రాష్ట్రం
లో జరుగుతున్నా నవీన పరిణామాలను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తద్యము అని
స్పష్టమగుచున్నది. రాష్ట్రం విభజించబడిన సీమాంద్ర ప్రాంతంలోని ముస్లింల
పరిస్థితులపై చర్చించ వలసి ఉంది. విభజన జరిగిన సీమాంద్ర ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్
గాను,
తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రం గాను పిలవ బడుతుంది..
రాష్ట్ర
విభజన వలన సీమాంద్ర ముస్లింలు ఎటువంటి బయాందోళనకు గురికావలసిన స్థితి లేదు. తక్షణ
కర్తవ్యం విభజన జరిగిన దాని నుంచి ఏవిధంగా అత్యధిక ప్రయోజనం పొందాలో ఆలోచించ వలసి
ఉంటుంధి ఒక్క ఉత్తర ఆంధ్రా ప్రాంతం
తప్పితే విభజన జరిగే ఆంధ్రప్రదేశ్
లో (సీమాంద్ర ప్రాంతంలో )ముస్లింల జనసంఖ్య ఆ రాష్ట్ర జనాభాలో 20-25% వరకు ఉంటుంది మరియు నూతన
రాజధాని కర్నూల్, ఒంగోల్ , విజయవాడ వంటి ఏ ప్రాంతం లో ఏర్పడిన ఆ
ప్రాంతానికి 50 కి.మి. వ్యాసార్ధంలో పల్లెలు,పట్టణాలలో ముస్లింలు తగినంత సంఖ్య లో ఉన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన
శ్రామిక శక్తి మొత్తాన్ని అంధించే సంఖ్యలో ముస్లిం శ్రామికులు కలరు. ముస్లిం ల
జీవితాలలో అభివృద్ధి కన్పిస్తుంది.
ఆంధ్ర
ప్రదేశ్ (సీమాంద్ర) పునర్నిర్మాణం లో ముస్లింలు ప్రధాన పాత్ర వహించవలసి ఉంటుంది.
రాజకీయ అధికారం అందకపోయినా ఆర్థిక, సామాజిక, విద్యా రంగాలలో ప్రగతి సాదించవలసి
ఉంటుంది. ఇందుకు గాను ముస్లిం లు తమ
అబివృద్ధి ,సంక్షేమం కోసం నూతనం గా ఏర్పడే ప్రభుత్వాన్ని, వివిధ రాజకీయ పక్షాలను కొన్ని డిమాండులు చేయ వలసి ఉంటుంది. వాటిని ఈ
క్రింద వివరించటం జరిగింది.
1.
ముస్లిం
రిజర్వేషన్స్ ను యదాతధం గా కొనసాగించాలి. వీలైతే వాటి శాతం పెంచ వలసి ఉంటుంది.
2. ఎటువంటి తేడాలు లేకుండా ముస్లింలు అందరికీ విద్యా, ఉపాది, రంగాలలో రిజర్వేషన్ కల్పించాలి –సయ్యద్,పఠాన్,మొగలు లకు కూడా
3. సచార్ కమిటీ, రంగనాధ మిశ్రా కమిటీ,కృష్ణన్ కమిటీ నివేదికలను యధాతధంగా అమలు పరిచేటట్లు వత్తిడి చేయ వలసి ఉంటుంది.
4. ముస్లిం ఉద్యోగులు మరియు అందరూ ఉద్యోగులకు జోనల్ సిస్టమ్ యదాతధంగా కొనసాగించాలి- 371డి నిబంధన కొనసాగింపు.
5. ఉర్దూ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.
6. ప్రధాన మంత్రి 15 సూత్రాలమైనారిటీ అబివృద్ధి పధకాన్ని అన్నీ జిల్లాలలో కనీసం 20% ముస్లిం జనాభా ఉన్న జిల్లాలకు వర్తింప చేయాలి.
7. రాష్ట్ర పోలీస్,పారా మిలిటరీ దళాలలో తగ్గుతున్న ముస్లింల భర్తీ శాతాన్ని పెంచాలి.
8. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, సహకార బ్యాంకులు, ఆర్.టి.సి. ,మున్సిపాలిటీ, వంటి సంస్థల నియమకాలలో ముస్లింలకు తగిన స్థానం కల్పించాలి.
9. రాష్ట్ర శాసన సభ మరియు శాసన మండలిలో గవర్నర్ నామినేట్ చేసే వ్యక్తి ముస్లిం అయి ఉండాలి.
10. ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ల , నామినేటెడ్ పోస్టుల నియామకం లో ముస్లింలకు ఆదిక ప్రాధాన్యం కల్పించాలి.
11. సీమాంద్ర ప్రాంతం లోని ప్రతి జిల్లా నుండి కనీసం ఇరువురు ముస్లింలను అబ్యర్ధులుగా అన్నీ రాజకీయ పక్షాలు కేటాయించాలి.
12. రాష్ట్ర మంత్రి వర్గములో కనీసం 5-10% స్థానాలు, హోమ్,ఆర్థిక, వ్యవసాయం వంటి శాఖలలో కనీసం 2 శాఖలను ముస్లిం లతో భర్తీ చేయాలి.
13. అన్నీ సీమాంద్ర స్థానిక సంస్థల ఎన్నికలలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలి.
14. రాయలసీమ, దక్షిణ కోస్తా లో అన్నీ జిల్లాలలో ఉర్దూను ద్వితీయ అధికార భాషగా ప్రకటించాలి.
15. ఉర్దూ మీడియం పాటశాలలను అధికంగా ఏర్పాటు చేసి, ఉర్దూ టీచర్ల సంఖ్యను పెంచాలి. ఉర్దూ టీచర్ల నియామకం లో రిజర్వేషన్లను పాటించకుండా, ముస్లిం అభ్యర్ధులతోనే వాటిని భర్తీ చేయాలి.
16. సీమాంద్ర ప్రాంతం లోని అన్నీ మదర్శాలను సర్వశిక్ష అబియన్ పరిదిలోనికి తెచ్చి,వాటిలోని విద్యార్ధు లకు మద్యాన్న భోజన పదకాన్నివర్తింపచేయాలి.
17. ఉర్దూ బాష అబివృద్ధికి ఉర్దూ అకాడెమిని స్టాపించాలి.
18. ముస్లిం బాల బాలికలకు నిర్బంధ ప్రాధమిక ఉచిత విద్యా విధానం అమలు జరపాలి,
19. ముస్లిం విద్యార్ధులంధరికి స్కాలర్ షిప్ ఇవ్వాలి. ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలి.
20. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్ధులకు, విదేశాలలో విద్యా అభ్యసించే, ముస్లిం విద్యార్ధులకు ప్రభుత్వం ఉచిత ఆర్ధిక సహాయం కల్పించాలి.
21. ముస్లిం విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా పోటీ పరీక్షల శిక్షణ నిమిత్తం అన్నీ జిల్లాలలో స్టడీ సర్కిల్ స్టాపించాలి.
22. ముస్లిం విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ సాంకేతిక విద్యాలయలు, (పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజినెరింగ్ కాలేజీలు) స్టాపించవలసి ఉంటుంది.
23. ముస్లిం యువతకు ఆంగ్లము, మాథ్స్, కంప్యూటర్ లలో ప్రత్యేక శిక్షణ అంధించాలి. గల్ఫ్ ఉద్యోగాల నిమిత్తం అరబ్బీ బాష లో ప్రత్యేక శిక్షణ కల్పించాలి.
24. ప్రతి పట్టణం, మండల కేంద్రం లో మౌలానా ఆజాద్ పబ్లిక్ లైబ్రరి లను స్టాపించాలి.
25. ముస్లిం ప్రవేట్ మైనార్టీ విద్యా సంస్థలకు తక్షణమే ప్రభుత్వ గ్రాంటు అందించాలి.
26. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పధకం, ఇందిరా అవాస పధకం లో గ్రామీణ ముస్లిం జనాభా కు తగినంత ప్రాతినిద్యం కల్పించాలి. జాతీయ ఆహార బద్రత చట్టాన్నిఅందరూ ముస్లింలకు వర్తింప చేయాలి.
27. రాజీవ్ ఆరోగ్య శ్రీ , రాజీవ్ గృహకల్ప వంటి పధకాలలో ముస్లిం లకు తగినంత ప్రాతినిద్యం కల్పించాలి.
28. ముస్లిం శ్మశానాల అబివృద్ధి, ఈద్గాల అబివృద్ధి, వాటి చుట్టూ ప్రహరీ,ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలి.
29. ప్రతి మండలకేంద్రం లేదా పట్టణాలలో షాదీ ఖానాలు, కమ్యూనటి కేంద్రాల ఏర్పాటు జరగాలి.
30. వక్ఫ్ ఆస్తుల పూర్తి సర్వే జరపాలి, అక్రమణకు గురిఐన వక్ఫ్ ఆస్తులను తక్షణం స్వాధీనం చేసుకోవాలి. వక్ఫ్ ఆస్తుల దురాక్రమణలు సమర్ధవంతంగా నిరోదించాలి.
31. సీమాంద్ర ప్రాంతం కోసం ప్రత్యేకంగ హజ్ హౌస్ నిర్మాణం జరపాలి మరియు సీమాంద్ర ప్రాంతం నుండి హజ్ కు వెళ్ళే ముస్లింల కోటా పెంచాలి.
32. మసీద్ లో పనిచేసే ఇమామ్, మౌజన్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వేతనాలు ఇవ్వాలి (యూ.పి. లో లాగా)
33. చౌక డిపోల డీలర్ల నియమకంలో తగిన ప్రాధాన్యత కల్పించాలి.
34. మునిస్పాలిటీ,కార్పొరేషన్, ఇరిగేషన్, ఆర్&బి వంటి ప్రభుత్వ శాఖలు నిర్మించి వేలంవేసే దుకాణాలలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలి.
35. ఆటొ నగర్ లోని దుకాణాలు, స్థలాల కేటాయింపు లో ముస్లింలకు అధిక ప్రాధాన్యత కల్పించాలి.
36. ముస్లిం జనసంఖ్య అదికంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలలో వారికోసం ప్రత్యేకం గా ఉర్దూ పాటశాలలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, పశువైద్య శాలలు నిర్మించాలి.
37. హెల్త్ వర్కర్లు , అంగన్వాడీ కార్యకర్తలలో ముస్లిం స్త్రీలకు ప్రాతినిద్యం ఎక్కువుగా వ్ందాలి. ముస్లిం జనానా (స్త్రీల)కోసం ప్రత్యేకంగ వైద్యశాలలు, చిన్న పిల్లల ఆసుపత్రులు నిర్మించాలి.
38. ప్రతి జిల్లాకు ముస్లిం మైనారిటీ ఆఫీసర్ ఏర్పాటుచేసి, ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా నిరుపేద ముస్లింలకు ఆర్థిక సహాయం కల్పించాలి.
39. ముస్లిం నిరుద్యోగులకు, యువతకు, స్వయం ఉపాధి కల్పించుకోవటానికి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పించాలి.
40. ఆర్థికంగా పేద వారు ఐనా ముస్లింలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, బంజరు భూముల పంపిణీ జరగాలి.
41. MEMPA వంటి పట్టణ పేదప్రజల అబివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పట్టణ నిరుపేద ముస్లిం యువతీ,యువకులకు వృతి శిక్షణ, టైలరింగ్, కుట్టు అల్లికలు వంటి వాటిలో శిక్షణ అంధించవలసి ఉంటుంది.
42. వికలాంగులు, విధవలు, వృద్ధులు ఐనా ముస్లింలకు పెంక్షన్ సదుపాయం ఉండాలి.
43. కేంద్ర, రాష్ట్రాల అన్నీ రకాల సంక్షేమ పధకాలను ముస్లిం లు పూర్తిగా వినియోగించుకొనేటట్లు అవగాహన కల్పించి వాటి ప్రయోజనం పొందేటట్లు చూడాలి.

పైన వివరించిన డిమాండ్ల ను ప్రభుత్వం,వివిధ రాజకీయ పక్షాల ముందు ఉంచి, వాటిని
సాదించేటట్లు ముస్లింలు ప్రభుత్వం పై ,రాజకీయ పక్షాలపై ,వత్తిడి,లాభీ
చేయవలసి ఉంటుంది. దీనికి గాను అందరూ ముస్లిం సోదరి,సోదరులు
సహకరించవలసి ఉంటుంది.
No comments:
Post a Comment