18 June 2020

విద్యార్ధులు – ఆత్మహత్యలు

Student suicides in Pakistan: More than a mental health issue

నేడు స్కూల్  మరియు కాలేజీలలో విద్యార్ధులు డిప్రెషన్ లాంటి తీవ్రమైన మానసిక సమస్యలతో భాదపడుతున్నారు. ఆ మానసిక సమస్యలను ఏవిధంగా దూరం చేయవచ్చునో నిపుణులు సూచిస్తున్నారు.
·       కొచీలో ఒక మొదటి సంవత్సరం ఇంజనీరరింగ్  సీనియర  విద్యార్థుల రాగింగ్ కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
·       19ఏళ్ల వైద్య విద్యార్థి పూనే యొక్క క్వారీ నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
·       18ఏళ్ల కామర్స్ విద్యార్ధి  ముజఫర్నగర్  రైల్వేస్టేషన్ వద్ద ఒక రైలు ముందుకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
·       ఒక మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్ధి పరీక్షలో విఫలమైన కారణంగా తర్వాత ఒక సంవత్సరం కోల్పోవుతాను అనే భయంతో తిరువంతపురంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విధమైన విద్యార్థుల ఆత్మహత్యలు  దాదాపు ప్రతిరోజూ వార్తలలో భాగంగా మారుతున్నవి.

మరొక సంఘటనలో హైదరాబాద్  లలితకళల(Fine Arts)యొక్క మొదటి సంవత్సరం విద్యార్థి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతని డైరీలో "ఎందుకు నేను బాగాచదవ లేకపోయాను? ఎందుకు నేను ప్రతిదానికి భయపడతున్నాను? ఎందుకు ఎవరితోనైనా కలిసి పనిచేయ లేకపోతున్నాను? ఎందుకు నేను ఎల్లప్పుడూ సంతోషం తో ఉండ లేక పోతున్నాను? అనే వాక్యాలను గమనించారు.

నవీన్  (పేరుమార్చబడింది), కళాశాలలో డిప్రెషన్ తో బాధపడుతున్న ఒక కంటెంట్ రచయిత. అతను అంటున్నాడు: " డిప్రెషన్ మొదట్లో ఆందోళనతో మొదలవుతుంది మరియు ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది మరియు నెమ్మదిగా డిప్రెషన్ పెరుగుతుoది. ఒకరి జీవితం లోని కొన్ని లేదా అనేక ఇతర కారణాలవల్ల డిప్రెషన్  ఏర్పడుతుంది. తన చుట్టూ ఉండే అందరికీ సమస్యలు తన వల్ల అని ఆలోచించడం మొదలవుతుంది. దానివల్ల భయం మరియు భావోద్వేగాలు ఏర్పడుతాయి. మానసిక కల్లోలం వల్ల తరచుగా నిద్రపట్టదు లేదా చాలా సేపు పడుకుంటారు. మూడ్ మారతు ఉంటుంది. ఈ భావోద్వేగాలు నిజంగా బలమైనవి గా మారినప్పుడు, ఆత్మహత్య ఆలోచనలు మొదలవుతాయి

"సాధారణంగా, ప్రజలు తమ జీవితంలోని హెచ్చుతగ్గులను అధిగమించడానికి ప్రయత్నించుతారు. కానీ నిరాశతో బాధపడుతున్న వ్యక్తికి, ఒక చిన్న ఓటమి కూడా భారీగా కనిపిస్తుంది. ఇది ఆందోళన పెంచడానికి దారితీస్తుంది మరియు ఒక అంత్య దశకు చేరుకుంటుంది అని” నవీన్ వివరిoచుతాడు.

డాక్టర్ చంద్రశేఖరన్, నేహా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు ఒక మనస్తత్వవేత్త. అయన  అబిప్రాయం లో “నిరాశ  నిస్పృహలు యువకులలో చిన్న వయస్సు లోనే ప్రారంభం అవుతాయి. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల అంచనాలు మరియు మంచి మార్కులు స్కోర్ చేయాలనే ఒత్తిడి కొన్నిసార్లు విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్నికలిగిఉంటుంది. వారు విఫలమైతే, తిరస్కారం పొందుతారు.. ఇది తల్లి మరియు తండ్రి మరియు తోబుట్టువుల విడాకులులేదా కుటుంబ సమస్యలవల్ల సంభవించవచ్చు.

డిప్రెషన్ సమస్యకు మరొక ముఖ్యకారణం “తల్లిదండ్రులు బలవంతంగా విద్యార్ధికి ఆసక్తిలేని కోర్స్ లో చేర్చుట” అని డాక్టర్ వి శామ్యూల్, చెన్నైఆధారిత మానసికవేత్త వివరిస్తున్నారు. అతని ప్రకారం “తల్లిదండ్రుల ఒత్తిడితో విద్యార్థులు ముందుకు సాగుతున్నారు కాని కోర్సు అర్ధంకాక ఎo చేయలో తెలియక డ్రాప్-అవుట్ గా మిగులుతున్నారు. వారి విశ్వాసం దెబ్బతింటుంది. అనేక కళాశాలలో వెక్కిరించడం మరియు ర్యాగింగ్ ప్రబలంగా ఉండటం మరొక ప్రధాన కారణoగా చెప్పవచ్చు. ఇవి వారి స్నేహితుల ద్వారా జరుగుతుంది. సున్నితమైన విద్యార్థులపై ఇది ఒక భయంకరమైన ప్రభావం కల్గిస్తుంది మరియు వారిని ఆత్మహత్యకు పురిగొల్పుతుంది. " అని అంటాడు.
అమ్మాయి/అబ్బాయి ద్వారా తిరస్కరణ మరొక సమస్య? గత ఐదు సంవత్సరాల నుంచి ఈ కారణం చాలా తక్కువగా ఉంది. అంతకు ముందు విఫలమైన సంబంధాలు సమస్యగా ఉండేవి. కానీ ఈరోజుల్లో యువకులు బహుళ సంబంధాలు కలిగి ఉంటునారు. ఒక సంబంధం విఫలమైతే వారు భాదపడటం లేదు?అలాగే, ప్రేమ వైఫల్యాల గురించి నేటి యువతరo మరింత ప్రాక్టికల్ గా ఉంటున్నారు. వారు మొదట దాని ప్రభావితంతో ఉన్నప్పటికీ, క్రమంగా వారు దాని నుండి బయట పడుతున్నారు "అని డాక్టర్ రవి చెప్పారు.

డిప్రెషన్ లక్షణాలు
"డిప్రెషన్ తో బాధపడుతున్న విద్యార్థులు సులభంగా విసుగు పొందుతారు. నేరాన్ని చేసిన భావన కూడా వారిలో కొనసాగుతుంది. వారు తమ తల్లిదండ్రుల అనుమతి పొందలేనప్పుడు, తాము ఏదోతప్పు చేసాము అని భావిస్తారు. కొన్నిసార్లు, వారు తాము శిక్షింప బడుతున్నామని భావిస్తారు.ఇది తర్వాత, బాధపడటంకు దారితీస్తుంది, మరియు వారు డిప్రెషన్  లోకి పోతారు” అని డాక్టర్ సుమతి వివరిస్తుంది

ప్రధాన సమస్య ఏమిటంటే ప్రజలు సాధారణ బాధపడటంకు మరియు వ్యాకులత(డిప్రెషన్)కు మధ్య తేడాను గుర్తించరు.  వైద్యపరంగా డిప్రెషన్ కు గురి అయిన వ్యక్తిని గుర్తించడం గురించి  మాట్లాడుతూ డాక్టర్ సుమతి  అంటారు: "మాంద్యం(డిప్రెషన్) కు గురిఅయిన వ్యక్తి అదే పనిగా తినడం లేదా తక్కువగా అసలు తినరు. మరొక వైద్యలక్షణం (Anhedonia) వారు తాము చేసే పనులలో ఆసక్తి కోల్పోతారు, TV చూడటం, స్నేహితులతో బయటకు వెళ్లిడం మరియు సంతోషంగా ఉండటం మొదలైనవి. అప్పుడు వారిలో "ఆత్మహత్య భావన ఏర్పడుతుంది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఆ  ఆలోచన వాస్తవం అవుతుంది.

ముందుకుదారి

“విద్యార్థుల చదువుశైలి అనగా చదివే విధానం మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరగవలయును. కేవలం వల్లె వేయకుండా వారు విషయమును అర్ధం చేస్కొని చదవవలయును. వారు 100శాతం పరిపూర్ణతకి ఆశ పడరాదు అది ఒత్తిడికి దారితీస్తుంది. తల్లిదండ్రులు వారిని తమ ఆసక్తిరంగంలో కొనసాగించేందుకువీలు కల్పించాలి” అని డాక్టర్ మంజు  మెహతా వైద్యసంబంధ మనస్తత్వవేత్త, ఎయిమ్స్, న్యూఢిల్లీ వివరిస్తుంది.

"మరొక విషయం పరిక్షలు మరియు పోటి పరిక్షాల విషయం లో విద్యార్ధుల అవగాహన మార్చవలయును.విద్యార్ధులను వారికి ఇష్టమైన రంగంను ఎన్నికోన నీయవలయును. అవసరమైతే సంబంధిత ప్రవర్తన చికిత్స ఇప్పించవలయును” అంటారు డాక్టర్ మంజు. తల్లిదండ్రులు మరియు తోబుట్టువులు వారితో ఒకమంచి సంభంధం కలిగి ఉండ వలయును” అని డాక్టర్ సుమతి  చెప్పారు.

"ఈరోజుల్లో తల్లిదండ్రులు వారి పిల్లలుకు కనెక్ట అవుట లేదు. వారు తమ జీవితాలతో బిజీగా ఉండి తమ పిల్లలు ఏమి చేస్తున్నారో గమనించడం లేదు.  . తల్లిదండ్రులకు తమ పిల్లలు ఏమిచేస్తున్నారో తెలిస్తే వారు సులభంగా వారి సమస్యను గుర్తించడానికి (ఉపసంహరణ లక్షణాలు గుర్తించడానికి) వీలవుతుంది” అని ఆమెఅంటారు..

ఒక దీర్ఘకాల పరిష్కారం కొరకు, సంరక్షణ ప్రారంభ సంవత్సరాల నుండి తీసుకోవాలి అని  డాక్టర్ సుమతి  ఉద్ఘాటిస్తుంది.

"తల్లిదండ్రులు చెయ్యవలసిన అతి ముఖ్యమైన విషయం వారి పిల్లలకు ప్రాముఖ్యత, విలువ మరియు గౌరవం ఇవ్వాలి. మరియు పిల్లలు తలితండ్రుల మార్గం అంగీకరించడo కోసం ఇది ముఖ్యం అని  "ఆమె అన్నారు..

నవీన్ ప్రకారం సమస్య పరిష్కరించడానికి హాబీలు తోడ్పడును. సమస్యల గురించి ఆలోచిస్తూఉంటే నిరాశ ముమ్మరం.అగును. కథలు రాయడం భాదలు మరియు సమస్యలను తొలగించుట లో సహాయపడినది. సైక్లియాత్రిస్ట్ సహాయం పొందుట కొంతవరకు నిరాశను తొలగించును. మొదట్లో వ్యక్తి ఇతరులతో మాట్లాడడు.కాని వారు మంచి మనష్యులు. వారితో మనం భావాలను పంచుకోవాలి. అది చివరికి మనం వాళ్ళ  విశ్వాసం పొందటానికి ఉపయోగపడుతుంది అని శ్యాం వివరించుతాడు. మందులు కొంత వరకు ఉపయోగ పడును కాని వాటి ప్రభావం దీర్ఘకాలం ఉండదు. చివరకు మిమ్మల్లి మీరు మాత్రమే రక్షించు కోగలుగుతారు .మీరు బయటకు రావాలని అనుకొంటే రాగలుగుతారు.

కౌన్సెలర్లు లేకపోవడం
విద్యార్ధికి అత్యంత అవసరం స్టూడెంట్ కౌన్సిలర్స్. కాని మన దేశంలో నిపుణుల కొరత ఉన్నది. కళాశాలలు కౌన్సెలింగ్ సైకాలజీలో కార్యక్రమాలు ప్రారంభించినప్పటికి అభ్యాసన(practicals)లేదు. ఆచరణ నైపుణ్యాల పై దృష్టి సారించడం బదులు సిద్ధాంత వివరణ ఉంటుంది అని డాక్టర్ ఆర్.సుభాషిణి, డీన్ మరియు విభాగ అధిపతి మనస్తత్వశాస్త్ర విభాగం , మద్రాసు స్కూల్ అఫ్ సోషియోలజి చేప్పారు
ప్రభుత్వం మరియు వైస్-చాన్స్లర్లు , కౌన్సిలింగ్  విద్యాసంస్థలో భాగంగా ఉండాలి అని చెప్పడం జరిగి సంవత్సరాలు గడిచినప్పటికీ దానిని తీవ్రంగా తీసుకున్న ధాఖలా  లేదు మరియు నాణ్యత విషయం లో రాజీ సర్వసామాన్యం. సాధారణంగా విద్యాసంస్థలు కౌన్సిలర్గా నైపుణ్యం లేని వారిని నియమించి వారికి అన్ని బాద్యతల్యు అప్పజేప్పుతారు అని ఆమె చెప్పారు.

ఎందుకు శిక్షణ కలిగిన  సలహాదారులుగా అవసరం ఉంది? డాక్టర్ సుభాషిణి ప్రకారం , "సైకాలజీ నేపథ్యం కలిగి, అండర్గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్-గ్రాడ్యుయేట్ స్థాయి కలిగి ఉండటం కౌన్సిలర్ పదవికి అవసరం. వారు విద్యార్దుల  వ్యక్తిత్వ అభివృద్ధికి తోడ్పడుతారు.  వివిధ రకాల వ్యక్తిత్వంను వివిధ భావోద్వేగాలు పట్ల ఒక అవగాహన కలిగి ఉండడం వారికి అవసరం.


No comments:

Post a Comment