శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూగోళం 79.9% నీరు తోను 29.1%
నేలతోను నిండి ఉంది. ఎంతో విశాలమైన భూమి
ఆధునిక సమాచార సాంకేతిక సాధనాలలతో చిన్నదిగా మారిపొయి నేడు ప్రపంచo ఒక (global village) పల్లెటూరు గా మరి
పోయింది . ఆధునిక కమ్యూనికేషన్ సాధనాల తో ప్రపంచవ్యాప్తంగా ఎ క్షణనా ఏమి
జరుగుతుందో చాలా త్వరగా మనం తెలుసు కోవచ్చు. ఆధునిక తో సాధనల తో పాటు నేడు ప్రపంచం అపారమైన సమస్యలు
ఎదుర్కొంటున్నది. యుద్ధం, హింస, వ్యాధులు, పేదరికం, మానవ హక్కులు ఉల్లంఘనలను / అణిచివేత మొదలగు సమస్యలు మానవాళి
ఎదుర్కొంటున్నది. మానవ జాతి కి అత్యంత వత్తిడి కలింగించే ఈ విషయాలను విచక్షణ
లేకుండా పాశ్చాత్య, ముస్లిం దేశాలు ఒకే విధంగా ఎదుర్కొంటున్నాయి.
అయితే పశ్చిమ దేశాలు
ఈ సమస్యల పరిష్కారంలో విజయం సాదించినవి.
ఈ దేశాల్లోని సమాజాలు స్థిరమైన
జీవితం అనుభవిస్తున్నాయి.వారు తమ దేశాల్లోని ప్రతి పౌరుడు కి భద్రత, హక్కులు, ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణ అందించే ప్రక్రియలో ఉన్నాయి.
భౌగోళికంగా ప్రపంచంలో ముస్లింలు నాలుగింట ఒక వంతు అరబ్
దేశాలలో నివసిస్తూ ఉన్నారు.నేడు ఇస్లాం మతం అనేక దేశాల, జాతి మరియు సంస్కృతులు, భాషలు, మరియు ఆచారాలు దాటి విస్తరించినది.నేడు ముస్లింలు
అధికoగా ఆసియా మరియు ఆఫ్రికా లో
నివసించుతున్నారు. వాస్తవానికి , ఇస్లాం మతం యూరోప్ మరియు అమెరికాలో ఒక ప్రధాన మరియు వేగంగా
పెరుగుతున్న మతం.
కాని నేడు ముస్లిం ప్రపంచం యుద్ధం, పేదరికం, ఆరోగ్యo, మరియు మానవ హక్కులు, నిరక్షరాస్యత, పురోగతి, నియంతృత్వం, రాజకీయ పారదర్శకత, లేకపోవడం, జాతి ఘర్షణ, మరియు ప్రాంతీయ విభజన వంటి సవాళ్లు ఎదుర్కొంటుంది. నిరక్షరాస్యత ముస్లిం దేశాల మెజారిటీ సమస్య. దాదాపు ముస్లిం ప్రపంచం లో 40% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు.నిరక్షరాస్యత వేనుకుబాటుతనంనకు దారితీస్తుంది, మరియు పురోగతి లేకపోవడం క్రమంగా ప్రాంతీయ విభాగాలు మరియు జాతి విభేదాలు కు తద్వారా అధికార పోరాటాల కు దారితీస్తుంది.రాజకీయ పారదర్శకత లేకపోవడం నియంతృత్వానికి దారి తీస్తుంది. ముస్లిం ప్రపంచంలోని మెజారిటీ దేశాలు నేడు ఈ లోపాలను కలిగి ఉన్నావి.
ముస్లిం ప్రపంచం పాశ్చాత్య దేశాల కన్నా వెనుక ఎందుకు పడింది అనే ఒక ప్రశ్న తల ఏత్తుతుంది . ప్రపంచ చరిత్ర అవగతం అవుతే తప్ప, ముస్లిం ప్రంపంచం, ప్రపంచంలో పాశ్చాత్య
ప్రపంచం కన్నా ఎ విధంగా వెనుక బడిందో తెలుసుకోవటం
కష్టం. ఇస్లాం ఫోబియా ఉన్నా వారు ముస్లిం
దేశాల వెనుకబాటుతనంకు కారణం ఇస్లాం
మతం అని ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవo దానికి
విరుద్ధంగా ఉంది. ఇస్లాం మతం పురోగతి, ఆవిష్కరణ, మరియు అభివృద్ధి యొక్క రూపం . ఇది ప్రతి తరం, సమయం, మరియు
ప్రాంతం యొక్క మతం. ఇది నాగరికత యొక్క మతం; ఇది జీవితం యొక్క
ఒక మార్గం.
ఒక నాగరికత కూలిపోగానే మరో నాగరికత
తలేత్తుoది. ఇస్లామిక్ కలిఫత్ 1924 లో కూలిపోగానే యూరోపియన్లు శక్తి వంతులై బానిసత్వం మరియు వలస
రాజ్య స్థాపనలో నిమగ్నమై ఒక కొత్త సామ్రాజ్య శక్తి రూపొందించినారు. నిజానికి ఇస్లామిక్
కలిఫత్ ఈ దురాచారాలను నిర్మూలిoచింది.
యూరోపియన్లు జయించిన దేశాల ప్రజలు బానిసలుగా చేయబడ్డారు. ఆ దేశాలు వలస రాజ్యాలుగా
రూపొందినవి. క్రమంగా 1950 లోఈ దేశాల వలస
పాలనకు వ్యతిరేకంగా అనేక దేశాలు అధికారాలు,స్వాతంత్ర్యం కోసం తిరుగుబాట్లు
జరిపినవి. భారీ పోరాటాలు తరువాత, అనేక దేశాలలో వలస రాజ్యాలు స్వాత్రoత్యం పొందినవి.
యురోపియన్లు భౌతికంగా మాత్రమె వదిలి వెళ్ళారు కానీ వివేచనాత్మకంగా మరియు మానసికంగా
అక్కడే బస చేసారు అనగా వారి ఎంపిక ప్రతినిధులు లేదా కీలుబొమ్మ ప్రభుత్వాలు ఏర్పాటు
చేసి వాటిపై నియంత్రణ కొనసాగించారు.
అందువలన, అనేక దేశాల్లోని ప్రజలు ఎప్పుడూ నిజమైన స్వాతంత్ర్యం పొందలేదు.
ప్రజలు వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు ప్రభుత్వం
ప్రజలకు వ్యతిరేకంగా ఒక విరుద్ధమైన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం శత్రువులుగా
తన సొంత ప్రజలను చూసింది మరియు ప్రజలు వారి శత్రువుగా తమ ప్రభుత్వంను చూసారు.
ప్రభుత్వం అధికార పార్టీ తప్ప ఇతర ఏ రాజకీయ పార్టీలను అనుమతించదు. అవినీతి,
సంపూర్ణ అధికార నియంతృత్వం, ప్రాధమిక మానవ హక్కులు, విద్య, వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛా వాణిజ్యం, రాజకీయ
భాగస్వామ్యo కల్పించక పోవటం, ఇస్లామిక్ ప్రభుత్వాల సాధారణ అలవాటుగా మారింది. పాపం, ప్రజలు ప్రభుత్వం
ఆస్తిని వారి నుంచి దోచుకోన్నదిగా భావించ సాగారు. ప్రజలు ప్రభుత్వoపట్ల ఆగ్రహం తో
స్కూల్ మరియు ఆస్పత్రి పరికరాలు దోపిడి చేసారు.
దగా, గందరగోళం మరియు అభివృద్ధి లేకపోవడం ఈ దేశాల
ప్రమాణములుగా మారినాయి. మానవ అభివృద్ధి
మూడు సూచికలను (పుట్టినప్పుడు జీవితపు సాఫల్యతకు,-దీర్ఘ మరియు ఆరోగ్యకరమైన జీవితం), అక్షరాస్యత, మరియు ఆదాయం
ద్వారా కొలుస్తారు. ముస్లిం మెజారిటీ దేశాలు మానవాభివృద్ధి సూచీలో UN నివేదిక ప్రకారం
తక్కువగా మధ్య లేదా జాబితా దిగువన వస్తాయి. 2009 లో
ఐక్యరాజ్యసమితి నివేదికలో మెజారిటీ ముస్లిం దేశాల అత్యంత అవినీతి దేశాల జాబితా
లో ముందు ఉన్నాయి. 2006 UN నివేదికప్రకారం
ప్రపంచంలో అత్యంత మరియు కనీసం నివాసయోగ్యమైన దేశాల జాబితాలో ముస్లిం దేశాలు లేవు.
నిజానికి ఈ గణాంకాలు మరియు ముస్లిం దేశాల పరిస్థితుల మధ్య అపారమైన సహ
సంబంధాలు ఉన్నాయి
మొత్తం ముస్లిం ప్రపంచం (57 ముస్లిం దేశాలు) లో దాదాపు 500 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మరోవైపు, ఒక్క USA లోనే 5,758
విశ్వవిద్యాలయాలు, మరియు భారతదేశం లో 8.407 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 2004
లో UNDP ద్వారా జరుపబడిన పరిశోధన ప్రకారం మొత్తం ముస్లిం
ప్రపంచంలోని ఒక విశ్వవిద్యాలయం కూడా ప్రపంచంలోని 500 అగ్ర ర్యాంక్
విశ్వవిద్యాలయాలలో లేదు. ముస్లిం ప్రపంచంలో అక్షరాస్యత 40% ఉంది, అదే పాశ్చాత్య
ప్రపంచంలో అక్షరాస్యత చాలా ఎక్కువగా 90% గా
ఉంది.
ముస్లిం మతం దేశాలలో 50% దేశాల ప్రజలు ప్రాధమిక విద్య పూర్తి చేస్తే, పాశ్చాత్య
దేశాల్లో 98% దేశాల ప్రజలు ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. ముస్లిం దేశాలలో
ప్రజలు 2% మాత్రమే విశ్వవిద్యాలయం కు హాజరయ్యారు అయితే పశ్చిమ
దేశాల ప్రజలలో 40%, మంది
విశ్వవిద్యాలయం కు హాజరయ్యారు. USA లో ప్రతి ఒక
మిలియన్ ప్రజలకు 5,000 శాస్త్రవేత్తలు ఉంటే
ముస్లిం దేశాలలో, ప్రతి ఒక మిలియన్
ప్రజలకు 230 శాస్త్రవేత్తలు కలిగి
ఉన్నారు.
పాశ్చాత్య దేశాలు పరిశోధన కోసం వారి GDP 5% ఖర్చు చేస్తే
ముస్లిం దేశాల, పరిశోధన కోసం వారి GDP లో 0.2%
ఖర్చుచేస్తున్నారు.ఇండోనేషియా లో 10000 జబ్బుపడిన ప్రజలకు ఒక డాక్టర్ ఉంటె,
స్పెయిన్ లో 500 రోగులకు ఒక డాక్టర్ ఉన్నాడు. 1995 లో బ్రిటన్ లో పౌరుని సగటు
వార్షిక ఆదాయం $ 12,000 గా ఉంది, అదే, పాకిస్తాన్
లో పౌరుని సగటు వార్షిక ఆదాయం $ 300 ఉంది. ఇది
ఇజ్రాయిల్ లో 7.652 ఉంది, అదే ఈజిప్ట్ లో 77 గా
ఉంది.
నిజానికి ముస్లిం దేశాలలో మానవ వికాసం లేకపోవడానికి బాధ్యత మెజారిటీ ముస్లిం దేశాల పైనే ఉంది.దీనికి ఒక ఉదాహరణ ఫిబ్రవరి, 2011 లో ఈజిప్ట్ లో ప్రజా విప్లవం ద్వారా అధ్యక్షుడు హోస్నీ ముబారక్ తొలగించ బడినాడు. తిరుగుబాటు కు ముందు అధ్యక్షుడు హోస్నీ ముబారక్ 30 సంవత్సరాలు ఈజిప్ట్ పాలించాడు అణచివేత, నిరంకుశ నియంత పాలన జరిగింది. వేలాది ప్రజలను ఖైదులో హింసించారు మరియు వేలాది మంది నిర్వాసితులైనారు. ముబారక్ కుటుంబం 70 బిలియన్ డాలర్లు విదేశి బ్యాంక్ లలో దాచుకోంది.
ఈజిప్టు ప్రజలు స్వేచ్చ గా జరిగిన ఎన్నికల్లో ముస్లిం బ్రదర్ హుడ్ ను ఎన్నుకొన్నారు కాని సైన్యం వారికి పరిపాలనా
భారం అప్పగించటానికి నిరాకరించినది. పలితంగా నేడు ఈజిప్ట్ అశాంతి తో కొట్టు
మిట్టాడుతుంది. ఈజిప్ట్ లో పేదరికం ప్రబలింది వేలకొలది ప్రజలు నిరక్షరాస్యులై ఉన్నారు. నిరుద్యోగం,
వ్యాధులు, చిత్రహింసలు,మానవ హక్కుల
ఉల్లంఘన నిత్య కృత్యాలయినవి. దీనికి ప్రధాన కారణం పాలనలో పారదర్సకత లేక పోవడం,
ప్రజల భావాలను గౌరవించక పోవడం.
కాలం మారింది. ఆధునిక సాంకేతిక కమ్యూనికేషన్ సాధనాలు
ప్రజలను చైతన్య పరచినవి. అల్ జజీరా, Facebook, Twitter మరియు Google వంటి ప్రచార
మాద్యమాల సహయం తో ముస్లిం ప్రపంచం చైతన్య
మైనది. రెండవది ముస్లిం ప్రపంచంలో
సాంకేతిక నైపుణ్యాలు కల యువకులు పెద్ద
సంఖ్యలోఉన్నారు. పాశ్చాత్య దేశాల ప్రజలు
స్వేచ్ఛ మధ్యప్రాచ్యంలో కీలుబొమ్మ ప్రభుత్వాల పాలనను వారు అంగీకరించటం లేదు. వారు
ప్రజల ద్వార ఎన్నికైన ప్రాతినిధ్య
ప్రభుత్వం ను కోరుకొంటున్నారు.
1991 లో సోవియెట్ యునియన్ పతనం తరువాత ప్రపoచ రాజకీయాలలో
పెను మార్పులు సంభవించినవి. ద్వి ధ్రువ ప్రపంచం స్థానం లో ఏక ధ్రువ ప్రపంచం
ఏర్పడినది. అమెరికా రాజకీయ ఆధిపత్యం పెరిగినది. ప్రపంచ పోలిసుగా అమెరికా మారింది.
అమెరికా తన రాజికీయ ప్రయోజనాల కోసం ప్రపంచ వ్యవహారాలలో కలుగ జేసుకోసాగింది. మద్య
ప్రాంతం లోని ఆయిల్ సంపద పై కన్ను వేసింది. కువైట్-ఇరాక్ విభేదాలలో జోక్యం
చేసుకోంది.
జన విద్వంసక
మారణాయుధాలు, జీవ రసాయనిక ఆయుధాలు కలిగి ఉన్నదన్న నెపంతో సద్దాం హుస్సేన్ పై
దండయాత్ర చేసింది. 1994 లో ఆపరేషన్ డెసర్ట్ స్టార్మ్ పేరుతో ఇరాక్ ను ఆక్రమించినది.
పలితంగా ఇరాక్ చిన్నా బిన్నాం అయినది. ఖతర్, బహారిన్ లలో ఎయిర్ బేస్ లను అమెరికా
కలిగి ఉంది. రాపిడ్ ఆక్షన్ ఫోర్సు పేర తన సప్తమ నావికా దళం ను గల్ఫ్ లో ఉంచినది.
తాలిబాన్ అణిచివేత నేపo తో ఆఫ్గనిస్తాన్ లో తిష్ట వేసింది.
అక్కడ కీలు బొమ్మ ప్రబుత్వాన్ని నెలకొల్పింది. ఆఫ్ఘన్ లో నిత్యం మారణ కాండ
కొనసాగుతుంది. ఇక లిబియా లో గడాఫి తొలగింపుతో అక్కడ తీవ్ర సంక్షోబం నెలకొంది. ఇవి
అన్ని ఆమెరికా తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఆయిల్ సంపద కోసం అరబ్ రాజ్యాల మద్య
చిచ్చు పెట్టి వాటి ఆర్థిక వ్యవస్థలను చిన్నబిన్నం చేసి సామాన్య ప్రజలు కష్టాలకు
లోను అయ్యేటట్లు చేస్తుంది.
ఇక పాలస్తీనా సమస్య ఎటు ఉండనే ఉంది. పాలస్తీనా ప్రజలు
ఇస్రాయిల్ దౌర్జన్యాలతో నిత్యం ఘర్షణలతో
జివిస్తు ఉన్నారు. అమెరికా సంధి ప్రయత్నాలు, ఇస్రాయిల్ మొండి వైఖరితో పలించుట లేదు. యూరోపియన్ యునియన్ వైఖరిలో
మార్పు వచ్చి పాలస్తీనా ను గుర్తించినవి దానితో కొన్ని యురోపియన్ దేశాలు రాయబార సంభంధాలు
ఏర్పచుకొంటున్నావి. త్వరలో పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కారం లబించ గలదని
అశిoచుదాము.
ఇక ఇస్లామిక్ దేశాలు అయిన బహరేన్, సౌదీ అరేబియా, సిరియా, ఇరాన్
ల మధ్య సెక్టారియన్ సంఘర్షణలు నిత్యకృత్యాలు
అయినవి.ప్రపంచంలో ముస్లింలలో ఎనభై ఐదు
శాతం సున్నీ ముస్లింలు. ప్రధానంగా ఇరాన్, ఇరాక్ మరియు
బహరేన్ లో నివసించే వారు షియా ముస్లింలు.
వీరు ప్రపంచంలోని ముస్లిం జనాభా లో 15 శాతం కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విరి
మద్య జరిగే సెక్టారియన్ సంఘర్షణలు ఇస్లామిక్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
గల్ఫ్ ప్రాంతం పై
రాజకీయ ఆదిపత్యం కోసం సున్ని సౌదీ
అరేబియా, షియా ఇరాన్ ల మద్య ప్రచ్ఛన్న పోరు కోన సాగుతుంది.ఏమన్ లోని తిరుగుబాటు
దారులకు ఇరాన్ సహాయం చేస్తుండగా, సౌదీ
తిరుగుబాటుదారుల పై బాంబు దాడులు చేస్తున్నది.హజ్ యాత్రలో ఇరాన్ యాత్రికుల మరణం
ఇరాన్-సౌదీ సంభంధాలను బలహీన పరిచినది. ఇటివల ఇరాన్ సమర్దిoచిన సౌదీ మైనారిటి షియా
మత గురువును సౌదీ ప్రభుత్వం ఉరి తీసింది. దీనికి ప్రతిగా ఇరాన్ లోని సౌదీ రాయబార
కార్యాలయం ద్వంసం అయినది. సౌదీ, ఏమిరైటీస్, బహరిన్ ఇరాన్ నుంచి తమ రాయబారులను
ఉపసంహరించుకోన్నావి. అమెరికా అదను కోసం
వేచి ఉంది. అణు-ఆయుధాల సమస్య పై ఇరాన్ పై
అమెరికా అoక్షలు విధించినది. అమెరికా- ఇరాన్ ల మద్య కుదిరిన ఒప్పదం పలితంగా ఇటివల
అమెరికా తన అoక్షలు ఉపసంహరించు కొంది.
కొన్ని గల్ఫ్ దేశాలు చమురు సంపదతో ఆర్ధికంగా బలపడగా ఇతర
ముస్లిం దేశాల జనాభా పేదరికం, అధిక నిరుద్యోగం మరియు సరిపోని విద్యా వ్యవస్థలతో పోరాడుతున్నారు.
2011 లో వసంత లేదా మల్లె పూల విప్లవం (arab spring) కొంతవరకు విజయవంతమై ఇస్లామిక్ ప్రపచం లో కొన్ని ప్రజాస్వామిక మార్పులను తీసుకు వచ్చింది. సౌదీ అరెబియ్, బహారిన్,కువైట్ లలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినవి.మొదటి సారి స్త్రీలకు పరిమితంగా ఓటు హక్కు కల్పించబడినది. టునీషియా లో నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. టునీషియ చతుష్టయానికి నోబుల్ శాంతిబహుమతి కూడా లబించినది.
ఇకపోతే కొత్తగా ఇసిస్ (ISIS) ఉగ్రవాద బయం ముస్లిం
ప్రపంచాన్ని వేటాడుతుంది.ఇస్లాం మూల సూత్రాలకు వ్యతిరేకంగా భాష్యం చెబుతూ తమదే
అసలైన ఇస్లాం అని వక్ర బాష్యం చెబుతూ హింసా పద్దతుల ద్వారా బయోత్పాతలను సృష్టిస్తూ
ఇరాక్, సిరియా లలో లక్షలాది మందిని ఉచకోస్తూ మిలియన్ల కొద్ది ప్రజలలు నిరాశ్రయులను
చేసి వారిని మధ్యధర సముద్ర మర్గాన యూరప్ దేశాలకు వలస పోయేటట్లు చేస్తున్నది. యూరప్
కొంతవరకు ఈ శరణార్దులకు ఆశ్రయం కల్పించినది.
చివరకు ఈ ఇసిస్ భూతం అణచలేని పెద్ద ప్రమాదం గా తయారు అయినది.
21 వ శతాబ్దపు ప్రారంభంలో ఇస్లామిక్ దేశాలు సంఘర్షణ మరియు హింసలతో, రాజకీయ ఆస్థిరత
లతో ప్రజా తిరుగుబాట్లతో, ఇసిస్ బెడదతో
కాలం గడుపుతున్నవి.
No comments:
Post a Comment