ఇస్లాం ధర్మం అవతరించిన దాదాపు 15 సంవత్సరాల తరువాత CE 624 నుండి ముస్లింలు
రంజాన్ కరీం ను పాటిస్తున్నారు.s'రంజాన్ కరీం' ఒక ఇస్లామిక్ నెల. ముస్లిం విశ్వాసులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ నెలలో ఉపవాసం ఉంటారు. ఉర్దూలో రమదాన్ నెలను రంజాన్ నెల గా సూచిస్తారు. రంజాన్ అనే ప్రత్యామ్నాయ ఉచ్చారణ ఉపఖండం అంతటా ముస్లింలు ఉపయోగిస్తారు. అయితే మిడిల్
ఈస్ట్ , ఇస్లామిక్
రాజ్యాలలో సనాతనవాదులు ఈ నెలను 'రంజాన్ కరీం' గా పిలుస్తారు. ఈ నెల లో 29 లేదా 30 రోజులు ఉపవాసం ముస్లింలకు విధి మాత్రమే గాక ఆచరణలో హజ్, నమాజ్ (ప్రార్థన), జకాత్, మరియు విశ్వాసం ప్రకటనతో (Shahada)
పాటు ఇస్లాం మతం యొక్క ఐదు సిద్ధాంతాలలో ఒకటిగా రూపొందినది.
రంజాన్ ఇస్లాం ధర్మం యొక్క ప్రకాశవంతమైన పండగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఒక
హదీసు ప్రకారం, ఈద్ అల్ ఫితర్ మరియు ఈద్ అల్ అధా రెండు పండుగలను మక్కా నుండి మదీనాకు తన ప్రయాణం తర్వాత ప్రవక్త (స)ఏర్పర్చారు."ప్రవక్త
మదీనా కు, వచ్చినప్పుడు అక్కడి ప్రజలు వినోదం ఆనందం మరియు కాలక్షేపం కోసం రెండు నిర్దిష్ట రోజుల ఉత్సవం
లాగా జరుపుకుంటు కనిపించారు. ప్రవక్త(స)
అడిగినప్పుడు ఈ ఉత్సవాల కు కారణం ఈ రెండు రోజులు ఆహ్లాదకరమైన
మరియు వినోద సందర్భాలు అని అక్కడి వారు సమాధానమిచ్చారు. అప్పుడు ప్రవక్త (స)
అల్లాహ్ రెండు రోజులు పండుగ ఉత్సవం జరుపుకోటానికి నిర్ణయిoచాడు అవి
వీటి కంటే మరింత మెరుగైన రోజులు అని వ్యాఖ్యానించారు:
అవి ఒకటి ఈద్ అల్ ఫితర్ మరియు రెండు ఈద్ అల్ అధా.- అనస్ బిన్ మాలిక్
జంగ్-ఇ-బదర్
యుద్ధం యొక్క విజయం తర్వాత ప్రవక్త ముహమ్మద్ మరియు అతని సహచరులు ద్వారా ఈద్ అల్
ఫితర్ CE 624 లో జరుపబడింది.
రమదాన్ నెలలో ఉపవాసo ఉండి ముస్లింలు స్వీయ
నిగ్రహం, నిరాడంబరత మరియు పట్టుదల ప్రదర్శిస్తారు
రంజాన్ కరీం
చరిత్ర
రంజాన్ కరీం మొదటి
క్రి.శ. 624 లో ప్రారంభించారు. ఇది హిజ్ర (ఇస్లామిక్
క్యాలెండర్) ప్రారంభంలో రెండో సంవత్సరం. ఈ సమయంలో ప్రవక్త ముహమ్మద్(స)
అప్పటికీ దైవ దూత జిబ్రెయిల్ ద్వార అల్లాహ్ పంపిన దైవ వాణిని వినిపిస్తున్నారు. అలాంటి దైవవాణి ఒకటి షాబాన్
నెల లో అనగా రంజాన్ కరీం ముందు నెలలో అవతరించినది. ఇస్లాం విశ్వాసులు
అందరు వచ్చే నెల అనగా రమదాన్ కరీం నెలలో విధిగా ఉపవాసాలు ఉండాలని అల్లాహ్ ఆదేశించినాడు.'
రంజాన్ నెల లో ఉపవాసం
యొక్క వేదాంతపరమైన ఆధారo దివ్య ఖురాన్ చాప్టర్ 2 (సూరా అల్ బఖరహ్) లో నమోదయింది. ఆయత్ సంఖ్య 185 దీని ప్రకారం: "పవిత్ర ఖురాన్
అవతరించిన నెల రమజాను నెల.మానవులందరికీ ఖురాన్ మార్గదర్శకం. రుజుమార్గం చూపే,
సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుండి రమజాను
నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి. కాని వ్యాధిగ్రస్తులైన వారు
లేదా ప్రయాణం లో ఉన్నవారు, ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లాహ్
మీకు సౌభాగ్యం కలుగజేయ్యాలనే అభిలషిస్తాడు. మిమ్మల్లి కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు. కనుక మీరు ఉపవాస దినాల
సంఖ్యను పూర్తిచేయగలగటానికి, అల్లాహ్ మీకు ప్రసాదించిన మహోపదేశానికి మీరు అల్లాహ్
ఔనత్యాన్ని కొనియాడటానికి, ఆయనకు మీరు కృతఙ్ఞతలు తెలుపుకోవటానికి ఈ పద్ధతి
తెలుపబడుతుంది.”
అందువలన, రమదాన్ కరీం లేదా
రంజాన్ పండుగ ను CE 624 లో అనగా ఇస్లాం ధర్మం అవతరిoచిన తరువాత దాదాపు 15 సంవత్సరాల నుండి
ముస్లింలు జరుపుకొంటున్నారు.
అయితే ముస్లింలకు మాత్రమే
కాక రమాదాన్ నెలలో ఉపవాసం ఉండటం అల్లాహ్ ఇతర ఎకేస్వరోవాద(monotheist) ధర్మాలకు కూడా జారీ
చేసినాడు. ముస్లింల ప్రకారం అప్పటి యూదులు, క్రైస్తవులు
మరియు సాబిఆన్స్ కు (Sabians) కూడా అల్లాహ్ అలా
ఆదేశించాడు. ఉపవాసం అనేది అల్లాహ్ జారీచేసిన ఆజ్ఞాలలో ఒకటి. “విశ్వసించిన
ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయిoచబడినది- ఎ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను
అనుసరించేవారికి కూడా విదింపబడినదో, దాని వల్ల మీలో బయబక్తులు జనించే అవకాసం ఉంది. ఈ ఉపవాసం కొన్నిదినాల
వరకే.”-దివ్య ఖురాన్ 2:183. ఇది విశ్వాసులలో తఖ్వా (అల్లాహ్ పట్ల బయం) పెంచుతుంది.
రమదాన్ కరీం పవిత్రత :
ఈ పవిత్ర నెల'రంజాన్ కరీం' లో ఉపవాసం
ముస్లింలకు విధి గా నిర్ణియిoచబడినది మరియు హదిస్సు ల ప్రకారం దివ్య ఖురాన్ యొక్క మొట్టమొదటి భాగం ఈ పవిత్ర
నెలలో ప్రవక్త ముహమ్మద్(స)ద్వార వెల్లడించబడినది.
హదీసుల ప్రకారం దివ్య ఖురాన్
మాత్రమే గాక ఏకేశ్వరోపాసన సంబంధించిన నాలుగు ఇతర సమగ్ర
పవిత్ర పుస్తకాలు “టాబ్లెట్స్ ఆఫ్ ప్రవక్త ఇబ్రహీం, ప్రవక్త ముసా యొక్క తోరా గ్రంధము, ప్రవక్త దావీదు కీర్తనలు మరియు సువార్త (బైబిల్ రెండు
విభాగాలు)” ఈ నెలలో వెల్లడైనవి.
కొంతమంది వాదన ప్రకారం అరబ్ భూభాగం లోని కొన్ని ఏకేశ్వరోపాసన చేసే జాతులు కుడా
రమదాన్ ఉపవాసం పాటించేవి. సిరియన్ క్రైస్తవులు కుడా లేన్తిన్ ఉపవాసాలు పాటిస్తారు.
(దివ్య ఖురాన్ లోని 2:181) వాటి ప్రభావం ముస్లింలపై కుడా ఉంది. కాని ముస్లిమ్స్
దినిని ఖండిస్తారు.
No comments:
Post a Comment