ఖాన్ బహదూర్ నవాబ్జాదా సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ బీహార్‌లోని పాట్నా జిల్లా, బర్హ్ నివాసి. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ 1855 జనవరిలో జన్మించారు. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ తండ్రి, నవాబ్ సయ్యద్ అమీర్ అలీ ఖాన్ బహదూర్, అవధ్ నవాబులకు దివాన్‌గా ఉండేవారు. 1857 విప్లవ సమయంలో, నవాబ్ సయ్యద్ అమీర్ అలీ ఖాన్ బహదూర్ ను ఒక అధికారిగా పాట్నాకు పంపారు మరియు ఉరిశిక్ష నుండి చాలా మంది విప్లవకారులను కాపాడారని విలియం టేలర్ తన పుస్తకంలో వివరించారు.
సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ తన ప్రాథమిక విద్యను కలకత్తా మదర్సాలో అభ్యసించి, ఆ తర్వాత డోవెటన్ కళాశాలలో చేరారు. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ చిన్న వయసులోనే 1875 నుండి 1908 వరకు హుగ్లీ ఇమాంబారాకు ముతవల్లీగా పనిచేస్తూ, రాణించారు. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ ఉర్దూ మరియు పర్షియన్ భాషలలో అనేక పుస్తకాలను రచించారు, వాటిలో 1883లో 'నవరత్న' మరియు 1889లో 'దుర్ద్నా-ఎ-ఖయాల్, తబకాత్-ఎ-మొహ్సినియా' तबाक़ात ए मोहसिनिया ఉన్నాయి.
సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ 1890లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫెలో అయ్యారు. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ ఢాకా విశ్వవిద్యాలయం వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. మరియు అలీగఢ్ కళాశాలకు ట్రస్టీగా ఉన్నారు. 1922లో ఓరియంటల్ కాన్ఫరెన్స్ నిర్వహణ స్వాగత కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ హుగ్లీ మహమ్మదీయ సంఘానికి కార్యదర్శిగా మరియు హుగ్లీ మునిసిపాలిటీకి కౌన్సిలర్‌గా కూడా ఉన్నారు. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ కు 1893లో ఖాన్ బహదూర్ బిరుదు లభించింది. ఆయనకు 1903లో గౌరవ పత్రం (సర్టిఫికెట్ ఆఫ్ ఆనర్) ప్రదానం చేయబడింది.
1923లో
సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ బీహార్ మరియు ఒరిస్సా హజ్ కమిటీకి అధ్యక్షుడయ్యారు. 1924లో
సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ బీహార్ మరియు ఒరిస్సా శాసన మండలి సభ్యునిగా నామినేట్
అయ్యారు మరియు ఏప్రిల్ 1926లో బీహార్ మరియు
ఒరిస్సా నుండి కేంద్ర శాసనసభకు అనధికార సభ్యునిగా నామినేట్ అయ్యారు. జూలై 1929లో,
సర్
ఉమర్ హయత్ ఖాన్ స్థానంలో సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ రాజ్య మండలి సభ్యునిగా
నామినేట్ అయ్యారు, మరియు అక్టోబర్ 1929లో
ఖాన్ బహదూర్ నవాబ్జాదా సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ కన్నుమూశారు. సయ్యద్
అష్రఫుద్దీన్ అహ్మద్ ఏకైక కుమారుడైన సయ్యద్ అలీ నవాబ్,
ఆ
తర్వాత హుగ్లీ ఇమాంబారాకు ముతవల్లీ అయ్యారు.
No comments:
Post a Comment