14 October 2026

సుబ్తాయ్ ఖాన్1175 – 1248 మంగోల్ సైనాదిపతి सुबताई खान –1175 – 1248 मंगोल सैनिक जनरल .

 

డూడుల్ కావచ్చు

 

సుబ్తాయ్ ఖాన్ (Subutai Khan / Subutai) లేదా సుబేదార్ (సుమారు 1175 – 1248) మంగోల్ సామ్రాజ్య చరిత్రలో అత్యంత ప్రసిద్ధ మరియు శక్తివంతమైన సేనాధిపతి. సుబ్తాయ్ ఖాన్’  చెంఘీజ్ ఖాన్ మరియు ఆయన కుమారుడైన ఒగెడై ఖాన్ ల వద్ద ప్రధాన సైనిక వ్యూహకర్తగా పనిచేశారు. మానవ చరిత్రలోనే యుద్ధరంగంలో అత్యధిక భూభాగాన్ని జయించిన ఏకైక కమాండర్‌గా సుబ్తాయ్ ఖాన్ కు గుర్తింపు ఉంది. సుబ్తాయ్ ఖాన్ చైనా, రష్యా, మరియు ఐరోపా దేశాల వరకు సాగిన అనేక దండయాత్రలలో మంగోల్ సైన్యానికి అద్భుతమైన విజయాలను అందించారు.

సుబ్తాయ్ ఖాన్  తన జీవితంలో 20 కి పైగా సైనిక దండయాత్రలకు నాయకత్వం వహించారు. 32 వేర్వేరు దేశాలను/రాజ్యాలను ఓడించారు 65కి పైగా ప్రధాన యుద్ధాలలో విజయం సాధించారు. అలెగ్జాండర్, నెపోలియన్ వంటి గొప్ప వీరుల కంటే కూడా ఎక్కువ భూభాగాన్ని సుబ్తాయ్ ఖాన్  తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు చైనా, మధ్య ఆసియా, పర్షియా, రష్యా(కియేవన్ రూస్) దాటుకుంటూ తూర్పు యూరప్ (పోలాండ్, హంగేరి) వరకు మంగోల్ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో సుబ్తాయ్ ఖాన్  కీలక పాత్ర పోషించారు. సుబ్తాయ్ ఖాన్‌ పాల్గొన్న ప్రసిద్ధ యుద్ధాలు (ఉదాహరణకు: కల్కా నది యుద్ధం, మోహి యుద్ధం)

సుబ్తాయ్ ఖాన్, మంగోల్  చెంగిజ్ ఖాన్ యొక్క అత్యంత విశ్వసనీయ సేనాపతి. ఖ్వారాజం షానుజయించమని, అప్పటి దాక తన ముఖం చూపించవద్దని చెంగిజ్ ఖాన్ సుబ్తాయ్ ఖాన్ ని ఆదేశించాడు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఖ్వారాజం షా పారిపోయాడు. ఖ్వారాజం షా ని వెతకడానికి చెంగిజ్ ఖాన్ 20,000 మంది అశ్విక దళంతో సుబ్తాయ్ ఖాన్ ను పంపాడు.

సుబ్తాయ్ ఖాన్ ఇరాన్ గుండా ప్రయాణించి కాకసస్ పర్వతాలకు చేరుకున్నాడు. ఇరానీయ భాషలో వీటిని కోహె కాఫ్ పర్వతాలు అని పిలుస్తారు, ఇది దేవతలు మరియు రాక్షసులు నివసించే ప్రదేశం. ఈ కోహె కాఫ్‌లోనే జార్జియా అనే ఒక సంపన్న క్రైస్తవ రాజ్యం ఉండేది. సుబ్తాయ్ ఖాన్ సైనికులు జార్జియా భూభాగాన్ని దోచుకోవడం ప్రారంభించారు, ఇది జార్జియా రాజు సైనికులకు మరియు మంగోలులకు మధ్య యుద్ధానికి దారితీసింది. మంగోలులు పారిపోతు వారిని వెంబడిస్తూ వచ్చిన జార్జియా సైనికులను ఉపాయం తో బంధించి చంపారు. ఆ తర్వాత మంగోలులు ఇరాన్ మరియు అజర్‌బైజాన్‌లకు తిరిగి వెళ్లి, తీవ్ర విధ్వంసం సృష్టించి, తిరిగి  జార్జియాపై దాడి చేశారు. నిరంతర దాడుల కారణంగా, జార్జియా పాలకుడు లొంగిపోయాడు. జార్జియా పాలకుడు మంగోలులకు ఆహారం, ధాన్యం ఇచ్చి, కోహె కాఫ్ పర్వతాల గుండా వెళ్ళడానికి అనుమతించారు.

మంగోలులు కోహె కాఫ్ నుండి బయలుదేరి, ప్రస్తుత రష్యాలోని గడ్డి మైదానంలోకి ప్రవేశించినప్పుడు, వారికి కిప్చాక్‌లు किपचक అనే ఒక టర్కిక్ తెగ ఎదురైంది. వారితో పాటు వోల్గా ప్రాంతం, బల్గేరియా మరియు అలాoస్  वोल्गा, बुल्गारिया, अलांस ల నుండి వచ్చిన తెగలు కూడా ఉన్నాయి. సుమారు 50,000 మంది ఉన్న ఈ గిరిజన సైన్యం మంగోలుల ముందు నిలబడింది. యుద్ధం జరిగింది, మరియు మంగోలులు తరిమివేయబడ్డారు. మంగోలులు ఒక ఉచ్చు పన్నారు, కానీ కిప్చాక్‌లు కూడా మంగోలుల వలె సంచార జాతికి చెందినవారు మరియు వారికి మంగోలులతో పరిచయం ఉంది.

మధ్య ఆసియా గడ్డి మైదానంలోని తెగలకు ఒకరికొకరు పరిచయం ఉంది, కలుసుకునేవారు మరియు వ్యాపారం చేసుకునేవారు. అందువల్ల, కిప్చాక్‌లకు కూడా మంగోలుల యుద్ధ పద్ధతులతో పరిచయం ఉంది, అందుకే వారు మంగోలుల ఉచ్చును తప్పించుకున్నారు. సుబ్తాయ్ ఖాన్ ఒక ఉపాయం పన్ని, బంగారు నాణేలతో నిండిన ఒక పెట్టెను కిప్చాక్ తెగ నాయకుడికి పంపాడు. సుబ్తాయ్ ఖాన్ ఇరాన్, అజర్‌బైజాన్ మరియు జార్జియాల నుండి దోచుకొన్న బంగారం, వెండి మొత్తాన్ని కిప్‌చాక్ అధిపతికి పంపినాడు. సుబ్తాయ్ ఖాన్ ఒక లేఖ పంపి, "మనమిద్దరం సంచార జాతులం, మనలో మనం ఎందుకు పోరాడుకోవాలి?" అని అందులో రాస్తాడు.

బంగారం తీసుకున్న తర్వాత, కిప్‌చాక్ అధిపతి తన సైన్యంతో బయలుదేరతాడు, ఆ తర్వాత వోల్గా, బల్గేరియా మరియు అలాoస్ एलांस కు చెందిన వారిని మంగోలులు దారుణంగా ఊచకోత కోస్తారు. సుబ్తాయ్ ఖాన్  ఇంతటితో ఆగడు, సుబ్తాయ్ ఖాన్  బంగారం తీసుకువెళ్తున్న కిప్‌చాక్‌లను కూడా పట్టుకుని, వారిని ఊచకోత కోసి, వారి నుండి నిధిని తిరిగి తీసుకుంటాడు. కానీ కిప్‌చాక్ అధిపతి తన కుటుంబం మొత్తంతో కలిసి రష్యన్ సంతతికి చెందిన రాకుమారుల వద్దకు పారిపోతాడు. ఒక రష్యన్ రాకుమారుడు కిప్‌చాక్ అధిపతికి బంధువు కావడంతో, ఆ రష్యన్ రాకుమారులు అతనికి ఆశ్రయం కల్పించారు.

ఆ సమయంలో రష్యా కూడా భారతదేశంలాగే చెల్లాచెదురుగా ఉండేది. దానికి మాస్కో, కీవ్ అనే రెండు పెద్ద రాజ్యాలు ఉండేవి. ఆ రెండు రాజ్యాల రాకుమారులు మంగోలులతో పోరాడటానికి 60 వేల మంది సైనికులతో వచ్చారు. కిప్చాక్‌లను తరుముకుంటూ వచ్చిన సుబ్తాయ్ ఖాన్, రష్యన్ రాకుమారులతో "మాకు మీతో యుద్ధం లేదు, కిప్చాక్‌లను మాకు అప్పగించి మీ ప్రాంతాలకు తిరిగి వెళ్ళండి" అని చెప్పాడు.

కానీ రష్యన్ రాకుమారులు అహంకారంతో దానిని అంగీకరించలేదు. యుద్ధం జరిగింది మరియు మంగోలులు యుద్ధం లో వెనుదిరగడం ప్రారంభించారు. మంగోలులు పారిపోవడం ప్రారంభించినప్పుడు, రష్యన్ రాకుమారుల మధ్య వివాదం చెలరేగింది. కొందరు వారిని తరిమి చంపేయాలని, మరికొందరు వారి కోసం వేచి ఉండాలని అన్నారు. చివరకు, ప్రతి రాకుమారుడు తన సొంత సైనికులతో మంగోలులను తరుమాలని నిర్ణయించారు.

మంగోలులు 9 రోజుల పాటు పారిపోతూనే ఉన్నారు, కానీ అకస్మాత్తుగా కల్కా నది సమీపంలో వెనుదిరిగారు. వారిని వెoబడిస్తున్న  కొంతమంది రష్యన్ సైనికులు నదికి ఒకవైపు, మరికొందరు మరోవైపు ఉన్నారు. మంగోలులు మొదట తమ పక్షాన ఉన్నవారిని, ఆ తర్వాత అవతలి పక్షాన ఉన్న రష్యన్ సైనికులను  ఊచకోత కోశారు.

వృద్ధాప్యంలో చూపు మందగించినా, గుర్రం ఎక్కలేని స్థితిలో ఉన్నా కూడా ఒక బండి (Wagon) లో కూర్చుని సైన్యాన్ని నడిపిస్తూ సుబ్తాయ్ ఖాన్  విజయాలు సాధించారు. క్రీ.శ. 1248 లో తన 73వ ఏట సుబ్తాయ్ ఖాన్  మంగోలియాలో మరణించారు

 

 

.

No comments:

Post a Comment