చారిత్రాత్మకంగా ఇస్లాం యొక్క
వ్యాఖ్యానం ఎల్లప్పుడూ మగవారికి అనుకూలంగా ఉంది. ఇస్లాం స్వికరించినది మొదట వ్యక్తి
మహిళ అయినప్పటికీ (ముహమ్మద్ ప్రవక్త (స) యొక్క మొదటి భార్య ఖదీజా), మరియు మహిళలు
హదీసు(సూక్తులు మరియు ప్రవక్త ముహమ్మద్ పనులు) విద్య అభివృద్ధి అందు మరియు సూఫీవాదం
అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ, స్త్రీలు గ్రంధాలు,
న్యాయము మరియు నాయకత్వ పాత్రలో మరియు బహిరంగ
ఆరాధన లో మగవారి కన్నా వెనుకబడి ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో ఈ పరిస్థితి మార్చబడింది.
ఇరవయ్యో శతాబ్దంలో అక్షరాస్యత
వ్యాప్తి మరియు బాల బాలికలకు
ప్రభుత్వ విద్యా సౌకర్యం లబించుట, మహిళలకు ఉద్యోగ
అవకాశాల విస్తరణ మరియు
పెరుగుతున్న మత మార్పిడిలు ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో నుండి ఇస్లాం స్వీకరించే వారి
సంఖ్య లో పెరుగుదల, విశ్వాసం యొక్క సాధన మరియు వ్యాఖ్యానాలలో ఎక్కువ
సాధికారత కొరకు ముస్లిం మహిళలు ముందు
ఉన్నారు. ముస్లిం మహిళలు విడిగా మరియు
సమూహంగా జీవితం యొక్క ఇతర రంగాల్లో వారి విశ్వాసం, సృజనాత్మక, మరియు యాజమాన్యం
పరంగా తమ సామార్ధ్యం నిరుపించుకొన్నారు.
సరైన మతపరమైన శిక్షణ
సౌకర్యాలు చేరుకోవడం లో తరచూ పురుష ఆధిపత్యంను ఎదుర్కొంటునప్పటికి నేటి ముస్లిం మహిళలు దివ్య ఖురాన్ స్టడీ సర్కిల్స్, మసీదు-ఆధారిత
కార్యకలాపాలు, మత సంస్థలు
పోషించే సమాజ సేవలు, మరియు ఇస్లామిక్
విద్యా లో విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల వలె చురుగ్గా ఉన్నారు. ఖురాన్ పారాయణం (Reciters) చేసేవారు, ఇస్లామిక్
న్యాయవాదులు మరియు ప్రపంచ
వ్యాప్తంగా ఇస్లామిక్ స్టడీస్ లో ఆచార్యులు గా ముస్లిం మహిళలు పెరుగుతున్నారు. కొన్ని మత సంస్థలలో గణనీయమైన స్థానాలు పొందినప్పటికీ గ్రాండ్ ముఫ్తీ
లేదా ఆయతుల్లా వంటి ఉన్నత మత స్థానాలు ఇస్లామిక్ మహిళలు సాధించలేదు.
సమకాలీన ముస్లిం మహిళ
మతపరమైన జీవితానికి చెందిన మూడు కీలక
అంశాలపై: దివ్య ఖురాన్ పారాయణం, బోధన లేదా ఖురాన్ వివరణ మరియు నమాజ్ అందు పాల్గొనుట దానికి
నాయకత్వం వహించుట మరియు ఇస్లామిక్ చట్టం ను వివరించడం పై ద్రుష్టి పెట్టింది. ఈ
చర్చల్లో కొన్ని సాంప్రదాయిక మరియు కొన్ని అబ్యుదయ శక్తులు స్త్రీ-పురుష సమానత్వం
మరియు కొందరు స్త్రీ-పురుషుల కొరకు కొన్ని ప్రత్యెక స్థానాల కొరకు తమ వాదన
వినిపించ సాగినారు. ఈ చర్చలు ఇరవై ఒకటో శతాబ్దంలో ఇస్లాం ను నిర్వచించడంలో అత్యంత
ముఖ్యమైనవి గా ఉన్నాయి.
దివ్య ఖురాన్
పారాయణం, భోదన మరియు అర్థ వివరణ- స్త్రీలు: (Role of women in
Reciting, Teaching, and Interpreting the Holy Qur'an)
సమకాలీన మరియు పడమటి ప్రపంచం
లో దివ్య ఖురాన్ వ్యాఖ్యానం లో ముస్లిం మహిళల
ప్రవేశం ఇరవై శతాబ్దం మొదట్లో ప్రారంభమైనది. 1909 ఈజిప్టు
ఉద్యమకారిణి మలక్ హిఫ్ని అల్-నసిఫ్ (బహితాట్ అల్-బడియ లేదా ఎడారి అన్వేషకురాలు) బాలికల కొరకు దివ్య ఖుర్ఆన్,
సున్నతుల బోధన, మాధ్యమిక విద్య అందు ప్రవేశం, నిశ్చితార్థం మరియు వివాహం లో షరియత్
అమలు కోసం ఒక 10-అంశాల
కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. నసిఫ్ తరువాత నమాజ్ కొరకు మహిళలు హాజరు కావడానికి మసీదు
స్థలం అభ్యర్థించింది.
1937/1938 లో జైనాబ్ అల్-ఘజాలి
ముస్లిం లేడీస్ అసోసియేషన్ ను సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడానికి
ఏర్పరిచినది. అయితే అది క్రమంగా దావా(మత ప్రబోధం) మరియు ఇతర మహిళలకు మత సూత్రాలు నేర్పే శిక్షణ సంస్థగా విస్తరించింది. ఖురాన్
మరియు హదీసులు లో మహిళల కు శిక్షణ ఇవ్వబడినది. అల్-ఘజాలి ఖురాన్ పై వ్యాఖ్యానాలు
మరియు హదీసులు ప్రచురించిన మొట్టమొదటి సమకాలీన గౌరవనీయమైన మహిళా వ్యాఖ్యాతల లో ఒకరిగా వెలుగొందుతుంది. ఆమె 2005 లో మరణించింది.
అదేవిధంగా ఇండోనేషియా లో మహిళలు ఇరవయ్యో శతాబ్దం ప్రారంభం నుంచి దివ్య ఖురాన్
అధ్యయనం కొరకు ప్రోత్సహిoప బడినారు. ముస్లిం మహిళల అతిపెద్ద జాతీయ సంస్థగా 1917 లో ఇండోనేషియా లో
స్థాపించబడిన “ఆసియా” దివ్య ఖురాన్ అధ్యయనం మరియు
మహిళల ఆర్ధిక స్థితిగతులను
మెరుగుపరిచేందుకు మరియు వారికి కనీస మానవ
హక్కులు కల్పించేందుకు కొన్ని ప్రోగ్రాములు రూపొందించినది. ముస్లిమాత్ నడ్లతుల్
ఉలేమా (Muslimat Nahdlatul
ulemaa) సంస్థ చట్టపరమైన సమస్యల పై దృష్టి సారించడం తో బాటు మహిళల ఆర్ధిక పరిస్థితి
మెరుగుపరిచేందుకు 1946 లో
స్థాపించబడింది.
నేడు ఇండోనేషియా లో మహిళల ఇస్లామిక్ స్టడీస్ నైపుణ్యాన్ని పెంచటానికి
అనేక పాసెంట్రెన్లో (ఇస్లామిక్ బోర్డింగ్ పాఠశాలలు) కలవు. వీటిలో దివ్య ఖురాన్ పారాయణ
నైపుణ్యం అనేక మంది స్త్రీలకు
ఇవ్వబడుతుంది. మలేషియా కౌలాలంపూర్ లో
జరిగిన దివ్య ఖురాన్ పఠనం లో జరిగిన అంతర్జాతీయ
పోటీ(1980) అందు తొలి మహిళ విజేతగా నిలిచిన మరియా ఉల్ఫః అలాగే ఇస్లామిక్ ఇమామ్స్, ఇస్లామిక్ స్టడీస్ లో
నైపుణ్యం కల ఇస్లామిక్ మేథావులు, మరియు ఇస్లామిక్ చట్టం మరియు వివరణ (షరియత్
మరియు ఫిక్) అందు ప్రముఖులైన మహిళలు ఈ
పాఠశాలల అందు జ్ఞానము పొందినవారే. ఇస్లామిక్
జ్ఞానము వచ్చేతరం వారికీ అందించడం కోసం పాసెంట్రెన్లో (ఇస్లామిక్ బోర్డింగ్
పాఠశాలలు)అందు వేలాది మహిళలకు శిక్షణ ఇవ్వబడుతుంది.
ముస్లిం ప్రపంచం అంతటా దివ్య ఖురాన్ పై వ్యాఖ్యానం ఇవ్వడంలో స్త్రీలకు శిక్షణ
ఇవ్వబడుతుంది. ఆఫ్రికన్-అమెరికన్
విద్వాంసురాలు ఆమినా వదూద్ సృష్టి మరియు
మతపరమైన బాధ్యతల పరంగా పురుషుల తో మహిళా
సమానత్వం ధృవీకరిస్తూ మతపరమైన రచనలు చేసింది.
ఇస్లాం లో పొందుపరచబడిన గౌరవం, సమానత్వం,
న్యాయం, స్వేచ్చ సూత్రాల ఆధారంగా పనిచేసే “సిస్టర్స్ ఇన్ ఇస్లాం” అనే గ్రూప్ ను 1993
లో మలేషియా లో స్థాపించినారు మరియు ప్రజాస్వామ్య బద్దంగా ఈ సూత్రాలను మానవ
సమానత్వం మరియు స్త్రీల రక్షణ రంగం లో
వినియోగించుచున్నారు. దివ్య కొరాన్ సూత్రాల
ఆధారంగా లింగ రహిత సమానత్వ సమాజంను ఏర్పర్చుటకు ప్రయత్నిస్తున్నారు.
స్త్రీల శోషణ, స్త్రీల పట్ల హింస, స్త్రీల గౌరవం తగ్గించే సూత్రాలను ఇస్లామిక్
కాని పద్దతులుగా సిస్టర్స్ ఇన్ ఇస్లాం గ్రూప్ భావిస్తుంది. దివ్య కొరాన్ కు వ్యతిరేకంగా లింగ విచక్షణ చూపే
పద్దతులను విశ్వాసాలను ఇస్లామిక్ సిస్టర్స్ సంస్థ వ్యతిరేకిస్తుంది.
2007 లో ఇరానియన్-అమెరికన్ విద్వాంసురాలు
లెలెహ్ బక్తియార్ దివ్య ఖురాన్ ను ఆంగ్లంలో అనువదించినది. పాకిస్తానీ-అమెరికన్
అస్మా బర్లస్ సమానత్వం అనుకూలంగా ఇస్లాం లో పితృస్వామ్య భావన తొలగించడం పై దృష్టి
పెట్టినది. సిరియన్-అమెరికన్ నిమాట్ హఫెజ్ బరజంగి ఇస్లాం లో వ్యక్తులు అలాగే ఒక కమ్యూనిటీ సభ్యులు గా మహిళలు యొక్క
ప్రాముఖ్యతను గుర్తు చేసినది మరియు దైవభక్తి (తఖ్వా)
ఆధారంగా మహిళలను గుర్తించాలని
పేర్కొన్నది. ఈ వివరణ అల్లాహ్ మానవుల మధ్య తేడా (లింగ, జాతి, లేదా పుట్టినది
కాక) (దివ్య ఖురాన్ 49:13) తఖ్వా స్థాయిలో
చూపుతాడు అని స్పష్టం చేసినది. అలాగే మొరాకో సామాజికవేత్త ఫాతిమా మేర్నిసిని
వoటి కొంతమంది స్త్రీల అసమానతను చూపే
కొన్ని హదీసులను వ్యతిరేకిoచినారు.
నమాజ్(ప్రార్ధన) లో లింగ సమానత్వం:( Gender Inclusiveness in Public Worship)
కొంతమంది ముస్లిం మహిళలు మసీదు పై పురుషుల
ఆధిక్యతను ప్రశ్నించారు. పురుషుని తో కలసి స్త్రీ నమాజ్ అందు పాల్గొనుట మరియు
నమాజ్ కు నాయకత్వం నిర్వహించుటకు చారిత్రికంగా ఉదాహరణలు చూపారు. దక్షిణాఫ్రికా
ముస్లిం మహిళలు1980 లో ముగిసిన అన్నిరకాల జాతి, లింగ,వర్ణవివక్ష, అణచివేతను ఉదాహరణ గా చూపారు. దక్షిణ
ఆఫ్రికన్ ఇస్లామిక్ లిబరేషన్ థియాలజీ ప్రార్ధన, నాయకత్వం పాత్రలు మహిళల కు
ఇవ్వడంను గుర్తుచేశారు. మొదట్లో అనగా 1990 లో స్త్రీ-పురుషులు కలగలిసిన
ప్రార్థనలను మహిళలు నడిపించారు ఖుత్బా (శుక్రవార ఉపన్యాసంలో) వినిపించారు. ప్రవక్త(స) ముహమ్మద్ ద్వారా నియమితులైన ఉమ్మె వరకా
ఇమామా ను(imamah -స్త్రీ ప్రార్థన నాయకురాలు) ఉదాహరణగా పేర్కొనారు.
మహిళలు మసీదులో పురుషులు కలిసి ప్రార్థన చేయడం లో వారి హక్కు ను ఉద్ఘాటించినారు.
1994 లో దక్షిణ ఆఫ్రికా లో స్త్రీలు ఇమామా (imamah ప్రార్థన నాయకురాలు) మరియు ఖుత్బా khatibah
(శుక్రవారం
ఉపన్యాసం బోధకురాలు )విధులు నిర్వహించగా అమెరికన్ ముస్లిం విద్వాంసురాలు ఆమినా వదూద్ ఆమె న్యూ యార్క్ సిటీ లో2005 లో ఇమామా
మరియు ఖుత్బా బాద్యతలు నిర్వహించారు. 2006
లో బోస్టన్లో ఆశ్రా నోమాని, కేసియా అలీ స్త్రీ
కాజి గా వివాహనిర్వాహణ బాద్యత నెరవేర్చారు.
మొరాకో మరియు టర్కీలో 2006 సంవత్సరంలో
స్త్రీలను ఇమాంలుగా నియమించారు. టర్కీలో మత సంబంధమైన వ్యవహారాల డైరెక్టరేట్ (Diyanet)
ఇమాంలుగా 250 మంది
మహిళను నియమించి వారిని రాజ్య అధికారులుగా గుర్తించినది మరియు హదీసులు నుండి స్త్రీ
అసమానత్వం ను తొలగించినది.
ఇస్లామిక్ లా-(షరియా) వివరణ (Interpreting Islamic Law(shariyaa)
ముస్లిం మహిళలకు అత్యంత వివాదాస్పదమైన
సమస్యలలో ఒకటి ఇస్లామిక్ చట్టం (షరియత్) మరియు దానిలో మార్పులు. ఇవి మహిళల ఆచరణాత్మక హక్కుల విస్తరణకు అవరోధంగా
మారినవి. ఫత్వా జరిచేసే ముఫ్తీ లేదా న్యాయమూర్తి పదవులు పురుషుల కు మాత్రమే ఉన్నది.
కొందరు మహిళలు ఈ స్థానం సాదించాలని కోరుకుంటారు. ఉదాహరణకు, 2006 లో, ముస్లిం సొసైటీ
ఫర్ అడ్వాన్స్మెంట్ మహిళల హక్కుల కోసం ఒక మహిళల షూరా (అడ్వైజరీ) మండలి ఏర్పాటు చేయలంది.
మహిళలు పండితులు ఎంపిక చేయబడిన కోర్ గ్రూప్ కొన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలింఛి
చివరికి మెజారిటీ అభిప్రాయం కొరకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయబడుతుంది.ఉదా: మసీదులో
దుస్తులు, సమానత్వం, స్త్రీ ఇమాములు, గౌరవ హత్యలు మరియు
పాకిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా, నైజీరియా వంటి దేశాల లో అమలులో
ఉన్న హుడుద్( hudud ) శాసనాలు. ఈ శాసనాలలో జినా మరియు అత్యాచారం (rape) వచ్చును.
మరొక అమెరికన్ ఆధారిత సంస్థ కరమః(Karamah). ఇది ఈజిప్టు-అమెరికన్ విద్వాంసురాలు అజియా అల్-హిబ్ర ద్వారా 2004 లో స్థాపించబడింది. ఇది షరియా అములు
లో లేని దేశాలలో షరియా సమతుల్యoగా అమలు చేసే
పని లో ఉంది. మహిళలపట్ల వివక్ష లేదా తేడా
చూపే ధోరణి ని మార్చి శాస్త్రీయ మూలాల ఆధారంగా లింగ సమాన ఇస్లామిక్ ధర్మ అభివృద్ధి
చేయడం కోసం దేశీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మహిళల హక్కులను మద్దతు
తెలపడానికి ముస్లిం మహిళల న్యాయ నిపుణులతో
కూడిన ఒక అంతర్జాతీయ నెట్వర్క్ఏర్పాటు చేసింది. ఇందులో లింగ-పాక్షిక చట్టాలకు కొత్త భాష్యం డిమాండ్ చేసే విద్యావేత్తలు, న్యాయవాదులు ఉంటారు.
2004 నుండి కరమః (Karamah) వివాహం మరియు విడాకుల చట్టాలు, పిల్లల కస్టడీ, విద్య, రాజకీయ పాల్గొనడం, గృహ హింస, ఆర్ధిక, మరియు వారసత్వం
హక్కులు మొదలగు కీలక అంశాలను చర్చింది.
సౌదీ అరేబియా మరియు ఇరాన్ వంటి సంప్రదాయవాద దేశాలలో
సైతం ఇస్లామిక్ న్యాయ వ్యవస్థలో మహిళల పాత్రను
విస్తరించాయి. సౌదీ అరేబియాలో సాంఘిక వ్యవహారాల
మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన మహిళలు పురుష న్యాయమూర్తులకు సలహాదారులు గా పిల్లలకు సంబంధించిన అన్ని విచారణలు మరియు
కోర్టు కేసులకు హాజరు ఆవుతారు. ఇస్లామిక్ చట్ట
ప్రకారం సాధారణంగా ఏడు సంవత్సరాల వయస్సులో
ఉన్న బాలుడు, తొమ్మిది ఏళ్ల వయసు అమ్మాయి బాద్యత
తండ్రికి అప్పచేప్పుతారు. కాని భర్త కు గృహ హింస చరిత్ర ఉన్న లేదా డ్రగ్ లేదా
మద్యంకు బానిస అయిన అభారం స్త్రీకి
అప్పజెప్పమని సౌదీ మహిళలు కోరుతున్నారు. తమ
ఆర్థిక హక్కులు దెబ్బతినకుండా వారు విడాకులు కోసం దాఖలు చేసిన సందర్భాలు కూడాఉన్నాయి.
అదేవిధంగా ఇరాన్ లో మహిళలు న్యాయస్థానం
లో ఉద్యోగులుగా,సలహాదారులుగా, న్యాయవాదులు గా పనిచేయడానికి అనుమతించబడతారు. మాజీ
న్యాయమూర్తి మరియు 2005 నోబెల్ శాంతి బహుమతి విజేత షిరిన్ ఇబాడిఅందుకు
ఉదాహరణ. న్యాయ మీమాంస అధ్యయనం కొరకు
ప్రత్యేకంగా మహిళలకు ఒక వేదాంత కళాశాల
ఏర్పాటు చేయబడినది. జమాత్ అల్-జహ్రా లో ఇరాన్ మహిళలు షియా న్యాయశాస్త్రం అబ్యసించవచ్చు. ఇస్లాం ఆధారిత
వివాహం మరియు విడాకుల చట్టాలలో మార్పులు మరియు మహిళల హక్కుల విస్తరణకు పూనుకొన్నారు.
ముగింపు:
ఇస్లామిక్ చర్చలలో స్త్రీలగొంతు వినిపించుటకు ప్రయత్నాలు
జరిగినప్పటికీ ముఖ్యంగా ఖురాన్ పాఠాలు మరియు ఆమోదించబడిన సంప్రదాయవాద వివరణల విషయం లో
సవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. ముస్లిం మహిళలు
విజయవంతంగా నెట్వర్క్ రూపొందించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ముస్లిం మహిళలతో
సంభాషణలు జరుపుతూ, సహాయం పొందుతున్నారు. అయితే
ఇస్లామిక్ స్త్రీలు పురుషులతో పాటు సమానంగా
వ్యాఖ్యాతలుగా అంగికరించ బడుట అనేది అవసరం. అనేక ముస్లిం పురుషులు దీనికి మద్దతు
తెల్పుతూ 21వ శతాబ్దం లో ఇస్లాం అభివృద్ధి చెందుటకు ఇస్లాం
లోపల దీనిని ప్రోత్సహిస్తున్నారు.