లైలా మరియు మజ్నూన్, ఇరాన్, 16వ శతాబ్దం, నేషనల్
మ్యూజియం ఆఫ్ స్కాట్లాండ్, ఎడిన్‌బరో
"లైలా మరియు మజ్నూన్" అనేది 7వ శతాబ్దపు బెడూయిన్ కవి ఖైస్ ఇబ్న్ అల్-ములావ్వా మరియు అతని
ప్రేయసి లైలా బింట్ మహ్ది గురించిన ఒక ప్రసిద్ధ విషాద ప్రేమకథ. అరేబియా
ద్వీపకల్పంలో పుట్టిన "లైలా మరియు మజ్నూన్" కథ, యుగయుగాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినది.
మజ్నూన్ అని కూడా పిలువబడే ఖైస్ ఇబ్న్
అల్-ములావ్వా, లైలాను గాఢంగా ప్రేమించిన ఒక కవి. ఖైస్, లైలా పట్ల
తీవ్రమైన వ్యామోహాo తో అంతులేని ప్రేమకు ప్రసిద్ధి చెందాడు.
లైలా
మరియు మజ్నూన్ తాము చదువుకొనే మదర్సాలో కలుసుకున్నారు. అక్కడ వారు మొదటి చూపులోనే ప్రేమలో పడతారు.
లైలా ఒక ఉన్నత
కుటుంబానికి చెందిన అందమైన, సద్గుణవంతురాలైన యువతి. లైలా, ఖైస్‌ను
ప్రేమించింది, కానీ గిరిజన మరియు సామాజిక
ఆచారాల కారణంగా లైలా కు ఖైస్‌ను వివాహం
చేసుకోవడానికి అనుమతి లభించలేదు.
మజ్నూన్‌పై లైలాకు ప్రేమ ఉన్నప్పటికీ, లైలా తండ్రి ఆమెకు మరొక వ్యక్తి ఇబ్న్ సలామ్‌కు ఇచ్చి వివాహం చేస్తాడు,
ఇది మజ్నూన్‌ను తీవ్ర దుఃఖానికి గురిచేసింది.
లైలా,
విడిపోయిన తర్వాత, మజ్నూన్ అరణ్యంలోకి
వెళ్లిపోయి, అక్కడ ఒక పిచ్చివాడిలా జీవించాడు. మజ్నూన్ లైలాపై
తన ప్రేమ గురించి ఉద్వేగభరితమైన కవితలు రాశాడు, అవి వాటి
అందం మరియు తీవ్రతకు ప్రసిద్ధి చెందాయి.
లైలా వివాహం చేసుకున్నప్పటికీ, మజ్నూన్ పై ప్రేమను
వదుకులేక తీవ్రంగా బాధపడింది."మజ్నూన్" అనే
పేరు అరబిక్‌లో "ఆవహించబడినవాడు" లేదా "పిచ్చివాడు" అని
అనువదిస్తుంది, ఇది ఖైస్ యొక్క మానసిక స్థితిని మరియు లైలాపై
అతని అదుపులేని ప్రేమను ప్రతిబింబిస్తుంది.
లైలా మరియు మజ్నూన్ కథ తరచుగా ప్రేమ
యొక్క శక్తికి మరియు దానిని వ్యక్తపరచడంపై సామాజిక ఆంక్షల పర్యవసానాలకు ప్రతీకగా
పరిగణించబడుతుంది.
లైలా మరియు మజ్నూన్ కథ యొక్క వివిధ వెర్షన్లు ఉన్నాయి, వాటిలో పర్షియన్ కవి నిజామి గంజవి మరియు భారతీయ కవి అమీర్ ఖుస్రో చేసిన
అనుసరణలు adaptations కూడా ఉన్నాయి.
ఈ అనుసరణలు అసలు కథకు తమ సొంత అంశాలను జోడించి, దానిని మరింత
ప్రాచుర్యం కల్పించాయి.
నిజామీ
గంజవి అనే పర్షియన్ కవి తన “ఖంసా” కావ్యంలోని మూడవ భాగంలో 1188/584లో రచించిన
కథాకావ్యం ద్వారా లైలా-మజ్నూన్ ఇతివృత్తం అరబిక్ నుండి పర్షియన్, టర్కిష్ మరియు భారతీయ భాషలకు వ్యాపించింది.
అమీర్
ఖుస్రూ రచించిన ప్రేమికులైన మజ్నూన్ మరియు లైలా యొక్క శృంగార కథ. ఈ ప్రతిని 1506లో, బహుశా హెరాత్‌లో, సుల్తాన్ అలీ
మష్హది అనే కాలిగ్రాఫర్ రాశారు (బ్రిటిష్ లైబ్రరీ IO ఇస్లామిక్
383).
లైలా మరియు మజ్నూన్ కథ కొందరు ఉత్తమ పర్షియన్, మొఘల్ మరియు ఒట్టోమన్ దృశ్య కళాకారులను visual
artists ప్రభావితం చేసింది, వారు ఈ రచనల మాన్యుస్క్రిప్ట్‌లకు
చిత్రాలు వేశారు.
పర్షియన్
సూక్ష్మ చిత్రాలు ముఖ్యంగా లైలా మరియు మజ్నూన్‌ల చిత్రణకు ప్రసిద్ధి చెందాయి. ఈ
చిన్న-పరిమాణ కళాఖండాలు అత్యంత వివరంగా ఉంటాయి మరియు తరచుగా కథలోని సన్నివేశాలను
వర్ణిస్తాయి, పాత్రల భావోద్వేగాలను మరియు వారి
చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాన్ని ప్రదర్శిస్తాయి.
లైలా మరియు మజ్నూన్‌ల ప్రేమ కథ ను వర్ణించే మాన్యుస్క్రిప్ట్ చిత్రాలు
తరచుగా వారి ప్రేమకథలోని భావోద్వేగ తీవ్రతను సంగ్రహిస్తాయి. ఈ చిత్రాలు వారి భావాల
లోతును తెలియజేయడానికి ప్రకాశవంతమైన రంగులు, క్లిష్టమైన వివరాలు
మరియు భావవ్యక్తీకరణతో కూడిన ముఖ కవళికలను కలిగి ఉంటాయి.
లైలా మరియు మజ్నూన్ కథ సూఫీ ఆధ్యాత్మిక గ్రంథాలతో సహా ఇతర సాహిత్య రూపాలలో కూడా చిత్రీకరించబడింది. వారి ప్రేమ తరచుగా రూపకాలంకారంగా వ్యాఖ్యానించబడుతుంది, ఇది దైవంతో ఆధ్యాత్మిక ఐక్యత కోసం తపనను సూచిస్తుంది.
లైలా మరియు మజ్నూన్ కథ సాంస్కృతిక
సరిహద్దులను దాటింది మరియు పర్షియా (ఇరాన్), అరేబియా మరియు మధ్య మరియు దక్షిణ
ఆసియాతో సహా వివిధ ప్రాంతాలలో ప్రసిద్ది చెందినది. లైలా మరియు మజ్నూన్ ప్రేమ ఇతివృత్తంపై
మాన్యుస్క్రిప్ట్ చిత్రాలు మరియు కవిత్వం వివిధ కళా సంప్రదాయాలలో చూడవచ్చు.
లైలా మరియు మజ్నూన్ ప్రేమ కథ
ఈనాటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది, ప్రేమ యొక్క శాశ్వతమైన శక్తిని, విరహ వేదనను మరియు
సమాజం విధించే పరిమితులను హైలైట్ చేస్తుంది. లైలా మరియు మజ్నూన్ ప్రేమ కథకు
సంబంధించిన మాన్యుస్క్రిప్ట్ చిత్రాలు మరియు కవిత్వం వారి ప్రేమ యొక్క కాలాతీత
స్వభావానికి మరియు దాని కళాత్మక వ్యక్తీకరణకు నిదర్శనంగా నిలుస్తాయి.