12 January 2017

ఇండో-మలయా ప్రాంతం లో ఇస్లాం వ్యాప్తి- చారిత్రిక పరిశిలన (Spread of Islam in the Indo-Malay region – A Historic Overview)




చరిత్రకారులు ఇస్లాం వ్యాప్తి లో ఇండో-మలయా  ప్రాంతం ను పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు.  ఇండోనేషియా మరియు మలయా ప్రాంతంలో ఇస్లాం వ్యాప్తి లేదా ఇస్లాం ప్రచారం కోసం శక్తి లేదా దండయాత్రల ఉపయోగం జరగ లేదు. ఇండోనేషియా జనాభా పరంగా ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద దేశం మరియు మలేషియా గొప్ప ఆర్థిక మరియు రాజకీయ శక్తి కలిగిన జాతిపరమైన వైవిధ్య దేశం.  మధ్యయుగంలో ఒక క్లుప్తమైన చారిత్రక నేపథ్యం రాజకీయ నిర్మాణ వ్యవస్థ కలిగిన  ఇండో-మలయా ప్రాంతంను అద్యయనం చేయడం చాలా  ముఖ్యం.
ఈ ప్రాంతములో ఎనిమిదవ మరియు పదహారవ శతాబ్దం మధ్య ఉనికిలో ఉన్న రాజ్యాలు మరియు సామ్రాజ్యాలకు  సంబంధించిన వివరాలు ఖచ్చితంగా ఉన్నాయి.  అలాగే ఈ ప్రాంతంలో ఉన్న విబిన్న రాజవంశాలు మరియు సామ్రాజ్యాలు మరియు  ఇస్లాం వ్యాప్తి కి సంభందించిన సమాచారo స్పష్టంగా లబిస్తుంది.  
నేడు అందుబాటులో ఉన్న చారిత్రాత్మక ఆధారాల ప్రకారం సుమత్రా, జావా మరియు ఇతర ప్రాంతాలలో వ్యాపించి ఉన్న  13000 ద్వీపాలు లేదా అందమైన ద్వీప సమూహం యొక్క వేర్వేరు భాగాలు మధ్యయుగ కాలంలో అనగా ఏడవ మరియు పద్నాలుగో శతాబ్దం లో  అనేక హిందూ మరియు బౌద్ధ సామ్రాజ్యాల పాలనలో ఉన్నాయి.   పదిహేనవ శతాబ్దం ప్రారంభంలో ముస్లిం సుల్తానుల యొక్క పెరుగుదల ఈ ప్రాంతం చూసినది. ఇండో-మలయా  ప్రాంత మధ్యయుగ చరిత్ర యొక్క మొదటి భాగం ఏడవ శతాబ్దములో స్థాపించబడిన బలీయమైన శ్రీవిజయ రాజవంశం నుండి మొదలై 1511 AD లో పోర్చుగీసు నౌకాదళం చే  ఓటమి పొందిన తొలి పదహారవ శతాబ్దం ప్రారంభంలో ఉన్న  మలేకా సుల్తానేట్ అంతం తో అగుతుంది.  
ఆసక్తికరంగా మలక్కా సల్తనత్ పాలకులు మొత్తం సుమత్రా ప్రాంతాన్ని పాలించిన శ్రీవిజయ రాజవంశం యొక్క ప్రత్యక్ష వారసులు మరియు వారు  జావా ద్వీపాల మీద రాజకీయ మరియు సైనిక ప్రభావాన్నిచూపారు.  1292 AD లో శ్రీవిజయ సామ్రాజ్యం దక్షిణ భారతదేశం పాలించిన చోళ సామ్రాజ్యం దాడులు కారణంగా బలహీనపడింది మరియు జావా ద్వీప పాలకులు సింఘాసరి రాజవంశం యొక్క కీర్తనేగార పాలనలో పతన మైనది.
పరాజయం పొందిన శ్రీవిజయ రాజవంశం యొక్క రాకూమారులలో  ఒకరు 1323 AD లో సింగపూర్ స్థాపిoచాడు మరియు దానిని ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా, నౌకాశ్రయంగా అభివృద్ధి పరిచాడు. ఆ సామ్రాజ్యం పద్నాలుగో శతాబ్దం మూడు వంతులవరకు కొనసాగింది  మరియు 1400 AD లో అది మజాపహిట్ సామ్రాజ్యం చే కూలదోయబడినది.  మజాపహిట్ సామ్రాజ్యం 1293 AD లో మంగోలుల సహాయంతో సింఘసరి రాకూమారుని ద్వారా స్థాపించబడినది.   సింగపూరా సామ్రాజ్యం ఆఖరి రాజు ఇస్కాందర్ షా గా పిలువబడే పరమేశ్వర తరువాత వెస్ట్ మలయా తీరానికి పోయి అక్కడ 1299 AD లో ప్రసిద్ధ మలక్కా సల్తనత్ ను ఏర్పాటు చేసారు. వరుస సుల్తానుల పాలనలో అది సింగపూర్ తరహాలో  ప్రగతిపథంలో విజయవంతంగా నడిచి ఒక వర్తక కేంద్రంగా వర్దిల్లినది. సియమీస్ దాడులను నిరోధించినది.
అంతర్గత పోరాటం మరియు శత్రువుల దాడుల కారణంగా మజాపహిట్ సామ్రాజ్యం యొక్క శక్తి మరియు ప్రభావం తగ్గినది  మరియు పదిహేనవ శతాబ్దం మధ్యలో దాని ఐదవ పాలకుడు ముజాఫ్ఫెర్ షా కాలంలో సామ్రాజ్యo లోని   అనేక భాగాలను మలక్కా సల్తనత్ ఆక్రమించారు. పదహారవ శతాబ్దం ప్రారంభం లో  మజాపహిట్ రాజవంశ పతనం సంభవించి  రాదేన్ పతః చే స్థాపించబడిన డెమాక్ సుల్తాన్ మార్గం నకు సుగమమైంది.
పోర్చుగీసు వారు పదిహేనవ శతాబ్దం ప్రారంభoలో సుగంధద్రవ్యాల వ్యాపారం  ప్రారంభించారు మరియు వ్యాపారం లో విఫలమైన వారు గోవాలో ఉంచ బడ్డ నావికా బలగాలను మలక్కా పంపించారు మరియు 1511 AD లో మలక్కా సల్తనత్ పోర్చుగల్ బలగాలు ఎదుర్కొటంలో  విఫలమై పతనమైనది.  పదహారవ శతాబ్దం ప్రారంభంలో మలేకా సుల్తానేట్ పాలన అంతరించిన తరువాత వివిధ స్థానిక సంస్థానాలు, తెగల  అధిపతులు  పోర్చుగల్ బలగాల మద్దతుతో స్థానిక ప్రాంత ఆదిపత్యం కోసం వేసిన పధకాలు పలించలేడు మరియు ఆ ప్రాంతం అంతర్గత పోరాటాల మద్య  చిక్కుకుంది.
పోర్చుగీసు వారు కూడా ఆ ప్రాంతంలో పూర్తి నియంత్రణ సాధించడంలో విఫలమైనారు మరియు వారు  డచ్ దళాలతో  నిరంతరం వైరంతో వ్యవహరించారు. డచ్ దళాలు వ్యాపార మరియు సైనిక స్థావరాలు అక్కడ స్థాపించారు. 1800 AD లో ద్వీపసమూహం యొక్క ప్రధాన భాగాలు డచ్ కాలనీ వలె మారినవి మరియు 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఆ ప్రాంతం జాపనీస్ దళాల ఆధీనంలోనే వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, ఇండోనేషియా స్వాతంత్ర్య ఉద్యమం ప్రారంభించింది మరియు 1949 లోస్వాతంత్ర్యం పొందినది..
శ్రీవిజయ చక్రవర్తులు బౌద్దులు  కాగా, సింఘసరి రాజులు హిందూమతం మరియు బౌద్ధమతం యొక్క అవలoభీకులు మరియు  మజాపహిట్ రాజులు బౌద్ధులు. శ్రీవిజయ వంశమునకు  చెందిన సింగపూర  సామ్రాజ్యధీశులు బౌద్ధమతం పాటిస్తూ ఉండేవారు వారిలో ఒకరైన మొహమ్మద్ షా మలక్కా సల్తనత్ యొక్క మూడవ రాజు అధికారికంగా 1423 AD లో ఇస్లాం మతం స్వీకరించినాడు. సంక్షిప్తంగా ఇండో-మలయా  ప్రాంటానికి చెందిన రాజులు  పదిహేనవ శతాబ్దం మధ్య వరకు బౌద్ధ మరియు హిందూ  పాలకులు ఉన్నారు. తరువాత ముస్లింలు ఈ ప్రాంత పాలన పై  నియంత్రణ సాధించారు. ముస్లిం సుల్తానులు అందరు   స్థానిక పాలకులు.
పదిహేనవ శతాబ్దం ప్రారంభంలో మలేకా సుల్తానేట్ మరియు పదిహేనవ శతాబ్దం అంతం లో డెమాక్ సుల్తానేట్ స్థాపన జరగక ముందు ఇస్లామిక్ కమ్యూనిటీలు సుమత్రా మరియు జావా ద్వీపాలలో మరియు మొత్తం ఆగ్నేయ ఆసియా ప్రాంతoలో 10వ శతాబ్దం ప్రారంభం నుండి కనిపిస్తున్నాయి    పదవ శతాబ్దం ఆరంభం లో ఈ ప్రాంతం లో ముస్లిం సమాధులు కనిపించుట వాస్తవం.
మధ్యయుగ కాలంలో మరియు ఇస్లాం యొక్క ఆగమనం ముందు అనేక అరబిక్, భారతీయ మరియు చైనీస్ వ్యాపారులు వ్యాపారం మరియు సుగంధ ద్రవ్యాలు మరియు ఇతర ఉత్పత్తులకు ఈ ప్రాంతాన్ని  వాణిజ్య ప్రాంతంగా  వ్యవహరించారు. ఇస్లాం మజాపహిట్ రాజవంశం పతనం తర్వాత వేగంగా వ్యాప్తి చెoదినది. ఎక్కువగా సూఫీలు  మరియు ఇతర ఇస్లాం బోధకుల ద్వారా వ్యాపించినది.
ఇండోనేషియా చరిత్ర మరియు ప్రస్తుత వ్యవహారాల పై ప్రఖ్యాత సమకాలీన విద్వాంసుడు అయిన మెర్లే కాల్విన్ రిక్లెఫ్స్ తన గ్రంధం ," ఎ హిస్టరీ ఆఫ్ మోడరన్ ఇండోనేషియా c.1200 నందు ఒక వైపు ఇండోనేషియా ఇస్లాం తో సంభందాలు ఏర్పడి ఇస్లామీకరణ చెందినది మరోవైపు విదేశీ ఆసియన్లు (అరబ్బులు, భారతీయులు, చైనీస్) అప్పటికే ముస్లింలు అయి శాశ్వతంగా  ఇండోనేషియన్ ప్రాంతంలో స్థిరపడ్డారు మరియు  అంతర్గత వివాహాలు, స్థిర నివాసం మొదలగు  వాటి ప్రభావం వలన  వారు జావనీస్ లేదా మాలే లేదా సుమత్రా వాసులుగా మారారు అని అంటాడు.  
మెర్లే కాల్విన్ రిక్లెఫ్స్ తన గ్రంధంలో వెనిస్ కు చెందిన యాత్రికుడు మార్కోపోలో పెర్లాక్ అనే ముస్లిం పట్టణం సందర్సించాడని పేర్కొన్నాడు. మొరాకో యాత్రికుడు, ఇబ్న్ బటుట 1345 మరియు 1346 లో చైనా నుండి వచ్చేటప్పుడు ఈ ప్రాంతమును దర్సించినాడు  మరియు ఈ ప్రాంత పాలకుడు షాఫీ ఫిర్కా ను అనుసరించేవాడని పేర్కొన్నాడు.  
1512 మరియు 1515 AD మధ్య ఈ ప్రాంతంను దర్శించిన లిస్బన్ కు చెందిన పోలిష్ యాత్రికుడు టోమ్ పీరెస్ ఈ ప్రాంతంలో పోర్చగిస్ వారి స్థావరాలు ఉన్నాయి మరియు బ్రూనై పాలకుడు ముస్లిం అని అన్నాడు. మిగతా కాలిమంతాన్ ప్రాంతం, మదుర, బాలి, లామ్బాక్, సుమ్బావా, ఫ్లోర్స్, సోలోర్,జావా కి తూర్పున ఉన్న  తైమూర్ దీవుల్లో – బుగిస్ మరియు దక్షిణ సులవేసి (సెలెబెస్) ప్రాంతం ఇంకా ఇస్లామికరణ చెందలేదు అని పేర్కొన్నాడు. ఈ నాన్ ఇస్లామిక్ రాష్ట్రాలు  తదుపరి డచ్ వలసవాద సమయంలో తదుపరి శతాబ్దాలలో ఇస్లాం స్వీకరించినవి.

చారిత్రిక ఆధారాలను బట్టి పదిహేడవ శతాబ్దం మధ్యలో అనేక మంది సూఫీ సన్యాసులు అందులో భారతదేశం లోని  సూరత్ నుండి వచ్చిన సూఫీ ప్రముఖుడు నురుద్దిన్ అర్ రానిరి కాలం లో ఇస్లాం ఈ ప్రాoతం మరియు  సుమత్రా, జావా మరియు మలయ ప్రాంతాల్లో గట్టి పునాదిని ఏర్పాటు చేసుకొంది. ఇస్లాం వ్యాప్తిలో  వాలీ సంగ (తొమ్మిది ఋషులు) పాత్ర చారిత్రకoగా కంటే ఎక్కువ ఆధ్యాత్మికoగా  ఉన్నట్టు పేర్కొనవచ్చు.

ఈ ప్రాంతం లో మతసమైక్యత నేటికి కనిపిస్తుంది. ద్వీపసమూహం యొక్క వివిధ ప్రాంతాల్లో మధ్యయుగ కాలంలో బౌద్ధ మరియు హిందూ చక్రవర్తులు  నిర్మించిన అనేక పురాతన దేవాలయాలు నేటికి కనిపిస్తాయి.  అవి అప్పటి సుల్తానులు పాలన కాలంలోను లేదా తరువాత డచ్ మరియు ఆంగ్ల  పాలకుల కాలంలోను ద్వంసం కాబడలేదు.  ప్రజలు పెద్ద సంఖ్య లో ముస్లిమ్స్ అయినప్పటికీ అవి ద్వంసం కాబడలేదు. నేడు హిందూ దేవాలయాలు బాలి, సుమత్రా మరియు జావా దీవులు అంతటా కనిపిస్తున్నవి.


కండి ప్రాంబనాన్ ప్రాంతం 240 దేవాలయాలు కలిగి ఉన్నది మరియు కండి  బోరోబుదుర్ ఎనిమిదవ శతాబ్దపు  భారీ బౌద్ధ స్మారక పునరుద్ధరణ 1973 లో యునెస్కో సహాయంతో జరిగింది. ఇక్కడ బౌద్ధ మరియు హిందూ  మతపరమైన మరియు సాంస్కృతిక చిహ్నాలు రక్షించబడటం జరుగుతుంది. 

No comments:

Post a Comment