్కార్ Sirkar of Tirhut భూభాగంలో చేర్చబడింది.

నేడు ఆరైలులో బేణి మాధవ్ మరియు సోమేశ్వర్ నాథ్ దేవాలయాలు తప్ప దాని ప్రాచీన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు లేవు. ఇది ట్రాన్స్-యమునా అలహాబాద్ యొక్క శాటిలైట్ టౌన్‌షిప్‌గా వేగంగా రూపాంతరం చెందుతోంది.

ఆరైల్‌కు వెళ్లే నైని రహదారి ఈరోజు అత్యంత ప్రసిద్ధ చెందిన అందమైన పర్యాటక ప్రదేశం. 

No comments:

Post a Comment