4 June 2021

రాగి యొక్క ఆరోగ్య ఉపయోగాలు Health Benefits Of Ragi





 

రాగి (Finger Millet) (ఎల్యూసీన్ కొరకానాఅమ్హరిక్లో తోకూసో) ని ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని వ్యవహరిస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. దీనిని ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాలోని మెట్టప్రాంతాలలో పండిస్తారు. రాగి స్వస్థలము ఇథియోపియా లోని ఎత్తుప్రదేశాలు అయితే నాలుగువేల సంవత్సరాలకు పూర్వము భారతదేశములో ప్రవేశపెట్టబడినది. ప్రపంచవ్యాప్తముగా రాగిని దాదాపు 38 లక్షల హెక్టార్లలో సాగుచేస్తున్నారని అంచనా.

రాగులు గోధుమ లేదా ఇతర ధాన్యాలకు ప్రత్యామ్నాయంగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. రాగుల పిండిని ఉదయం మజ్జిగ తొ గాని బెల్లం తొ గాని తీసుకొంటే అద్భుతమైన పోషకాలు పొందవచ్చు

 

రాగిలో మిథియోనైన్ అమీనో ఆమ్లం పుష్కలంగా ఉంది. రాగులతో  కేకులు, పుడ్డింగులు, పారిట్జులు చేసుకోవచ్చు.

 

పోషకాహార వాస్తవాలు మరియు విలువ

100 గ్రాముల రాగి పిండి పోషక విలువ:

ముఖ్యమైన పోషకాలు:కేలరీలు 455,మొత్తం కొవ్వు 5.1 గ్రా

ట్రాన్స్ ఫ్యాట్ 0 గ్రా,సోడియం 4.8 మి.గ్ర,కార్బోహైడ్రేట్లు 89 గ్రా

పొటాషియం 267 మి.గ్రా,చక్కెరలు 2 గ్రా,ఆహార ఫైబర్ 14.1 గ్రా

ప్రోటీన్ 13 గ్రా, కాల్షియం 1.3%,ఐరన్ 26%

విటమిన్లు: థియామిన్ (5%), రిబోఫ్లేవిన్ (7.6%), నియాసిన్ (3.7%), విట్ సి (7%), విట్E (4.6%)

 

రాగులు/తైదులు-ఆరోగ్య ప్రయోజనాలు

·         అధిక బరువు తగ్గటానికి: రాగుల్లోని ట్రిప్టోథాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. రాగులోని పీచు కడుపు నిండిన భావన కలిగించి, ఎక్కువగా తినకుండా చేస్తాయి. ఇవన్నీ బరువు తగ్గేందుకు తోడ్పడును.

·         ఎముక పుష్టికి: వీటిల్లో క్యాల్షియం దండిగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. ఎముక క్షీణతను నివారించి విరిగే ముప్పును తగ్గిస్తాయి.

·         మధుమేహం నియంత్రణకు: రాగుల్లోని ఫైటోకెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. దీంతో రక్తంలోకి గ్లూకోజు త్వరగా విడుదల కాదు. ఇలా రక్తంలో గ్లూకోజు స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి.

·         కొలెస్ట్రాల్ తగ్గేందుకు: లెసిథిన్మెథియోనైన్ అనే అమైనో ఆమ్లాలు కాలేయంలో పోగుపడిన కొవ్వును నిర్మూలిస్తుంది. ఇక థ్రియోనైన్ అమైనో ఆమ్లమైతే కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది.

·         రక్తహీనత: రాగుల్లోని ఐరన్ రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది.

·         ఆందోళన : వీటిల్లోని ట్రిప్టోథాన్ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. అందువల్ల ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నివారణకు తోడ్పడతాయి. కొన్నిరకాల పార్శ్వనొప్పులు తగ్గటానికీ ఉపయోగపడుతుంది.

·         కండరాల మరమ్మతుకు: ఐసోల్యూసిన్ అమైనో ఆమ్లం కండరాల మరమ్మతుకు, రక్తం ఉత్పత్తికి, ఎముక ఏర్పడటానికి, చర్మం ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. వాలైన్ అమైనో ఆమ్లం జీవక్రియ సరిగా జరగటంలో పాలుపంచుకుంటుంది. కండరాలు సమన్వయంతో పనిచేయటానికి, శరీరంలో నైట్రోజన్ సమతుల్యతకు తోడ్పడుతుంది.

·         వృద్ధాప్యం దూరంగా: రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణలోపాన్ని దూరంగా ఉంచొచ్చు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండానూ చూసుకోవచ్చు.

·       అవసరమైన అమైనో ఆమ్లాల మూలం: రాగి శరీరానికి కీలకమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. రాగి/ ఫింగర్ మిల్లెట్‌లో ట్రిప్టోఫాన్, థ్రెయోనిన్, వాలైన్, ఐసోలూసిన్ మరియు మెథియోనోయిన్ అనే అమైనో ఆమ్లాలు ఉన్నాయి.

రాగి/ఫింగర్ మిల్లెట్ ని  రోటీ (పులియని పాన్కేక్), ముడ్డే (గట్టి గంజి / డంప్లింగ్) మరియు అంబ్లి (సన్నని గంజి) రూపంలో తీసుకుంటారు. గంజి, ఉప్మా, కేకులు మరియు బిస్కెట్లు తయారు చేయడానికి రాగిని ఉపయోగించవచ్చు. రాగి పిండిని దోసలు, ఇడ్లీలు మరియు లడూస్ వంటి వివిధ భారతీయ వంటలు చేయడానికి ఉపయోగిస్తారు. రాగి పిండిని పాలు, ఉడికించిన నీరు లేదా పెరుగుతో కలుపుతారు. రాగి మాల్ట్ భారతదేశంలోని దక్షిణ భాగాలలో వైద్యులు సిఫార్సు చేసిన ఆహార పానీయం.

 

 

 




 

 

  

No comments:

Post a Comment