6 June 2016

భారత దేశం లోని పిల్లలలో ఉబ కాయం –కారణాలు-నివారణ మార్గాలు.




“మంచి ఆరోగ్య విధానాలు అనుసరించండి పిల్లలలో ఉబకాయం అరికట్టండి”.

గత 5 సంవత్సరాల గణాంకాల ప్రకారం 5-19 సంవత్సరాల లోపు భారత దేశ  పిల్లలలో దాదాపు  22% వరకు ఊబకాయం లేదా అధిక బరువు  ఉంది. ఈ సంఖ్య కౌమారం లో 30% కి పెరిగింది. దాదాపు 2/3వంతు  పిల్లలలో  స్థూలకాయo యవ్వనం వరకు కొనసాగుతుంది. WHO నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పిల్లల లో  జంక్-ఫుడ్ మరియు ఆల్కహాల్ రహిత పానీయాలు ఉబకాయం లేదా అధిక బరువు  పెరుగుదలకు ముఖ్య కారణాలు.
.
2014 లో 5 సంవత్సరాల లోపు పిల్లలలో ఉబకాయం లేదా అధిక బరువు  ప్రపంచవ్యాప్తంగా 41 మిల్లియన్ ల వరకు ఉంది. భారత దేశం లో ఈ గ్రూప్ పిల్లలలో ఉబకాయం లేదా అధిక బరువు  5% తక్కువుగా ఉంది మరియు అబివృద్ది చెందుతున్న దేశాలలో ఇది వేగంగా విస్తరించు చున్నది. 1990 -2014 మద్య తక్కువ/మద్య తరగతిఅదాయం ఉన్న దేశాలలో  ఉబకాయం లేదా అధిక బరువు  గల పిల్లల 7.5 మిలియన్ల నుంచి 15.5 మిలియన్లకు పెరిగింది. 2014 లో వారిలో ఆధిక శాతం అనగా 48% మంది ఆసియా, 25% మంది ఆఫ్రికా లో ఉన్నారు.
ఒకప్పుడు ఊబకాయం భారతదేశం లో గొప్పవారి గుర్తు గా  పరిగణించబడుతుంది, ప్రస్తుతం ఇది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జనాభా కుడా పాకింది. డాక్టర్ మిశ్రా అభిప్రాయం ప్రకారం భారత దేశం లో గ్రామిణ ప్రాంత పిల్లలతో పోలిస్తే  పట్టణ ప్రాంత పిల్లలలో ఉబకాయం లేదా అధిక బరువు  ఎక్కువ.
పిల్లలలో ఉబకాయం,అధిక బరువు  సమస్యను స్కూల్ లెవెల్ లోనే గుర్తించి దానికి తగు నివారణ చర్యకు చేపట్టాలి లేనియెడల అది యవ్వనం లో మరింత ప్రమాదం కు దారి తీస్తుంది.
గణాంకాల ప్రకారం, భారతదేశం లో పెద్దలలో ఉబకాయం కొలవడానికి శరీర ద్రవ్యరాశి సూచిక (BMI) ఉపయోగిస్తారు కాని   పిల్లలకు ఇది తగదు. ఖచ్చితమైన కొలత కోసం  పిల్లల వయస్సు మరియు సెక్స్  లెక్కలోనికి తీసుకోవాలి.  చర్మం  మడతల  రెట్ల మందం, నడుము-హిప్ నిష్పత్తి, నడుము చుట్టుకొలత, మరియు వివిధ స్కానింగ్ పద్ధతులు పిల్లలలోని ఊబకాయ కొలవటానికి ఉపయోగిస్తారు.
సాధారణంగా, మీ పిల్లల చేతులు, తొడలు మరియు ఉదరం సాధారణ కంటే ఎక్కువ మందం  కలిగి ఉంటే లేదా  బాలుడు  లేదా బాలిక కనీస భౌతిక శ్రమ తర్వాత ఆయాస పడుతుంటే, లేదా ఆటలలో ఇతర పిల్లలతో పోటి పడలేక పోతే అప్పుడు ఆ బాలుడు లేదా ఆ బాలిక  ఊబకాయం కలిగి ఉన్నదని చెప్పవచ్చు.
పిల్లల ల్లో ఊబకాయం కు కారణాలు.
వంశపారంపర్యం గా కొందరు పిల్లల లో ఉబకాయం వస్తుంది. ¼ వంతు పిల్లలు ఉబకాయం ఈ విధంగా పొందుతారు లేదా జన్యు సంభంద రోగాలు ప్రదర్ విల్లి (Prader-Willi syndrome) వలన కూడా బాల్య ఉబకాయం వస్తుంది.
ఆహారం: ఈ రోజులలో పిల్లలు  మాల్స్ లో దొరిలే హై క్యాలరీలు, లో న్యూట్రిషన్ వ్యాల్యులు  గల ఆహార పదార్ధాలను తింటున్నారు. దీనివల్ల పిల్లలలో ఉబకాయం త్వరగా వస్తుంది.
జీవన శైలి: పిల్లల పెరుగుదలలో పరిసర వాతావరణం ప్రభావం ఉంటుంది. తల్లితండ్రులు తమ పిల్ల ల అధిక బరువును లెక్కచేయక ముద్దు చేస్తుంటారు. దీనితో పిల్లలు మంచి జీవన శైలిని అలవర్చుకోరు. ఉదా: కు తల్లి-తండ్రుల తో కలసి మార్కెట్ కు నడక ద్వార పోవడం, అవుట్-డోర్ వ్యాయామం, ఆటలు నిర్లక్షం చేసి ఇంటిలో టి.వి.కి, వీడియో గేమ్స్ కు, కంప్యుటర్ కు  అతుక్కు  పోతారు.కనీస శారీరక శ్రమ వారిలో లోపించి వారు అధిక బరువు పెరుగుతారు. దీనితో పాటు పిల్లలు స్కూల్ లో ఆటలు ఆడటం మానివేశారు,లెసన్స్, స్టడీ అవర్స్,  హోం-వర్క్ తో నే వారి సమయం గడిచిపోతుంది.
ఉబకాయం వలన ఆరోగ్య సమస్యలు:
 ఉబకాయం వలన పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా కార్డియో-వాస్క్యులార్ జబ్బులు, అధిక రక్తపోటు, టైపు-2 డయబితీస్, గాల్ స్టోన్స్, అస్తమా,బాలికలలో పోలిసిస్టిక్ ఒవరీస్, నిద్రలేమి, కలత నిద్ర వంటి సమస్యలు ఎదుర్కొంటారు.
చిన్న తనం లో ఉబకాయం ఉండుట వలన వారిని  స్కూల్ లో ఫ్రెండ్స్ ఎగతాళి చేయుట వలన వారిలో  ఆత్మ న్యున్యతా భావన పెరుగుతుంది, సామాజిక కార్యక్రమాలనుంచి దూరంగా ఉండటం, ఆదుర్ద, డిప్రేషన్, నిరాకరణ భావన వారిలో పెరుగుతాయి.
ఉబకాయ నివారణ కు చర్యలు:
సరిఅయిన సంతులిత పోషకారం అందించుట: జంక్ ఫుడ్ తినుట ఆపివేయవలయును. కార్బోహైడ్రేట్ పదార్ధాలను, ఫాట్ ను పెంచే ఆహారపదార్ధాలను  తగ్గించి అధిక మొత్తం లో నీరు,ఫ్రూట్స్,కూరగాయలు, నట్స్ ఎక్కువగా తీసుకోవాలి.
అవుట్-డోర్ యాక్టివిటీస్ లో పాల్గొనుట: శారీరక శ్రమను పెంచే     పిక్నిక్, ట్రెక్కింగ్ మరియు ఇతర అవుట్-డోర్ యాక్టివిటీస్ లో పాల్గొనాలి.
ఇంటి పనులు లలో సహాయ పడుట : వంట గది లో సహయం చేయుట, ఇంటిని శుబ్ర పరుచుట,కూరగాయలు, వెచ్చాలు తెచ్చుట  మొదలైన కార్య క్రమములు వలన బాద్యత, క్రమ శిక్షణ   పెరుగును.
ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుట: వాకింగ్,ఆటలు,వ్యాయామం,స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్ కు పొవుట మొదలగు ఫిజికల్ యాక్టివిటీస్ వారిలో అలవర్చవలయును.
టి.వి./వీడియో గేమ్స్,కంప్యుటర్ ఉపయోగించే సమయం తగ్గించుట: టి.వి./వీడియో గేమ్స్  విక్షణ సమయం బాగా తగ్గించాలి.
సరిఅయిన స్కూల్ ఎన్నుకొనుట: ఆట-స్థలం,టైం టేబుల్ లో స్పోర్ట్స్ కు సమయం కేటాయిoచుట, ఎన్.సి.సి./స్కౌట్స్ అండ్ గైడ్స్, ఉన్న స్కూల్స్ లో పిల్లలను జేర్చుట ద్వారా వారిలో ఆటలయండు  ఆసక్తి పెరిగి దేహ దారుడ్యం పై శ్రద వహించేదారు.
తల్లి-తండ్రుల దృక్పదం లో మార్పు: పిల్లల లో ఉబకాయo ఉన్న తల్లి-తండ్రులు దానిని ఎర్లీ స్టేజి లో గుర్తించి తగిన సహాయం పొందాలి. తల్లితండ్రులు మంచి పోషకారం, మంచి జీవన శైలిని అనుసరించిన పిల్లలపై అది ప్రభావం కల్పించును. ఉబ్కాయం ఉన్న పిల్లలను అవహేళన చేయుట, వారిని ఇతరులతో పోల్చుట ఎంతమాత్రం చేయరాదు. అది వారి మానసిక స్థితి పై ప్రభావం కల్పించ గలదు.
   


 

 











No comments:

Post a Comment