27 June 2021

అజీమాబాద్‌(పాట్నా)లో ఆజదరి స్థాపకుడు దూలిఘాట్ యొక్క నవాబ్ అహ్మద్ అలీ ఖాన్ ‘ఖయామత్’, Remembering Ahmad Ali Khan ‘Qayamat’, the Nawab of Doolighat who established azadari in Azeemabad

 




పాట్నా(ఒకప్పటి అజీమాబాద్) వీధుల్లో వేలాది మంది నల్లని దుస్తులు ధరించి, “హుస్సేన్! హుస్సేన్! అని నినదిస్తూ తమ గుండెలపై కొట్టుకొంటూ  కర్బాలా షా బాకర్ వైపు కదులుతున్నారు. పాట్నా వీధులు హుస్సేన్! హుస్సేన్! ”.అనే నినాదాలతో  నల్ల సముద్రంలో మునిగిపోయినట్లు కనిపిస్తున్నాయి. వీరు శతాబ్దాల క్రితం అమరత్వం పొందిన ఇమాం హుస్సేన్ ను తలచుకొంటు సంతాపం ప్రకటిస్తున్నారు. పాట్నాలోని అషురా’ (మొహర్రం 10 వ)రోజు  యొక్క ప్రస్తుత చిత్రం ఇది.

అజాదరి Azadari అనేది కర్బాలా యుద్ధ క్షేత్రంలో అమరత్వం పొందిన ప్రవక్త ముహమ్మద్(స) మనవడు ఇమామ్ హుస్సేన్ జ్ఞాపకార్థం జరుపబడే ఒక శౌక ఉత్సవం.  అషురా అనేది అజాదరి అనే పెద్ద సంప్రదాయంలో భాగం. ఆజాదరి “అజా (దుఖం) మరియు దారీ (చేయవలసినది) అనే పదాల నుండి వచ్చింది.సాహిత్యపరంగా   శోకం అని అర్థం.

భారతదేశంలో ఆజాదరి మొఘలుల రాకతో ప్రారంభమైనది. తైమూర్ లాంగ్ (బాబర్ చక్రవర్తి ముత్తాత) స్వయంగా ఒక ఆజాదర్ మరియు దాదాపు ప్రతి సంవత్సరం కర్బాలా (ఇమామ్ హుస్సేన్ మందిరం) ను సందర్శించేవాడు. మొఘల్ చక్రవర్తి  హుమయూన్ డిల్లి సింహాసనాన్ని పొందినప్పుడు అతనితో పాటు అనేక మంది పెర్షియన్ ప్రభువులు ఎక్కువగా షియా వర్గానికి చెందినవారు భారత దేశం వచ్చారు..

బీహార్‌లోని అజీమాబాద్ (ప్రస్తుత పాట్నా నగరం) ఆజాదరి యొక్క గొప్ప సంప్రదాయo పాటించే నగరాలలో  ఒకటి. పాట్నాలో ఆజాదరి సంప్రదాయం  ఒక సూఫీ ఆధ్యాత్మిక షా అర్జాన్ Shah Arzan రాకతో ప్రారంభమైంది. క్రీ.శ 1629 లో ఆయన మరణం వలన మొహర్రం కొన్ని సంవత్సరాలు ఆగిపోయింది. దీనిని తిరిగి షాజదా మీర్జా నౌజర్ అలీ సఫావి Shahzada Meerza Nauzar Ali Safavi ప్రారంభించారు, వారు తమ కుటుంబ సభ్యులకు మరియు వారితో సంబంధం ఉన్న వ్యక్తుల కోసం ఒక మసీదు మరియు తజియాఖానాను కలిగి ఉన్న ఒక ప్యాలెస్ (ఇమామ్ హుస్సేన్ యొక్క పవిత్ర మందిరం యొక్క ప్రతిరూపాన్ని ఉంచిన ప్రదేశం) నిర్మించారు,

క్రీ.శ 1722 లో  నవాబ్ సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్ బహదూర్ 'ఖయామత్ Nawab Syed Ahmad Ali Khan Bahadur ‘Qayamat ' ఏడు సంవత్సరాల కాలం నజాఫ్ అల్-అష్రాఫ్ Najaf Al-Ashraf (ఇమామ్ అలీ ఖననం చేయబడిన ఆధునిక ఇరాక్‌లోని ఒక నగరం) లో గడిపిన తరువాత అజీమాబాద్‌ కు  రాకతోనే  అజీమాబాద్‌లో ఆజాదరి స్థిరంగా మారింది.

సూఫీ అయిన అహ్మద్ అలీ చిన్న వయస్సులోనే మక్కా నగరానికి బయలుదేరాడు, హజ్ చేసిన తరువాత అతను మదీనా, కర్బాలాలోని పవిత్ర మందిరాలకు వెళ్లి చివరకు నజాఫ్‌లో స్థిరపడ్డాడు. నజాఫ్‌ నగరంలో అనేక మంది సూఫీలు ​​మరియు ఆధ్యాత్మికవేత్తలతో ఏడు సంవత్సరాల పాటు గడిపాడు. తిరిగి అజీమాబాద్కు తిరిగి వచ్చినప్పుడు, అహ్మద్ అలీ, అతను ఇమామ్ హుస్సేన్ (జరీహ్Zareeh) పవిత్ర మందిరం యొక్క మూడు ప్రతిరూపాలను తీసుకువచ్చాడు. అతను జరీహ్ ఉంచడానికి డూలిఘాట్ వద్ద మరొకటి, సంగిదాలన్ వద్ద మరొక ఇమాంబర Imambara నిర్మించాడు మరియు మూడవదాన్ని పాట్నాలోని గౌరీ స్తాన్ వద్ద కల సూఫీ ఆధ్యాత్మికవేత్త  మరియు అతని స్నేహితుడు షా అబ్దుల్ లతీఫ్  కు బహుమతిగా ఇచ్చాడు. ప్రతి సంవత్సరం మొహర్రం నెల 9వ తేదిన  తకియా షా బాకర్ ఇమాంబరా లో  మజాలి నిర్వహించేవాడు. ఇది అజీమాబాద్‌లో అజాదరి యొక్క అధికారిక స్థాపనను సూచిస్తుంది.

నవాబ్ సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్ బహదూర్ ఖయామత్అజీమాబాద్‌ లో మదర్సా-ఎ-దీనియా అనే కళాశాలను దూలిఘాట్‌లో స్థాపించాడు, అక్కడ అతను తన జీవితాంతం వరకు విద్యార్థులకు చదువు నేర్పించాడు. డూలిఘాట్‌లోని ఈ సంస్థ చివరికి అబ్బాసియా కాలేజీగా మారి 1934 సంవత్సరం వరకు ఉనికిలో ఉంది, భూకంపం ఎస్టేట్‌లోని ఇతర భవనాలతో పాటు దానిని నాశనం చేసింది ..

నవాబ్ అహ్మద్ అలీ ఖాన్ బహదూర్ “ఖయామత్” పేరు  క్రింద పెర్షియన్ భాషలో విస్తృతంగా రాశాడు. అతన్ని అతని కాలపు ముఖ్యమైన మార్సియా-నిగర్ (మోనోడిస్ట్) గా భావిస్తారు. అతను ఆధ్యాత్మిక సాధన మరియు హజ్రత్ అలీ భక్తుడు. ఇది ఆయన కవిత్వంలో ప్రతిబింబిస్తుంది. అతను మొత్తం 1291 గజల్స్‌ ను వ్రాసాడు మరియు వాటిని దివాన్ రూపంలో సంకలనం చేశాడు

నవాబ్ అహ్మద్ అలీ ఖాన్ ఖయామత్సంగిదలాన్‌తో పాటు దూలిఘాట్‌లో ఆజాదరిని స్థాపించిన తరువాత 1778 లో మరణించాడు. అతను మరణించిన 20 సంవత్సరాలలో, అజాదరి యొక్క ఇతర ముఖ్యమైన ప్రదేశాలను కల్నల్ కల్బే అలీ ఖాన్ నౌజర్ కత్రా మరియు సుల్తాన్ గంజ్ వద్ద పాట్న నగరంలోనే స్థాపించారు.

ఆజాదరి ఆచారాలలో హిందూ సమాజం కూడా పాల్గొనేది. మహారాజా రామ్ నరేన్ మౌజున్కూడా ఆజాదరి ఆచారాలలో పాల్గొన్నారని చెబుతారు.

అజీమాబాద్‌లోని అజాదరి చాలా మటుకు పెర్షియన్ రూపం లో కన్పిస్తుంది. ఈ రోజు, అజాదారీ షియా సమాజంతో పాటు ఇతర వర్గాల (హిందువులు మరియు సున్నీలు) ప్రమేయంతో ముహర్రం యొక్క భారతీయ రూపాన్ని సూచిస్తుంది.

 

.

No comments:

Post a Comment