మద్య నిషేధo మీద చర్చ భారతదేశం అంతటా ప్రారంభమైనప్పుడు మద్యం సేవించడం వల్ల
కలిగే ప్రభావాల నుంచి దాదాపు ప్రతి 96 నిమిషాలకు ఒకరు
మృతి చెందడం లేదా ప్రతి రోజు 15 మంది మరణిoచుతారని 2013 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి) గణాంకాల విశ్లేషణ
తెలుపుతుంది.
భారతదేశం లో మద్యం తలసరి వినియోగం 38 శాతం పెరిగింది. 2003-05 లో 1.6 లీటర్ల నుండి 2010-12 లో 2.2 లీటర్ల వరకు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక
తెలుపుతుంది.భారతీయులలో 11 శాతం మంది అమితంగా
తాగుతారని మరియు అది ప్రపంచ సగటు 16 శాతం ఉందని
తెలుస్తున్నది.
.
ఈ డేటా మద్యం సేవించడం ఒక మానసిక సమస్య కాదు ఒక ఆరోగ్య సమస్య అని
తెలుపుతున్నది. తమిళనాడు లో జె జయలిలత మే 23, న ముఖ్యమంత్రిగా
ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజున 500 మద్యం దుకాణాలు మూసివేసింది. ఏప్రిల్ లో
బీహార్ అమ్మకo, ఉత్పత్తి మరియు మద్యం వినియోగం పై నిషేధం విధించింది. ఆగష్టు 2014 లో కేరళ మద్యo అమ్మకాలపై నిషేధం విధించినది కాని ఐదు
నక్షత్రాల హోటళ్లులలో మద్యం అమ్మకాన్ని
అనుమతించినది.
కేరళ,
తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల ముందు జరిపిన సర్వేలలో మద్య నిషేధానికి విస్తృత మద్దతు లభించింది. కేరళలో
పురుషులు మరియు మహిళల్లో 47 శాతం, తమిళనాడులో 52 శాతం పురుషులు మరియు మహిళలు మద్య నిషేదానికి అనుకూలంగా
ఉన్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్స్ నివేదిక వెల్లడించినది. నిషేదానికి ప్రముఖ కారణం
గృహ హింస మరియు మరణాలు అని మద్య నిషేదవాదులు చెప్పారు.
మద్యం పై తాజా నిషేదానికు ముందు గుజరాత్, నాగాలాండ్ ఏకైక భారత రాష్ట్రాలు మద్యం పై నిషేదం
విధించాయి.మహారాష్ట్ర మద్యం సంబంధిత మరణాలలో ముందు స్థానం లో ఉంది.
మహారాష్ట్ర, ఆ తురువాత మద్య ప్రదేశ్,తమిళనాడు అత్యంత మద్యం సంబంధిత మరణాలు
కలిగి ఉన్నవని ఎన్సిఆర్బి(NCRB) గణాంకాలను బట్టి తెలుస్తుంది. మద్యంనకు అధిక క్రైం రేట్ కు
మద్య సంభందం ఉన్నాదని తెలుస్తున్నది.
"మేజర్ నేరాలు మరియు ప్రమాదాలకు కారణం మరియు మద్యం
పలితంగా మహిళలపై లైంగిక వేధింపులు మరియు దొంగతనాలకు దారితీస్తుంది అని తమిళనాడు మక్కల్ అధికారం (పీపుల్స్ పవర్) ఎస్ రాజు BBC కు చెప్పారు.
"మద్యపానం వలన తమిళనాడు లో 30 సంవత్సరాల లోపు వితంతువులు అతిపెద్ద సంఖ్య లో” ఉన్నారు.కేరళలో ఆసుపత్రుల్లో చేరే వారు మరియు జరిగే నేరాల్లో 69 శాతం మద్యం వలన అని ఆల్కహాల్ అండ్ డ్రగ్ ఇన్ఫర్మేషన్
సెంటర్ అనే ఒక NGO సంస్థ ది ఎకనామిస్ట్ లో
ఉటంకించినది.
2014 లో ప్రతి రోజు ఐదుగురు ప్రజలు కల్తీ మద్యం సేవించిన తరువాత మరణించుతున్నారు.
2015 లో కల్తి మద్యం వినియోగం వలన 100 మంది కంటే ఎక్కువ మంది మాల్వాణి,
ముంబై, లో మరణించారు. అది విస్తృత దౌర్జన్యంకు దారితీసినది. 2014 లో 1,699 మంది కల్తీ / అక్రమ మద్యం వలన మరియు 2013 లో 387 మంది మరణించారు. అనగా 2014 లో 339 శాతం పెరిగింది కనపడింది.
అయితే నిషేధం వలన వ్యసనం మరియు మరణాలు
తగ్గ పోవచ్చు అని హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఆఫ్,
లండన్ స్కూల్ లో ఒక
ప్రముఖ ప్రజా ఆరోగ్య నిపుణుడు విక్రమ్ పటేల్
ఇండియన్ ఎక్స్ప్రెస్ కాలమ్ లో వాదించాడు.
" పని లేని ప్రజలకు ఆనందం
ఇచ్చే పదార్థo మత్తు అని అతను రాశాడు. "వ్యసనం ఒక ఆరోగ్య సమస్య
ఒక నైతిక సమస్య కాదు మరియు దాని భారం తగ్గించేందుకు అనేక
వ్యూహాలు ఉన్నాయి. మద్య నిషేధం సాంఘిక సమస్యలను పరిష్కరించటంలో విఫల మైనది. అనేక
మంది ప్రజారోగ్య శాస్త్రవేత్తలు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ కుడా మద్య నిషేదాన్ని సిఫార్సు
చేయ లేదు. "
గమనికలు:
Ø ఆల్కహాల్ ప్రభావం సంభవించే మరణాల నమోదు దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రాల వారీగా 2014 తరువాత నుండి ఆగిపోయింది. వాటిని మొత్తం
ఆకస్మిక మరణాలు లో చేర్చారు. కాబట్టి 2013 డేటా ప్రకారం వాటిని విశ్లేషించాము.
Ø మద్యం ప్రభావం వలన సంభవించే మరణాలు ఎక్కువగా గుండెపోటు / మూర్ఛ వలన కూడా సంభవించ
వచ్చు. అందుకే మరణించినవారి సంఖ్య
ఖచ్ఛితంగా రూఢీపరచుకోవటం కష్టం కాబట్టి కేవలం "మద్యం
ప్రభావం" అనే అంశం క్రింద గణాంకాలను ఉపయోగించాము.
.
No comments:
Post a Comment