22 June 2021

ముస్లింలు వృద్ధులతో ఎలా వ్యవహరిస్తారు? How Do Muslims Treat The Elderly?

 

 




 

 

 


ఇస్లామిక్ ప్రపంచంలో వృద్దులకు ప్రత్యెక గృహాలు లేవు. వృద్దులైన తల్లిదండ్రులను చూసుకోవటం ముస్లిముల పాలిటి ఒక గౌరవం, ఆశీర్వాదం మరియు గొప్ప ఆధ్యాత్మిక వృద్ధికి అవకాశంగా పరిగణించబడుతుంది. తల్లిదండ్రుల కోసం ప్రార్థించడమే కాదు, అపరిమితమైన కరుణతో వ్యవహరించమని దేవుడు మనలను అడుగుతాడు, మనలను చిన్నప్పుడు వారు అమితంగా ప్రేమించారని గుర్తుంచుకోండి. ఇస్లాం లో తల్లులు ముఖ్యంగా గౌరవించబడ్డారు: స్వర్గం తల్లుల పాదాల వద్ద ఉందిఅని ప్రవక్త(స) బోధించారు. వారు వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు, ప్రతి ముస్లిం తల్లిదండ్రులను అదే దయ మరియు నిస్వార్థతతో చూస్తారు.

 

ఇస్లాంలో తల్లిదండ్రులకు సేవ చేయడం ప్రార్థన చేయడం తరువాత రెండవ ముఖ్యమైనది  మరియు దానిని ఆశించడం తల్లితండ్రులుగా  వారి హక్కు. వారి పట్ల చికాకును వ్యక్తం చేయడం నీచమైనదిగా పరిగణించబడుతుంది.

·      
“నీ  ప్రభువు ఇలా నిర్ణయం చేసాడు: మీరు కేవలం ఆయనను తప్ప మరేవరిని ఆరాధించకండి. తెల్లితంద్రులతో మంచితనం తో వ్యవహరించండి.ఒక వేళ మీవద్ద వారిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారై ఉంటె, వారిముందు విసుగ్గా, “చీ” అని కూడా అనకండి, వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి.  మృదుత్వమూ, దయభావమూ కలిగి వారిముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్ధిస్తూ ఉండండి: ప్రభూ! వారిపై కరుణ జూపూ, బాల్యం లో వారు నన్ను కారుణ్యం తో, వాత్సల్యం తో పోషించినట్లు”-(దివ్య ఖురాన్ 17: 23-4)

 

No comments:

Post a Comment