25 April 2013

సమాచార హక్కు చట్టం-వికాస క్రమము లేదా పారదర్శకత పూర్వాపరాలు


“The Origins of Openness”


దాదాపు 250 సం. లకు పూర్వము అనగా, 1766 లో స్వీడెన్ దేశము సమాచార స్వేచా  చట్టం (Freedom of Information Act)ను రూపొందించేను.ఇది ప్రపంచెంలో మొట్ట  మొదటి సమాచార చట్టం. దీని రూపకల్పనలో ఫినిష్ తత్వవేత్త అందెర్స్ చెదినియస్ (Anderas Chydenius) ప్రముఖ పాత్ర వహించేను. ఈ చట్టం రాజకీయ సెన్సారును రూపుమాపి, ప్రభుత్వ పత్రాలను సామాన్య ప్రజలకు అందుబాటులోనికితెచ్చేను.
         
18వ శతాబ్దపు స్వీడన్-ఫిన్లెండ్ రాజనీతివేత్తలలో చెదినియూస్ ప్రముకుడు. ఇతని ఉద్దేశంలో ప్రజాస్వాయo.సమానత్వం, మానవ హక్కుల పట్ల గౌరవము, పౌర సమాజ అబివృద్ధి, సంతోషమునకు తోడ్పడును. ఇతని ప్రకారము అర్థశాస్త్రము సామాన్య ప్రజల ఉపకారమునకు  ఉద్దేశించ బడినది. The National Gain అనే అతని వ్యాసము చాల ప్రసిద్ది గాంచినది . అతను సాదించిన గొప్పవిజయాలలో పత్రికా స్వా తంత్ర సాదన  ప్రదానమైనది.
         
180 సం. ల తరువాత 1946  లో జరిగిన ఐ.రా.సమితి మొదటి సమావేశం లో ఆమోదింపబడిన 59(1) తీర్మానము “సమాచార స్వేచ్చఅనేది ఒక  ప్రాదమిక హక్కు మరియు ఐ.రా.సమితికి సంబందించిన అన్నీ స్వేచ్చలకు మూలము” అని స్పస్టము చేసినది.
        
  సమాచార స్వా తంత్రము మరియు పత్రికా  స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రములో భాగమని, అవి ప్రాధమిక మానవ హక్కులలో భాగమని 1948 లో ఆమోదింపబడిన ప్రపంచ మానవ హక్కుల ప్రకటన లోని 19 వ నిబంధన తెలుపుతుంది. ప్రభుత్వ అదికార వ్యవస్థ నుంచి సమాచారాన్ని అడగటం,గ్రహించడం, , అందుబాటులోనికి పొందటం భావ ప్రకటన స్వాతంత్రంలో భాగముగా గుర్తించ వచ్చు.
          
1966 ‘International Covenant on Civil and Political Rights’ ోని 19(2) నిబంధన ప్రకారం భావ ప్రకటన స్వాతంత్రం అనగా ఎటువంటి ఆటంకాలు లేకుండా, మౌఖికంగా లేదా రాతపూర్వకంగా తనకు ఇష్టమైన పద్దతిలో అన్నీ రకాల సమాచారాన్ని అడగటం,పొందటం మరియు దాన్ని అందుబాటులోనికి తెచ్చుకోవటం  అని చెప్పవచ్చును. ప్రభుత్వ పాలనలో పారదర్శకత సాదించుటకు,అవినీతి నిర్మూలనకు గాను తమ జాతీయ చట్టాలలో అవసరమైన మౌలిక మార్పులు చేయుటకు అన్నీ సభ్య దేశాలకు ఆదికారము కలదని 2005 అవినీతి వ్యతిరేక  ఐ.రా.సమితి కన్వెక్షన్ లోని 10 వ నిబంధన తెలియచేయుచున్నది.అప్పటినుంచి ఏ.రా.సమితి లోని జనరల్ అసెంబ్లి సమాచార స్వేచ్చ ను ప్రాదమిక హక్కు గా గుర్తించినది మరియు అనేక దేశాలు సమాచార హక్కుకు సంబందించిన చట్టాలను రూపొందించ సాగినాయి.
           
1966 లో అమెరికా సమాచార స్వేచ్చకు సంబందించిన చట్టాన్నిరూపొందించినది.ఈ చట్టము రూపొందించబడతానికి అమెరికా వార్తాపత్రికల సంపాదకులు మరియు  కాంగ్రెస్ లోని డెమోక్రెటిక్ పార్టీ కు చెందిన జాన్ మాస్ ప్రముఖ  పాత్ర వహించేను.. హరోల్డ్ క్రాస్ రచించిన “The Peoples’ Right to Know” అనే గ్రందము సమాచార స్వాతంత్ర ఉద్యమానికి బైబిల్ గా పరిగణించ వచ్చు.
         
ఇప్పటివరకు 80 కు పైగా దేశాలు సమాచార స్వాతంత్ర చట్టాలను రూపొందించినాయి. 1990 లో సమాచార స్వాతంత్ర చట్టాలను రూపొందించిన దేశాలు 12 ఉండగా గత 2 దశాబ్దాలలో వాటి సంఖ్య 90 కు పైగా పెరిగినది. విబిన్న దేశాలలో స్వాతంత్ర సమాచార చట్టాల పరిణామ క్రమము.
·       స్వీడన్ 1766
·       కొలంబియా 1888
·       ఫిన్లెండ్ 1951   
·       అమెరికా  1966                                        
·       ఫ్రాన్స్ 1978
·       ఆస్ట్రేలియా న్యూజిలాండ్ 1982
·       కెనడా 1983
         
అనేకుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రము లబించినది.మన రాజ్యాంగ నిర్మాతలు భావప్రకటన మరియు వాక్ స్వాతంత్రములను ప్రాధమిక హక్కులలో చేర్చిరి. అనేక సందర్భాలలో సుప్రీం కోర్ట్ సమాచార స్వాతంత్రంను రాజ్యాంగం లోని 19 వ నిబంధనలో భాగంగా పేర్కొంది.సమాచార స్వాతంత్రం లేని భావప్రకటన స్వాతంత్రం అర్థరహితం. రాజ్యాంగం లోని 19వ నిబంధన భావప్రకటన మరియు వాక్ స్వేచ్చను కల్పించును.
         
తన అనేక తీర్పులలో సుప్రీం కోర్ట్ సమాచార స్వాతంత్రంను రాజ్యాంఘంలోని 19 వ నిబంధనలో భాగంగా గుర్తించినది.
       
Bennette Coleman v. Union of India, 1973. వివాదంలో సుప్రీం కోర్ట్ రాజ్యాంగంలోని  19వ నిబందనలోని భావప్రకటన మరియు వాక్  స్వాతంత్రం లో భాగంగా సమాచార హక్కు ను గుర్తించినది
        State of UP v. Raj Narain,  1975 వివాదంలో జస్టిస్ మ్యాత్యూ తీర్పునిస్తూ సాదారణ ప్రభుత్వ కార్యకలాపాలను రహస్యంగా ఉంచటం ప్రజా ప్రయోజనాల దృస్ట్యా మంచిది కాదని మరియు అదికారులు తమ చర్యలను వివరించి వాటిని సమర్ధించుకోవటం ద్వారా  అవినీతి మరియు దికార దుర్వినియోగాన్ని అరికట్టవచ్చును అని పేర్కొనేను.
      
  ఎలెక్త్రోనిక్ మీడియా నుంచి సమాచారమును పొందుట మరియు సేకరించుట వాక్ స్వాతంత్రంలో భాగమని సుప్రీం కోర్ట్ 1995 Secretary, Ministry of I & B, Government of India v Cricket Association of Bengal,వివాదంలో  తీర్పును ఇచ్చేను.
·      
ప్రబుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకొనుటకు మరియు ప్రతి ప్రభుత్వ కార్యకలాపo గురించిన  వివరాలను పొందు హక్కు ప్రజలకు కలదని S.  P. Gupta v. Union of India, 1982, కేసులో వివరించడమైనది.
·       
People’s Union for Civil Liberties v. Union of India, 2004 వివాదంలో సమాచార హక్కు స్తాయిని,మానవ హక్కుల స్తాయి కి పెంచబడినది తద్వారా పరిపాలనలో పారదర్శకత,జవాబుదారీతనము సాదించబడినవి..
         
రాజస్తాన్ లోని వెనుకబడిన ప్రాంతం ఐనా భీమ్ తహసిల్ లో ఎం‌కే‌ఎస్‌ఎస్ అనే స్వచ్చంద సేవాసంస్థ సమాచార హక్కును ఉపయోగించి హాజరు పట్టీలో చూపబడిన వ్యక్తుల బిల్లులు,వోచరులకు సంబందించిన వివరాలు అడిగి.వాటివివరాలను పొందటంలో సఫలం పొందినది. ప్రజావిచారణల పేర అనేక కార్యక్రమాలు నిర్వహించినది. రాజస్తాన్ విద్యుచ్చక్తి బోర్డు కు సంబంధించిన ఇంజ నీర్  నుండి లంచంగా తీసుకొన్న 1500/- రూపాయలు పేదరైతుకు తిరిగి ఇప్పించినది.
         
రాజస్తాన్ అనుభవం అనేక రాష్ట్రలలో ప్రతిద్వనించినది. మాగ్నసే అవార్డ్ గ్రహీత,సామాజికవేత్త, ఎం‌కే‌ఎస్‌ఎస్ సంస్త నిర్మాత,అరుణ రాయ్ జాతీయ నినాదం ఐనా ఒక సన్నివేశాన్ని ఈ క్రిందివిదంగా వివరించారు.”డిల్లిలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఒక స్నేహితుడు రాజస్తాన్ కు చెందిన ఒక మహిళ సుశీల ను సమాచార హక్కు చట్టం గుంరించి ప్రశ్నించటం జరిగింది. దానికి ఆమె నా కుమారుడిని బజారుకు 10 రూపాయలు ఇచ్చి పంపిన వాటి వివరాలు అడుగుతాను. అలాగే ప్రభుత్వం లక్షల రూపాయలను పేదవారికోసం ఖర్చు పెడుతుంది. కాబట్టి నా డబ్బు- నా లేక్కలు  అన్నది.
         
24-5-1997 న భారత ప్రధాని తో జరిగిన అన్నీ రాష్ట్రల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రభావాత్మక మరియు జవాబుదారీ ప్రభుత్వం (Effective and Responsive Govt) అనే అంశంపై చర్చ జరిగి ఒక యాక్షన్ ప్లాన్ తయారుచేయుటకు నిర్ణయించడo జరిగినది.1.జవాబుదారీతనం మరియు పౌరస్నేహ ప్రభుత్వం,2.పారదర్శకత మరియు సమాచార చట్టం, 3.ప్రభుత్వ సేవల వినియోగం లో మెరుగుదల మరియు సంఘటితత్వం అనే మూడు అంశాలు ఈ యాక్షన్ ప్లాన్ లో ఉన్నాయి.
          
1977 జనవరి లో కేంద్ర ప్రబుత్వము సమాచార హక్కు మరియు పారదర్శక ప్రభుత్వ విధానం పై ఒక వర్కింగ్ గ్రూపు ను నియమించినది. హెచ్.డి.శౌరి నాయకత్వం లోని వర్కింగ్  గ్రూపు సవివరణాత్మక మరియు సంక్షిప్త నివేదికను మరియు సమాచార స్వాతంత్రంపై డ్రాఫ్ట్ బిల్లును సమర్పించినది.
         
ఫిబ్రవరి 2000 లో  పి‌సి‌ఐ,పి‌ఐ‌ఐ,ఎన్‌సి‌పి‌ఆర్‌ఐ, ఎఫ్‌ఆర్‌టి‌ఐ, మొదలగు సంస్తలు పైన వివరించిన డ్రాఫ్ట్ బిల్లులో మార్పులు కోరుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని చేసినాయి.
          
ఈ లోపల తమిళనాడు, గోవా రాష్ట్రాలు 1997 లో సమాచార హక్కు చట్టాలు రూపొందించినాయి.ఈ క్రింద వివరించిన ఇతర రాష్ట్రలు కూడా సమాచార హక్కు చట్టాలను రూపొందించినాయి.
రాజస్తాన్,కర్నాటక 2000
డిల్లీ 2001     
మహారాష్ట్ర , అస్సామ్ 2002
మద్య ప్రదేశ్ 2003
జమ్మూకాశ్మీర్ 2004

సమాచార స్వాతంత్ర బిల్లు 2000 ను లోక్ సభ లో 25-07-2000 న కేంద్ర ప్రభుత్వాo ప్రవేశపెట్టినది.
అడిగిన సమాచారము అంతటినీ అందించవలసిన బాద్యత ప్రభుత్వాదికారి వర్గం పై ఉందని ఈ బిల్లు  స్పష్టం చేసినది. ఈ బిల్లు సమాచార స్వాతంత్ర చట్టం 2002 రూపేణా పార్లమెంట్ ఆమోదించినది కానీ ఈ బిల్లు ఆదికార గజీట్ లో ఐ తేదీ నుండి అమలులోనికి రావాలో స్పష్టం చేయనందువలన అది అమలులోనికి రాలేదు.
           
2004 లో అదికారం లోనికి వచ్చిన యూ‌పి‌ఏ-2 ప్రభుత్వం నియమించిన జాతీయ సలహా మండలి  సమాచార స్వతంత్ర హక్కు చట్టంలో ముఖ్యమైన మార్పులు సూచించినది. ఆ సూచనలను పరిశీలించిన ప్రబుత్వo స.స్వా.చట్టాన్ని మరింత అర్థవంతమైన, పురోగ, భాగస్వామ్య చట్టంగా చేయదలచుకొంది.
        
  తరువాత యూ‌పి‌ఏ-2 ప్రభుత్వo సమాచార స్వాతంత్ర చట్టం స్తానంలో కొత్త చట్టాన్ని అనగా సమాచార హక్కు చట్టం 2005 ను రూపొందించినది.ఈ చట్టం రాజ్యాంగం లోని 19 (1) (A)నిబంధనలో భాగంగా సమాచార హక్కు ను గుర్తించినది.స్వాతంత్రం వచ్చిన 56 సo.ల తరువాత పార్లమెంట్ ప్రజల సమాచార హక్కు లో భాగంగా 2005 సమాచార హక్కు చట్టాన్నిరూపొందించినది
         

ఈ చట్టం జమ్ము కాశ్మీర్ మినహఇoచి పూర్తి భారత దేశానికి వర్తించును.జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం తన సొంత జమ్మూకాశ్మీర్ సమాచార హక్కు చట్టం 2009 ని రూపొందించుకొనేను.అది 20-03-2009 నుండి (అమలులో ఉన్న పాత జమ్ము కాశ్మీర్ సమాచార చట్టం 2004 స్తానమ్ లో) అమలులోనికి వచ్చెను.
తెలుసుకొనే హక్కు - అంతర్జాతీయ దినోత్సవము
         
ప్రతి సం. సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచవ్యాప్తoగా  ప్రజలు తెలుసుకొనే హక్కు- అంతర్జాతీయ దినోత్సవాన్ని(Right to Know- International Day) జరుపుకొంటున్నారు.పారదర్శక  ప్రబుత్వ ఆశయాన్ని ఈ రోజు గుర్తించి ప్రచారము చేస్తున్నారు. పాలనలో పారదర్శకతను పెంచే గ్రూపు కార్యకర్తలు,12 దేశాలకు చెందిన ప్రబుత్వకార్యక్రమాలలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించినారు.వారు 2002 సెప్టెంబర్ లో బల్గేరియా రాజధాని సోఫియాలో “Freedom of Information Advocates Network.” అనే సంకీర్ణాన్ని ప్రారంబించిరి. సమాచార హక్కు కు సంబందించిన ప్రపంచ వ్యాప్త ఉద్యమాన్ని స్మరించుకోవటానికి ఈ ఉత్సవాన్ని జరప సాగారు.

·       CGG చే రూపొందించబడిన The Origins of Openness కు స్వేచానువాదం.









No comments:

Post a Comment