10 March 2013

తెలుగులో న్యాయపాలన


తెలుగు లో న్యాయపాలన ప్రజలలో నమ్మకం పెంచును. ప్రతివొక్కరికి న్యాయవ్యవస్త అందుబాటులో ఉండాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిoది.మనదేశంలో పూర్వం అనగా ఆంగ్లేయుల పాలన కాలంలో న్యాయస్థానాలలో  వాదోపవాదాలు,తీర్పులు  తెలుగు లోనే  జరిగేవి. 1874లోనే అప్పటి కోర్టులు తెలుగులో తీర్పులు ఇచ్చాయి. తెలుగు భాషబిమాని అప్పటి కలేక్టర్ సి.పి.బ్రౌన్ స్వయంగా తెలుగులో తీర్పు చెప్పారు.  అవిభక్త మద్రాస్ రాస్టంలో న్యాయస్థానాలలో తెలుగు ఉపయోగించమని మద్రాసు హై కొర్టు సూచించినది.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత తెలుగులో తీర్పులు వెలువడటం లేదు. న్యాయస్థానాల్లో తెలుగులోనే తీర్పులు ఇవ్వాలని 1962, 1965 లోప్రభుత్వం రెండు జివోలు తెచ్చినా అమలుకు నోచుకోలేదు. తెలుగులోనే వివాదాలను దాఖలు చేయాలని, విచారణ ప్రక్రియ, వాదోపవాదాలు తెలుగులోనే జరగాలని చివరికి తీర్పులు కూడా తెలుగులోనే వెలువడాలని తరచు ఆకాంక్షలు వ్యక్తమయ్యాయి. కొన్ని న్యాయస్థానాలలో న్యాయవాదుల సంఘాల వారు ఈ మేరకు తీర్మానాలు కూడ ఆమోదించారు
1972వరకు పలు న్యాయస్తానలలో వాదప్రతివాదాలు తెలుగులో సాగేవి.సాక్షాన్ని నమోదుచేయడం, తీర్పు వెల్వరించడమే ఆంగ్లంలో జరిగేది. స్టానిక భాషలోనే న్యాయపాలన సాగించాలని 1974 లోనే ఉత్తర్వులు వెలుడ్డాయి. 1979 లో నంద్యాల మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ శ్రీ ఖాదర్‌ మొహియుద్దీన్‌ మొట్టమొదటి ''తెలుగు తీర్పు '' ఇచ్చారు. 1980వ దశకంలో కొన్నిచోట్ల కొందరు న్యాయవాదులు తెలుగులో వాదించారు కూడ. 1981లో న్యాయస్థానాల్లో తెలుగు ఎందుకు అమలు కావడం లేదని ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. 1982లో మున్సిఫ్‌ మేజిస్ట్రేటు కోర్టుల్లో తెలుగు వాడాలని శాసించారు.  తిరిగి 2008 లో మళ్లీ ఉత్తర్వులు జారీ చేసినా అమలు శూన్యము నేడు కోర్టులో తెలుగులో మాట్లాడేందుకు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనిఉoది.

తెలుగు లో న్యాయ పాలన సాదించటానికి ఈ క్రింది సూచనలను అందించ వచ్చును.
·       మాతృభాషలోనే న్యాయపాలన ఉండాలి
·       మాతృభాషలో మాత్రమే ప్రతి వ్యక్తి తన భావాలను స్పష్టంగా చెప్పగలుగుతాడు.  పరిపాలన, న్యాయపాలన, లో మాతృభాష ప్రాధాన్యం పెరగాలి.
·       తెలుగు భాషలోనే వాదనలు- ప్రతివాదనలు జరిగితే కక్షిదారులు తీర్పులను అర్ధం చేసుకోగలుగుతారు.
·       తీర్పులు, సాక్ష్యాల నమోదు తెలుగులో జరగాలీ. జిల్లా, ఉప న్యాయస్థానాలు, మెజిస్ట్రేట్ కోర్టుల్లో న్యాయపాలన అంటే వాదనలు, సాక్షుల వాంగ్మూలం నమోదు, ఉత్తర ప్రత్యుత్తరాలు, తీర్పులు తెలుగులో జరగాలి.
·       న్యాయస్థానాల్లో స్థానిక భాషలోనే తీర్పులు ఉంటే పారదర్శకత ఉంటుంది.న్యాయవ్యవస్థ ప్రజలకు మరింత దగ్గర అవుతుంది.
·       రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం వల్ల ఆంగ్లంలో వెలువడుతున్న తీర్పులు సరిగా అవగతంకాక ఇబ్బందులు పడే పరిస్ధితి ఉంది, దిన్ని నివారించేందుకు సాధారణ ప్రజలు/కక్షిదారులకు/ గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే విధంగా న్యాయపాలన తెలుగు లో ఉండాలీ.
·       వాదోపవాదాలు తెలుగులో ఉండటం వల్ల కేసు పూర్వపరాలు సామాన్యులకు/ కక్షిదారులకు తేలికగా అర్థమవుతాయి.
·       చట్టాలు, తీర్పులు, కార్యకలాపాలు, ఉత్తర్వులు తెలుగులో రావాలి,అప్పుడే న్యాయ పరిపాలన సక్రమంగా జరుగుతుంది.
·        న్యాయవ్యవస్థ పారదర్శకంగా పనిచేయాలంటే తెలుగులో లీగల్: న్యాయపాలన అవసరమని అప్పుడే న్యాయవాదులు, న్యాయమూర్తుల పట్ల కక్షిదారులకు వున్న అనుమానాలు, దురభిప్రాయాలు తొలగిపోతాయి
·       మనోవర్తి,విడాకులు, కార్మికుల చట్టాలు తదితర కేసుల్లో న్యాయపాలన తెలుగులో ఉంటే కక్షిదారులు అవసరమైతే ప్రశాంత వాతావరణంలో రాజీపడేందుకు వీలైన అవగాహన కలుగుతుంది.
·       న్యాయస్థానాల కార్యాకలాపాలు ప్రజలకు అర్ధమయ్యే భాషలో ఉండాలని రాజ్యాంగం సూచించింది.
·       కోర్టులకు వచ్చేవారిలో నిరక్షరాస్యులు, సామాన్యులే ఎక్కువగా ఉంటారు , తెలుగులోనే వాదప్రతివాదనలు, తీర్పులుంటే వారికి అర్థమమవుతుంది.
·       సమాచార హక్కు విజయవంతం అవ్వాలంటే న్యాయస్తానాలలోవాదప్రతివాడలు, తీర్పులు తెలుగులో వెలుబడాలి.
·       తెలుగులో న్యాయపాలన జరిగితే న్యాయస్థానాలపై మరింత విశ్వాసం పెరుగుతుంది.
·       తెలుగు లో న్యాయ పాలన పై న్యాయమూర్తులు, న్యాయవాదులు ,తరచూ సదస్సులు, సమావేశాలు జరపటం ద్వార ప్రజలలో అవగాహన కల్పించాలి. ఇందుకు గానుఅమలులో ఉన్న న్యాయ విజ్ఞాన సదస్సులను వాడుకోవాలి.

ప్రభుత్వం అందించాల్సిన సహకారం :
·       తెలుగులో న్యాయపదకోశాలు, న్యాయశాస్త్ర పుస్తకాల ప్రచురణతో పాటు, చట్టాల అనువాదానికి చర్యలు తీసుకోవాలి.
·       తెలుగులో న్యాయ శాస్త్ర గ్రంథాలు, న్యాయపదకోశ నిర్మాణ  ఆవశ్యకత, తెలుగు చట్టాల అనువాదం- సమస్యలు, న్యాయపాలనలో తెలుగు కంప్యూటర్, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాల వినియోగం కు అవసరమైన సహాయాన్ని, సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలీ.
·       ఇంగ్లీషు భాషలోని పదాలకు సమానమైన పదాలను రూపొందించి సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆంగ్ల పారిభాషిక పదాలకు సమానమైన తెలుగు పదాలు ఏర్పడాలి. ఆవి గ్రంథస్థం కావాలి,బహుళ వ్యాప్తిలోకి రావాలి!
·       అందరికీ అర్ధమయ్యే రీతిలో న్యాయ వాజ్ఞ్మయం రూపొందించాలి!
·       తెలుగుకంప్యూటర్ సాఫ్ట్ వేర్ ,తెలుగుషార్ట్ హ్యాండ్, తెలుగు స్టెనోగ్రాఫి, స్టెనో గ్రాఫర్ లను , యితర సాదన సంపత్తిని న్యాయస్తానలలో ఏర్పాటుచేయాలి..
·        తెలుగులోని శాసనాలను దశలవారీగా అనువాదం చేసేందుకు తగిన వౌలిక సదుపాయాలు కల్పించాలీ.
·       తెలుగు లో తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులను, వాదించే న్యాయవాదులను ప్రోత్సహించాలి, పారితోషకాలు ప్రకటించాలి.
·       తెలుగు లో న్యాయపాలన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరపాలి.
·       తెలుగులో సంక్షిప్త సమాచారాన్ని (ఎస్‌ఎంఎస్) అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించాలి.
·       న్యాయవాదులు తెలుగు లో వాదించాలి, న్యాయమూర్తులు తెలుగు లో  ప్రోసిడింగులను ఆమోదించాలి.
·       క్రింది తరగతి ఉద్యోగులు నోటీసులను, సమన్లను,ఇతర కార్యకలాపాలను తెలుగు లో నిర్వయించాలి.
·       ప్రభుత్వము రూపొందించిన 18 రకాల ఫాంట్లతో కూడిన తెలుగు సాఫ్ట్ వేరు ను అన్నీ న్యాయస్తానాలకు అందించాలి.
·       తెలుగు భాష అమలుకు హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన విస్తృత కమిటీని ఏర్పాటు చేయాలీ.
ఇటీవల జరిగిన తెలుగు లో న్యాయపాలన సదస్సు స్పూర్తి తో నాంపల్లి క్రిమినల్ న్యాయస్తానాలకు చెందిన 2 మహిళా న్యాయమూర్తులు 2nd ACMM కె. శైలజ మరియు 14వ అడిషనల్ చీఫ్ మెట్రోపోలిటియన్ మెజిస్ట్రేట్ (ACMM) కొక రమాదేవి తెలుగు లో తీర్పు వెలుబుచ్చినారు.
శ్రీకాకుళముకు చెందిన భార్యభర్తలు అయిన  ఇద్దరు మెజిస్ట్రేట్లు,  జుడీషియల్ 1st క్లాస్ మెజిస్ట్రేట్ ఏ.పద్మ మరియుమొబైల్ కోర్ట్  మెజిస్ట్రేట్ ఎస్. చిన్నబాబు తెలుగు లో తీర్పు వెలుబుచ్చినారు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా13 మంది న్యాయమూర్తులు తెలుగులో 28 తీర్పులిచ్చారు 

2023 లో తెలంగాణ హైకోర్టు తెలుగు భాషలో  తొలి తీర్పును వెలువరించి చరిత్ర సృష్టించింది. ముఖ్యమైన తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి వాటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర హైకోర్టులను కోరిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ మైలురాయి నిర్ణయం తీసుకోబడింది. సికింద్రాబాద్‌లోని ఇద్దరు సోదరుల మధ్య జరిగిన భూవివాదం కేసులో న్యాయమూర్తులు పి నవీన్‌రావు, నగేష్ భీమపాకలతో కూడిన డివిజన్ బెంచ్ తెలుగు లో  తీర్పును వెలువరించింది.

తెలంగాణ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా తెలుగు నిర్ణయo వేలుబడినది. గతంలో ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళంలో తీర్పు వెలువరించింది.

భాగస్వామ్య పక్షాల సౌలభ్యం కోసం తెలుగులో నిర్ణయాన్ని అందజేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. తెలుగు తీర్పులో సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా కొన్ని ఆంగ్ల పదాలను ఉపయోగించారని పేర్కొంది.

తెలంగాణా హైకోర్టు వెలువరించిన తెలుగు తీర్పుపై వివిధ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన న్యాయవాదులు గతంలో హైకోర్టుల్లో ప్రాంతీయ భాషలను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరగా, సుప్రీంకోర్టు వారి అభ్యర్థనలను తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం భవిష్యత్తులో తెలుగు భాషలో  మరిన్ని తీర్పులు వెలువరించడానికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.

రిఫరెన్స్:


·       ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ, ఈనాడు,ఆంధ్ర భూమి  మొదలగు తెలుగు దినపత్రికలు.
·       ఈ టి‌వి , టి‌వి నైన్ , ఏబి ఎన్ ఆంధ్ర జ్యోతి టి‌వి చానల్ రిపోర్ట్లు.
·       ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రికలు.
·       










  
  
  


No comments:

Post a Comment