4 March 2013

తెలుగు సాహిత్యంలో ముస్లింవాదం



తెలుగు సాహిత్యంలో ముస్లింవాద సాహిత్య


ఇవాళ తెలుగు సాహిత్యంలోమైనారిటీ వాదంఅనే పేరు వినిపిస్తుంది. తెలుగు సాహిత్యంలోమైనారిటీ వాదంఅనేది ఒక పారిభాషిక పదంగా మారింది.  అల్ప సంఖ్యాకులైన ముస్లింల కష్టనష్టాలను అభివ్యక్తికరించే సాహిత్యాన్నిమైనారిటీ వాదంఅంటున్నారు. తెలుగు సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్న కాలం ఇది. స్త్రీవాదం, దళితవాదం వరుసలో ముస్లింవాద సాహిత్యం తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకున్నది. ప్రపంచ వ్యాప్త పరిస్థితులను బట్టి తమ సమస్యలలోప్రత్యేకత ఉందని, అల్ప సంఖ్యాక వర్గం కావడం వల్ల అభద్రత భావం నెలకొందని భావిస్తున్న ముస్లింల మనోభావాలను ప్రతిఫలిస్తు వస్తున్న సాహిత్యమే మైనారిటీ వాద సాహిత్యం.
భారతదేశంలో మతాన్ని ఆధారం చేసుకొని ప్రజలపై జరుగుతున్న దాడులను, అభద్రతను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. ఆ మతం వల్ల వారిపై జరుగుతున్న అల్పసంఖ్యాక భావమే వారి రచనల్లో వ్యక్తమైతే అప్పడు అది "మైనారిటీ సాహిత్యం" అవుతుంది. దీన్నిమైనారిటీ వాద సాహిత్యం”,” ముస్లిం సాహిత్య వాదం”, “మైనారిటీవాదంవంటి మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. దీనినిముస్లిం మైనారిటీ వాదంఅని పిలవడం సమజసంగా ఉంటుంది తెలుగులోముస్లిం మైనారిటీ సాహిత్యానికి లభిస్తున్న ప్రాధాన్యత ఊపందుకుంది,వాటి పై అనేక విశ్వవిద్యాలయాలు పరిశోధనలు కూడా చేయిస్తున్నాయి. ''మైనారిటీ సాహిత్యం'' అని అనగానే ముస్లింల సాహిత్యంగా గుర్తిస్తున్నారు.
ప్రపంచంలోఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా, ఆ ఉగ్రవాదుల్లో ముస్లిం పేర్లు కనిపించినా, అందరి ముస్లింలపై అనుమానపు చూపులు చూస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తుంది. భారతదేశంలో ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, వారి కంటే తర్వాత స్థానంలో ఉన్న వారికున్నంత స్వేచ్ఛ ముస్లింలకు లేదనే అభిప్రాయం బలంగానే వినిపిస్తుంది.1992 డిశంబరు 6వ తేదిన బాబ్రి మసీద్ కూల్చివేత తర్వాత 2002లో గుజరాత్‌లో జరిగిన మత కల్లోలాలు ముస్లింలలో అభద్రతా భావాన్ని పెంచాయి. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పటి నుంచి ముస్లిం సమాజంపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతన్న భౌతిక, సాంస్కృతిక దాడులు భారతదేశంలోని ముస్లింలను కూడా వెంటాడుతున్నాయి. ముస్లిమేతర సమాజం నుంచి గుచ్చుకునే ప్రశ్నల ముళ్లు ముస్లింలను ఆత్మన్యూనత భావనలోకి, అపరాధ భావనలోకి నెట్టేస్తున్నవి.
ముస్లింల దేశభక్తి శంకించబడింది. స్వదేశం లోనే పరాయి వాళ్ళుగా బ్రతక వలసిన దుస్థితి యేర్పడింది.  వారి పట్ల వివక్షత,అణచివేత సాధారణ విషయలుగా మారాయి.ముస్లింలు తమని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం జరుతుతుందని, దానికోసం ప్రతిచోటా దేశభక్తిని నిరూపించుకోవలసి వస్తుందనీ వాదిస్తున్నారు. తాము ముందు భారతీయులమని గుర్తించాలని వాదిస్తున్నారు.

ఆధునిక సాహిత్యంలో వచ్చిన వివిధ ధోరణి/ వాదన/ ఉద్యమాలలో స్త్రీ, దళిత, ముస్లిం మైనారిటి సాహిత్యం అనే విభజన ఇంచుమించు సాహితీవేత్తలందరూ అంగీకరించారు. ముస్లిం సాహిత్యంలో కూడా ముస్లిం స్త్రీవాద సాహిత్యం అనే విభాగాన్ని కూడా సాహితీ వేత్తలు గుర్తిస్తున్నారు.

ముస్లిం వాదం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకతను నిలుపుకుంది.మైనారిటీ సాహిత్యం ఆరంభంలో దళిత,బహుజన వాదం లో భాగమై,అనంతరం ఒక స్వతంత్రవాదంగా గుర్తింపు పొందింది.మానవులంతా పరస్పర సోదరులేనని ఛాటిచెప్పిన ఇస్లాం విశ్వ మానవ సిద్ధాంతానికి ఆకర్షితులై మతం మారిన దళితులమన్న  ముస్లిం కవులు తెలుగు సాహిత్యంలో తమదైన శైలిని, ముద్రను వేయటానికి ప్రయత్నం చేశారు.జాతీయ సమైక్యత, మత సామరస్యం,సమాన హక్కులు-ఆదరణ వంటి ఆంశాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయటానికి ప్రయత్నించారు.ముస్లిం వాదం తెలుగు సాహిత్యంలో ఒక నూతన యుగానికి తెరతీసింది.ముస్లింలు తమ భావాలను, సమస్యలను సమాజంలో పంచుకోవటానికి ఒక మార్గం  ఏర్పడింది.
ఇవాళ తెలుగు సాహిత్యంలో ముస్లింవాదం గురించి సర్వత్రా చర్చ నెలకొని ఉంది.  ముస్లింవాదం గమనాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం. ముస్లింల పేదరికం, అభద్రతాభావం, వివక్ష, అణచివేత, బాబ్రీ విధ్వంసం, గుజరాత్ముస్లిం జాతిమేధం, ముస్లిం సంస్కృతి, ముస్లిం స్త్రీలు, తదితర అంశాలపై విస్తృతంగా కవిత్వం, కథలు ముస్లిం రచయితల నుంచి వచ్చాయి.
“పుట్టుమచ్చ” దీర్ఘ కవితతొ తెలుగు సాహిత్యంలో ముస్లింల అభివ్యక్తి మొదలైంది. 1991లోనేపుట్టుమచ్చకవిత రూపుదిద్దుకుంది. కవిత అచ్చయింది. అంతకు ముందు ఇస్మాయిల్‌, వజీర్రహమాన్‌, స్మైల్‌, కౌముది, దిలావర్‌, దేవిప్రియ, గౌస్‌, అఫ్సర్‌, యాకూబ్లాంటి కవులున్నప్పటికీ పుట్టుమచ్చకు ముందువాళ్లు తాము ముస్లిం కవులుగా రాసింది లేదు.

తొలుత1991లో ఖాదర్మొహియుద్దీన్‌ ‘పుట్టుమచ్చదీర్ఘ కవిత, 1992 లో బాబ్రీ కూల్చివేతను పురస్కరించుకుని తెలుగులో అఫ్సర్‌, యాకూబ్‌, ఇక్బాల్చంద్‌, హనీఫ్లాంటివారంతా ముస్లింలుగా తమ ఫీలింగ్సు కవిత్వీకరించారు. అదే సందర్భంలోకంజిరబులెటిన్బాబ్రీ కూల్చివేతను పురస్కరించుకుని ఒక సంచిక వేసింది. అందులో పై కవులున్నారు.
 1995 జనవరిలో వచ్చినచిక్కనవుతున్నపాటసంకలనంలో అచ్చయిన ఖాజా, అబ్బాస్‌, అఫ్సర్‌, యాకూబ్‌, ఇక్బాల్చంద్ ముస్లిం కవితలున్నాయి 'పదునెక్కిన పాట', 'బహువచనం' తదితర కవితా సంకలనాలలో కూడా ముస్లిం వేదనను తెలిపే రచనలు ఉన్నాయి.
1997లోజీహాద్‌’ ముస్లిం మైనారిటీ కవుల కవితా సంకలనం, తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్యం అందించిన స్ఫూర్తితో ఖాజా 1998లో  షరతు, ఫత్వా అనే కవితలు రాశాడు. స్కైబాబ హిజాబ్‌, రెహాల్‌, సాంచా లాంటి కవితలు రాశారు.
1998లో స్కైబాబ సంపాదకత్వంలోజల్జలాముస్లింవాద కవితా సంకలనoతొ  ‘ముస్లింవాదంస్థిరీకరణ ప్రారంభమైంది. అంతర్ బాహిర్ పోరాటాల వ్యక్తీకరణగా వచ్చినజల్జలాతెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగా ఎన్నో చర్చల్ని రేకెత్తించింది. ముస్లింవాద కవితా సంకలనంజల్జలాలో సయ్యద్గఫార్ ఇంకా ఎంతోమంది ముస్లిం కవులు మెజారిటీ మత భావజాలాన్ని, మతోన్మాదాన్ని ప్రశ్నించారు. తర్వాత వచ్చినఫత్వాసంకలనం,(1998)సుల్తానాకథ.హర్యాలీసంకలనం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగా సాహితీ వేత్తలు గుర్తిస్తున్నారు.
 
 2002
సంవత్సరంలో. ‘గుజరాత్గాయంపేరుతో 200 మందికి పైగా కవుల సంకలనం ఒకటి ప్రచురింపబడింది 2002లో అన్వర్‌, స్కైబాబ సంపాదకత్వంలో గుజరాత్ ముస్లిం జాతిమేధంపై అజాఁపేరుతో 36 మంది కవుల కవితలున్న ముస్లిం కవుల సంకలనం ఒకటి వెలువడింది.అజాఁపేరుతో ముస్లిం కవిత్వ సంకలనం వచ్చాక సాహిత్యంలోనూ, పత్రికల్లోనూ ముస్లింవాదం పట్ల చర్చ జరిగింది.
 
2002లో హనీఫ్‌ ‘ముఖౌటాగుజరాత్పై కవిత్వం, 2004లో స్కైబాబ సంపాదకత్వంలో 40 మంది కథకులతో ముస్లిం కథల సంకలనంవతన్రావడంతో తెలుగు సాహితీలోకం ఉలిక్కిపడింది. తమ మధ్యే నివసిస్తున్న మరొక ప్రపంచం గురించి చదివి ఆశ్చర్యపోయింది. అస్తిత్వ ఉద్యమాల నుంచి ఒక కథా సంకలనం రావడం అదే మొదలు. ప్రముఖ విమర్శకులు సైతం తప్పనిసరై ముస్లింవాదాన్ని ప్రస్తావించక తప్పని స్థితినివతన్కల్పించింది. భాషలో, జీవన విధానంలో ఉండే తేడాను వతన్తేల్చి చెప్పింది

వతన్తో పాటు 2005లో వేముల ఎల్లయ్య, స్కైబాబ సంపాదకత్వంలో దాదాపు 100 మంది రచనలతో  వచ్చినముల్కిమూడవ సంచికను ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచికగా తేవడం మరొక చేర్పు. ఇందులో వతన్‌, ఖబూతరా, సండాస్‌, ముసీబత్‌ వంటి కథలు,అనేక కవితలు, సమీక్షలు వున్నాయి.
2005లో షాజహానానఖాభ్‌’ ముస్లిం స్త్రీ కవిత్వం,  స్కైబాబ గుజరాత్ గాయంజగ్నేకీ రాత్పుస్తకాలు మరింత చర్చను లేవనెత్తాయి. ‘గవాయిదానికి సాక్ష్యమిచ్చింది. దాంతో ముస్లింవాదం పరిపుష్టమైనట్లు అనిపించింది.

కాని తర్వాత2006లో షాజహానా, స్కైబాబ సంపాదకత్వంలో 71 మంది కవులతో వచ్చిన ముస్లిం సంస్కృతి కవితా సంకలనంఅలావామరెన్నో కొత్త అంశాల్ని చర్చకు పెట్టడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసిందిఇండియన్ ముస్లిం సంస్కృతిని గుర్తించి చర్చకు పెట్టడంఅలావాసాధించిన ఘనత. ముస్లింల జీవన విధానం, మత విశ్వాసాలు, ఆచారాలు వంటి అంశాలను గ్లోరిఫై చేసే అశాస్త్రీయ, హెడోనిస్టిక్ పద్ధతికి ముస్లింవాదం వీడ్కోలు పలికింది.అలావాసంకలనం దేశీ ముస్లిం సంస్కృతిగా మనం చూడవచ్చు.దాంతో ముస్లింవాదం చర్చ ఊపందుకుంది
జల్జలా, అజాఁ, వతన్, ముల్కి, ‘అలావాసంకలనాల వల్ల, ఇంకా పుట్టుమచ్చ, ఫత్వా, ముఖౌటా, బా, అలీపాన్మరకకవిత్వంహరేక్మాల్‌’ కథలు, వెండిమేఘం, ముస్లింవాద తాత్త్వికత లాంటి పుస్తకాల వల్ల ముస్లింవాదం ఇవాళ గట్టి పునాదిని ఏర్పర్చుకొంది, విస్తృతిని సాధించింది.
అఫ్సర్‌ ‘వలసకవితా సంపుటిలోనూ, యాకూబ్‌ ‘సరిహద్దు రేఖకవితా సంపుటిలోనూ, ఇక్బాల్చంద్‌ ‘ఆరోవర్ణంకవితాసంపుటిలోనూ, హనీఫ్‌ ‘ఇక ఊరు నిద్రపోదుకవితా సంపుటిలోనూ, దిలావర్‌ ‘కర్బలా’, రేష్మా రేష్మాకవితా సంపుటలలోనూ ముస్లింవాద కవితలున్నాయి.
ముస్లింవాద తాత్వికతపేరుతో ముస్లింవాద కవిత్వంపై ఖాజా పుస్తకం, ‘మైనారిటీ కవిత్వంపరిశీలన పేరుతో డా. ఎస్‌. షమీ ఉల్లా పి.ఎచ్‌.డి. పరిశోధనా గ్రంథం వెలువడ్డాయి. ప్రముఖ కవి స్మైల్‌, సయ్యద్గఫార్వలీహుసేన్,మహమూద్,  డా. ఎస్‌. షమీ ఉల్లా, స్కైబాబ,ఆఫ్రీన్‌,ఖాదర్మొహియుద్దీన్‌,గౌస్మొహియుద్దీన్యాకూబ్‌,ఖలందర్‌,హనీఫ్‌, ఇక్బాల్చంద్‌,గౌస్మొహియుద్దీన్‌,ఖాదర్షరీఫ్‌., షాజహానా,డా. దిలావర్‌, అలీ, ముస్లింవాద కవితలు రాశారు.
ముస్లింవాద కవులు, రచయితలు దాదాపు తొంభైమంది దాకా ఉన్నారు.ముస్లింవాదం అంటే సామాజిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చినట్లు అవుతుందనేది సులభంగా అర్థమయ్యే అంశం.‘ముస్లింలలో సంస్కరణల గురించి మాట్లాడడం. చారిత్రక అవసరం. విషయాన్ని ముస్లింవాద కవితలు, కథలు బలంగా వ్యక్తం చేశాయి. కొత్త తరం రచయితలే కాదు, స్మైల్, షేక్ హుసేన్, దిలావర్ ఇంకా దాదాహయత్ తదితరులు దాన్ని ఒప్పుకొంటున్నారు.
ముస్లిం రచయితలు తమ రచనల ద్వార ఆంధ్రప్రదేశ్, భారతదేశం లోని ముస్లింలు ఎదుర్కొంటున సమస్యలను వారి ఆస్తిత్వవాదాన్ని వెలుగులోకి తెచ్చారు. ఒకవైపు  హిందుత్వ శక్తుల ఆదిపత్యాన్ని వ్యతిరేకిస్తూ మరోవైపు సంస్కరణలను ఆశిస్తూ ముస్లిం మైనార్టీ రచయితలు తమ భావాలను ప్రకటించారు. ఇస్లాంపేరిట  తమ మత  పెద్దలు, మైనార్టీ నాయకులు అనుసరిస్తున్న అవకాశవాద దొరణిని నిరసించారు. ఇస్లాంలో మహిళలను కించపరిచే వారిని వ్య తిరేకిస్తూ సంస్కరణలను కోరారు.
ముస్లింరచయితలు వారి రచనలు,వారి పోరాటాలు సామాజిక మార్పుకి దోహదం చేస్తున్నాయి.ముస్లిం సమాజం అంతర్గతంగా తమలోని లోపాలపై దృష్టి సారించి సంస్కరించుకుంటూనే బాహ్య పోరాటం చేయాలి. తరం ముస్లింవాదులు బాహిర్ పోరాటంతో పాటు అంతర్గత పోరాటం కూడా జరగాల్సిందే అంటున్నారు. అందుకుజల్జలా, వతన్, పాచికలు, ఫత్వా, బా, నఖాబ్, జగ్నేకీ రాత్సంకలనాలే నిదర్శనం. ఎమ్.టి. ఖాన్ దగ్గర్నించి జమీలా నిషాత్ వరకు, జావేద్ అఖ్తర్ నుంచి సారా అబూబకర్ వరకు, యాకూబ్, హనీఫ్, అఫ్సర్ నుంచి యాకూబ్ పాషా వరకు ముస్లింలలో సంస్కరణవాదాన్ని బలపరుస్తున్నవాళ్ళే. ముస్లింల జీవన సరళిలో సంస్కరణల్ని ఆహ్వానిద్దాం  అందులోనే ముస్లింల అభ్యున్నతి దాగి ఉంది.
ముస్లింలను అణిచి వేస్తున్న మూల శత్రువుతో పోరాడుతునే అంతర్గత వైరుధ్యాలను వదలకుండా బాహ్య అంతర రెండు పోరాటాలు చేయడం ముస్లింవాదం ప్రత్యేకత. హిoదుత్వ దాష్టీకాన్ని ప్రశ్నిస్తూనే అంతర్గతంగా ముస్లిం స్త్రీల గురించి, ముస్లింల లోని ఛాందసత్వం గురించి, ముస్లిం సమాజంలో జరగవలసిన సంస్కరణల గురించి, తమ మూలాల వెతుకులాట గురించి, ఎంతో సాహిత్యాన్ని సృష్టించటం సాహిత్య ప్రత్యేకత. మొత్తం మీద ముస్లిం మైనారిటీవాద సాహిత్యం ఒకవైపు స్వీయమతంలోని మూఢాచారాలను ఖండిస్తూ, మరొక వైపు మాతృదేశంలోతమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ, అగ్ర వర్గానికి, కింది వర్గానికి మధ్య నలిగిపోతూ, తాము స్థితిలో ఉన్నారో తెలియజేస్తూన్నది.
తెలుగు ద్వారా భారతీయ సాహిత్యానికి తద్వారా మానవ నాగరీకతకు  అందుతున్న అపూర్వమైన ఒక అదనపు విలువ ముస్లింవాదం.

ముస్లింవాద కవులు, యిత్రి రచయితలు
తెలుగు సాహిత్యాని పరిశీలించిన దాదాపు 80 పైగా తెలుగు ముస్లిమ్ కవులు, కవయిత్రులు కనిపిస్తారు
దేవీప్రియ (ఖాజా హుస్సైన్) అఫ్సర్,కౌముది, ఎం‌కే సుగుంబాబు(మహబూబ్ ఖాన్) ఉమర్ అలిషా, దిలావర్, ఇస్మాయిల్,యూసుఫ్, ఖాదర్ మోహిద్దీన్, గులాం గౌస్‌, ఎస్ ఏ రవూఫ్, ఎస్ ఏం మలిక్, ఖాదిర్ బాబు, ఖాదర్ ఖాన్, కరీముల్లా, ఖాజా, స్కై బాబా, వాహిద్, సౌజన్య, నాసిర్ అహ్మద్, ఇక్బాల్ చంద్, రహమతుల్లా, షరీఫ్, అన్వర్, యాకూబ్ పాషా, అలీ, ఖాసిమ్, మహాజబీన్, షాజహానా వంటి కవులు, కవయిత్రులు తమ కవిత్వం తో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం  చేశారు
ఖాదర్ మోహిద్దీన్ తన పుట్టుమచ్చ దీర్ఘ కవితలో ఆత్మ గౌరవంతో జీవించటానికి సరియైన అస్థిత్వం ముస్లింలకు వుండాలనే డిమాండ్  వ్యక్తం చేసెను.. 
సయ్యద్ సలీం తన కాలుతున్న పూలతోట” కావ్యానికి సాహిత్య అకాడమీ అవార్డును,జాతీయ మానవ హక్కుల సంఘ ప్రశంసను అందుకున్నారు. ముస్లిం కుటుంబాలపై తెలుగులో వ్రాయబడిన తొలి నవలగా  ఇతని నవలను పేర్కొనవచ్చు.
కరీముల్లా “సాయిబు” అనే దీర్ఘ కవితలో ముస్లింల స్థితిగతుల్ని  వారి మ:నోవేదనను అత్యంత హృదయ రమ్యముగా వర్ణించాడు.కరీముల్లా రచనా”సాయిబు” తెలుగులో వ్రాయబడిన తొలి ముస్లిం కవి దీర్ఘ రచనగా చెప్పవచ్చు.
స్కైబాబ కథల సంకలనం “అధూరే ” ముఖ్యంగా గ్రామీణ,పట్టణ నేపధ్యంలో ముస్లింల దైనందిన జీవితంలోని  అనేక కోణాలను మన ముందు ఆవిష్కరిస్తుంది. తెలుగు సాహిత్యంలో అచ్చమైన  ముస్లింల జీవితాలపై ఒక ముస్లిం వెలువరిస్తున్న కథల  సంకలనం “అదూరే”. అదూరే కథలు ముస్లిం జీవితాల పరిమళాన్ని. పేదరికపు గోసను వ్యాపింపచేస్తున్నాయి.
అఫ్సర్  తన కవితలలో తను చెప్పదలచుకొన్న భావాన్ని అత్యంతం మృదువుగా శ్రావ్యంగా వినిపించేవాడు.
షాజహానా అనే కవయిత్రి తన కవితలలో బురఖా పద్దతిని నిరసిస్తూ అద్భుత బావాల్ని ప్రకటించింది.
ముస్లింవాదాన్ని ప్రతిబింబించే కవితా సంపుటలతో పాటూ ముస్లిం జీవిత విదాన్నాన్ని ప్రతిబింబించే నవలలు, కథానికలు, దీర్ఘ  కవితలు వచ్చాయి.
తెలుగు సాహిత్యంలో ముస్లిం మైనార్టీ దృక్పద౦ ఒక ప్రత్యేకతను సంతరించుకోంది. బారతీయ సాహిత్య రీతులలో ఒక్క తెలుగులోనే ముస్లింవాదం ప్రారంభమైనది అని సగర్వంగా చెప్పవచ్చును.   

తెలుగులో స్త్రీవాదం వచ్చిన తరువాత, దళిత , ముస్లిం మైనారిటీ వాదంలోనూ, స్త్రీ లు తమ సమస్యలను కవిత్వీకరిస్తున్నారు. అంతకు ముందు పురుషులే, స్త్రీ సమస్యలను కొంతవరకూ స్పర్శిస్తూ కవిత్వం రాశారు. అయితే స్త్రీలు రాసిన కవిత్వంలో మరింత బలంగా ముస్లిం స్త్రీ సమస్యలు అభివ్యక్తయ్యాయి.
ముస్లిం స్త్రీ సమస్యలను షాజహానా, మున్వీరునిసా, మహేజబీన్, షహనాజ్ ఫాతిమా మొదలైన వాళ్ళు స్త్రీవాద దృక్పథంతో కవిత్వీకరిస్తున్నారు. షాజహానా రాసిననఖాబ్కవితా సంకలనం ముస్లిం స్త్రీ వాదానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతకు ముందు వచ్చిన ‘’జల్ జలా'’ కవితా సంకలనంలో కూడా స్త్రీ వాద సమస్యలను వర్ణిస్తూ పురుషులు కవిత్వం రాశారు. ఖాదర్ మొహియుద్దిన్ ‘’పుట్టుమచ్చ'’లో, గుజరాత్ సంఘటనల తరువాత ‘’గుజరాత్ గాయం'’, ‘’ఆజా'’, ముస్లింల సాహిత్య ప్రత్యేక సంకలనం'’ ముల్కి'’, ‘’అలావా'’ కవితా సంకలనం, స్కై బాబా రాసిన ‘‘జగ్నేకీ రాత్’’, ఖాజా ‘’ఫత్వా'’ మొదలైన వాటిలో ముస్లిం స్త్రీ వాదం కనిపిస్తుంది.
ఇంటిలో స్త్రీ పురుషుల మధ్య కనిపించే వివక్ష, ఇతర స్త్రీలకున్నట్లే ముస్లిం స్త్రీలలోనూ ఉంది. కానీ, ఉన్నత విద్యనభ్యసించనివ్వకపోవడం, నిర్ణయాధికారం లేకపోవడం మొదలైన వాటి విషయంలో ముస్లిం స్త్రీలు మరింత వివక్షకు గురవుతున్నారు. బయటకు కనిపించే బురఖా, బురఖా వెనుక ఎన్నో నిర్భందాలు, బహు భార్యత్వ సమస్య, బహు సంతానోత్పత్తి కోసం అనుభవించే లైంగిక వివక్ష, భర్త చనిపోతే స్త్రీ పునర్వివాహం పట్ల తలెత్తుతున్నఅనేక పరిణామాలు మొదలైన సమస్యలు ముస్లిం స్త్రీ వాదంలో కనిపిస్తున్నాయి. అంతే కాకుండా, పురుషాధిపత్యం, కుటుంబ హింస, ఆర్థిక, సాంస్కృతిక విద్యా కారణాల వల్ల చాలామంది విడాకుల కోసంతలాఖ్చెబుతున్నారు. ఆర్థిక, ఉద్యోగ కారణాల వల్ల పరదే్శాలకు వలస పోయిన తరువాత స్త్రీలు పొందే కష్టాలు, బాలికలను ముసలి వాళ్ళకిచ్చి వివాహం చేసే పద్ధతి, దాని వెనుక స్త్రీ ఆంతరంగిక మనస్తత్వం వంటివన్నీ ముస్లిం స్త్రీ వాదంలో కవయిత్రులు వర్ణిస్తున్నారు. కొన్ని సామాజిక వర్ణాల వాళ్ళు ముస్లింలుగా మతాంతరీకరణ చెందడం వల్ల భాష, ఆచార వ్యవహారాల్లో కలిగే ఇబ్బందులను కూడా ముస్లిం స్త్రీలు కవిత్వీకరిస్తున్నారు
 రచయిత్రి షాజాహానాలద్దాఫ్నిపేరుతో రాసిన కవితలో ముస్లింలలోలద్దాఫ్స్త్రీ మానసిక జీవితాన్ని చిత్రించారు. వచ్చీ రాని ఉర్దూ పదాలతో మాట్లాడుతుంటే ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని అధిగమించడం కోసం ఉర్దూ నేర్చుకోవాలనే వారి ప్రయత్నం, భాష రాక, తన మాతృ భాషలోనే మాట్లడితే వచ్చే నష్టమేమిటనే ప్రతిఘటన స్వరాన్ని కూడా వినిపించగలిగారు కవయిత్రి.
 ముస్లిం స్త్రీల బతుకు వేదనను, హింసను కవిత్వంగా మలిచిన తొలి ముస్లిం తెలుగు కవయిత్రి షాజహానా.. ముస్లిం స్త్రీ బాధల గాధలను కవిత్వీకరించి, వాటికి కారణాలు చెప్పి, సంకెళ్ల నుంచి బయటపడడానికి చేయాల్సిన అంతర్గత పోరాటం గురించి చెప్పిన తెలుగు ముస్లిం కవయిత్రి షాజహానా.
బురఖా, నఖాబ్గుట్టును విప్పిన కవయిత్రి షాజహానా. షాజహానా కవితా సంకలనం 'నఖాబ్‌' ఆత్మధైర్యాన్ని ప్రకటిస్తూ ముస్లిం స్త్రీలందరికీ మనోబలాన్ని అందిస్తోంది .
 షాజహానా కవిత్వం ప్రధానంగా - ముస్లిం సమాజంలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం, స్త్రీలను ముస్లిం పురుషుల ఆధిపత్య సంకెళ్ల నుండి విముక్తం చేయడం కోసం చేసే పోరాటాo.ముస్లిం స్త్రీలలోని స్వేచ్ఛా కాంక్షను తాము అనుభవిస్తున్న బతుకుల నుంచి బయటపడాలనే కాంక్షను షాజహానా కవిత్వం వెల్లడిస్తుంది. ఇటువంటి స్త్రీలందరికీ షాజహానా కవిత్వం ఊతం ఇస్తుంది.
ముస్లింలకు పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్ లో ముస్లిం వివాహ వ్యవస్థ గురించిఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే బహూ భార్యాత్వాన్ని అంగీకరించ వచ్చునని స్పష్టంగానే ఉంది. దీన్ని వక్రీకరిస్తూ, మత పెద్దల అండ దండలతో స్త్రీ మనోభి ప్రాయాలను విలువనివ్వకుండా జరుగుతున్న వివాహం గురించి, వివాహాల వెనుక ఉండే దయనీయ గాథల గురించి కూడా కవిత్వం వచ్చింది.” ఒకవైపు పేదరికం, మరొక వైపు మూఢత్వం చేసే పెత్తనం. రెండింటి మధ్య బొమ్మల్లా మారిపోతున్న స్త్రీల గురించి మున్వీరున్నీసా రాసినగుడియాకవిత గొప్ప నిదర్శనం!
 జాన్ హైడ్ కనుమూరి రాసిన హసీనా కవితా సంకలనంలో  ముస్లిం స్త్రీ జీవిత కోణాన్ని చూపడంలో కొత్త పార్శ్వ్హాలు ఉన్నాయి
ముస్లిం స్త్రీవాదం గురించి మాట్లాడుతూ డా. ఎండ్లూరి సుధాకర్ ఇలా అన్నారు. “ముస్లిం స్త్రీవాద కవిత్వం అంటే ముస్లిం స్త్రీలు రాసిందే అవుతుంది. ముస్లిం స్త్రీలు రాసిన కవిత్వంలో వారి బాధలు వెల్లడవుతున్నాయి. ఇతర మతాలు, వర్ణాలలో కంటే ముస్లిం స్త్రీ ఇస్లాం మతంలో మరింత పీడనకు గురవుతుందని ముస్లిం స్త్రీవాదం వల్ల స్పష్టమవుతుంది. వస్తువులో వచ్చిన నవ్యత శిల్పంలో కూడా ప్రవేశించి తెలుగు సాహిత్యానికి మరింత సొగసుని అందించిందని చెప్పుకోవచ్చు.
ముస్లిం సాహిత్యం రాస్తున్న కొద్దిమందిలో స్త్రీవాద దృక్పథంతో రాస్తున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలోను షాజహానా శక్తివంతంగా రాసే కవయిత్రిగా నిలుస్తున్నారు. విధంగా విశ్లేషించుకున్నపుడు ముస్లిం స్త్రీవాదం షాజహానా చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు.
 ముస్లిం సమస్యలు మరిన్ని బయటకు రావాలంటే ముస్లిం మహిళలు మరింత మంది చదువుకోవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఇస్లాం మతంలోని కొన్ని లోపాలు స్త్రీ పాలిట శాపాలుగా వక్రీకరించని పరిస్థితి నెలకొంటుంది.
మొత్తం మీద ముస్లిం మైనారిటీవాద సాహిత్యం ఒకవైపు స్వీయమతంలోని మూఢాచారాలను ఖండిస్తూ, మరొక వైపు మాతృదేశంలోతమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ, అగ్ర వర్గానికి కింది వర్గానికి మధ్య నలిగిపోతూ, తాము స్థితిలో ఉన్నారో తెలియజేస్తూన్నది.
తెలుగు ద్వారా భారతీయ సాహిత్యాన్నికి తద్వారా మానవ నాగరీకతకి అందుతున్న అపూర్వమైన ఒక అదనపు విలువ ముస్లింవాదం.

References:తెలుగు సాహిత్యంలో ముస్లింవాద సాహిత్యం

·       Sky baaba:                 తెలుగు సాహిత్యంలో ముస్లింవాదం,

హిందూత్వదాష్టీకాన్ని ప్రశ్నించిన ముస్లింవాద కవిత్వం

·       Darla venkateswara Rao: మైనారిటీ సాహిత్యం మరోచూపు
·        Mulki:                           ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక.
·       :డా.దార్ల వెంకటేశ్వరరావు  :ముస్లిం మైనారిటీ కవిత్వం లో స్త్రీవాద దృక్పథం
·       Wikipedia –                    :Telugu Literature

·       Telugu Sahityam-Ninna-Nedu-Repu by G. Sambasiva Rao

·       Hibiscus on the Lake Twentieth-Century Telugu Poetry from India Edited and translated by Velcheru Narayana Rao University of Wisconsin-Madison

·       Muslim Minorityvadam  - The Hindu

·       Telugu Muslims Literature in search of a friend-Kesav

·       1. నఖాబ్ (ముస్లిం స్త్రీ కవిత్వం) షాజహానా, నసాల్ కితాబ్ ఘర్ ప్రచురణ, హైదరాబాద్. ఫిబ్రవరి, 2005
2.
ముల్కీ (ముస్లిం సాహిత్య సంకలనం) సంపాదకులు: వేముల ఎల్లయ్య, స్కైబాబ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్. జూలై, 2005.
3.
అలావా (ముస్లిం సంస్కృతి కవిత్వం) సంపాదకులు: షాజహానా, స్కైబాబ, నసాల్ కితాబ్ ఘర్ ప్రచురణ, హైదరాబాద్. జూలై, 2006.
·        కాసుల ప్రతాపరెడ్డి -నిప్పుల వాన షాజహానా కవిత్వం

 



No comments:

Post a Comment