నాగ్‌పూర్, మహారాష్ట్ర:
1857లో జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంలో
మాతృభూమి కోసం తమ రక్తాన్ని అర్పించి ప్రాణాలను అర్పించిన అసంఖ్యాక అమరవీరులు
మరియు స్వాతంత్ర్య సమరయోధుల పాత్రను గుర్తుంచుకోవాలి.
ఈ సందర్భం లో 1857 - మొదటి
స్వాతంత్ర్య యుద్ధంలో నాగ్‌పూర్‌లోని బ్రిటిష్ రెసిడెన్సి నివాసంపై దాడి చేయడానికి
మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలను ఎదుర్కోవడానికి ప్రణాళిక వేసిన నవాబ్ కాదర్ అలీ
మరియు అతని సహచరుల బలిదానాన్ని కూడా గుర్తుచేసుకోవాలి. మొదటి భారత స్వాతంత్ర్య సమరంలో
పాల్గొన్న నవాబ్ కాదర్ అలీ మరియు అతని సహచరులను నాగపూర్ కోటలో ఉరితీశారు.
మీరట్ లో ప్రారంభం అయిన ప్రధమ భారత స్వాతంత్ర్య సమర జ్వాల
తర్వాత,
నాగపూర్
ప్రాంతంలోని సైనికులు మరియు పౌరులలో కూడా ప్రజ్వలించింది. . జూన్ 13,
1857న,
మిషన్
హై స్కూల్ సమీపంలో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ లోని
భారతీయ సైనికులు కూడా ఆందోళనలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు
భయపడిన ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులలో
కొందరు కాంప్టీ కంటోన్మెంట్ వైపు పరిగెత్తగా, మరికొందరు సీతాబుల్డి
కోట లోపలికి వెళ్లారు. అయితే కొంతమంది భారతీయల ద్రోహం కారణంగానే దాడి ప్రణాళికలు
లీక్ కావడం మరియు తిరుగుబాటు వార్త బ్రిటిష్ అధికారులకు చేరడం జరిగింది.
బ్రిటిష్ అధికారులు, భారతీయ తిరుగుబాటుదారులను నియంత్రించడానికి
మరియు వారిని ఓడించడానికి ఇతర ప్రాంతాల నుండి మరిన్ని EIC
దళాలను
పిలిపించారు.
దివంగత రఘోజీ II
భార్య
రాణి బకా బాయి బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చింది మరియు విప్లవకారులను ప్రోత్సహించే లేదా సహాయం
చేసే ఎవరినైనా అరెస్టు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగిస్తామని హెచ్చరిక జారీ
చేసింది. కొందరు
దేశద్రోహులు
ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత,
కమిషనర్
ప్లోడెన్ ఒక రెజిమెంట్‌ను నాగపూర్ నగరంలోకి తరలించమని ఆదేశించాడు. టాలి వద్ద తిరుగుబాటు
సైనికుల క్యావలరీ calvary
నిరాశ చెందినారు.. మేజర్ ఆరో తిరుగుబాటు నాయకుల నుండి సమాచారం పొందడానికి
ప్రయత్నించాడు కానీ ఎవరూ పేర్లు చెప్పలేదు
రాణి బకా బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ
అధికారులకు సహకరించి తిరుగుబాటు సైనికులను బెదిరింపులతో నిరుత్సాహపరిచింది. కంపెనీ
అధికారులు, తిరుగుబాటుదారులను గుర్తించారు.
ఆయుధాలను స్వాధీన పరుచుకొన్నారు మరియు విచారణ తర్వాత,
తిరుగుబాటు నాయకులు
దిల్దార్
ఖాన్,
ఇనాయతుల్లా
ఖాన్,
విలాయత్
ఖాన్ మరియు నవాబ్ కాదర్ అలీలను విచారించి ఉరితీశారు. ఒక సాధారణ గొయ్యిలో ఖననం
చేయబడ్డారు
గెజిటీర్ క్లుప్తంగా ఇలా పేర్కొంది,
‘నాగపూర్ కోట లోపల నవ్
గజా బాబా అని పిలువబడే ఒక పెద్ద సమాధి- నవాబ్ కాదర్ అలీ మరియు
అతని ఎనిమిది మంది సహచరుల సమాధి. వారు కోట ప్రాకారాల వద్ద చంపబడి ఉరితీయబడ్డారు.’“వారందరినీ
తొమ్మిది గజాల పొడవున్న ఒక సాధారణ గొయ్యిలో ఖననం చేశారు. బ్రిటీష్ వారికి సాయపడిన
వారికి బహుమానంగా ‘జాగీర్లు’ లభించాయి.
ఆనాటి తిరుగుబాటుదారుల ఉరితీత గురించి గులాం
రసూల్ 'ఘమ్‌గీన్'
అనే
కవి ఫార్సీలో కవిత రాశాడు, అది డాక్టర్ మొహమ్మద్ షర్ఫుద్దీన్ సాహిల్ రాసిన 'తారిఖ్-ఎ-నాగ్‌పూర్'
పుస్తకంలో
ప్రస్తావించబడింది.
నాగ్‌పూర్ భౌగోళికంగా మధ్య భారతదేశంలో
భాగంగా పరిగణించబడుతుంది మరియు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో అతిపెద్ద నగరం. నాగ్‌పూర్
కోట చాలా కాలం పాటు టెరిటోరియల్ ఆర్మీ యొక్క 118
పదాతిదళ బెటాలియన్‌కు స్థావరంగా ఉంది. ప్రతి సంవత్సరం,
ఆగస్టు
15
మరియు జనవరి 26తో సహా మూడు రోజులలో తెరిచి ఉంటుంది. ఈ
రోజుల్లో వేలాది మంది ప్రజలు స్వాతంత్ర్య సమరయోధుల సమాధిని సందర్శించి తమ నివాళులు
అర్పిస్తారు
No comments:
Post a Comment