26 June 2016

భారత దేశం లోని మస్జిద్లు తమ పాత్రను నిర్వహిస్తున్నవా!


సాధారణంగా మసీదు అనేది ముస్లిం సమాజములో ప్రార్థన చేసే ఒక ప్రార్థనా స్థలం గా పరిగణిoచ బడుతున్నది. సంవత్సరాలతరబడి  మసీదులు అనేవి ముస్లిం  సమాజాలలో ఒక ముఖ్యమైన పాత్ర ను పోషిస్తున్నవి  కానీ నేటి ఆధునిక కాలం  లో మసీదులు నిర్వహించే పాత్ర మారుతుoది. ప్రారంభం లో మసీదు కేవలం ప్రార్థనా ప్రాంతంగానే  కాక, ముస్లిం సమాజంలో అన్ని కార్యకలాపాలకు కేంద్రంగా ఉపయోగపడేది. ప్రార్థనలు, ప్రబోధాలు, విద్య మరియు సంక్షేమ చర్యలు ప్రతిదీ మసీదు చుట్టూ జరిగేవి.

చారిత్రకంగా ప్రవక్త ముహమ్మద్ (స)  మదీనా  వలస వెళ్ళిన  తరువాత చేపట్టిన మొదటి పని ముస్లింల కొరకు మసీదు నిర్మించడoగా  ఉంది. మదీనా  లో మొదటి మస్జిద్ ప్రవక్త(స) యొక్క గృహం పక్కన ఉంది అది ఒక ఓపెన్ ఎయిర్ భవనం అందులో అందరు ముస్లిమ్స్ ఆహ్వానించబడినారు. చివరకు ముస్లిములు మసీదు కొరకు  ఒక సరైన నిర్మాణo చేపట్టారు.  దానికి 'మసీదు-ఇ-నభవి ' అనే పేరు పెట్టారు.

ప్రవక్త (స) హదీసుల అత్యంత ప్రామాణిక పుస్తకం సహీహ్ బుఖారీ ప్రకారం మసీదు ప్రవక్త(స) మరియు ప్రవక్త(స) అనంతర ఖలీఫా ల  కాలంలో అన్ని కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. ప్రజలు ప్రార్థన కోసం, చర్చలు జరపటానికి, విద్యా కేంద్రంగా,న్యాయవ్యవస్థ కేంద్రంగా మరియు ముఖ్యంగా ముస్లింల పరిపాలన మరియు సంక్షేమ కేంద్రo గా  మస్జిద్ ఉండేది.

ప్రవక్త (స) ముస్లింల నాయకుడిగా మస్జిద్  నుంచి ఇస్లామిక్ ప్రపంచంలోని అన్ని పరిపాలనా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇతర ప్రదేశాల నుండి వచ్చే రాయబారులను  కలిసేవారు, ఒప్పందాలు కుదుర్చుకొనే వారు   మరియు ఒప్పందాలపై సంతకాలు చేసేవారు. యుద్ధ నియమాలు మొదలగు అన్ని కార్యక్రమాల రూపకల్పన చేసేవారు. యుద్ధంలో కొల్లగొట్టిన సంపద పంపిణీ మరియు యుద్ధాల్లో గాయపడిన ప్రజలకు  ప్రధమ చికిత్స మరియు వారికి వైద్య  ఉపచారాలు మస్జిద్ లో చేయబడేవి.

ప్రజల తమ వివాదాలను  మస్జిద్ లో  పరిష్కరించుకోవటానికి వీలుగా మస్జిద్లు   న్యాయ కేoద్రలుగా  ఉండేవి. ప్రజలనుంచి సేకరించిన జకాత్ మరియు సదాకత్ మరియు పేదలకు వాటిని  పంపిణీ చేసే  స్వచ్ఛంద కేంద్రాలుగా మస్జిద్లు ఉండేవి. ఇంకా కొన్ని మతం, ఫికా  మరియు ఇతర సంబంధిత విషయాల గురించి వివరించే పాఠశాలలుగా, విద్యకు కేంద్రంగా ఉండేవి. ప్రయాణికులకు మస్జిద్ లో  ప్రజలు  ఆహారo పంపిణీ చేసేవారు మరియు ఆశ్రయం,విశ్రాంతి కల్పించేవారు. ప్రజలందరికి  జాతి, స్థితి,లింగ బేధం  లేకుండా మస్జిద్  లో  ఎల్లప్పుడూ ప్రవేశం, ఆశ్రయం కల్పించబడేది.

ప్రవక్త (స) మరణం తరువాత  ఖలీఫా కాలం లో కూడా ఈ సంప్రదాయం కొనసాగింది మరియు ముస్లింల సంక్షేమం కోసం అత్యంత ముఖ్యమైన కేంద్రాలుగా మసీదులు  ఉండేవి. మసీదులు గ్రంధాలయాలను  కలిగి సాహిత్య కార్యకలాపాలు ప్రోత్సహించెవి  మరియు అవి పేదలకు  ఉపాధి పొందేందుకు సహాయంగా వారికి మత జ్ఞానమును మరియు లౌకిక జ్ఞానమును  భోదించేవి.
భారతదేశం లో మొఘల్ పరిపాలనా కాలంలో మసీదులు రాజ కుటుంబీకుల ఆర్ధిక సహాయం తో నిర్వహించబడ్డాయి. మసీదులు కొరకు ఉదారంగా భూమి మరియు  డబ్బు విరాళంగా  ఇవ్వబడేది మరియు గ్రంధాలయ భవనాలు,విశ్రాంతి గృహాలు మరియు మసీదు పరిసరాలలో  పాఠశాలలు నిర్మించబడినవి.

అయితే నేడు మసీదులు కేవలం పరిమిత సౌలభ్యo గల ప్రార్థన ప్రాంతాలు గా మిగిలిపోయినవి. భారతదేశం లో చాలా మసీదులు  మహిళలను  అనుమతించడం లేదు  లేదా కొన్ని మస్జిద్లు  ఆంక్షలతో ఎటువంటి సౌకర్యాలు లేకుండా అనుమతిoచు చున్నవి. నేడు ఏ మస్జిద్ సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం లేదు మరియు వాటికి అనుభందంగా ఆస్పత్రులు కలిగి లేవు. మసీదులకు  జతగా మదరసాలు ఉన్నప్పటికీ అవి యువత కోసం వృత్తి విద్యా కోర్సులు నడపటం లేదు. అతితక్కువ మసీదులకు  గ్రంధాలయాలు లేదా ప్రయాణికుల విశ్రాంతి  కేంద్రాలు కలిగివున్నవి.

ఈనాటి మసీదులు అత్యంత పెద్దవిగా సువిశాలమైన ఆవరణలతో, అధునాతనం గా  నిర్మించబడ్డాయి కాని వాటిని ముస్లిం సమాజ కార్యకలాపాలకు కేంద్రంగా పిలువలేము. దీనికి విరుద్ధంగా చర్చిలు మరియు గురుద్వారాలు ఇస్లాం సూచించిన నమూనాను/మార్గమును  అనుసరిస్తున్నట్లు  కనిపించుతున్నవి. ఇవి ఆరాధన మందిరాలే కాక   పేదలకు సహాయం పడే సంక్షేమ కేంద్రాలు గా మరియు  ప్రయాణికులకు వసతి కేంద్రాలుగా ఉపయోగ పడుతున్నవి.

గురుద్వారా లో లoగర్ ద్వారా అందరు పేదలకు మరియు సంపన్నులకు సమానం గా  ఆహారo అందించ బడుతుంది మరియు ప్రజలు గురుద్వారాలో  సమాజ సేవ కొరకు స్వచ్చంద భావన తో పనిచేస్తారు. కాని  సంక్షేమ కేంద్రాలుగా పని చేస్తున్న మసీదులు  అతి తక్కువగా ఉన్నాయి. తిరిగి మస్జిదులను సంక్షేమ చర్యలు మరియు మత కార్యక్రమాలకు పాల్పడే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా  ఉంది. మసీదులు కమ్యూనిటీ యొక్క కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందనే భావన ముస్లిం లకు  కలిగినప్పుడు దానికి కోల్పోయిన ఆదరణ, ప్రోత్సాహం తిరిగి లబిస్తుంది.   


No comments:

Post a Comment