7 May 2023

"ముస్లింలలో నానాటికీ పెరుగుతున్న డ్రాపౌట్ వెనుక బురఖా, బాల్య వివాహం, ఫార్మల్/అధికారిక విద్య పట్ల నిర్లక్ష్యం"-ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ స్టడీస్ నివేదిక "Burqa, early marriage, disregard for formal education behind ever-rising dropout among Muslims" Report of Institute of Objective Studies

 

పాఠశాలకు వెళ్లే ముస్లిం బాలికల్లో ఎక్కువ డ్రాపౌట్ రేటు ఉంది. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ముస్లిం బాలురు మరియు బాలికలు  ఎక్కువ డ్రాపౌట్ రేటు, ఉన్నత విద్యలో  తక్కువ ప్రవేశo,  తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్నారు మరియు ఇవన్ని ముస్లింలలో తక్కువ  విద్యా పురోగతికి దారితీస్తున్నాయి.

 

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ స్టడీస్ ద్వారా జరిపిన “తులనాత్మక దృక్పథంలో ముస్లిం డ్రాపౌట్ స్థితి” - నివేదికలో ముస్లింల డ్రాపౌట్ రేటుపై దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

భారత దేశం లో ముస్లింలలో పాఠశాల నమోదు రేటు తగ్గుతోందని, అలాగే డ్రాపౌట్ రేటు మరింత పెరుగుతోందని పేర్కొంది.

·       పశ్చిమ బెంగాల్‌లో, ముస్లింలు జనాభాలో 27 శాతం ఉండగా, అకడ ముస్లిం సమాజంలో డ్రాపౌట్ రేటు 27.2 శాతంగా ఉంది. దీనికి విరుద్ధంగా, హిందువుల డ్రాపౌట్ 22.0గా ఉంది.

·       బీహార్‌లో ముస్లింల డ్రాపౌట్ రేటు 13.9 శాతంగా ఉంది.

నివేదిక ప్రకారం, ముస్లింల ఆదాయం పెరిగినప్పటికీ, వారు విద్యపై దృష్టి పెట్టలేకపోతున్నారు.

·       ముస్లిం డ్రాపౌట్ రేటు జాతీయ సగటు 18.96 శాతంతో పోలిస్తే 23.1 శాతం.

·       బెంగాల్, లక్షద్వీప్, అస్సాం వంటి రాష్ట్రాల్లో డ్రాపౌట్స్ శాతం ఎక్కువగా ఉంది.. ముస్లింలు ఫార్మల్/అధికారిక విద్య పట్ల తక్కువ మొగ్గు చూపుతున్నారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం, తల్లిదండ్రులు తమ పిల్లలను 6-14 ఏళ్లలోపు పిల్లలను తప్పనిసరిగా పంపించాలి. అయినప్పటికీ, ముస్లింలు తరచుగా పిల్లలను 15 సంవత్సరాల వయస్సులో పిల్లలను డ్రాప్-అవుట్ చేయించి  పనిలోకి పంపుతారు.

ముస్లింలు మెజారిటీగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి బాగా లేదు.

·       J&Kలో డ్రాపౌట్ రేటు (శాతం) LPre-ప్రైమరీ)లో  హిందూ 0, ముస్లిం 0.7; (ప్రాథమిక/ప్రైమరీ ) హిందూ 6.5, ముస్లిం 5.5;

·       (మిడిల్/మధ్యతరగతి మరియు పై తరగతి) హిందూ 6 ముస్లిం 12.8; (ద్వితీయ

·       సెకండరీ  తరగతులు) హిందూ 17.3, ముస్లింలు 25.8.

·       మరియు హయ్యర్ సెకండరీ తరగతిలో, హిందువుల డ్రాపౌట్ రేటు 15, మరియు ముస్లింలు 15.4 (శాతం).

2011 జనాభా లెక్కల ప్రకారం, అస్సాంలో ముస్లింలు జనాభాలో 34.22 శాతం ఉన్నారు. ఇక్కడ కూడా ముస్లింల డ్రాపౌట్ రేటు ఆందోళన కలిగిస్తోంది.

·       ప్రీ మరియు ప్రైమరీ తరగతిలో హిందువులు 6, ముస్లింలు 5.9 మరియు క్రిస్టియన్లు 28.8,

·       ప్రైమరీలో హిందువులు 15.0, ముస్లింలు 12.5 మరియు క్రిస్టియన్లు 26.4,

·       మధ్య మరియు ఉన్నత తరగతిలో హిందూ 28.0, ముస్లింలు 26.0 మరియు క్రిస్టియన్లు 30.0,

·       సెకండరీ తరగతిలో హిందూ 25.8, ముస్లింలు 30.2, క్రిస్టియన్లు 32.0

·       హయ్యర్ సెకండరీ తరగతిలో హిందువులు 13.9, ముస్లింలు 19.6, క్రైస్తవులు 19.2 ఉన్నారు.

·       అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో హిందువులు 11.5, ముస్లింలు 9.6, క్రైస్తవులు 0.0 ఉన్నారు.

·       ముస్లింలు జనాభాలో 27 శాతం ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల డ్రాపౌట్ శాతం 27.2 కాగా, హిందువులది 22.0.

·       జార్ఖండ్, కర్నాటక, గుజరాత్, కేరళ, తెలంగాణ మరియు ఢిల్లీలలో పాఠశాలల్లో ముస్లింలలో డ్రాపౌట్ రేటు ఎక్కువగా ఉంది.

·       ముస్లింలలో ఈ ధోరణికి ఆర్థిక పరిమితులు కూడా కారణము.

అధ్యయనం ప్రకారం,

·       కుటుంబ ఆదాయం రూ. 1231-1700 ఉన్న 23.0 శాతం ముస్లిం పిల్లలు మరియు 18.7 శాతం హిందువులు పాఠశాల డ్రాపవుట్‌లు అవుతున్నారు.

·       అధిక ఆదాయ బ్రాకెట్‌లో పాఠశాల డ్రాపవుట్‌ కొద్దిగా తక్కువగా ఉంది.

అలాగే, నిఖాబ్ మరియు బాలికలకు ముందస్తు వివాహాలు చేయడం ముస్లిం బాలికలలో అధిక డ్రాపౌట్‌కు దోహదం చేస్తుంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్‌ను ఉపసంహరించుకుంటే మరియు కర్నాటకలోని పాఠశాలలు మరియు కళాశాలల్లో మహిళలు బురఖా, నిఖాబ్ ధరించడాన్ని నిషేధిస్తే, బాలికలలో డ్రాపౌట్ పెరిగే అవకాశం ఉంది.

·       అస్సాంలో మదర్సాలు మూతపడటంతో అక్కడ డ్రాపౌట్‌లు చాలా ఎక్కువయ్యాయి.

·       పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల శాతం 27 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో అత్యధికంగా ముస్లింలలో డ్రాపౌట్‌లు కనిపిస్తున్నాయి.

·       యూపీలో డ్రాపౌట్ తక్కువగా ఉంది, దానికి కారణం మదర్సాలే, అక్కడ అమ్మాయిలకు కూడా విద్యనందిస్తున్నారు

ముస్లింలలో నాయకత్వ లోపమే పాఠశాలల్లో డ్రాపౌట్‌కు ప్రధాన కారణము..

భారతదేశంలో ముస్లిం నాయకత్వం బలహీనంగా ఉందని, విద్య గురించి మాట్లాడే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. భారతదేశంలోని ముస్లింలను విద్యతో అనుసంధానించే నాయకుడు లేడు. విధాన రూపకల్పనలో పాత్ర పోషించగల ముస్లిం నాయకులు ఎవరూ లేరు, ”అని నివేదిక పేర్కొంది.

·       భారతదేశంలో 14.23 శాతం మంది ముస్లింలు చాలా పేదలు. ముస్లింలు ఇతర వర్గాల మాదిరిగానే సంపాదిస్తున్నారు, కానీ వారి పిల్లల చదువుకు తక్కువ ఖర్చు చేస్తున్నారు..

·       మరోవైపు, దేశంలో క్రైస్తవ జనాభా చాలా తక్కువగా ఉంది కాని వారి దృష్టి మొత్తం విద్యపైనే ఉంది. క్రైస్తవ సమాజంలో అత్యధికంగా చదువుకున్న పిల్లలు ఉన్నారు. ముస్లింలు కూడా క్రైస్తవులు లాగా  విద్యపై దృష్టి సారించి పెట్టుబడులు పెట్టాలి.


ముగింపు:

స్వాతంత్య్రానికి ముందు విద్యలో ఎస్సీ, ఎస్టీలు ముస్లింల కంటే చాలా దిగువన ఉండేవారు. అయితే నేడు ముస్లింలు వారికంటే చాలా వెనుకబడి ఉన్నారు. ముస్లిం సంస్థలు వివిధ ప్రాంతాల్లో విద్యపై ప్రజలకు అవగాహన కల్పించాలి. మదర్సాలు ఉన్న చోట ఆధునిక విద్య కూడా ప్రవేశపెట్టాలి.

No comments:

Post a Comment