7 May 2023

అస్సాంలోని ముస్లిం బాలికలకు విద్యను అందించి, వారికి సాధికారత కల్పిస్తున్న మౌలానా మహమ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ Maulana Mohammed Badruddin Ajmal who educates and empowers Muslim girls of Assam

 

బద్రుద్దీన్ అజ్మల్ అని పిలవబడే మౌలానా మహ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ అస్సాం నుండి ఎన్నికైన లోక్ సభ సభ్యుడు మరియు ముస్లిం-కేంద్రీకృత రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF)కి నాయకత్వం వహిస్తున్నారు. బద్రుద్దీన్ అజ్మల్ అస్సాం అంతటా ముస్లిం మహిళల కోసం అనేక ఆధునిక విద్యాసంస్థలను ఏర్పాటు చేశాడు.

అజ్మల్ అభిప్రాయం ప్రకారం ఖురాన్ మరియు ప్రవక్త మహ్మద్() ప్రకారం, లింగ భేదం లేకుండా ముస్లింలందరికీ విద్య జ్ఞానం తప్పనిసరి. మహిళలను పాఠశాలలు, కళాశాలలకు వెళ్లనివ్వకపోతే పవిత్ర ఖురాన్ను అగౌరవపరచడమే అవుతుంది.

స్త్రీ విద్య పట్ల బద్రుద్దీన్ అజ్మల్ అతని శ్రద్ధ ప్రశంసనీయం. బద్రుద్దీన్ అజ్మల్ ఉత్తర ప్రదేశ్లోని దేవ్బంద్లోని ప్రసిద్ధ దారుల్ ఉలూమ్లో చదువుకున్నారు మరియు  అరబిక్లో M.A.కి సమానమైన ఫాజిలాత్ డిగ్రీని పొందారు.

  “భారతదేశంలో ముస్లిం బాలికలు ఉన్నత విద్య పరిస్థితి ఈశాన్య భారతదేశంలో దారుణంగా ఉంది. అజ్మల్ ఫౌండేషన్ ద్వారా  2006 సంవత్సరంలో బద్రుద్దీన్ అజ్మల్ మొట్టమొదటిసారిగా  బాలికలకు సైన్స్విద్యను  HS (+2 స్థాయి) అందజేసే మరియమ్ అజ్మల్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్థాపించినాడు. తరువాత, అజ్మల్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 2012 సంవత్సరంలో డిగ్రీ స్థాయికి అప్గ్రేడ్ చేయబడింది.

ఆరు సంవత్సరాల తరువాత, అజ్మల్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల అప్గ్రేడ్ చేయబడింది మరియు నేడు ఇది BA మరియు B.Sc రెండింటిలో ఇంగ్లీష్, అస్సామీ, ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ వంటి సబ్జెక్టులలో కోర్సులను అందిస్తుంది. అజ్మల్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల దిబ్రూగర్ విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉంది.

మరియమ్ అజ్మల్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల అనూహ్యంగా అభివృద్ధి చెందింది మరియు రోజువారీ బోర్డింగ్ మరియు హాస్టల్ రెండింటికీ సంబంధించిన అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి.

మరియమ్ అజ్మల్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల లో ప్రస్తుతం  1500 కంటే ఎక్కువ విద్యార్దినిలు ఉన్నారు మరియు ఇప్పటి వరకు 5000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు తమ HS మరియు డిగ్రీ (BA & B.Sc.) ఉత్తీర్ణులయ్యారు. మరియమ్ అజ్మల్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. దాని పూర్వ విద్యార్థులలో  అనేక మంది వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు మొదలైనవారు ఉన్నారు.

మరియమ్ అజ్మల్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల చాలా మంది పూర్వ విద్యార్థులు ఢిల్లీ విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం, తేజ్పూర్ విశ్వవిద్యాలయం, గౌహతి విశ్వవిద్యాలయం, దిబ్రూఘర్ విశ్వవిద్యాలయం, అస్సాం విశ్వవిద్యాలయం, నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయం మొదలైన ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం మంచి సంఖ్యలో విద్యార్థులు నీట్ మరియు జెఇఇకి అర్హత సాధింఛి  వైద్య మరియు ఇంజనీరింగ్ కోర్సులను జాతీయ ఖ్యాతి గల ఇన్స్టిట్యూట్లలో అభ్యసిస్తున్నారు.

మరియమ్ అజ్మల్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల లాగా  గౌరీపూర్, ఖరుపేటియా మరియు హోజాయ్ వంటి వివిధ ప్రాంతాల్లో బాలికల విద్య కోసం ప్రత్యేకంగా అనేక ఇతర విద్యా సంస్థలు బద్రుద్దీన్ అజ్మల్ చే స్థాపించబడ్డాయి.

మరియం అజ్మల్ సీనియర్ సెకండరీ స్కూల్, ఖరుపేటియా, ఇప్పటివరకు అద్భుతమైన ఫలితాలను అందించింది. పాఠశాలలో ప్రస్తుతం 255 మంది బాలికలు చదువుతుండగా, ఇంతవరకు 771 మంది ఉత్తీర్ణులయ్యారు. పాఠశాలల పూర్వ విద్యార్థులు అస్సాం ప్రభుత్వంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉన్నారు.

ధుబ్రి జిల్లాలోని గౌరీపూర్లోని మరియమ్ అజ్మల్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రస్తుతం 200 మంది విద్యార్థులతో బాలికల విద్యపై దృష్టి సారించే మరొక కేంద్రం. ఇప్పటివరకు 500 కంటే ఎక్కువ మంది విద్యార్థులు హెచ్ఎస్ ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు మరియు ఈ స్కూల్ పూర్వ విద్యార్ధులలో ఎక్కువ మంది ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్నారు.

మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ ఆశయం మరియమ్ అజ్మల్ మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి మరియు ఉత్తమంగా పనిచేసే మహిళా నాయకులను తయారు చేయడం బద్రుద్దీన్ అజ్మల్ ఆశయం

No comments:

Post a Comment