2 May 2023

వరల్డ్ ఆస్తమా డే: ఏటా మే మొదటి మంగళవారం 'ప్రపంచ ఆస్తమా దినం' ఉబ్బసం ఎందుకు వస్తుంది? నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

 

ఆస్తమా రోగులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23.5 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వారిలో ఒక్క భారత్‌లోనే 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది ఉన్నట్టు అంచనా.

బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.

భారత్‌లో 11 ఏళ్ల లోపు చిన్నారుల్లో నూటికి 5 నుంచి 15 మంది ఆస్తమా బారిన పడుతున్నారు. 

ఆస్తమా అంటే ఏమిటి?

దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి.

మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి.

దాంతో గాలి ప్రవాహానికి ఆటంకంగా మారుతుంది. గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది.

ఈ రుగ్మత ఏ వయసు వారికైనా వస్తుంది. అయితే, చిన్నపిల్లలు, యుక్త వయసు వారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది.

భారత్‌లో 5 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లల్లో 5 శాతం నుంచి 15 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

కేరొలిన్ దీవుల్లో యాభై శాతం మందికి పైగా చిన్నారులు ఆస్తమా బాధితులే.

బ్రెజిల్, కోస్టా రికా, పనామా, పెరూ, ఉరుగ్వే దేశాల్లో 20 శాతం నుంచి 30 శాతం, కెన్యాలో 20 శాతం మంది చిన్నారులు బాధితులే.

ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు ప్రతి ఆరుగురు పిల్లల్లో ఒకరు ఆస్తమాతో బారిన పడుతున్నారు.

ఆస్తమా బాధితులు శారీరక వ్యాయామం చేయొద్దని కొందరు చెబుతుంటారు. కానీ, వైద్యుల సలహాతో వ్యాయామం చేయొచ్చు

ఆస్తమా ఎందుకు వస్తుంది?

వాయుగొట్టాలు ఉబ్బడం వల్ల ఆస్తమా వస్తుంది. అయితే ఆ గొట్టాల్లో వాపు రావడానికి కారణమేంటన్న విషయం మాత్రం శాస్త్రవేత్తలకు కూడా స్పష్టంగా తెలియదు.

కానీ ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులతో పాటు వంశపారంపర్యమైన విషయాలు కూడా ఆస్తమా రావడానికి కారణమని భావిస్తున్నారు.

చర్మ వ్యాధులు ఉన్న చిన్నారులకు ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ.

తల్లిదండ్రులు ఆస్తమా బాధితులు అయితే పిల్లలకు కూడా అది వచ్చే అవకాశం ఉంది.

ధూమపానం, మద్యపానం, వాయు కాలుష్యం, రసాయనాల వాసన పీల్చడం వల్ల కూడా ఆస్థమా వస్తుంది.

తల్లికి పొగతాగే అలవాటు ఉన్నా దాని ప్రభావం కడుపులో బిడ్డపై పడి, అది ఆస్తమాకు దారి తీసే అవకాశముంది.

దుమ్ము, ధూళి, జంతువుల వెంట్రుకలు, బొద్దింకలు, పువ్వులలోని పుప్పొడి రేణువులు, గడ్డి పోచలు, బూజు వంటివి అలర్జీకి కారణమవుతాయి. అది ఆస్తమాకు దారి తీస్తుంది.

జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా రావచ్చు.

జర్మనీలో 40 లక్షల మంది(చిన్నా పెద్ద కలిపి), జపాన్‌లో 30 లక్షల మంది దాకా ఈ రుగ్మతతో బాధపడుతున్నారు

ఏం మందులు వాడాలి?

·         విటమిన్ డీ ఉండే పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆస్తమా తీవ్రతను తగ్గించుకోవచ్చు.

·         రిలీవర్లు: ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు తక్షణం ఉపశమనం పొందేందుకు రిలీవర్ మందులు వాడాలి. ఇవి వాయునాళం కండరాలను వదులు అయ్యేలా చేస్తాయి. ఈ మందులను వేసుకునేందుకు ఇన్‌హేలర్ పరికరాన్ని వెంటే ఉంచుకోవాలి.

·         ప్రివెంటర్లు: వాయునాళాల కండరాల వాపును తగ్గించి, శ్వాసకు ఇబ్బంది లేకుండా చేస్తాయి

·         ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు స్టెరాయిడ్లు వాడాల్సి రావచ్చు. అయితే వాటిని వైద్యుల సలహా మేరకు మాత్రమే

 

No comments:

Post a Comment