25 May 2024

 

లోటా(మంచి నీళ్ళ చెంబు) 1857 తిరుగుబాటుకు కారణాలలో ఒకటి.

Bottom of Form

A curious case of Lotah & the Revolt of 1857

సల్మాన్ హైదర్

భారతదేశంలో 1857లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటుకు లోటా (మంచినీళ్ళ చెంబు) ఒక కారణమని ఎవరికైనా తెలుసా?

అవును, ఇది నిజం.

లోటా (మంచినీళ్ళ చెంబు) విప్లవానికి ఒక కారణం ఎలా అయిందో తెలుసుకొందాము..

 బ్రిటీష్ పాలకులు 1757లో ప్లాస్సీ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత భారతదేశంలో రాజకీయ శక్తిగా స్థిరపడ్డారు. బ్రిటీష్ పాలకులు తమ రాజకీయ నియంత్రణను కొనసాగించడానికి  భారతీయ ప్రజల సంస్కృతిని అధ్యయనం చేయడానికి ప్రయత్నించారు. ఈ అధ్యయనాలు క్రైస్తవ మిషనరీల సహాయంతో కూడా జరిగాయి. కాని భారతీయులకు త్రాగడానికి ఇత్తడి లేదా రాగి పాత్ర(లోటా) చాలా ముఖ్యమైనదని వారు అర్థం చేసుకోలేకపోయారు.

భారతదేశ ప్రజలు  ఇతర కులాలు/సంఘాల ప్రజల నుండి నీరు త్రాగరు. నీరు త్రాగటానికి వ్యక్తిగత లోటాను ఉపయోగిస్తారు. ఎవరి లోటా వారికి ప్రత్యేకంగా ఉంటుంది. . తాము త్రాగే లోటా ను  ఇతరులు తాకడానికి ఎటువంటి పరిస్థితులలోను  అనుమతించరు. ప్రతి వారికి వ్యక్తిగత లోటా (మంచినీరు త్రాగే చెంబు) ఉంటుంది. దానిని ఇతరులు ముట్టుకోరాదు.అది అతని వ్యక్తిగత ఆస్తి.

ప్రముఖ చరిత్రకారుడు జాదునాథ్ సర్కార్ తన ఎకనామిక్స్ ఆఫ్ బ్రిటీష్ ఇండియాలో భారతీయులకు  అత్యంత అవసరమైన వస్తువులలో నీరు త్రాగే లోటాను ఒకటిగా పేర్కొన్నాడు. మంచినీరు త్రాగే చెంబును హిందువులలో లోటా అని మరియు ముస్లింలలో బధ్నా లేదా అఫ్తాబా అని పిలుస్తారు మరియు లోటా సాధారణంగా ఇత్తడితో తయారు చేస్తారు. మహమ్మదీయులు  రాగితో చేసిన లోటా ను ఇష్టపడతారు.

బ్రిటీష్ వారు జైళ్లు, సైన్యం కంటోన్మెంట్లు మరియు ఇతర ప్రదేశాలలో వ్యక్తిగత లోటాలను తీసివేయడానికి ప్రయత్నించారు, ఇది భారతీయులచే వారిని క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నించే ప్రయత్నంగా భావించబడింది.

1834లో అలీపూర్ జైలులో వ్యక్తిగత లోటాలను జప్తు చేసేందుకు అధికారులు ప్రయత్నించినప్పుడు, ఖైదీలు మేజిస్ట్రేట్ రిచర్డ్‌సన్‌పై దాడి చేసి లోటాలతో హత్య చేశారు.

1857 తిరుగుబాటుకు సంబంధించిన దాదాపు అన్ని బ్రిటిష్ అధికారిక చరిత్రకారులు లోటా మరియు తిరుగుబాటు కథను రాశారు.

జాన్ విలియం కేయ్ తన ఎ హిస్టరీ ఆఫ్ ది సిపాయి వార్ ఇన్ ఇండియాలో 1857కి ముందు బ్రిటీష్ రాజ్‌పై అసంతృప్తికి లోటాను ఒక కారణమని భావించాడు.

విలియం కేయ్ ఇలా వ్రాశాడు, “ఒక హిందువు లేదా  మహమ్మదీయుడుకి  అతని వ్యక్తిగత లోటా లేకుండా ఏమీ జరగదు.. లోటా అనేది నీరు త్రాగే  ఒక లోహపు చెంబు. లోటా అతనిని మతపరంగా అపవిత్రత నుండి కాపాడుతుంది.

ఖైదీలు లోటా నుండి తమను విడదీసే ప్రయత్నoమును  తమ కులం, సంస్కృతి మరియు మతంపై ప్రత్యక్ష దాడిగా  చూశారు. విలియం కేయ్ ఇలా పేర్కొన్నాడు, “ఖైదీలు వ్యక్తిగత లోటాలను ఉపసంహరించే ప్రయత్నాన్ని ప్రతిఘటించారు మరియు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

లోటా విషయం పై తలయెత్తిన ఆందోళనను అణిచివేయడానికి అర్రా వద్ద ఖైదీలపై కాల్పులు జరపాలని బ్రిటిష్ ప్రభుత్వం  గార్డులను ఆదేశించగా, తిర్హూట్‌లోని మోజుఫర్‌పోర్‌లో ప్రజల ఆగ్రహజ్వాలలు భయంకరంగా మారినవి.  లోటా విషయం లో ఖైదీలకు మద్దతుగా మరియు సానుభూతితో పట్టణం మరియు జిల్లా ప్రజలు  ఆందోళన చేపట్టారు. పట్టణంలోని దాదాపు అందరు నివాసితులు, ఖైదీల పట్ల సంఘీభావం ప్రకటించారు.

ఖైదీలు తప్పించుకుని  వారు ప్రభుత్వ ఖజానాను దోచుకోవడం మరియు పట్టణాన్ని దోచుకోవడం జరుగుతుంది  అన్న అనుమానం తో అదనపు దళాలను తీసుకురావడానికి ముందు, బ్రిటిష్ పౌర అధికారులు లోటాలను పునరుద్ధరించడం ద్వారా తిరుగుబాటుదారులను శాంతింపజేయడం సరైనదని భావించారు.

ఈ విధంగా 1857 తిరుగుబాటుకు లోటా ఒక కారణం అయ్యింది.

 

*పూర్వ కాలం లో మన  ప్రాంతం లో కూడా గ్రామాలలో శుభకార్యం జరిగినప్పుడు బంతి భోజనానికి ఆహ్వానించబడినప్పుడు విందుకు వెళ్ళే వారు  ఎవరికీ వారు తమతో పాటు మంచి నీరు త్రాగటానికి గ్లాస్/లోటా/చెంబు  తీసుకెళ్లటం గమనించే ఉంటారు.

No comments:

Post a Comment