22 June 2016

నాదర్ షా 1698-1747

నాదర్ సః అఫ్సర్ (Nāder Šāh Afšār) లేదా నాదిర్ షా (ఫార్సీ లో    نادر شاه افشار‎‎; ) లేదా నాదర్ కొలి బేగ్( نادر قلی بیگ )లేదా తఃమాస్ప్ కొలి ఖాన్(   تهماسپ قلی خان)ఇరాన్ ను పరిపాలిoచిన షా(చక్రవర్తి)  మరియు ఇరాన్ చరిత్రలో అతి శక్తివంతమైన చక్రవర్తులలో (షా)ఒకడు. అతడు చేసిన యుద్దాల వలన అతనిని నెపోలియన్ అఫ్ పర్షియా లేదా 2వ అలేక్జాండర్ అని అందురు.
నాదర్ షా ఈశాన్య ఇరాన్ కు చెందిన ఖొరాసాన్ ప్రాంత తుర్కమేన్ అఫ్శార్ తెగ కు చెందినవాడు. ఈ తెగ సఫవిద్ రాష్ట్రానికి చెందిన షా ఇస్మాయిల్ కు ఆయుధాలను సరఫరా చేసేది.
ఇరాన్ ను పరిపాలిస్తున్న షా సుల్తాన్ హుసైన్ కాలం లో హోతకి ఆఫ్ఘన్ తెగ, సఫవిడ్స్,ఒట్టోమన్ మరియు రష్యన్స్ పెర్షియ(ఇరాన్) భూభాగం ను ఆక్రమించారు. నాదర్ షా వారినందరినీ వెళ్ళగొట్టి పెర్షియా భూభాగం ను తిరిగి స్వాధీన పరచుకొన్నాడు. పెర్షియా భూభాగాలను  ఏకీకృతం చేసి పెర్షియా భూభాగ ఆక్రమితదారులను వెళ్ళగోట్టినాడు. 200 సంవత్సరాలు ఇరాన్ ను పరిపాలించిన బలహీనులైన సఫవిద్ వంశస్తులను తొలగించి  1736 లో తనే స్వయంగా షా(చక్రవర్తి) గా ప్రకటించుకొన్నాడు.
అతని కాలం లో ఇరాన్ సామ్రాజ్యం ఇరాన్,అర్మీనియా,అజెర్బైజాన్, జార్జియా, ఉత్తర కకాసుస్, ఇరాక్, టర్కీ, తుర్క్మినిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతం, పాకిస్తాన్, ఒమాన్, మరియు పెర్షియన్ గల్ఫ్ వరకు విస్తరించినది. కాని అతని యుద్దాలతో ఇరాన్ ఆర్ధిక వ్యవస్థ క్షిణించినది.
నాదర్ షా చరిత్ర లో మద్య ఆసియా కు చెందిన క్రూరమైన సైనిక పరిపాలకులు  చెంగిజ్ ఖాన్, తైమూర్ లను ముఖ్యంగా వారి క్రూరత్వం ను ఆదర్శంగా తీసుకొన్నాడు. ఇతను ఇరాన్ చరిత్రలో ముఖ్యమైన యుద్దాలు హేరాత్, మిహ్మన్డుస్ట్, ముర్చే-ఖోర్ట్, కిర్కుక్, ఎఘేవార్డ్, ఖేబర్ కనుమ, కర్నాల్ మరియు కార్స్ అన్నింటిలోను పాల్గొన్నాడు. ఆ యుద్దాలు అతనిని చరిత్ర లో గొప్ప సైనిక పాలకునిగా, అఫ్శారిడ్ వంశ ప్రముఖునిగా  నిలబెట్టినవి. అతని సైనిక చరిత్రలో ముఖ్యమైనవి దేగేస్తాన్ పై  జరిపిన దండయాత్రలు. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం లో నాదర్ షా ఆసియా  సైనిక విజేతలలో  గొప్ప అంతిమ నాయకుడు.
ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులను అణిచివేయటానికి ఆఫ్ఘానిస్తాన్ తో భారత సరిహద్దులను మూయమని నాదిర్ షా కోరగా మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా పట్టించుకోలేదు మరియు తన ప్రత్యర్ధి ఒట్టోమన్  చక్రవర్తి 1వ ముహమ్మద్ కు సహాకారం అందించిన మొఘల్ చక్రవర్తి పై ప్రతీకారం తీర్చుకోవటానికి    నాదిర్ షా ఉత్తర భారతదేశo పై  55 వేల సైన్యంతో దండయాత్ర చేశాడు. అప్పటికే మరాఠా దాడులు, ఇతర సర్దార్ల స్వాతంత్రం, అంతర్గత కుమ్ములాటల్లో ఘోరంగా బలహీనపడ్డ మొఘలులు కర్నల్ యుద్ధంలో అత్యంత తేలికగా ఓడిపోయారు. ఢిల్లీని పూర్తిగా నాశనం చేసి, దోపిడి చేయమన్న ఆజ్ఞను తన సైన్యానికి నాదిర్షా ఇవ్వగా ఘోరమైన జనహననం జరిగింది. ఒకే ఒక్కరోజులో 20వేల నుంచి 30వేలమంది భారతీయులను పర్షియన్ దళాలు ఊచకోత కోశాయి.
యుద్ధానంతరం జరిగిన ఘోరమైన నరమేధంలో పర్షియా సేనలు ఢిల్లీలో అన్నివైపుల నుంచి ప్రజలను ముట్టడించి తుపాకులతో కాలుస్తూ, కత్తులతో నరుకుతూ వికృత క్రీడ సలిపాయి. వేలాదిమంది స్త్రీలను అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. పిల్లలను తల్లుల చేతిలో ఉండగానే నరికిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఇళ్ళను తగలబెట్టగా వచ్చిన పొగ మేఘాల్లా ఆకాశాన్ని ఆవరించింది. ఈ ఊచకోత చివరకు మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా తన రాజ్యఖజానా తాళాలు నాదిర్ షా చేతికివ్వడంతో ముగిసింది.
చివరకు మొఘల్  చక్రవర్తి మొహమ్మద్ షా తన నెమలి సింహాసనాన్ని కూడా పర్షియా సామ్రాట్టుకు కోల్పోయాడు. అప్పటి నుంచి నెమలి సింహాసనం పర్షియన్ సామ్రాజ్య ఆధిక్యానికి చిహ్నంగా నిలిచింది. యుద్దంతరం పొందిన అపార రత్నరాశుల నిధిలో, నాదిర్ కోహినూర్, దర్యా-ఇ-నూర్ వంటి వజ్రాలు పొందాడు. కోహ్-ఇ-నూర్(కోహినూర్) అంటే పర్షియన్ భాషలో కాంతి పర్వతం అనీ, దర్యా-ఇ-నూర్ అంటే కాంతి సాగరం అనీ అర్థాలు.
నాదిర్షా దోచుకుని పోయిన సంపద విలువ గురించి చరిత్రకారులు ఎన్నోరకాలుగా అంచనాలు వేశారు.
·        ప్రేజర్ అనే చరిత్రకారుడు 70 కోట్ల నవరసులు ఉంటుందని వ్రాశారు. దీనిలోని 25కోట్ల నవరసుల విలువగల సాధారణమైన నగలు ఉన్నాయి.ఇవికాక  అపురూపమైన నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం (క్రమక్రమంగా అది బ్రిటీష్ వారి వద్దకు చేరింది), దర్యా-ఇ-నూర్(ఇది ఇప్పటికీ పర్షియాలోనే ఉంది). అంత్యంత విలువైన మణిమాణిక్యాలున్న ఆభరణాలు ఉన్నవి.
·        నాదిర్షా కొలువులో వజీరుగా చేరిన భారతీయుని కింది ఉద్యోగి ఆనందరాం అంచనా ప్రకారం  60 లక్షల వెండినాణాలు, వేలాదిగా బంగారునాణాలు, కోటి విలువగల బంగారు సామాన్లు, 50కోట్లు విలువైన విశిష్టమైన నగలు, ఇవికాక కొన్ని విలువకట్టేందుకు వీలుకాని వస్తువులు నాదర్ షా పట్టుకుపోయినట్టు వ్రాశారు.
·        నాదిర్షా సొంత చరిత్రకారుడు కోటి తొంభైలక్షల నవరసుల ఖరీదు కలిగిన నాణాలను తరలించుకువెళ్ళినట్టుగా వ్రాశారు.
·        స్కాంట్లాండుకు చెందిన మరో చరిత్రకారుడు నాదిర్షా తరలించిన డబ్బు, వస్తువుల విలువ 11 కోట్ల 90 నవరసులుగా అంచనావేశారు.
నాదిర్షా దండయాత్రలో సంపాదించిన దోపిడీ సొమ్ము ఆసరాతో అతను పర్షియా తిరిగివెళ్ళాక అక్కడ ప్రజలపై పన్ను మూడేళ్ళపాటు తొలగించాడు. 
నాదిర్ షా షియా అయినప్పటికీ సున్నీల పట్ల అభిమానం ప్రదర్శించాడు. అతని సైన్యం క్రైస్తవులు, సున్నీలు, షియాలతో కూడి ఉంది.అతడు షియా 6వ ఇమాం జాఫర్ అల్ సాదిక్ చూన జాఫరి మర్గంను అనుసరించాడు. కొంతమంది రచయితల  అబిప్రాయం ప్రకారం అతను ఒక నిర్దిష్ట మత సాంప్రదాయలును అనుసరించినాడు అని చెప్పుట కష్తం.
మొఘలుల పై విజయం తరువాత అతని ఆరోగ్యం క్షిణించినది. పెద్ద కుమారునికి పరిపాలన భారం అప్పగించినాడు.  కాని అతని విధానాలతో నచ్చక అతనిని కళ్ళులేని కబోధిని చేసాడు. నాదిర్ షా పెర్షియా నావికా దళం ను అభివృద్ధి చేసాడు. బహారిన్ ను క్రమించాడు. ఆ తరువాత ఒమాన్ ను స్వాధీన పరచుకొన్నాడు. ఒట్టోమన్ రాజ్యం తో యుద్ధం చేసి సంధి షరతులలో భాగంగా నజఫ్ పొందినాడు.
ఇరానియన్ నాణ్యలను ముద్రించినాడు. సైనికులకు జీతాలు ఇచ్చాడు. అతని కాలం లో ఇరాన్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింది చివరకు నాదిర్ షా 1747 లో సొంత అంగరక్షకులచేత హత్య కావిoచబదినాడు. అతని తరువాత ఇరాన్ సామ్రాజ్యం చిన్న బిన్నం అయినది
 ఆధారాలు:
వికిపెడియా.
భారత దేశ చరిత్ర – తెలుగు అకాడమి.





No comments:

Post a Comment