16 June 2016

ఇస్లామిక్ చరిత్ర లో ఖ్యాతిగడించిన మహిళామణులు.



ఇస్లాం   తల్లి  పాదాల కింద స్వర్గం ఉంచింది మరియు భార్యను గౌరవించని భర్త  విశ్వాసం  అసంపూర్తిగా మిగులుతుంది.  ఈ విధమైన విశ్వాసం తో  మహిళలు గౌరవనీయ స్థితి మరియు స్థానం  పొంది ఇస్లామిక్ చరిత్రలో ఉన్నత స్థానం పొందినారు. 

ఒక నవజాత శిశువు యొక్క ఏడుపు తో,  ఒక కూతురు పుట్టిన గురించి సమాచారం తో ఒక మక్కా గృహస్తుని హ్రుదయo విలవిల లాడుతుంది. ఈ వార్తను అతను అవమానకరం గా భావిస్తాడు. చీకట్లో ఎవరు చూడకుండా అతను తన నవజాత శిశువును సజీవంగా పాతిపెట్టడానికి బయలుదేరతాడు. – ఇది అజ్ఞాన కాలం (621CE) నాటిఅరబ్ సమాజ స్థితి.
సరిగ్గా అదేపరిస్థితులలో ఏనుగు సంవత్సరం లో ప్రవక్త మొహమ్మద్(స) జననం జరిగింది మరియు మానవాళి కి ఒక ఆశా ఉదయ రేఖ కన్పించినది. పాతిపెట్టబడే ప్రతి ఆడ శిశువు తనుచేసిన తప్పు ఏమిటి అని తన జనకుడిని అడుగుతుంది దానికి లెక్కల దినమున తను చేసిన దుశ్చర్యకు ప్రతి తండ్రి  సమాధానం ఇవ్వవలసి వస్తుందని ప్రవక్త(స)తెలిపినాడు.  

ఇస్లాం సమస్త మానవజాతి కోసం మరియు మహిళల జీవితాలలో ఒక ఉత్ప్రేరకంగా మార్గదర్శకత్వం గా ఆవిర్భవించినది. గతంలో వినని ఒక భావన  లేదా ఆలోచన -మహిళల హక్కులు అనేవి ఆదరించబడినవి  మరియు రక్షిoచడటం  జరిగింది. గృహాల్లో కేవలం కేవలం వస్తువు గా ఉన్న భార్య  పరువుకు చిహ్నం  అయ్యింది. ప్రవక్త (స)సహచరులు, ప్రవక్త(స)  తన కుమార్తెల పట్ల చూపిన ఉత్తమ ప్రవర్తన, ప్రేమ ను చూసి ఆశ్చర్యపోయారు.
ప్రవక్త (స) స్త్రీ-పురుష తేడా ఆధారంగా విశ్వాసులలో  ఎలాంటి తేడా లేదు అని బోధించారు. ఇద్దరు సమానoగా  హక్కులు - విధులు మరియు  జ్ఞానము పొందవచ్చును అని అన్నారు. మహిళలు  చెడు నుండి రక్షణ పొందటానికి మరియు ఇతరులను  మంచి వైపు ప్రోత్సహించడానికి పురుషుల తో పాటు సమాన అధికారం కలిగి ఉన్నారు.  అదే విధంగా తల్లి పాదాల చెంత స్వర్గం ఉందని అందువలన తల్లి తో పాటు తండ్రులు కూడా  స్వర్గం పొందుతారని  భార్యను  గౌరవించలేని భర్త  విశ్వాసం అసంపూర్తిగా మిగులుతుందని అన్నారు. ఈ విధమైన విశ్వాసం తో  మహిళలు గౌరవనీయ స్థితి మరియు స్థానం  పొంది ఇస్లామిక్ చరిత్రలో ఉన్నత స్థానం పొందినారు.

ముస్లిం  మహిళలు ఇస్లామిక్ చరిత్రలో  పండితులు, న్యాయ వేత్తలు , పాలకులు,  యోధులు, వ్యాపార, మరియు న్యాయ నిపుణులు గా రాణించారు. ప్రవక్త (స) యొక్క గృహo అతని అనుచరులకు మార్గదర్శకత్వం చూపినది.  అతని భార్య ఖదీజా (ర) అతని అంతరంగికురాలుగా, సహచరిగా,  ఒక సంపన్న వ్యాపారవేత్తగా మరియు  వర్తకురాలుగా  అతను ప్రవక్త పదవిని పొందినప్పుడు నైతికంగా మరియు ఆర్థికంగా మద్దతు ఇచ్చినది.  ఆయేషా బిన్తె అబూ బకర్ (ర) అతని నుండి అపార ధార్మిక జ్ఞానం పొంది  ఒక గొప్ప న్యాయవేత్త మరియు విద్వాంసురాలుగా  మారింది. ఉమ్మె సలమా (ర) హుడైబియా  ఒప్పందం సమయంలో  ప్రవక్త(స) కు  న్యాయ సలహా ఇచ్చినది.  హఫ్సా (ర) ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ కుమార్తె, ఆమె తండ్రి మరణం తరువాత దివ్య ఖురాన్ వ్రాసిన మొదటి వ్యక్తి అయినది.
హదీసు లో నిపుణులు  మరియు పండితులు,కవయిత్రులు,భోదకులు మరియు న్యాయవేత్తలు :
హదీసుల సంగ్రహం లో స్త్రీల ఘనత గొప్పది. ఇస్లాం తోలి కాలం లో హదీసు సంగ్రహకురాళ్ళుగా  స్త్రీలు ఉండేవారు. ఇబ్నె హజర్ 53 మహిళల వద్ద, అస్-సఖ్వి  68 మహిళలవద్ద  మరియు అస్-సుయూతి 33 మహిళల వద్ద హదీసులు అధ్యయనం చేసారు.
నాల్గవ శతాబ్దంలో యాజ్-సుఫ్ఫియా  గా పిలవబడే ఫాతిమా బిన్తె అబ్దుర్ రెహ్మాన్,  ఫాతిమా అబూ దావుద్ సునన్ యొక్క మనవ రాలు, అమత్ అల్- వహీద్, ప్రముఖు న్యాయవేత్త అల్-ముహామిమిలి యొక్క  మనుమరాలు,  న్యాయమూర్తి అబూ బకర్ అహ్మద్ యొక్క కుమార్తె ఉమ్ అల్-ఫత్ అమత్ అస్-సలామ్ మొదలగు హదీసు విదుషిమణులు కలరు.
జుముఃబిన్తె అహ్మద్ యొక్క ధార్మిక తరగతులకు  ఎల్లప్పుడూ పెద్దసంఖ్య లో విశ్వాసులు హాజరుయ్యేవారు.

ఫాతిమా బిన్తె అల్-హసన్ ఇబ్న్ ఆలీ అద్-దక్క్యక్ అల్- కుశైరి ఐదవ మరియు ఆరవ శతాబ్దాల, ఒక హదీసులు పండితురాలు. ఆమె దైవభక్తి మరియు చేతివ్రాత నగీషీ కుశలత, హదీసు మరియు ఇస్నాడ్స్(isnads -chains of narrators) కు ప్రసిద్దురాలు.
అల్- సహీహ్ బుఖారి హదిసు గ్రంధం పై  కరిమా అల్ మర్వాజియా కు మంచి పట్టు ఉంది. అబూ దార్ హెరాట్  ఆ కాలానికి చెందిన ప్రముఖ పండితుడు. ఆమె దగ్గిరే  సహీహ్ బుకారి అధ్యయనం చేయమని తన విద్యార్థులకు సలహా ఇచ్చేవాడు. ఆమె విద్యార్థులలో  అల్-ఖాతిబ్ అల్-బాగ్దాదీ మరియు అల్-హుమయ్ది ఉన్నారు.
షాహ్దః గా పిలబడే ఫాతిమా-బిన్తె-ముహమ్మద్, ముస్నిడ అస్ఫహన్ (అస్ఫహన్ అనగా  గొప్ప హదీసుల పై అధికారo కలవారు)గౌరవం  అందుకున్నారు. ఆమె సూఫీ గృహం స్థాపించారు దానికి ఆమె  భర్త చాలా దాతృత్వము ఇచ్చారు. సహీహ్ అల్ బుఖారీ పై ఆమె ఇచ్చే ఉపన్యాసాలకు  విద్యార్థులు పెద్ద సంఖ్య లో హాజరుయ్యేవారు.

సిట్ట అల్- వుజ్ర ఇస్లాం చట్టం పై తన  పాండిత్యం పాటు సహీహ్ అల్-బుకారి  పై  డమాస్కస్ మరియు ఈజిప్ట్ లో ఉపన్యాసాలు ఇచ్చేవారు అదే విధంగా ఉమ్ అల్-ఖీర్ అమత్ అల్- ఖాలిక్,  హిజాజ్ లో చివరి గొప్ప హదీసుల విద్వాంసురాలు గా  భావించబడుతుంది.
ఏడవ శతాబ్దంలో డమాస్కస్ లో ఉమ్ అల్-దర్దా అనే ఒక ప్రముఖ న్యాయవేత్త కలరు ఆమె విద్యార్ధులలో అబ్దుల్ మాలిక్ ఇబ్న్ మర్వన్ మరియు అప్పటి ఖలీఫా  ప్రముఖులు. ఆమె మసీదులో హదీసులు మరియు ఫికా  బోధించెది. ఆ సమయంలోని ఒక ముఖ్యమైన పండితుడు మరియు తిరుగులేని ప్రజ్ఞగల  ఒక న్యాయమూర్తి ఇలియాస్-ఇబ్నె-మువియా ఆమెను  ఇతర హదీసు పండితులలో  ఉన్నతరాలుగా  భావిస్తారు.

ఆయేషా బిన్తె సాద్  బిన్ అబి వాక్వాస్ ఒక న్యాయవేత్త,  పండితురాలు  మరియు ప్రఖ్యాత మాలిక్ ఫికా గురువు ఇమామ్ మాలిక్ యొక్క ఉపాద్యాయురాలు.
సయ్యిదా నఫీసా ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క ముది మనుమరాలు మరియు హస్సన్ బిన్ ఆలీ బిన్ అబూ తాలిబ్ కుమార్తె. ఆమె  గొప్ప ఇస్లామిక్ న్యాయ శాస్త్రవేత్త. ఆమె  వద్దకు విద్యనబ్యసించడానికి విద్యార్థులు సుదూర ప్రాంతాలనుండి వచ్చే వారు. వారిలో ఇమాం షఫీ ఒకరు. ఇమాం షఫీ షాఫి  ఫికా స్థాపకుడు. అతని విద్యకు ఆమె ఆర్థికంగా సహాయం చేసింది.
అషిఫా బిన్తె అబ్దుల్లా మార్కెట్ ఇన్స్పెక్టర్ మరియు మేనేజర్ గా ఖలీఫా ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ నియమించిన తొలి ముస్లిం స్త్రీ.

అమ్ర బిన్తె అబ్డుర్రెహామన్ ఎనిమిదవ శతాబ్దపు ఒక న్యాయవేత్త,  ముఫ్తీ మరియు హదీసులలో గొప్ప  పండితురాలు. ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సమయంలో ఆమె ప్రవక్త (ర) గారి భార్య అయేషా (ర) సంబంధిత హదిసులపై గొప్ప అధికారిణిగా  భావించేవారు. ఆమె విద్యార్థులలో  అబూ బకర్ బిన్ హజిం మదీనా యొక్క  ప్రముఖ న్యాయమూర్తి గా ఉండేవారు.

డమాస్కస్ లో ఆయేషా బిన్తె ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ హది అనేక ప్రముఖ ముస్లిం పురుష పండితులకు  బోధించారు మరియ ప్రవక్త ముహమ్మద్ (స) కు చెందిన ఇస్నాడ్స్ తెలిసిననవారు.  ఆమె ఇబ్న్ హజర్ అల్-అస్కలని కి భోదించారు
ఫాతిమా అల్-బతయహియ్యః ఎనిమిదవ శతాబ్దపు  ఒక ప్రముఖు వృద్ధ మహిళ. ఆమె  ప్రవక్త యొక్క మస్జిద్ లో సహీహ్ అల్ బుఖారీ హదీసులు  విద్యార్థులకు  బోధించేవారు
తొమ్మిదవ శతాబ్దంలో అల్-కరవ్వియ్యిన్ మస్జిద్ స్థాపకురాలు ఫెస్, మొరాకో కు చెందిన ఫాతిమా అల్-ఫిహ్రియ్య. 859వ  సంవత్సరం లో స్థాపించబడిన కరవ్వియ్యిన్ మస్జిద్ ద్వార అరబిక్ సంఖ్యలు ప్రచారం పొందినవి. ఇది యూరప్ లోనే గాక  ప్రపంచంలోని పురాతన మరియు  మొదటి విశ్వవిద్యాలయం  మరియు ఇప్పటికీ పనిచేస్తున్న విశ్వవిద్యాలయంగా ప్రసిద్ది పొందినది. ఇస్లామిక్ స్టడీస్, భాషలు మరియు శాస్త్రాలు అధ్యయనం చేయడానికి ఇక్కడికి  ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నుండి ఇక్కడకి విద్యార్ధులు వచ్చేవారు. ప్రయాణించారు
కార్డోబ ఫాతిమా పదవ శతాబ్దం గొప్ప లైబ్రేరియన్ ఆమె 4,00,000 పుస్తకాలు గల 70 ప్రజా గ్రంథాలయాలు పర్యవేక్షించినది.
పదకొండవ శతాబ్దంలో బనఫ్శా ఆర్-రుమయ్య పాఠశాలలు, వంతెనలు మరియు బాగ్దాద్ నగరం లో గృహం లేని స్త్రీల కోసం  ప్రజాగృహం ను నిర్మించినది.
వారి  తర్వాత అబిదః అల్ మదన్నియ్యా, అబ్దః బిన్తె బిషర్, ఉమ్మె ఉమర్ అధ్-థకఫియ్య , ఆలీ ఇబ్న్ అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ ముది మనుమరాలు జైనాబ్, నఫిస్సా  బిన్తె అల్-హసన్ ఇబ్న్ జియాద్, ఖదీజా ఉమ్మె ముహమ్మద్, అబ్దః  బిన్తె అబ్దుర్  రెహమాన్ మరియు అనేక మంది ఇతర మహిళలు హదీసు ప్రసంగాలలో నిపుణులు ఉన్నారు.
అబిదా ముహమ్మద్ ఇబ్న్ -యాజిద్ యొక్క బానిస. ఆమె  పెద్ద సంఖ్యలో హదీసులు  నేర్చుకొని తన మదని ఉపాద్యాయురాలు యొక్క 10,000 హదీసుల పై పట్టు కలిగి ఉన్నారు.  ఆమెను పవిత్ర నగరం జెరూసలేం  పర్యటన కు వచ్చిన స్పెయిన్ గొప్ప హదీసు పండితుడు హబీబ్ దాహ్హన్ కు బహుమతి గా ఇచ్చినప్పుడు అతను ఆమెను బానిసత్వం నుంచి  విముక్తి చేసి ఆమెను వివాహం చేసుకొని అందలుషియా(స్పెయిన్) కు తీసుకు వెళ్ళెను.
జైనాబ్  బిన్తె సులేమాన్, దీనికి విరుద్ధంగా, జన్మతః ఒక యువరాణి.  ఆమె తండ్రి-సఫ్ఫః అబ్బాస్సిడ్ రాజవంశ స్థాపకుడి బందువు  మరియు అల్-మన్సూర్ కాలిఫెట్ సమయంలో బస్రా, ఒమన్, మరియు బహారిన్   గవర్నర్ గా ఉండేవాడు. విద్యావంతురాలు అయిన జైనాబ్ హదీసు విద్వాంసురాలు మరియు ఆమె శిష్యులుగా అనేక పురుషులు ఉండేవారు.  
పన్నెండవ శతాబ్దంలో బాగ్దాద్ లో అద్యయనం చేసి  మహిళా మణిగా ప్రసిద్ది చెందిన షుహదః బింతె అహ్మద్  హదీసులలో గొప్ప విద్వాంసురాలు మరియు న్యాయవేత్త.
'జైనబ్ బిన్తె కమల్ 400 కంటే పుస్తకాలు ఎక్కువ పుస్తకాలు డమాస్కస్ లోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో భోదించారు మరియు విద్యార్ధుల పట్ల అసాధారణ సహనం ప్రదర్శించారు.
ఫాతిమా బిన్తె ముహమ్మద్ అల్-సమర్కండి న్యాయ శాస్త్రవేత్త అయిన తన భర్తకు ఫత్వాలు జారి చేయడం లో సలహా ఇచ్చేవారు.
ఇటీవల, పంతొమ్మిదవ శతాబ్దంలో నైజీరియా కు చెందిన నానా ఆస్మా ఒక కవయిత్రి, గురువు, మరియు తన  తండ్రికి సలహాదారునిగా పనిచేసారు.

పరిపాలనా వేత్తలు:
పదకొండవ శతాబ్దం లో యెమెన్ ను 71 సంవత్సరాలు పాలించిన అరవ-అల్-సులయ్హీ  పవిత్ర స్త్రీగా పేరుగాంచినది మరియు పదమూడవ శతాబ్దంలో తన భర్త మరణం తర్వాత ఈజిప్ట్ యొక్క పాలనా భారం తీసుకొన్నది సుల్తానా షాజరాట్ అల్-డర్.
సలాఉద్దిన్ అయ్యబి మేనకోడలు మరియు కోడలు ధయ్ఫా ఖాతూన్ ఆమె కుమారుడు కింగ్ అబ్దుల్ అజీజ్ మరణం తరువాత అలెప్పో రాణి అయ్యారు మరియు ఆరు సంవత్సరాలు పరిపాలించారు. ఆమె పాలన సమయంలో ఆమె క్రూసేడర్స్, ఖుర్జ్మేయిన్, మంగోల్ మరియు సెల్జుక్ లనుండి బెదిరింపులను ఎదుర్కొన్నారు. ఆమె అలెప్పో లో రెండు పాఠశాలలు స్థాపించారు.
సిట్టఅల్-ముల్క్ ఈజిప్ట్ కు చెందిన ఒక ఫాతిమిడ్ యువరాణి ఆమె పరిపాలన ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ఉంది.
తొమ్మిదవ శతాబ్దపు ఖలీఫా హరున్ అర్-రషీద్ భార్య జుబేదా  మక్కా ప్రముఖ ప్రధాన మార్గాల్లో యాత్రికులకు   నీటి వసతి  మరియు అతిథి గృహాల నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఆమె కవులు మరియు రచయితలను ఆదరించినది.  మక్కా శివారులో ప్రసిద్ధ జుబేదా నీటి ఊట ఇప్పటికీ ఆమె పేరు అజరామరం చేసింది.
ప్రముఖ చరిత్ర కారుల  ఉద్దేశంలో 13వ శతాబ్దం లో భారత దేశమును పరిపాలించిన రజియా సుల్తాన నూరుగురు కుమారుల కన్న మిన్న.
యజుజ్ సుల్తాన్ సలీం కాలం లో రోక్సిలేనా గా పిలువబడే హుర్రేం సుల్తాన్,  ఉక్రేన్ మీద  క్రిమియన్ టర్క్స్   దాడిలో పట్టుబడి  ఒట్టోమన్ సుల్తాన్ కింగ్ సులేమాన్ కు  బానిసగా బహుకరింపబడి ఆ తరువాత అతనిని వివాహామాడినది. ఆమె ఒక మదరాసా  మరియు ఒక పబ్లిక్ వంటగది, పురుషులు మరియు మహిళలకు వేరు-వేరు స్నాన శాలలు, రెండు పాఠశాలలు మరియు మహిళల యొక్క ఆసుపత్రితో కూడిన మసీదు కాంప్లెక్స్ ను    ఇస్తాంబుల్ లో నిర్మించినది. ఆమె మక్కా లో నాలుగు స్కూల్స్ మరియు యెరూషలేములో ఒక మసీదును నిర్మించినది.
ఆమినా పదహారవ శతాబ్దంలో నైజీరియా లోని ఒక రాష్ట్రం రాణి. పదహారేళ్ళ వయసులో ఆమె రాజమాత అయ్యింది.  ఆమినా సైనిక నైపుణ్యాలను నేర్చుకోని ఆ రాష్ట్ర  అశ్విక దళం ప్రముఖ యోధురాలుగా  ఉద్భవించింది. 34 సంవత్సరాల తన పాలనలో, ఆమె అతిపెద్ద పరిమాణం లో భూభాగాన్ని విస్తరింపజేసినది. ఆమె హౌసా వ్యాపారులకు  సురక్షిత ప్రయాణాన్ని అనుమతించడానికి స్థానిక పాలకులను  బలవంతం చేసింది.  ఆమె నిర్మించిన మట్టి గోడ దుర్గాలు  ప్రజాదరణ పొందినవి.  ఆమె ప్రతి సైనిక శిబిరంలో చుట్టూ రక్షక గోడల నిర్మాణానికి ఆదేశించింది.ఇప్పటికీ వాటిని ఆమినా గోడలు అని  పిలుస్తారు.
1819 నుండి 1924 వరకు భూపాల్ ను పాలించిన బేగం కైఖుర్సు  జహాన్ కుటుంబం రైల్వే, వాటర్ వర్క్స్,  తపాలా వ్యవస్థ మరియు రవాణా మార్గాలు మెరుగుపరిచినది.
మేధోతనం  మరియు విద్యలో:
ముస్లిం మహిళలు మేధోతనం  మరియు విద్యలో విజయాలు సాదించారు.  సుతయ్త అల్ మహామిల్లి పదవ శతాబ్దపు  రెండవ సగంలో నివసించిన గణిత శాస్త్రవేత్త, మరియు బాగ్దాద్ లోని ఒక సంపన్న  చదువుకున్న కుటుంబం నుంచి వచ్చారు. ఆమె అరబిక్ సాహిత్యం, హదీసులు, న్యాయ మీమాంస మొదలగు అనేక రంగాలలో రాణించారు. ఆమె బీజగణితంలో అనేక సమీకరణాలకు పరిష్కారం కనుగొన్నారు. ఆమె ఇబ్న్ అల్ జౌజీ ఇబ్న్ అల్-ఖాతిబ్ బాగ్దాదీ మరియు ఇబ్నె కతిర్ వంటి చరిత్రకారులచే  కొనియాడబడింది.
కార్డోబ కు చెందిన లబన (పదవ శతాబ్దం, స్పెయిన్) గణితం లో మంచి  ప్రావీణ్యత గలది  మరియు అత్యంత క్లిష్టమైన జ్యామితీయ మరియు బీజగణిత సమస్యలు పరిష్కరించెది. ఆమె ఇస్లామిక్ స్పెయిన్, రెండోవ ఉమయ్యద్ ఖలీఫా అల్ హకం కు వ్యక్తిగత కార్యదర్శి గా నియమితురాలు అయ్యింది.

పదకొండవ శతాబ్దంలో నివసించిన అయేషా, అండాలస్ ప్రిన్స్ అహ్మద్ కుమార్తె, కవిత్వం  మరియు ప్రసంగo లో ఆమె   రాణించేను. ఆమె కవితలు కార్డోబ రాజ్యంలో అత్యుత్తమమైనవి  మరియు ఆమె వ్యక్తిగత  గ్రంధాలయం అత్యంత దుర్లభ గ్రంధాలతో నిండి ఉండెను.
పదకొండో శతాబ్దంలో అల్మోహడ్స్ యొక్క యువరాణి వాల్లదా కవితలు మరియు వాక్చాతుర్యo లో పేరు గాంచినది. ఆమె సంభాషణలు కడులోతుగా  మరియు ప్రకాశ వంతం గా ఉండేవి. 11వ శతాబ్దం లో వాల్లదా కార్డోబా ఐబీరియన్ ద్వీపకల్పం యొక్క ప్రతి మూల నుండి గద్య లేదా కావ్య కూర్పు లో పోటీదారులను ఓడించేది.  
పదకొండవ శతాబ్దం సెవిల్లె కు చెందిన అల్ ఘజానియా మరియు సఫియా ఇద్దరు వారి కావ్య మరియు ప్రసంగ కళ లో నిష్ణాతులు. సఫియా అందమైన  చేతివ్రాత మరియు ఆమె మాన్యుస్క్రిప్ట్ యొక్క అద్భుతమైన దీపాలంకరణలు ప్రసిద్ది చెందినవి.
అల్ –ఫైసులి కుమార్తె మిరియం అల్- ఫైసులి సాహిత్య విజయాలు  అండాలస్ అంతటా ప్రసిద్ధి చెందినవి. పదకొండవ శతాబ్దం చివరినాటికి ఆమె సూక్తుల వ్యంగ్య ప్రమాద తెలివి ఊహించనంతగా ఉంది.
అందమైన  చేతివ్రాత -  కలిగ్రాఫి మరియు ఇతర శాస్త్రాలు :
చేతివ్రాత కళ లో ప్రసిద్ది పొందిన ఒక పేరు లో తానా. ఆమె  ఇబ్న్-ఖయూమా గృహంలో ఒక బానిస గా ఉండేది.  ఇబ్న్ ఖయుమా ఎనిమిదవ శతాబ్దం ఖలీఫా మన్సూర్ కుమారులలో ఒకరికి శిక్షకుడు గా పనిచేస్తుండేవారు. అతను ఆనాటి ప్రముఖ కాలిగ్రాఫేర్ ఇషాక్-బిన్తె-హమ్మాద్ వద్ద శిక్షణ కొరకు తానా ను పంపుతాడు. తానా చేతిరాత అందంగా నగిషీలు చేక్కినట్లు ఉండెడిది.
పదకొండవ శతాబ్దపు ఉమ్మె-అల్-సాద్ ముస్లిం సంప్రదాయాలలో  ప్రసిద్ధి గాంచింది. అల్ ఫిహ్రిస్ట్-ఇబ్నె అల్ నడిమ్ అనే 18వ శతాబ్దపు చరిత్రకారుడు ఆమె  వివిధ నైపుణ్యాలు కల మహిళల్లో ఒకరిగా గుర్తించాడు.  
పదకొండవ శతాబ్దపు అరబ్ తెగల మహిళ ఒకరు అరబ్ మాండలికాలలో పండితురాలు. ఆమె  కు 'గిరిజన పురాణములు మరియు పదాల తో పరిచయం' ఉంది మరియు అరవ అనే ఆమె “ప్రబోధాలు, నీతులు, మరియు జ్ఞానం” పై ఒక పుస్తకం రాసింది.

రాస అనే పేరు గల ఒక భారతీయ  మహిళా వైద్య సంరక్షణ మరియు మహిళల రోగాల  రచయిత. ఆమె పుస్తకం అరబిక్ లో అందుబాటులో వైద్య పుస్తకల జాబితా లో  ఉంది. మరియః అల్-కిబ్తియ్యహ్ అనే ఈజిప్షియన్ మహిళా  ఏడవ శతాబ్దంలో రసవాదం లో పుస్తకాలు రచించినది.
10వ శతాబ్దం లో ఉత్తర సిరియా ను పాలించిన సయఫ్-అద్-దవల ఆస్థానం లో పనిచేసిన అల్-లిజిలియ్యః బిన్తె అల్-లిజ్జి అల్-అస్తుర్లబి అస్త్రోలబెస్ అనే విజ్ఞాన  శాస్త్రం లో ప్రముఖురాలు.
మహిళలు-వైద్య రంగం:
ఇస్లాం లో మహిళలు వైద్యులుగా పనిచేసినారు. వారు యుద్దరంగం లో గాయపడిన స్త్రీ-పురుషులకు వైద్యం చేసే వారు.
మొదటి నర్సు గా ఖ్యాతి ప్రవక్త (saws) సమయంలో జీవించిన రుఫయ్డ బిన్తె సాద్ అల్- అస్లమియ్య కు దక్కుతుంది.  ఆమె 624 CE లో బద్ర్ యుద్ధంలో గాయపడినవారికి వైద్యం చేసేది. ఆమె వైద్యుడు అయిన తన  తండ్రి, సాద్ అల్- అస్లామి వద్ద వైద్యం నేర్చుకొన్నారు.
అల్ షిఫా  బిన్తె అబ్దుల్లా అల్-కురైశియ అల్-అడవియః నాటి తెలివి గల మహిళా. ఆమె ప్రభుత్వ పరిపాలన మరియు వైద్యంలో నైపుణ్యం గలిగినది. ఆమె అసలు పేరు లయల కాని,అల్-షిఫా గా పేరుగాంచారు. షిఫా అనగా నయం చేసేది అని అర్ధం..
నుసైబా  బిన్తె కాబ్  అల్- మజ్నేవ ఉహుద్ యుద్ధం సమయంలో వైద్య సేవలు అందించింది. ఉమ్మె-ఇ-సినాన్ అల్-ఇస్లామి యుద్ధభూమిలో లోకి వెళ్ళడానికి మరియు గాయపడిన సైనికుల సహాయం మరియు నీటిని అందించడానికి ప్రవక్త(స) అనుమతి కొరకు విజ్ఞప్తి చేసింది. ఉమ్మెవర్క  బిన్తె హరిత్ ఖురాన్ క్రోడీకరణ లో పాల్గొంది మరియు బద్ర్ యుద్ధంలో గాయపడిన వారికి సేవలు అందించినది.
నుసైబా  బిన్తె అల్- హరిత్ ఆమెను ఉమ్ అల్-అతియా అని కూడా పిలుస్తారు, ఆమె యుద్ధభూమిలో గాయపడిన వారిని  సంరక్షించారు మరియు ఆహారo మరియు నీరు మరియు ప్రథమ చికిత్స అందించారు మరియు సున్తీ కుడా చేసేవారు.
ఇస్లాం లో మహిళల మీద 40 వాల్యూమ్ రచయిత డాక్టర్ అక్రమ్ నద్వి తన పరిశోధనలో అనేక చారిత్రిక రికార్డులు తవ్వితీసారు. ఇస్లాం సంబంధిత సంప్రదాయాల అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించిన ముస్లిం మహిళల 8,000 బయోగ్రాఫికల్ ఖాతాలు ఉన్నట్టు  గ్రహించారు. ముస్లిం మహిళలు సమకాలీన పురుష ప్రపంచాన్ని  మించి రాణిoచారు.మహత్తర మేథో సంపత్తి సాధనగా గౌరవం మరియు గుర్తింపు అందుకునే ప్రతిబ వారిలో  ఉంది. అవకాశాలు మరియు ప్రేరణ లబిస్తే ఈ మహిళలు ఇస్లామిక్ నాగరికత చరిత్ర లో ప్రముఖ పాత్ర వహించేదరు.


No comments:

Post a Comment